Monday, October 06, 2008

సుమతీ శతకం poem5

సుమతీ శతకంలో నుంచి మరొక పద్యం ఇవ్వాళ ఇక్కడ ఉంచుతున్నాను.

అప్పుగొని సేయు విభవము

ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్

దప్పురయని నృపురాజ్యము

దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!

తాత్పర్యం: రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజురాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.


అప్పు చేసి పప్పు కూడు తరహాలో జీవించకూడదు.. అది ఎప్పటికైనా ముప్పే అని ఈ పద్యం చెప్తుంది. మన పెద్దవాళ్ళు అన్నట్టు పెళ్లి చేసుకోవడానికి కాస్త ఈడు జోడు ఉండాలి అంటూ ఉంటారు. నేననుకోడం ఏంటంటే ఈ శతకం రచనాకాలంలో కన్యాశుల్కం లాంటి దురాచారాలు ఉండేవేమో కదా... అప్పట్లో చిన్న చిన్న అమ్మాయిలని పండు ముదుసలికిచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు ధనం కోసం. అలా చేయడం ఎంత ఘాతుకమో కదా..అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఆ ముసలినే ఇష్టపడి అతని దగ్గరే ఉండే అవకాశం చాలా తక్కువ కదా..ఆయా మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఇవన్నీ చాలా సమస్యలకి దారి తీస్తాయి చివరికి.

ఇక పోతే ..తప్పులను కనిపెట్టని రాజు రాజ్యం.. అంటే జనాల కోసం కాకుండా తమ స్వార్ధం చూసుకునే ఈనాటి ప్రభుత్వాలు, రాజకీయనాయకుల లాగ అన్నమాట. ఇవన్నీ ఎప్పటికైనా హాని కలిగించేవేనని ఈ పద్యం లో నీతి వస్తుంది.

సరే మరి..ఇంకో పద్యంతో..మళ్లీ కలుద్దాం..

సెలవు..!

ప్రేమతో...

మధుర వాణి

5 comments:

కొత్త పాళీ said...

మిగతా వాటి సంగతేమో గానీ, ఇక్కడ అమెఇర్కాలో ప్రస్తుతం అప్పుగొని సేయు విభవము, దప్పురయని నృపురాజ్యము తెచ్చిన కీడుని అనుభవిస్తున్నాము :)

S said...

"మూర్ఖుని తపమున్‌"
-మరి దీని ప్రస్తావన లేదేం?

మధురవాణి said...

@ S,
ఓ.. నిజమే కదా! ఇంతకీ మూర్ఖుడి తపం వల్ల ఎవరికీ నష్టం ఉంటుందబ్బా? :P

ఊహల జాబిలి said...

తప్పులను కనిపెట్టని రాజురాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.

Madhuravani garu, meeru chala chakkaga chepparandi. indirectly the above lines warned me about the situaton at my work place. now the problem is solved. thank you madhuragaru. (i felt only thanks is not enough. so added the following lines.)

for explanation of "మూర్ఖుని తపమున్‌" may these lines will be helpful to you madhuragaru. ofcourse you can explain in a more beautiful and wasy way.

Appugoni ceyu vibhavamu
muppuna brayamputalu murkhuni tapamun
dapparayani nrpu rajyamu
depparamai mida gidu deccura Sumati!
vibhavamu=wealth; prayamputalu=young wife; nrpu=king; tepparamu=harm.

Sumati, wealth obtained through borrowing, a young wife in old age, a fool’s penance, and a regime
which doesn’t recognize the crime of an accused, will cause harm later.

Living with pomp on borrowed money, which many people do, will lead to grief. It is just as bad as taking
a young wife in old age, praying without conviction, and an unpunished crime. All these should be avoided if you wish to lead a peaceful life.

మధురవాణి said...

@ ఊహల జాబిలి,
మీ వివరణ బావుంది. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలండీ! :)