Wednesday, October 08, 2008

ఈ వేళలో నీవు ఏంచేస్తూ ఉంటావో..అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను..

ఈ వేళలో నీవు ఏంచేస్తూ ఉంటావో...అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను...

నా గుండె ఏనాడో చేజారి పోయింది...
నీ నీడగా మారి నా వైపు రానంది...
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో...

ఈ వేళలో నీవు ఏంచేస్తూ ఉంటావో...అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను...

నడిరేయిలో నీవు నిదురైన రానీవు... గడిపేదెలా కాలమూ...

పగలైన కాసేపూ... పనిచేసుకోనీవు... నీ మీదనే ధ్యానమూ...

వైపు చూస్తున్నా... నీ రూపే తోచింది... నువు కాక వేరేది కనిపించనంటోంది...

ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది... నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది...

నీ మాట వింటూనే ఏం తోచనీకుంది... నీ మీద ఆశేదో నను నిలువనీకుంది...

మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు...

వేళలో నీవు ఏంచేస్తూ ఉంటావో...అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను...

ఈ పాట దాదాపు అందరికీ ఇష్టమైన పాటే కదా..! పాట 1996 లో వచ్చిన "గులాబీ" చిత్రం లోనిది. సినిమా ద్వారా నటుడు JDచక్రవర్తి, నటి మహేశ్వరి, గాయని సునీత, దర్శకుడు కృష్ణవంశీ పరిచయం అయ్యారు. మొదటి పాటతోనే సునీతకి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంచి పేరు, అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ సునీత పాడిన అన్ని పాటల్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయిన పాట. సినిమా కి సంగీతం శశిప్రీతమ్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించారు. సినిమాలో పాటలన్నీ చాలా చాలా బావుంటాయి. నాకు దర్శకులు కృష్ణవంశీ గారంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో పాటలు చాలావరకు సిరివెన్నెల గారే రాస్తూ ఉంటారు. నేను వాళ్ళిద్దరికీ వీరాభిమానిని కాబట్టి, నాకు వీరిద్దరి combination లో వచ్చిన చాలా పాటలు బాగా నచ్చుతాయి. "శివ" సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడైన కృష్ణవంశీ కి ఇదే మొదటి సినిమా. వర్మ గారే సినిమాని నిర్మించడం విశేషం. సినిమా తెలుగు సినీప్రపంచంలో ఒక trend setter గా నిలిచిపోయింది. హీరోలని ఏరా..పోరా..ని పిలవడం సినిమా నుంచే మొదలయ్యిందనుకుంటా...!

మీరు కూడా పాట విని ఆనందించండి. download చేసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన link చూడండి.
http://rapidshare.com/files/152104972/ee_velalo_neevu_em_chestu_untavo_madhuravaani.blogspot.mp3

ప్రేమతో...
మధుర వాణి

4 comments:

.:: ROSH ::. said...

I cant read nor i understand telugu but i love that "Ee velalo" song soooo much. couldnt help but stop to write a line to thank you for sharing the song. rock on!

మధురవాణి said...

Hi Rosh..
its interesting to know that you love this song without understanding it. So many people love this song becos of the music and lyrics. If you can understand the lyrics, I think you'll love it like anything. If you have any friends who know telugu.. try to get the meaning of the song..!
and special thanks for you, for taking time to write a comment here.
I am posting some of the very best songs in telugu in this blog. try other ones also...may be you like them too.. :)

Madhura vaani

Unknown said...

Hello vani garu. ee patante naaku chala istam...it is really heart touching song.chala haayiga untundhi ee paata vintunte.. maaku ilanti paatalanu gurthu chesthunnandhuku abhinadhanalu :)

Anil

Unknown said...

Thanks to Sharing,Very melodious song