Wednesday, October 01, 2008

ఊహలు గుసగుసలాడే.. నా హృదయము ఊగిసలాడే..

హాయ్ హాయ్....నమస్కారం.
ఈ రోజు తెలుగు వారందరికీ బాగా సుపరిచితమైన, ఎంతో ప్రియమైన ఈ పాటను గురించి చెప్పాలనిపించింది.
ఊహలు గుసగుసలాడే.. నా హృదయము ఊగిసలాడే..ప్రియా.....
ఊహలు గుసగుసలాడే.. నా హృదయము ఊగిసలాడే..

వలదన్న వినదీ మనసు..కలనైన నిన్నే తలచు..
వలదన్న వినదీ మనసు..కలనైన నిన్నే తలచు..
తొలిప్రేమలో బలముందిలే...అది నీకు మునుపే తెలుసు...
ఊహలు గుసగుసలాడే.. నా హృదయము ఊగిసలాడే..

నను కోరి చేరిన బేలా... దూరాన నిలిచేవేలా...
నను కోరి చేరిన బేలా... దూరాన నిలిచేవేలా...
నీ ఆనతి లేకున్నచో... విడలేను ఊపిరి కూడా...
ఊహలు గుసగుసలాడే.. నా హృదయము ఊగిసలాడే..

దివి మల్లెపందిరి వేసే...భువి పెళ్లిపీటలు వేసే..
నెరవెన్నెల కురిపించుచూ...నెలరాజు పెండ్లిని చేసే...
ఊహలు గుసగుసలాడే.. నా హృదయము ఊగిసలాడే..

ఈ పాట ఎంత బావుంటుందంటే...ఈ పాట గురించి రాయడానికి అనుకోగానే పాట మొత్తం అలా అలా గుర్తొచ్చేసింది. అందుకే మొత్తం పాట రాసాను. ఈ పాట లో ప్రతీ విషయం గొప్పగా చెప్పుకోదగినదే.
శ్రావ్యమైన సంగీతం, వినసొంపైన పదాలు, గాంధర్వ గానం...వెరసి పాట.
1963 లో వచ్చిన బందిపోటు అనే సినిమాలోని పాట ఇది. "జానపదబ్రహ్మ" శ్రీ విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మన విశ్వవిఖ్యాతనటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు కథానాయకుడు మరియు కృష్ణకుమారి గారు కథానాయిక. ఘంటసాల గారు స్వీయ సంగీతదర్శకత్వం వహించి సుశీల గారితో కలిసి పాడిన ఆణిముత్యం ఈ పాట. మరింకెందుకు ఆలస్యం..మళ్లీ ఒకసారి ఈ పాటని ఈ రోజు విని ఆనందించండి. అలాగే మీ భావాలను కూడా మీలాగే ఈ పాటను ఇష్టపడే అందరితోనూ పంచుకోండి.

మళ్లీ కలుద్దాం..!
ప్రేమతో..
మధుర వాణి

5 comments:

Anonymous said...

AMAZING. U KNOW THE LYRICS ALSO

ITS VERY NICE SONG

Anonymous said...

chandamaama raave jabilli raave song is there with u

if its there plz post here

prince said...

iiipaata bhagesari raaga swaraparichaaru ....eepatanu vitala chaarya gaaru kadha ki addugaa slow gaa vuntundhi ani vadhanaaaru kaani eee paata raasindhi arudra gaaru anukunta ayyaanu mana guruvugaarika daaniloni vishyam tekusu gaa paatu baati vunchaaru aapaatani ....manku bandhipootu cinma peru chepagaanye gurthuku vachyee paata adhye ...ok vani

prince said...

iiipaata bhageswari raaga swaraparichaaru ....eepatanu vitala chaarya gaaru kadha ki addugaa slow gaa vuntundhi ani vadhanaaaru kaani eee paata raasindhi arudra gaaru anukunta ayyaanu mana guruvugaarika daaniloni vishyam tekusu gaa paatu baati vunchaaru aapaatani ....manku bandhipootu cinma peru chepagaanye gurthuku vachyee paata adhye ...ok vani

దాసరి వెంకటరమణ said...

mee empika chaalaa baavundi. meeru post chestunna paatalu spandana telisina prati hridayaanni taaki teerutaayi.keep it up. Ramana.