Sunday, October 26, 2008

మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌన రాగాలెన్నినాళ్లో ...!!

నమస్కారం..!
మనందరికీ చాలా నచ్చే ఒక మధుర గీతాన్ని ఇవ్వాళ నేను మీకు గుర్తు చేస్తున్నాను. పైన చూసారుగా...ఆ పాట గురించే నేను మాట్లాడేది. "మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్లో..." అని మొదలయ్యే ఈ పాట 1997 లో వచ్చిన "ఎగిరే పావురమా.." అనే సినిమాలోనిది. ఈ సినిమా విడుదలైన రోజుల్లో చాలా హిట్ అయ్యి మంచిపేరు తెచ్చుకుంది. సకుటుంబ, వినోదాత్మక చిత్రాలను అందించే SV కృష్ణారెడ్డి గారి చాలా మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆయన సినిమాలకి చాలావరకు సంగీత దర్శకత్వం కూడా ఆయనే వహిస్తారని మనందరికీ తెలుసు.

ఈ సినిమాలో పాటలన్నీ వీనులవిందుగా ఉండేవే. అయినాగానీ, ఈ మాఘమాసం పాటకు ప్రత్యేకంగా చాలా మంది అభిమానులుంటారు. గులాబీ సినిమాలోని 'ఈ వేళలో నీవు ఎం చేస్తూ ఉంటావో' అనే పాట తో పాపులర్ అయిన సునీత ఈ పాట పాడడంతో తెలుగు సినిమా ప్రపంచంలో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఈ సినిమాలో శ్రీకాంత్, JD చక్రవర్తి హీరోలుగా నటించారు.

సినిమా ద్వారా 'లిరిల్ బేబీ' లైలా హీరోయిన్ గా పరిచయం అయింది. అమాయకమైన మొహం, చిన్నపిల్లలాంటి నవ్వు కలిగిన ఈ అమ్మాయి ఈ సినిమాలో లంగా వోణీలలో, రిబ్బన్లతో రెండు జడలు వేసుకుని చాలా ముద్దుగా ఉంటుంది. అమ్మాయి తెలుగులో కంటే కూడా, తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసి చాలా పాపులర్ అయింది. తరువాత లైలా ఒక ఇరానియన్ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని సినిమాల నుంచి విరమించింది. తనకి ఒక బాబు కూడా. లైలా అభిమానులందరి కోసం నేను తన కుటుంబం ఫొటోస్ ని ఇక్కడ post చేస్తున్నాను. చూసి ఆనందించండి.ఇంక మళ్ళీ పాట విషయానికి వస్తే, ఈ పాటకి సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి గారు. సాహిత్యం చాలా బావుంటుంది. ఒకసారి చూద్దామా మరి...!

మాఘమాసం
ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు
మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే
ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు
చికు చిన్నోడోయమ్మా..!

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు...
ముక్కు
పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు..
నా
.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు..
లేతలేతగా
సొంతమైనవి దోచాడే నాడు..
ఓయ
మ్మో....ఆ.. హాయమ్మా వలపులే తోలిరేయమ్మ వాటేస్తే..
చినవాడు నా సిగ్గు దాచేస్తే....

మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు
మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..!

తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిల్లగాడు..
రాతిమనసున
ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు..
నా
.. కంటిపాపకు కొంటె కలలను అలికాడే అతగాడు..
ఒంటి
బతుకున జంట సరిగమ పలికించేదేనాడో..
ఓయమ్మా
.. ... వళ్ళంతా మనసులే.. తుళ్ళింత తెలుసులే..
పెళ్ళాడే శుభలగ్నం నాడూ..

మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు
మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే
ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు
చికు చిన్నోడోయమ్మా..!

మరి మీరు కూడా ఈ పాటని మళ్లీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఆనందించండి..!
మళ్లీ కలుద్దాం..!!

No comments: