కొత్త కోయిల స్వరాల్లో ఈ రోజు మరో పాటను గురించి చెప్పబోతున్నాను.

త్వరలో ఈ 'ఆవకాయ బిర్యాని' సినిమా రిలీజ్ అవ్వబోతుంది. పాటలు విన్నాక సినిమా ఖచ్చితంగా బావుంటుందని నాకనిపిస్తుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడైన మణికాంత్ కద్రి కి ఇదే మొదటి సినిమా. పాటలకు సాహిత్యం హ్యాపీ డేస్ తో ప్రసిద్ది పొందిన వనమాలి రాసారు. ఈ సినిమాలో ఉన్నా ఆరు పాటల్లో ఏదీ తీసివేయదగింది కాదు. కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ పాట గురించి మాట్లాడతాను. ఈ పాట నిడివి 3 నిముషాల కన్నా తక్కువే. అయినా చాలా ఆహ్లాదంగా ఉంటుంది వినడానికి. చిత్రీకరణ కూడా అలాగే చేసి ఉండచ్చని నేను ఊహిస్తున్నాను. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ తెలుగువాళ్ళే కావడం మరో విశేషం.

ఇంక పాట వింటుంటే ఉషోదయ వేళ చల్లని తెమ్మెరగా గాలి తెర తాకినట్టుగా ఉంటుంది.
విని చూడండి. మీకే తెలుస్తుంది..!
నడిచే ఏడు అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా..!!
వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా..!!
చిలకా గోరువంక.. చెలిమే మనది కాదా..!
పిల్లా పాపలింక.. కలిమే కలిసి రాదా..!
నేలైనా.. ఇకనైనా.. నీ పాదాల వేలై నా.. తాకేనా..!!!
కురిసే పండువెన్నెల్లో... కునుకే చాలు వళ్ళో...!!
మెరిసే మేడలెందుకులే... మదిలో చోటు చాల్లే...!!
ఊగే డోలలూ...సిరులే పాపలూ...!
నీతో కబురులే... నా మునిమాపులు...!
ఈ కలలే నిజమయ్యే.. బ్రతుకే పంచితే చాలు.. నూరేళ్ళూ..!!!
అబ్బాయి కాలు నెల తాకకుండా గొప్పగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటే.. అమ్మాయేమో నువ్వు తోడుగా ఉండే సంతోషం చాలు...మేడలు, మిద్దెలు అవసరం లేదు అని చెప్తూ ఉంది. ఎంత ముచ్చటగా ఉందో కదా..!
ఈ పాటని నరేష్ అయ్యర్, చిత్ర ఆలపించారు. మెలోడీస్ ని ఇష్టపడే వారు తప్పకుండా వినాల్సిన పాట.
మీరు కూడా ఒకసారి విని చూడండి.
1 comment:
EE SONG NAAKU CHALA ISTAM BY Vere$h@yanam..
NA DARLING KEMO.. NEEVE NEEVE FROM DARLIN(TELUGU)
Post a Comment