నేను "అజ్ఞాతగీతాలు" అని ఒక శీర్షిక మొదలుపెట్టాను. ముందుగా చెప్పినట్టుగా కొన్ని flop అయిన లేదా పెద్దగా ఎవరికీ తెలియని సినిమాల్లో ఉన్న మంచి పాటలని, తెలియని వారికి తెలియచెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. ఒకవేళ మీకు తెలిస్తే మళ్లీ ఒక్కసారి గుర్తు చేసినట్టుగా ఉంటుందన్నమాట.ఈ రోజు నేను ఇందులో మొదటి పాట గురించి వ్రాస్తున్నాను.

ఊహలకేమో రెక్కలు రాగా... ఎగిరిపోతుంటే... ఆకాశవీధిలో..ఓ..ఓ..."
ఇదే ఈ పాట చరణం.
ఈ పాట నాకు బాగా నచ్చిన soft melodies లో ఒకటి. ఇదొక romantic duet.
ఈ పాట 2001 లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన "ఆకాశవీధిలో" అనే చిత్రంలోనిది.

మనందరికీ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తెలుసు కదా..ఇప్పుడు ఆయన పాడిన పాటలు మనకి చాలా తెలుసు. 2001 లో ఉషాకిరణ్ మూవీస్ లో వచ్చిన ఆనందం సినిమా తో తను చాలా పాపులర్ అయ్యాడు. ఆ సినిమా కి కొద్ది రోజుల ముందు ఇదే బ్యానర్ నుంచి వచ్చిన ఈ ఆకాశవీధిలో సినిమాలో ఈ వెన్నెల్లో ఆడపిల్ల పాటని దేవిశ్రీ నే పాడారు. దేవిశ్రీ, హరిణి కలిసి ఈ పాటని చాలా బాగా పాడారు. మీరు ఒకసారి విని చూస్తే తెలుస్తుంది.

పాట చాలా మృదువుగా సాగుతుంది. సాహిత్యం కూడా అలాగే ఉంటుంది. నిజంగా ఆకాశ వీధిలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది :) ఒక సారి మీరే విని చూడండి.
వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే...వెచ్చని అల్లరే నాదైతే...
ఊహలకేమో రెక్కలు రాగా...ఎగిరిపోతుంటే...ఆకాశవీధిలో...
వెన్నెల్లో ఆడపిల్ల నేనయితే...వెచ్చని అల్లరే నీదైతే...
ఊహలకేమో రెక్కలు రాగా...ఎగిరిపోతుంటే...ఆకాశవీధిలో...
మేఘాలే ముగ్గులు పెట్టే వేళల్లో... దేహాలే ఉగ్గులు కోరే దాహంలో...
చందమామే మంచం... సర్దుకుందాం కొంచెం...
అహోరాత్రులు ఒకే యాత్రలో...రహస్యాల రహదారిలో...
ఆకాశవీధిలో...ఓ..ఓ..ఓ..
వెన్నెల్లో ఆడపిల్ల నేనయితే...వెచ్చని అల్లరే నాదైతే...
భూదేవే బిత్తరపోయే వేగంలో...నా దేవే నిద్దురలేచే విరహంలో...
తోకచుక్కై చూస్తా...ఓ..ఓ..సోకు లెక్కే రాస్తా...
ముల్లోకాలకే ముచ్చేమటేయగా...ముస్తాబంత ముద్దాడుకో...
ఆకాశవీధిలో...ఓ..ఓ..
వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే...వెచ్చని అల్లరే నాదైతే...
ఊహలకేమో రెక్కలు రాగా...ఎగిరిపోతుంటే....
ఆకాశవీధిలో...ఓ..ఓ...
వెన్నెల్లో ఆడపిల్ల నేనయితే.....
మళ్లీ కలుద్దాం...!
ప్రేమతో...
మధుర వాణి
3 comments:
naaku keeravani paatalantey chaala istam madhura gaaru..
so anni paatalu vinestoo untaanu..
Ee song gurinchi raasinanduku happy ga feel ayya..
hmm..alludugaru pilichaaru ane movie "noraara pilichina.."song vinnara..
కుమార్ గారూ..
ఆ సినిమాలో పాటలు బావుంటాయి.
నోరార పిలిచినా, రంగు రంగు రెక్కల.. రెండూ బావుంటాయి.
ఈ రెండీటి కంటే కూడా.. మరుగేల ముసుగేల అని మరో పాట ఉంటుంది.
అది నాకు చాలా చాలా ఇష్టం.. మీరు విన్నారా అది?
ippude vintunna aa song....meeru cheppaka...It is good
I like the romantic song..chaali chaalani...
Also songs from priyaraagalu are good..
Rayabaaram pampindevare raatri velalo..and koonalamma koonalamma...
Post a Comment