
హాయ్ హాయ్..
"కొత్త కోయిల స్వరాలు"...ఈ పేరెలా ఉంది??
నేను ఈ శీర్షికని కొత్తగా మొదలుపెట్టబోతున్నాను. పేరులోనే అర్ధం కూడా స్ఫురిస్తుంది కదా...! అదే దీని ఉద్దేశ్యం కూడా...
మన తెలుగు సినిమాల్లో ఎన్నో వేల పాటలున్నాయి కదా.. ఇంకా కొత్తవి వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. మనలో చాలామందికి పాత పాటలే చాలా బావున్నాయి అనిపిస్తుంది. అంటే...పాత రోజులతో పోల్చుకుంటే నేటి సినీసంగీతంలో స్వరాల పరంగా కానీ, సాహిత్యపరంగా గానీ విలువలు పడిపోయాయి అని అనిపిస్తుంది. చాలా వరకు ఈనాటి సినిమాల్లో ఏదో పాటలు పెట్టాలి కాబట్టి పెట్టారు అన్నట్టే ఉంటున్నాయి. సంగీతం అని చెప్పబడే వాయిద్యాల హోరులో అసలు పాడే పాట ఏ భాషలో ఉందో కూడా తెలుసుకోవడం కష్టం అయిపోయింది. అర్ధం పర్ధం లేని ఏవేవో మాటలు

కానీ, ఇలాంటి పరిస్థితుల్లో కూడా, కొంతమంది మంచి అభిరుచి కలిగిన నిర్మాతలు, దర్శకుల పుణ్యమా అని అడపాదడపా కొన్ని మంచి పాటలు వస్తున్నాయి మన తెలుగులో... కొన్ని సినిమాల్లో పాటలు సరైన సందర్భ నేపథ్యంలో మంచి సంగీతం, సాహిత్యం, చిత్రీకరణలతో తీస్తున్నారు.
అలాంటి ఒక మంచి అనుభూతిని కలిగించే కొత్త కొత్త పాటల గురించి మాట్లడుకోడమే ఈ "కొత్త కోయిల స్వరాలు" ధ్యేయం.
మీరందరికీ కూడా నచ్చుతుందని భావిస్తున్నాను.
అతి త్వరలో ఒక కొత్త కోయిల స్వరంతో మీ ముందుకి వస్తాను.
ప్రస్తుతానికి సెలవు మరి..!
ప్రేమతో...
మధుర వాణి
2 comments:
Ashcharyamo mari adbuthamo...na favourie songs anni dorikayi ikada, pure bliss! Chala baga rasaru madhura...enjoyed thoroughly!
Thank you Manasa gaaru.. :-)
Post a Comment