Tuesday, October 14, 2008

ఒక బృందావనం...సోయగం...ఎద కోలాహలం..క్షణ క్షణం...

హాయ్ హాయ్..
ఈ రోజు నేను మీ అందరికి గుర్తు చేయబోయే పాట ఏంటంటే....ఇదే...
ఒక బృందావనం...సోయగం...
ఈ పాట 1988 లో 'పద్మశ్రీ' మణిరత్నం గారు దర్శకత్వం వహించిన ఘర్షణ అనే చిత్రం లోనిది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు. 80 లలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో చాలా హిట్ అయ్యింది. ఇంక పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సినిమా పాటలకి చాలా చాలా మంది అభిమానులు ఉంటారు. ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ వినడానికి ఇష్టపడుతుంటారు. అలంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. ఈ పాటతో పాటు ఈ సినిమాలో మిగిలిన పాటలన్నీ కూడా వాణీజయరాం గారు పాడారు. సుశీల గారు, జానకి గారితో పోల్చుకుంటే వాణీజయరాం గారు తక్కువ పాటలు పాడారు. కానీ, దాదాపుగా ఆవిడ పాడిన ప్రతీ పాట అత్యంత ప్రజాదరణ పొందిన జాబితాలో ఉంటుంది. ఒక బృందావనం... పాటకి సాహిత్యం మణిరత్నం సినిమాలకు ఎప్పుడూ పాటలు రాసే 'రాజశ్రీ' గారు అందించారు. ఈ సినిమా లో ఇద్దరు జంటలు ఉంటారు. ప్రభు-అమల, కార్తీక్-నిరోషా జంటగా నటించారు. ఒకే తండ్రి, వేరు వేరు తల్లులకు పుట్టిన ఇద్దరు యువకుల మధ్యన జరిగే ఘర్షణే ఈ ఘర్షణ సినిమా. మనసుకి హత్తుకునే లాగా తీసారు మణిరత్నం గారు. ఇంక పాట విషయానికి వస్తే...కథానాయిక నిరోషాని కార్తిక్ మొదటిసారి చూసే సమయం లో వచ్చే పాట ఇది. నిరోషాని హీరోయిన్ గా పరిచయం చేసిన మొదటి చిత్రం ఇదే. ఆ అమ్మాయి ఈత కొలనులో ఆడుతూ, పాడుతూ సాగే పాట ఇది. ఈ పాట సంగీతం గానీ, సాహిత్యం గానీ, ఆ సందర్భాన్ని చక్కగా ప్రతిబింబించేలా ఉంటుంది.
పక్షుల కిలకిలా రావాలతో మొదలయీ ఈ పాట ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతుంది. మీరే చూడండి ఒకసారి... ఎంత బావుందో...!!
ఒక బృందావనం...సోయగం...ఎద కోలాహలం..క్షణ క్షణం...
ఒకే
స్వరం..సాగెను తీయగా..ఒకే సుఖం విరిసేను హాయిగా..
ఒక బృందావనం...సోయగం......


నే
సందెవేళ జాబిలీ...నా గీతమాల ఆమనీ...
నా
పలుకు తేనె కవితలే...నా కులుకు చిలక పలుకులే...
నే కన్న కల మేడ నందనం...నా లోని వయసు ముగ్ధ మోహనం...
ఒకే స్వరం..సాగెను తీయగా..ఒకే సుఖం విరిసేను హాయిగా..
ఒక బృందావనం...సోయగం......


నే
మనసుపడిన వెంటనే... ఇంద్రధనుస్సు పొందునే...
వెండి మేఘమాలనే...నా పట్టుపరుపు చేయనే..
నే
సాగు బాట జాజిపూవులే...నాకింక సాటి పోటి లేదులే ..
ఒకే
స్వరం..సాగెను తీయగా..ఒకే సుఖం విరిసేను హాయిగా..
ఒక బృందావనం...సోయగం......


మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ పాట గుర్తు చేసుకుని ఆనందించండి.

ప్రేమతో
...
మధుర
వాణి

3 comments:

యోగి said...

చాలా అబ్ధుతమైన పాట, ఎన్నిసార్లు విన్నా, ఇంటర్లూద్ లో రాబోయే స్వరాలతో సహా కంఠతా తెలిసినా, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. :)

ChimataMusic said...

Madhura..

I would cordially congratulate/appreciate all your service to the nostalgic Telugu music.

As a hardcore bhAshAbhimAni, I would like to suggest you the following in your posts:

చేశావు --> చేసావు గా type అవుతున్నది. You can try with "chEShAvu" and then your transliterated tool might give you the correct melika "శా".

మధురవాణి said...

@ Chimata Music,
Thanks a lot for your compliment and valuable suggestion.
నిజాయితీగా చెప్పాలంటే "చేశావు - చేసావు" రెండీటిల్లో మొదటిదే సరైనది, రెండోది తప్పు అన్న విషయంలో నాకు సరైన అవగాహన లేదు. ఎందుకంటే "చేసుకున్న, చేసిన.." వగైరా పదాలు రాసేప్పుడు 'శ' కాకుండా 'స' నే వాడుతూ ఉంటాం కదా.. అందుచేత "చేశావు, చేసావు" రెండూ సరైనవేనేమో అనిపిస్తుంది నాకు. కానీ, ప్రత్యేకంగా రెండీటికీ తేడా ఏంటి అని నాకు ఎప్పటినుంచో ఉన్న సందేహం. ఇప్పటికీ తీరలేదు. మీరైనా, ఇంకా వేరే ఎవరైనా గానీ మరింత వివరించి చెప్తే సంతోషిస్తాను. :)