ఈ పోస్ట్ title చూసారా? అసలు ఈ వాక్యం వింటేనే ఎంత సంతోషంగా ఉంది కదా..! ఇది ఒక పాట పల్లవి. ఆ పాట గురించే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది.

ఈ పాట కూడా "ఆవకాయ బిర్యాని" సినిమాలో పాట. ఈ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు. పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ, అప్పుడే నేను ఈ పాటలకి చాలా పెద్ద అభిమానినైపోయాను. ఒకసారి వింటే మీరు కూడా అలాగే అయిపోతారు. నాది గ్యారంటీ..!

ఇంతకు ముందుగా చెప్పినట్టుగా శేఖర్ కమ్ముల నిర్మాణంలో అనీష్ కురువిల్లా దర్శకత్వంలో మొదటి సినిమా ఇది. గోదావరి సినిమాలో రాజీని పెళ్లి చేసుకున్న రవి గుర్తున్నాడా? అతని పేరే కమల్ కామరాజు. అతనే ఈ సినిమాలో కథానాయకుడు. ఇంక హీరోయిన్ విషయానికొస్తే అచ్చ తెలుగమ్మాయి, కొత్త అమ్మాయి, పేరు బిందు మాధవి. సంగీత దర్శకుడు మణికాంత్ కద్రికి తొలి సినిమా అయినా గానీ, అద్భుతమైన, మధురమైన సంగీతాన్ని ఇచ్చాడు. మన దేశంలో ఉన్న అతి కొద్ది మంది గొప్ప saxophonists లో ఒకరైన కద్రి గోపాలనాధ్ గారి తనయుడే ఈ మణికాంత్ కద్రి. సాహిత్యం హ్యాపీడేస్ ఫేం వనమాలి అందించారు.
ఈ పాటని కార్తీక్, శ్వేత చాలా చాలా బాగా పాడారు. ఒక్కసారి ఈ పాటలోని వాక్యాలు చూసారంటే మీరు పాట వినకుండా ఉండలేరు. మీరే చూడండి కావాలంటే..!!

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన..
ఇన్నాళ్ళకు నీలో నను దాచిన సంగతి కనుగొన్నా..
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన..
నేనిక లేనా.... నువ్వయ్యానా...!!!
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!
ఈ క్షణమే... మనకై వేచీ..మనసులనే ముడి వేసీ..
కడదాకా... నీతో సాగే.. కలలేవో.... చిగురించే..
నిలువెల్లా నాలోనా... తడబాటే చూస్తున్నా..!!
నిను చేరే వేళల్లో.. తపనేదో... ఆగేనా...!!!
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!
No comments:
Post a Comment