ఈ రోజు చాలా మధురమైన ఒక ఆపాత మధురాన్ని మీకు గుర్తు చేస్తున్నాను.
అదే.."నన్ను దోచుకొందువటే..వన్నెల దొరసానీ..కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ.." అనే పాట.
ఈ పాట 1962 లో వచ్చిన గులేబకావళి కథ అనే జానపద చిత్రంలోనిది. ఇందులో మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ NTR గారు కథానాయకుడు. ఈ చిత్రాన్ని NTR సొంత సంస్థ అయిన N.A.T arts (National art theatre) లో ఆయన సోదరుడైన నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మాతగా తీసారు. ఈ చిత్ర కథకు ఆధారం శ్రీ సుబ్బన్న దీక్షితులు అనే రచయిత రాసిన "కాశీమజిలీ కథలు". ఈ చిత్రంలో పాటలు రాసిన Dr. C. నారాయణ రెడ్డి గారు NTR గారి విన్నపం మీద మొదటి సారిగా సినిమాలకి పాటలు రాయడానికి ఒప్పుకొని మొదటగా ఈ చిత్రానికే రాసారట. ఈ సినిమాలో ఉన్నా అన్నీ పాటల్లోకీ "నన్ను దోచుకొందువటే" అనే ఈ పాట బాగా ప్రజాదరణ పొందింది. ఈ పాట పల్లవిలో దొరసాని అనే పదప్రయోగం ఉంది. ఈ సినిమా వచ్చిన రోజుల్లో రచయితలందరూ ఈ పదప్రయోగం గురించి విపరీతంగా మాట్లాడుకున్నారట. ఎందుకంటే.. ఈ పదం తెలంగాణా ప్రజలకు సుపరిచితమే..కానీ, ఆంధ్రా వాళ్ళకి తెలికపోడమే కారణం. తెలుగు సినీ సాహిత్యంలో దాశరధి రంగాచార్యుల వారు మరియు, సినారె గారే చాలా తెలంగాణా పదాలని తెలుగు ప్రజలందరికీ పరిచయం చేశారట.అదే.."నన్ను దోచుకొందువటే..వన్నెల దొరసానీ..కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ.." అనే పాట.
ఈ పాటని ఆభేరి రాగంలో ఘంటసాల గారు, సుశీల గారు అద్భుతంగా ఆలపించగా... NTR, జమున తమ అభినయంతో పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చారు.
నన్ను దోచుకొందువటే..వన్నెల దొరసానీ..కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ..
నన్ను దోచుకొందువటే ...
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన..
పూలదండ వోలె..కర్పూర కళిక వోలె...కర్పూర కళిక వోలె...
ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు...
ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు..
కలకాలము వీడని సంకెలలు వేసినావు...సంకెలలు వేసినావు...
నన్ను దోచుకొందువటే..వన్నెల దొరసానీ..
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ..
నన్ను దోచుకొందువటే ...
నా మదియే మందిరమై...నీవే ఒక దేవతవై...
నా మదియే మందిరమై...నీవే ఒక దేవతవై...
వెలసినావు నాలో..నే కలసిపోదు నీలో..కలసిపోదు నీలో...
ఏనాటిదో మన బంధం...ఎరుగరాని అనుబంధం...
ఏనాటిదో మన బంధం...ఎరుగరాని అనుబంధం...
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం...ఇగిరిపోని గంధం...
నన్ను దోచుకొందువటే..వన్నెల దొరసానీ..
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ..
నన్ను దోచుకొందువటే .......
మరింకేం...ఆలస్యమెందుకు?? మీరూ ఈ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి.
ఇంక సెలవు...!!
ప్రేమతో...
మధుర వాణి
2 comments:
manchi paataa...nenu oka saari tv lo chusanu...malli guthu chesinanduku dhanyavadamulu....nice work keep going..:)
Post a Comment