Monday, October 20, 2008

మాటే మంత్రము...మనసే బంధము...

ఇవ్వాళ్టి మధురగీతం ఇదే..!
మాటే మంత్రము...మనసే బంధము....అనే పాట.
ఈ పాట, ఈ సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది. 1981 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఇలాంటి ప్రేమకథల ట్రెండ్ అప్పట్నించే మొదలయింది.
ఈ సినిమాకి దర్శకత్వం భారతీ రాజా గారు. సంభాషణలు హాస్యబ్రహ్మ జంధ్యాల గారు రాసారు. కార్తీక్, ముచ్చర్ల అరుణ ప్రేమజంటగా నటించారు. కుల మతాలకి అతీతమైన ప్రేమే ఈ సినిమా కథాంశం. ఆ రోజుల్లో కాలేజీ విథ్యార్ధులు ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూసి మరీ హిట్ చేశారట. ఈ సినిమాకి అత్యద్భుతమైన సంగీతాన్ని music maestro ఇళయరాజా గారు అందించారు. ఇళయరాజా గారి ఆణిముత్యాల్లో ఈ సినిమా పాటలు ముందువరుసలో ఉంటాయి. సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి గారు చాలా అర్ధవంతంగా, మధురంగా రాసారు. ఈ పాటని SP బాలు, SP శైలజ పాడారు. ఈ పాట మొదలవగానే అందరు గుర్తు పట్టేస్తుంటారు ఎందుకంటే పాట మొదట్లో హిందూ మంత్రాలు, చర్చి సంగీతం వస్తాయి. ఈ సినిమాలో హీరో హిందువు, హీరోయిన్ క్రైస్తవురాలు. అందుకే అలా symbolic గా పెట్టారన్నమాట.
ఈ పాట వినడానికి వీనుల విందుగా ఉంటుంది. మాటలు నిజంగా మనసుకి హత్తుకునే లాగ ఉంటాయి. ఒకసారి చూద్దామా మరి..!

ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుశ్శేవేంద్రియే ప్రతిదిష్టతి.....


మాటే
మంత్రము... మనసే బంధము...
మమతే.. సమతే.. మంగళ వాద్యము...
ఇది కల్యాణం... కమనీయం... జీవితం...

మాటే
మంత్రము... మనసే బంధము...
మమతే.. సమతే.. మంగళ వాద్యము...
ఇది కల్యాణం... కమనీయం... జీవితం...

ఓ..ఓ..మాటే మంత్రము... మనసే బంధము...

నీవే నాలో స్పందించిన...ఈ ప్రియలయలో శ్రుతి కలిసే ప్రాణమిదే...
నేనే నీవుగా... పువ్వు తావిగా...
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో...

నేనే నీవై ప్రేమించిన...ఈ అనురాగం పలికించే పల్లవిదే...
ఎదలో కోవెల ఎదుటే దేవత...
వలపై వచ్చి వారమే ఇచ్చి కలిసే వేళలో...

మాటే మంత్రము... మనసే బంధము...

మీరు కూడా ఒకసారి ఈ పాటను గుర్తు తెచ్చుకుని విని ఆనందించండి.

ప్రేమతో...
మధుర
వాణి

1 comment:

krishna rao jallipalli said...

పాటా బావుంటుంది... సినిమా బావుంటుంది... కాని ఆ నిక్కరోడికి ప్రేమేమిటా?? ఇంత వరకు అర్థo కానిది, జవాబు దొరకనిది??