Tuesday, February 14, 2012

ఇందు 'వెన్నెల సంతకం'.. స్నేహానికి 'మధుర సంతకం'

దాదాపు ఏడాదిన్నర క్రితం మన తెలుగు బ్లాగ్లోకంలో ఒక కొత్త బ్లాగు పుట్టింది. ఏమా బ్లాగు కథ అని అలా అటుకేసి తొంగి చూస్తే 'వెన్నెల సంతకం' అనే చక్కటి ఆహ్లాదమైన పేరుతో మొదటి చూపులోనే ఆకట్టుకుంది బ్లాగు. "మనసు పొరల్లో విరబూసిన జ్ఞాపకాల పరిమళాలు.. జాబిల్లి వెదజల్లిన వెండి పుప్పొడి రేణువులు.." అంటూ కాసింత భావుకత్వం, బోలెడంత సున్నితత్వం, మరి కాసింత కవిత్వపు పరిమళం అద్దుకుని అందంగా స్వాగతం పలికే పరిచయ వాక్యాలు కనిపించాయి. ఎవరబ్బా ఇంతందమైన బ్లాగుని రాస్తున్నారు అని బ్లాగరు పేరు చూడగానే అప్పుడు అర్థం అయింది అసలు మహత్యం ఎక్కడుందో. ఎందుకంటే అసలు 'ఇందు' అంటేనే చందమామ అని అర్థం కదా మరి! ఓహో.. అందుకేనేమో జాబిలమ్మ ఇంతందంగా వెన్నెల సంతకం చేస్తోంది. సార్థక నామధేయురాలల్లే ఉందే అమ్మాయి అనిపించింది.

తన గురించి చెప్పమంటే 'ప్రకృతి నాకు స్ఫూర్తి' అనే ఇందు తను చూసొచ్చిన అందమైన ప్రదేశాల గురించి, అక్కడ కనువిందు చేసిన ప్రకృతి రమణీయతని గురించి తనదైన శైలిలో కళ్ళకి కట్టినట్టు అందంగా వర్ణిస్తుంది. అప్పర్ పెనిన్సులా అందాలు, స్మోకీస్ టపాలు చదివితే తన అక్షరాల వెంబడి అడుగులు వేస్తూ మనం కూడా వెళ్లి చూసొచ్చినట్టే అనిపిస్తుంది. కేవలం అక్షరాల్లో నిక్షిప్తం చేయడమే కాకుండా అందమైన ప్రకృతి దృశ్యాలని తన కెమెరా కన్నుతో శాశ్వతం చేసే విద్య కూడా బాగా వచ్చు ఇందుకి. తను తీసిన ఛాయాచిత్రాలు చూడాలంటే తన ఫోటో బ్లాగ్ 'చిత్రాంజలి' ని సందర్శించాలి.
కేవలం అమెరికా అందాలే కాదు తిరుమల కాలిబాట ప్రయాణం గురించీ, సాగర్ రోడ్డు గురించి కూడా చక్కటి కబుర్లు చెప్పింది గుంటూరమ్మాయి. చిరుజల్లులంటే తనకి ఇష్టమే అయినప్పటికీ ఏమైనా తనకి మంచు అంటేనే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది. అనిపించదూ మరి.. అప్పుడోసారి ఒక అందమైన మంచు కురిసే ఉదయాన్ని మనకి చూపించిందా, మొన్నీ మధ్యే బోల్డన్ని మంచు ముచ్చట్లు చెప్పిందా, మళ్ళీ అప్పట్లో ఓసారి పేద్ద సాహసంగా మంచుకి ఎదురీదానని చెప్పి కాస్త కంగారుపెట్టింది కూడా కదా!

అన్నట్టు, మీకు ఇందు సైకిలు కథ తెలుసా.. తెలీకపోతే ముందు అర్జెంటుగా వెళ్లి తెలుసుకురావాల్సిందే! ఇంకా తన చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడితో కలిసి చేసిన అల్లరి, కళాశాల కబుర్లు, నోట్ బుక్ వెనక పేజీల్లో గీసిన కళాఖండాలూ, ఎప్పటికైనా తీరుతుందో లేదోననుకున్న తన అందమైన కల, మసాలా తాతయ్య కబుర్లూ.. ఇవన్నీ హాయిగా అలా గడ్డం కింద రెండు చేతులూ పెట్టుక్కూర్చుని వినదగిన కబుర్లు. అప్పుడప్పుడూ మిస్సింగ్ రోజ్, పరంజ్యోతి అంటూ తను చదివిన పుస్తకాలని మనకి పరిచయం చేస్తుంటుంది. పుష్పక విమానం లాంటి మంచి సినిమాల గురించే కాకుండా తింగర మంగళ అంటూ హర్రర్ సినిమా స్టోరీ చెప్పి మనల్ని కడుపుబ్బా నవ్వించేస్తుంది.

మీకు సీతాకోకచిలుకలా హాయిగా గాల్లో ఎగరాలనుందా.. అయితే ఇందు దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. ఎలా ఎగరాలో తను మీకు నేర్పిస్తుంది. అలాగే పాపం ఇందు చిన్ననాటి నేస్తం తప్పిపోయిందట. మీకెక్కడన్నా ఎదురు పడితే మన ఇందు తన కోసం ఎదురు చూస్తోందని చెప్పడం మర్చిపోకండేం! అప్పుడెప్పుడో కార్ డ్రైవింగు నేర్చుకుంటున్నాననీ, తనకి అర్జెంటుగా డ్రైవింగు లైసెన్స్ వచ్చెయ్యాలని మనందర్నీ కూడా తన కోసం పూజలూ, వ్రతాలూ చెయ్యమని చెప్పింది కదా.. ఇప్పటికైనా లైసెన్సు వచ్చిందో లేదో మరి మన మేడం గారికి.

ఇప్పటికిప్పుడే కమ్మటి కొత్తావకాయ రుచి చూడాలనిపిస్తోందా.. అయితే ఇందూ బ్లాగు తలుపు కొట్టండి. మళ్ళీ మళ్ళీ రుచి చూడాలనిపించే కమ్మటి కొత్తావకాయ విందు దొరుకుతుంది. ఇంకా ఇందు పాకశాస్త్ర ప్రావీణ్యం చూడాలంటే మాత్రం తన చేత్తో వండి వార్చిన కొబ్బరన్నం, రివర్స్ సేమ్యా ఉప్మా రుచి చూడాల్సిందే. పనిలో పనిగా తను చెప్పే నూడిల్స్ కథ కూడా వినేసి రండి మరి. మధ్య ఇందు 'బ్రెడ్డు హేటర్స్' సంఘం ఒకటి స్థాపించింది. మీరు కూడా నాలాగా 'బ్రెడ్డు వద్దు..ఇడ్లీనే ముద్దు' అనేవారయితే చందూ గారిని సపోర్ట్ చేస్తూ ఇందూకి వ్యతిరేకంగా సంఘంలో చేరొచ్చు. హిహ్హిహ్హీ.

కల్యాణం కమనీయంలా ఇందు పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో తెలుసా మీకు. ఇంకా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసి ఇందూచందూలని దీవించి రండి. ఇందుకి భక్తి ప్రపత్తులు కొంచెం ఎక్కువే. చక్కగా సంప్రదాయబద్ధంగా పండుగలూ, పూజలూ చేసుకోడం చాలా ఇష్టం. మీరే చూడండి వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, శివరాత్రి అంటూ ఎంత బాగా పూజలూ పునస్కారాలూ చేస్తుందో. అప్పుడప్పుడూ బుద్ధం శరణం గచ్చామీ అని కూడా స్మరిస్తుంది. అలాగే మీకు జావాలో ఏమన్నా సందేహాలుంటే ఇందుని అడిగెయ్యండి. ఎందుకంటే తను జావా వ్రతం చేసిందిగా మరి.

ఇందుకి కథలు రాయడం బాగా వచ్చు తెలుసా.. ఒక్క చిట్టి చీమ కథే కాదు, అందమైన ప్రేమకథలు కూడా రాసేస్తుంది. తొలిసారి నిన్ను చూసింది మొదలు.. అంటూ తను రాసిన తొలి కథ చదివితే మీరూ ఒప్పుకుంటారు. కేవలం కథలే కాదు.. శ్రావణ మేఘాలూ, స్వప్నాలూ అంటూ అలవోకగా కవితలు అల్లేస్తుంది. అంతే కాదు.. 'For women' అనే వెబ్సైటు కోసం తన అమెరికా వాసపు కబుర్లతో ఆసక్తికరమైన వ్యాసాలు కూడా రాస్తోంది ఇందు.

ఇందుకి అందమైన డైరీలన్నా, నెమలీకలన్నా, చాక్లెట్లన్నా మహా ఇష్టం. మీరెప్పుడైనా తన కోసం ఏదన్నా కానుకివ్వాలనుకుంటే అవి ఇచ్చెయ్యండి. బోల్డు సంతోషపడిపోతుంది. ఇంకా ఏం ఇష్టం అని అడుగుతున్నారా.. దెయ్యాల కథలంటే ఇష్టమనుకోండి. కానీ, కొంచెం భయం కూడా. అయినా సరే తను వింటానంటుంది గానీ మీరు మాత్రం తనకి దెయ్యాల కథలు చెప్పకండేం. ఎందుకంటే తర్వాత తను భయపడి పాపం చందూ గారిని కూడా కంగారు పెట్టేస్తుంది కాబట్టి. అలాగే ఇంటర్నెట్లో ఆడే గేమ్స్ గురించి మాత్రం ఇందుకి అస్సలు గుర్తు చెయ్యకండి. అసలే ఎంతో కష్టపడి ఒకసారి తన మీద తను గెలిచింది. అందుకని మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు.. సరేనా!

ఇందు గురించి ఇంకొక గొప్ప విశేషం చెప్పాలి. అదేంటంటే, తనకి కృష్ణుడు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా.. అయ్యో రామా.. నిజమండీ బాబూ.. తన బ్లాగు ముంగిట్లోకి అడుగు పెట్టగానే "ఇందూ.. ఏమన్నా కబుర్లు చెప్పవా అని ముద్దుగా అడిగే చిన్నారి కృష్ణుడిని చూస్తే మీరూ ఒప్పుకు తీరతారు. సరదాకేం కాదు గానీ, నిజంగానే ఇందుకి కృష్ణుడంటే బోల్డంత ఇష్టం, ఆరాధనా, ప్రేమా, భక్తీనూ! తన బ్లాగులో మొట్టమొదటి పోస్టుని ఒక అందమైన కృష్ణ శ్లోకం తోనే ప్రారంభించింది. శ్రీకృష్ణ చరణాల్ని తలచుకోగానే తనకి ఎంతటి భక్తి పారవశ్యమో! 'యమునా తటిలో నల్లనయ్యకై..' అంటూ సాగే కమ్మటి పాటకి ఎంతందంగా వ్యాఖ్యానం చెప్పిందో చూసారా? తన అందమైన కల కృష్ణుడి కృపతో కళ్ళెదుటే నిజంలా నిలిచి ఒక అద్వితీయమైన అనుభూతిని తనకెలా సొంతం చేసిందో మీరూ తెలుసుకోండి. మీరెప్పుడైనా బృందావనానికి వెళ్ళారా? ఇందు రాసిన బృందావనం కథ చదివితే మధురానగరి తీరం, యమునా తరంగాల సవ్వడి, బృందావనంలోని పుష్ప పరిమళాలూ, మోహన మురళీగానం.. సర్వమూ అనుభవంలోకి వస్తాయి. ఎప్పటికీ గుర్తుండిపోయే అమూల్యమైన అనుభూతిని ఒడిసిపట్టుకోవచ్చు. తన రాతలన్నీటిల్లోకీ నాకు మరీ మరీ నచ్చిన టపా కూడా ఇదే.

ఇంతసేపూ ఇందు రాతల గురించే చెప్పాను కదా.. ఇప్పుడు ఇందు గురించి రెండు మాటలు చెప్తానేం.. ఇందు చాలా మంచి అమ్మాయి. చాలా చాలా మంచి అమ్మాయి. నిజ్జంగా నిజం.. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు, తన చుట్టూ ఉన్న అందరితోనూ స్నేహంగా మసలుకునే మంచి మనసు. ఎంత అల్లరి చేస్తుందో అంత ఆలోచనాపరురాలు కూడా. నాకైతే చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితురాలైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాగుల ద్వారా పరిచయమై, స్నేహం పెంపొంది నా మనసుకి నచ్చి దగ్గరైన అతి తక్కువమంది ఆత్మీయులలో ఇందు ఒకరు. అలాంటి చిన్నారి ఇందు పుట్టినరోజు రోజే కాబట్టి.. తను ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలనీ, తను కోరుకున్నవన్నీ దక్కాలనీ, కొంచెం బిజీ తగ్గి ఇదివరకులా తరచూ తన వెన్నెల సంతకంతో మనందరినీ మురిపించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.. మనందరం కలిసి ఇందుకి హేప్పీ హేప్పీ బర్త్ డే చెబుదామా మరి..


33 comments:

Anonymous said...

Wish you many happy returns of the day.నాకు నచ్చలా, దీవెన. ఇది నా దీవెన దీర్ఘాయుష్మాన్ భవ!

Zilebi said...

వెన్నెల సంతకం బాగుందండీ

చదవడానికి ఆ విడ్జెట్ లు మరీ ఇబ్బంది కలిగిస్తున్నాయి.

ఇంత బాగా రాసేవారు ఎందుకు అలాంటి అడ్డంకులు పెడతారు చెప్మా !

హ్యాపీ గా వెన్నల ని ఆస్వాదిస్తామను కుంటే ఆ విద్జేటు రాక్షసుడు మరీ అడ్డు పడి వెన్నెల అందాన్ని పోగొడుతున్నాడు !చీర్స్
జిలేబి.

జ్యోతి said...

ఇందు.. దీర్ఘాయుష్మాన్ భవః

Unknown said...

ఇందు గారి వెన్నెల సంతకానికి మీ అక్షర మాటలతో నక్షత్ర జిలుగులు అద్దారు. ఎప్పటిలానే మీరేది రాసినా అద్భుతం....
తన పుట్టిన రోజుని చక్కగా తెలియజేశారు.
ఇందు గారికి కి జన్మదిన శుభాకాంక్షలు !!!

హరే కృష్ణ said...

Happy Happy B'day Indu Chandu :)

తృష్ణ said...

a very very happy birthday indu !
good gift madhuraa !!

SHANKAR.S said...

మనందరి ఆత్మీయ డైనోకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

"ఇందు చాలా మంచి అమ్మాయి. చాలా చాలా మంచి అమ్మాయి. నిజ్జంగా నిజం.. "

అలా చెప్పకపోతే కొడుతుందన్నట్టు చెప్పావు మధురా :))

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇందు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
నవ్వుతూ నవ్విస్తూ ఇలాగే హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఇందులో కొన్ని టపాలు నేను చదవలేదు. వెంటనే చదివెయ్యాలి.

ఇంత మంచి టపా వ్రాసిన మధుర వాణి గారికి ధన్యవాదాలు.

♛ ప్రిన్స్ ♛ said...

ఇందు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

శివరంజని said...

కరెక్ట్ గా చెప్పావు మధు .. ఎవరైనా ఇందు తో ఒక గంట మాట్లాడితే చాలు ఈ నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ అని ఒప్పుకోక తప్పాడు ... నాకు ఈక్వల్ గా అల్లరి చేసే అమ్మాయి ఎవరన్న ఉన్నారు అంటే అది మన ఇందు నే .. అందుకే తనకి నేను ఓ ముద్దు పేరు కూడా పెట్టాను .. ఆ పేరంటే తనకి చాల ఇష్టం ......... చాక్లెట్ బేబీ హేపీ హేపీ హేపీ బర్త్డే డే :))))))))

ఇందు చిన్నప్పుడు తప్పిపోయిన ఆ నేస్తం నేనే కదూ ...నేనే కదూ ఇందు నేనే :P

vijay.... said...

ఇందు కి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

వేణూశ్రీకాంత్ said...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇందూ... మీ బిజీ కొంచెం తగ్గి మళ్ళీ ఇంకొంచెం తరచుగా మీ వెన్నెల సంతకంతో బోలెడు కబుర్లు పంచుకుంటారని ఆశిస్తున్నాను :)
చాలా బాగా రాశారు మధురా..

రాజ్ కుమార్ said...

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇందు గారూ

రాజ్యలక్ష్మి.N said...

Wish you many happy returns
of the day..
ఇందు గారికి జన్మదిన శుభాకాంక్షలు!

శశి కళ said...

కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు, తన చుట్టూ ఉన్న అందరితోనూ స్నేహంగా మసలుకునే మంచి మనసు. ఎంత అల్లరి చేస్తుందో అంత ఆలోచనాపరురాలు కూడా.
అవును చక్కటి స్నెహ శీలి....మధురా నిజంగా తను యెంత మంచి స్నెహితురాలిని పొందింది...ఈ పొస్ట్ తనకి నిజం గా చక్కటి బహుమతి....పుట్ట్టిన రొజు శుభాకాంక్శలు ఇందు...

మాలా కుమార్ said...

Happy Birthday indu.

జ్యోతిర్మయి said...

ఇందూగారూ అప్పుడెప్పుడో 'మంచు ముచ్చట్లు' చదివాను. ఈ అమ్మాయి బాగా వ్రాస్తున్నారే అనుకున్నాను. అది మీరే అని ఇప్పుడే తెలిసింది.
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

మధుర గారూ ఎంత మంచి బహుమతి ఇచ్చారండీ మీ స్నేహితురాలికి.

Sravya V said...

చాలా చక్కగా రాసారు మధుర ఇందు గురించి !
హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇందు !!

పద్మవల్లి said...

ఇందూ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!!!
మధురా, చాల బాగా రాసావు. నేను తన బ్లాగ్లో అన్నీ చదివేసాను అనుకున్నాను, కానీ చాలానే చదవలేదు అని తెలిసింది నీపోస్టు వలన.

మనసు పలికే said...

మధురా.. ఇందు గురించి ఎంత చక్కని పరిచయం ఇచ్చావో.. నా తరపున కూడా మన నేస్తం ఇందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు:):)

వనజ తాతినేని said...

Indhu.. Wish you Happy Birth day. Many many more Happy returns of the Day.
Madhura.. Manchi Gift ichhaaru.Good.

జయ said...

చాలా మంచి బ్లాగ్. ఎంత వ్రాసినా తక్కువే మధుర గారు.
ఇందు గారు, మీకు హృదయపూర్వక అభినందనలతో...జన్మదిన శుభాకాంక్షలు.

..nagarjuna.. said...

పుట్టినరోజు శుభాకాంక్షలు ఇందుగారు ః)

మధురవాణి said...

@ కష్టేఫలే,
శర్మ గారూ.. మంచి మాట చెప్పారు. విషెస్ కన్నా దీవెనలే మిన్న.. ధన్యవాదాలు. :)

@ జిలేబీ,
ధన్యవాదాలండీ.. ఇంతకీ విడ్జెట్స్ ఇబ్బంది ఏ బ్లాగులో.. నా బ్లాగులోనా, ఇందూ బ్లాగ్లోనా, లేకపోతే ఇద్దరి బ్లాగుల్లోనూ అంటారా? :P

@ చిన్ని ఆశ,
మీ ప్రేమపూర్వక అభిమానానికీ, శుభాకాంక్షలకీ బోల్డు బోల్డు థాంకులు.. :)

@ జ్యోతి, హరేకృష్ణ,
థాంక్యూ ఫ్రెండ్స్.. :)

@ తృష్ణ గారూ,
అయితే గిఫ్ట్ బావుందంటారా.. Thanks for the compliment and wishes. :)

మధురవాణి said...

@ శంకర్.S,
హహ్హహ్హా.. అదేం కాదు.. ఇందు మంచి అమ్మాయి. చాలా చాలా మంచి అమ్మాయి. అందుకని నన్ను అస్సలు కొట్టదు తెల్సా.. :))))) థాంక్యూ.. :D

@ బులుసు గారూ,
అలాగే మిగిలినవన్నీ కూడా తీరిగ్గా చదివెయ్యండి మరి.. పోస్టు నచ్చినందుకు, శుభాకాంక్షలు అందించినందుకు ధన్యవాదాలు. :)

@ తెలుగు పాటలు, విజయ్, రాజ్ కుమార్, రాజి, మాలా కుమార్, నాగార్జున..
నాతో పాటుగా ఇందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించిన మిత్రులందరికీ బోల్డన్ని ధన్యవాదాలు.

@ శివరంజని,
థాంక్స్ ఫర్ ది స్వీట్ విషెస్.. :))

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ వేణూ.. మీ కోరికే నాది కూడానూ.. మరింత తరచుగా ఇందు కనిపించాలని.. :))

@ శశికళ,
అబ్బ.. ఎంత గొప్ప ప్రశంస ఇచ్చారండీ.. చాలా సంతోషమయ్యింది. ధన్యవాదాలు. :)

@ జ్యోతిర్మయి, వనజ వనమాలి,
బాగుందంటారా నా బహుమతి.. థాంక్యూ థాంక్యూ.. :)

@ శ్రావ్యా, మనసు పలికే,
నేను రాసింది మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ బోల్డు బోల్డు థాంకులు అమ్మాయిలూ..:))

@ పద్మవల్లి,
అవునా.. అయితే మిగిలినవన్నీ ఇప్పుడు చదివెయ్యండి. థాంక్యూ సో మచ్.. :))

@ జయ గారూ,
మంచి మాట చెప్పారండీ.. ధన్యవాదాలు.. నిజమే.. ఏదో మనకి చేతనయినంత ప్రయత్నం చెయ్యడమే తప్ప మొత్తంగా సరితూగేంత రాయలేమేమో కదూ! :)

ఇందు said...

మధురా!! నాకు చాలా చాలా హప్పిగా ఉంది. నీ మాటల్లో నా బ్లాగు గురించి చూస్తుంటే!! ఎంత బాగా రాసావో పాపం ఆ బ్లాగుని ఎంత పరిశీలిస్తే ఇంత బాగా రాయగలిగావ్!! అలాగే నన్ను ఎంత అభిమానిస్తే ఇలా రాయగలవ్!! హ్మ్! ఏదేమైనా ప్రేమ,కోపం,స్నేహం, అన్నీ నీ తరువాతే ఎవరైనా ఇంత అందంగా వర్ణించగలిగేది. అసలు ఈ పోస్టులో అన్నిసార్లు 'ఇందూ' అన్న పేరు చూస్తుంటే ఎంత పులకింతగా ఉందో!! చాలా థాంక్స్ మధూ!! నిజంగానే నాకు అన్నిటికంటే బాగ నచ్చిన స్వీట్ స్వీట్ గిఫ్ట్ ఇది :) నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నీదగ్గరనించి లభించిన బెస్ట్ గిఫ్ట్ ఇది :)

మధు పోస్టు మెచ్చి, నాకు శుభాకాంక్షలు అందించిన స్నేహితులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు :)

మధురవాణి said...

@ ఇందమ్మాయ్..
ఒక్క మాటలో చెప్పాలంటే, పుట్టినరోజు పాపాయి కళ్ళలో ఈ చిన్ని మెరుపు చూద్దామనే నేను ఈ బుల్లి కానుక ఇప్పుడిచ్చింది. ఆ కోరిక తీరినందుకు నాక్కూడా బోల్డు సంతోషంగా ఉంది. You are most welcome. Pleasure is all mine dear! :)

శ్రీనివాస్ said...

మీ బ్లాగ్ చాల చాల బాగుంది.. ఇంత ఓపిక తో రాయడం నిజంగా అబినందించదగ్గ విషయం

జైభారత్ said...

మధురవాణి గారు ... ఇందు గారికి మీ అంత బెస్ట్ ఫ్రెండ్ దొరకడం...ఎంత అదృష్టమో...ఐనా మీరు..సాటి బ్లాగర్ ని ఎలా పొగడగలిగారండి అసలు...అందునా ఒక అమ్మాయి ని ఇంకో అమ్మాయి...వావ్!!!! మీరు నిజంగా గ్రేటండి బాబు...మీరింతగా చెబుతుంటే..ఇక ఇందు గారి బ్లాగ్ని నా నాయనాగ్నితో ధహించివేస్తాను ...

మధురవాణి said...

@ శ్రీనివాస్,
మీ ప్రశంసకి ధన్యవాదాలండీ.. :)

@ లోకనాథ్,
మీకు మరీ అంత విచిత్రంగా అనిపించిందంటే నాకూ చిత్రంగానే ఉందండీ.. :)
సరే అలాగే.. తప్పకుండా మా ఇందూ బ్లాగ్ చదవండి. ఎవరికైనా నచ్చేస్తుంది. కాకపోతే ఏంటో అగ్ని, దహించివేయడాలూ అంటున్నారు. మరీ అంత హింసాత్మక చర్యలేవీ తలపెట్టకండి సుమీ.. :))))

రవిశేఖర్ హృ(మ)ది లో said...

ఎంత చక్కటి విశ్లేషణ !అది ఇంకో బ్లాగు ఫై మీ బ్లాగు చాల బాగుందండి.అలాగే మీ ఇందు గారిది కూడా !మీ శైలి బాగుంది.
మరోసారి వ్రాస్తాను మరింత విశదంగా !
రవిశేఖర్ ఒద్దుల

మధురవాణి said...

@ oddula ravisekhar,
మా రాతలు మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మా ఇద్దరి తరపునా మీకు ధన్యవాదాలండి. :)