Showing posts with label చిట్టి కథలు. Show all posts
Showing posts with label చిట్టి కథలు. Show all posts

Friday, July 12, 2013

ఓ చిన్న కథ!



​​చిన్నప్పుడు నాలుగైదు తరగతుల్లో తెలుగు వాచకంలో ఒక కథ ఉండేది. కథ పేరు పరివర్తన అని గుర్తు.

ఒక ఊర్లో సుశీల అనే కల్లా కపటం లేని సాధు స్వభావం కలిగిన అమ్మాయి ఉంటుంది. (నాకింకా బాగా గుర్తు కల్లా కపటం అనే పదం అదే మొదటిసారి వినడం :-) సుశీల భర్త అహంకారి, తోటివారిని మోసం చేసి డబ్బు సంపాదించే రకం. అందరితో పాటు సుశీలని కూడా కష్టపెడుతూ ఉండేవాడు. సుశీల వాళ్ళ ఊరి నడిబొడ్డులో ఉన్న ఒక మర్రిచెట్టుకి ఉన్నట్టుండి కొత్తగా మహిమ వచ్చిందని ఊరంతా కోడై కూస్తుంది. ఎవరైనా మర్రిచెట్టు కిందకి వెళ్ళగానే వారి వారి మనస్తత్వం వ్యక్తిత్వాన్ని బట్టి రూపం మారిపోతోందట. మళ్ళీ మర్రిచెట్టు కింద నుంచి దూరంగా వచ్చేస్తే ఎప్పట్లాగే వాళ్ళ నిజరూపం వచ్చేస్తుందట. ఊర్లో అందరూ ఆ వింత ఏదో చూద్దామని మర్రిచెట్టు చుట్టూ గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారట. చాలామంది కుక్కల్లాగా, పిల్లుల్లాగా రకరకాలుగా మారిపోతుండటం చూసి జనాలు విరగబడి నవ్వుతుంటారు.
ఇదంతా చూసి సుశీల భర్తకి మర్రిచెట్టు కిందకి వెళ్ళి తానూ ఎలా మారతాడో చూసుకోవాలని కుతూహలం ఏర్పడుతుంది. కానీ ఊర్లో వాళ్ళందరి ముందు వెళ్ళడానికి ఇష్టపడక ఒక రోజు అర్ధరాత్రి పూట సుశీలని వెంటబెట్టుకుని మర్రిచెట్టు దగ్గరికి వెళతాడు. ఇద్దరూ కలిసి చెట్టు కిందకి చేరగానే సుశీల భర్త పెద్ద బ్రహ్మ రాక్షసుడిగా మారిపోతాడు. సుశీల మాత్రం ఏమీ మారకుండా తన నిజరూపంలోనే ఉంటుంది. భర్త బ్రహ్మరాక్షస రూపాన్ని చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత సుశీల భర్త చెట్టు నీడ నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చేస్తాడు. తనలో ఇంత క్రూరత్వం ఉందనీ, సుశీల కల్లా కపటం లేని మనసు వల్లే తను రూపం మారలేదని అర్థం చేసుకున్నాక అతనిలో పశ్చాత్తాపం కలిగి పరివర్తన చెందుతాడు. ఇక నుంచి మంచి మనిషిలా మారి బతకాలని నిర్ణయించుకుంటాడు.
ఇదీ కథ!
నాకు అప్పుడప్పుడూ ఈ కథ గుర్తొస్తూ ఉంటుంది. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన పలు రకాల సౌకర్యాల మూలంగా ప్రపంచంలో నలుమూలల ఉన్నవారినందరినీ ఒక చోటకి చేరుస్తోంది ఇంటర్నెట్ లోకం. కానీ పై కథలో మర్రిచెట్టు కిందకి చేరగానే రూపాలు మారిపోయిన మనుషుల్లాగే ఇంటర్నెట్ నీడలో మనుషులు రూపాంతరం చెంది కనిపిస్తుంటారు. ఆ కనిపించే రూపాల వెనక దాగున్న నిజమైన వ్యక్తి ఎవరు ఏమిటో అంచనా వెయ్యగలగడం, అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యంగా మారిపోతోంది. ఈ మాయాలోకంలో ఎదురుపడే ఇందరి మధ్యలో ఒకరో ఇద్దరో సుశీల లాంటి వాళ్ళ పరిచయం, స్నేహం పొందగలిగితే అదృష్టవంతులమే కానీ ఆ సంభావ్యత ఎంతని ఎలా లెక్కగట్టడం? అది ఎప్పటికప్పుడు కొత్త ప్రశ్నే ఎందుకంటే మరి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త రూపాల్లో ఎదురుపడుతుంటారు కాబట్టి ఇదీ లెక్క అని తేల్చడం సాధ్యమయ్యే పని కాదు కదా! కానీ పై కథలోలా మర్రిచెట్టు కింద కనిపించే కొత్త ​రూపాలు సరదాగా ఉండి ​ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేవైతే నష్టమేముందీ, అయినా ముసుగులు బయట మాత్రం ఉండవా అంటే ఉండొచ్చు. కానీ ఈ మయసభ లాంటి లోకంలో బోల్తా పడటం బయటి ప్రపంచంలో కన్నా మరింత సులువు కదా! :-)



Thursday, November 24, 2011

ఊ అనూ.. ఊహూ అనూ..


"ఏవండీ.. ఇక్కడ కూర్చోవచ్చా?"
".."
"బస్ ఎప్పుడొస్తుందో మీకు తెలుసాండీ?"
"ఊహూ.."
" బస్సు ఎక్కుతున్నారంటే మీరు మా కాలేజీనాండీ?"
"ఊహూ.."


"హాయ్.. నన్ను గుర్తు పట్టలేదాండీ.. నిన్న కలిసాం కదా!"
"ఊహూ.."
".. మర్చిపోయారా.. పోనీ నన్ను మళ్ళీ గుర్తు చెయ్యమంటారా?"
"ఊహూ.."
"అదేంటండీ.. నిన్న కాలేజీనా అనడిగితే కాదన్నారు.. అయితే మీరూ ఇక్కడే చదువుతున్నారన్నమాట!"
"ఊహూ.."
"మరిక్కడున్నారేంటి .. ఎవరన్నా ఫ్రెండ్స్ కోసం వచ్చారా?"
".."


"హాయ్.. ఏంటండీ.. రోజూ ఇదే బస్సెక్కి ఇదే కాలేజీకి వచ్చేది కేవలం ఫ్రెండ్స్ ని కలవడం కోసమేనా?"
".."
"మీ పేరేంటో తెల్సుకోవచ్చా?"
"ఊహూ.."
"ప్చ్.. అయితే మీకు మాటలు రావాండీ పాపం?"
"ఊహూ.."
"మాట్లాడకపోయినా కనీసం పోట్లాడతారేమో అనుకున్నానండీ.. అయితే నా ఉపాయం పని చెయ్యలేదన్నమాట!"
".."
"పోనీలెండి.. రేపు మళ్ళీ ఇదే టైముకి కనిపిస్తారుగా.."
"ఊహూ.."
"నా కోసం కాదండీ.. కాలేజీకి వస్తారుగా అంటున్నా.."
".."


"హాయ్.. చాన్నాళ్ళైంది కనిపించి.. బావున్నారా?"
"ఊహూ.."
"ఏంటీ.. నిజంగా బాగాలేరా?"
".."
"మీరు మూగో కాదో తెలీదు గానీ మిమ్మల్ని చూసీ చూడగానే నాకొచ్చిన మాటలు కూడా మర్చిపోతానండీ నేను.."
".."
"మీరు చాలా అందంగా ఉంటారండీ.."
".."


"ఏడాదిగా చూస్తున్నాను.. మీకు '.. ఊహూ' తప్ప వేరే మాటలేవీ నేర్పించలేదాండీ మీ ఇంట్లో వాళ్ళు?"
"ఊహూ.."
"నాతో మాట్లాడటం మీకిష్టం లేదాండీ?"
"ఊహూ.."
"మీ పక్కన కూర్చోవచ్చాండీ?"
"ఊహూ.."
"బస్ ఎప్పుడొస్తుందో తెలుసాండీ?"
"ఊహూ.."
"మీరంటే నాకు చాలా ఇష్టమండీ.."
".."
"ఒట్టి ఇష్టమే కాదు.. బోల్డు ప్రేమ కూడానండీ.."
".."
"మీక్కూడా నేనంటే ఇష్టమేనా మరి?"
"ఊహూ.."
"నేను మీ చెయ్యందుకోవచ్చాండీ?"
"ఊహూ.."
"ఊహూ.. అంటే .. అని అర్థమాండీ?"
".."

కొన్నాళ్ళు గడిచాక....



"ఏవండీ.. ఏవండోయ్.. మిమ్మల్నే పిలిచేది.. ఎంత పిలిచినా పలకరే అసలు?"
"
.."
"
ఇందాకటి నుంచీ నేను గొంతు చించుకుని మరీ చెప్పేది మీరేమన్నా ఆలకిస్తున్నారా?"
"
.."
"
అసలు నిన్న మీకేం చెప్పాను.. పని చేసుకొచ్చారా?"
"
ఊహూ.."
"
మీరేం మనిషండీ బాబూ.. కనీసం ఒక్కసారన్నా నేను చెప్పిన పని చెప్పినట్టు చేసుకొచ్చారా?"
"
ఊహూ.."
"
సరేలే.. భోజనంలోకి గుత్తి వంకాయ కూర చేసాను. సరిపోతుంది కదా.."
"
.."
"
పక్కనుంచి శోష వచ్చేలా నేనింతలా మాట్లాడుతుంటే మీరేం బదులివ్వరేంటండీ.. మూగవారైపోయారా ఏంటి??"
"
.."
"
మధ్యన మీరు చాలా మొద్దుమొహంలా తయారవుతున్నారండీ.. సంగతేమన్నా తెలుస్తోందా?"
"
.."
"
రెండేళ్ళుగా చూస్తున్నాను.. మీకు '.. ఊహూ' తప్ప వేరే మాటలేవీ నేర్పించలేదాండీ మీ ఇంట్లో వాళ్ళు?"
"
ఊహూ.."
"
అసలు పెళ్ళి కాకముందు ఎన్నేసి మాయ మాటలు చెప్పారండీ.. అంటే అవన్నీ అబద్ధాలే కదూ?"
"
.."
"
అంటే నిజంగా అబద్ధాలు చెప్పారు అనేనా??"
"
.."
"
నా మీద మీకు బొత్తిగా ప్రేమ లేకుండాపోయింది కదూ?"
"
.."
"
అసలు నాతో మాట్లాడటం కూడా మీకు నచ్చట్లేదు కదూ!"
"
.."
"
చీ చీ.. మీ మాయ మాటలు నమ్మి మిమ్మల్ని పెళ్ళాడటం నాదే బుద్ధి తక్కువయ్యింది.."
"
.."
"
హూ..నా ఖర్మ కాకపోతే... అయినా మీలాంటి మనిషితో ఇంక మాటలనవసరం.."
"
.."
"(*&&^%^$
£(&*($£&($%*£"
"^&*(%*(
£%^$&**)(^%&$£"

ఏదో వస్తువు నేల మీద పడి భళ్ళున బద్దలైన శబ్దం..

"
.. అయ్యయ్యో.. కింద ఎలా పడిపోయింది? సర్లే.. పోతే పోయిందిలే.. నువ్వేం బాధపడకు.. ఇంతకీ మీ ఫ్రెండ్ స్నేహ ఏమంది అప్పుడు.. చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేసావేంటి?"
"................
tension"


టపా వెనక ఉన్న చిన్న పిట్ట కథేంటంటే మన శిశిర ఉంది కదా.. అదేనండీ.. తన 'ఎదసడి' ని మధురంగా తన అక్షరాల్లో నింపి మనకి వినిపిస్తూ వుంటుందే.. శిశిర.. తను చిన్నప్పుడు బాగా విన్న పాట ఒకదాని కోసం వెతుకుతూ మీకేమైనా తెల్సా అని నన్ను అడిగారు. " అనూ.. ఊహూ అనూ.." అని మురళీకృష్ణ సినిమాలోని పాట అది. అయితే తను వెతికినప్పుడు దొరకలేదట. దానిక్కారణం ఏంటంటే, ప్రేమలో ఉంటుంది గానీ ఊహూ ఎందుకుంటుందిలే అనుకున్నారట తను. అయితే నేనీ పాట వెతికి పంపాక "అయితే ప్రేమలో ఊహూ కూడా ఉంటుందా.. అదెలాగో మీరే చెప్పాలి మధురా.." అన్నారు సరదాగా. అది చూసి నవ్వుతున్నప్పుడు వచ్చిన సరదా ఆలోచనే టపా అన్నమాట! :)

అమ్మాయ్.. శిశిరా.. ఇప్పుడు అర్థమైందా.. ప్రేమలో లు, ఊహూ లు రెండూ ఉండే అవకాశం ఉందని.. :)