Showing posts with label నేనో కథ రాశానోచ్. Show all posts
Showing posts with label నేనో కథ రాశానోచ్. Show all posts

Saturday, October 04, 2014

​ఆటా 2014 సభల జ్ఞాపిక 'అక్షర'లో నా కథ 'అవ్యక్తం'


ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు జూలై 2014లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘనంగా నిర్వహించిన 13 వ 'ఆటా'​ మహాసభల జ్ఞాపక సంచిక 'అక్షర' ని ప్రచురించారు. ​పేరుకి తగ్గట్టే చూడచక్కని డిజైనింగుతో, అందమైన బొమ్మలతో, అద్భుతమైన నాణ్యతతో అచ్చు వేయబడిన 'అక్షర'లో బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, కవితలు వ్యాసాలు ఉన్నాయి. నా కథకు వేసిన బొమ్మ చాలా నచ్చేసింది.

​ఇంత చక్కటి జ్ఞాపికలో నాక్కూడా చోటు కల్పించినందుకు, శ్రమ తీసుకుని సంచిక ప్రతిని ఇంతదూరం పంపినందుకు ప్రత్యేకంగా అక్షర సంపాదకులు రవి వీరెల్లి గారికీ, మిగతా సంపాదక వర్గానికీ కృతఙ్ఞతలు.
కథ చదివి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ..








Sunday, June 01, 2014

వంగూరి ఫౌండేషన్ ఉగాది బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు'

​వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జయ నామ సంవత్సర ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు' ఈ నెల కౌముది మాసపత్రికలో ప్రచురించబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.
చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..

Wednesday, October 02, 2013

​ నా కథ 'ఇదీ గొప్ప కథ!' 'తెలుగు వెలుగు' పత్రిక అక్టోబరు సంచికలో..


నేను రాసిన 'ఇదీ గొప్ప కథ!' 'తెలుగు వెలుగు' మాసపత్రిక అక్టోబరు సంచికలో ప్రచురితమైంది. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలుపుతారని ఆశిస్తూ..

నా కథని ప్రచురించిన 'తెలుగు వెలుగు' సంపాదక వర్గానికి, అడగ్గానే శ్రమ అనుకోకుండా వెంటనే పుస్తకం కొని నాకోసం కథని స్కాన్ చేసి పంపించిన ​​ఆత్మీయ స్నేహితుడు వేణూశ్రీకాంత్ కి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.


Thursday, May 02, 2013

నా కథ 'ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం' మాలిక పత్రిక చైత్ర మాస సంచికలో..



నేను వ్రాసిన 'ప్రకృతి ఒడిలోబ్రతుకు పాఠం' అనే కథ 'మాలిక పత్రిక' చైత్ర మాస సంచికలో ప్రచురితమైంది. నా కథని ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..


Friday, October 05, 2012

నా కథ 'ఇలాగే ఇలాగే సరాగమాడితే..' 'మాలిక పత్రిక' ఆశ్వీయజ సంచికలో..

నేను వ్రాసిన 'ఇలాగే ఇలాగే సరాగమాడితే..' అనే కథ 'మాలిక పత్రిక' ఆశ్వీయజ సంచికలో ప్రచురితమైంది. నా కథని ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

Sunday, July 01, 2012

నా కథ 'సాహచర్యపు అంచున' 'కౌముది' పత్రిక జూలై సంచికలో!

నేను కొన్నాళ్ళ క్రితం రాసి పంపిన కథ 'సాహచర్యపు అంచున', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.

నా కథని అంగీకరించి ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

Monday, January 16, 2012

నా కథ 'ఒక ప్రయాణం - ఒక పరిచయం' 'మాలిక పత్రిక' సంక్రాంతి సంచికలో..

నేను వ్రాసిన 'ఒక ప్రయాణం - ఒక పరిచయం' అనే కథ 'మాలిక పత్రిక' సంక్రాంతి సంచికలో ప్రచురితమైంది. నా కథని ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

Sunday, July 03, 2011

నా కథ 'రవి మావయ్య' 'కౌముది' పత్రిక జూలై సంచికలో!


నేను రాసి పంపిన కథ 'రవి మావయ్య', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.
నా కథని అంగీకరించి ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..