Tuesday, September 30, 2008

సుమతీ శతకం poem3

మన సుమతీ శతకంలోని మరో తియ్యని పద్యాన్ని ఈవేళ post చేస్తున్నాను.

అడిగిన జీతంబియ్యని

మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యం: అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.


కూటికోసం కోటి విద్యలు అన్నట్టుగా...మన జీవనభ్రుతి కోసం ఎక్కడో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం. యజమాని దగ్గర వినయ విధేయతలతో మనకి అప్పగించిన పనిని నిజాయితీగా, బాధ్యతగా చేస్తూ ఉంటాం. ఐతే... అందరు bossలూ ఒకలా ఉండరు :) మన చేత బాగా గొడ్డు చాకిరీ చేయించుకుని న్యాయంగా జీతం పెంచాల్సివచ్చినప్పుడు కానీ , తప్పనిసరి అవసరానికి సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, చాలా నిర్ధయగా, అధికార గర్వంతో ప్రవర్తించే యజమాని (boss :) ) దగ్గర ఉద్యోగం చేయడం కన్నా మన సొంత శక్తుల మీద ఆధారపడి బతకడం మేలు అని ఈ పద్యం నుంచి భావం వస్తుంది.

ఒకవేళ ఎప్పుడైనా మనకి అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి... ఈ సుమతీ పద్యాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకుందాం. మీరేమంటారూ మరి??


మరొక చిన్న విషయం... ఈ పద్యంలో మిడిమేలం అని ఒక పదప్రయోగం ఉంది. గమనించారా..? గర్వం, పొగరు అని చెప్పడానికి ఉపయోగించారు. మీరెప్పుడైనా ఈ పదం విన్నారా? నేను మాత్రం నా చిన్నతనంలో పల్లెటూరులో విన్నాను. ఎవరైనా కొత్తగా ఏదయినా గొప్పలకు పోవడం గానీ, పొగరుగా మాట్లాడడం గానీ చేస్తుంటే "ఈ మిడిమేలం ఎక్కడా చూల్లేదమ్మా..." అని అంటుండేవారు.. ఇన్ని సంవత్సరాల తరవాత ఈ పద్యం లో చూసి ఈ పదం మళ్లీ నాకు గుర్తు వచ్చింది.

అదన్నమాట సంగతీ...!

సరే..ఇక ప్రస్తుతానికి సెలవు మరి..

శుభరాత్రి..!

ప్రేమతో...

మధుర వాణి


ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమనీ..

స్వాగతం..!
ఇవ్వాళ నేను చెప్పే పాట గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది చాలా ప్రజాదరణ పొందిన పాట.
"ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమనీ..తొందరపడి ఒక కోయిల ముందే కూసింది..విందులు చేసింది..."
ఈ పాట 1968 లో వచ్చిన సుఖదుఃఖాలు అనే చిత్రం లోనిది. S.P.కోదండపాణి గారు స్వరపరిచిన ఈ పాటను మన గాన కోకిల P.సుశీల గారు పాడారు. ఈ సినిమా లో supporting role లో చెల్లెలు పాత్రలో నటించిన వాణిశ్రీ గారి మీద ఈ పాటని చిత్రించారు. ఈ పాట చాలా hit అవడంవల్లనే వాణిశ్రీ గారికి నటిగా break వచ్చింది. ఈ పాటని రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. తెలుగులో భావకవిత్వ (romantic poetry) ఒరవడిని తీసుకురావడంలో దేవులపల్లి వారిని ప్రసిద్ధంగా చెప్తారు. దేవులపల్లి గారు సినిమాల కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు కాదట. ఆయన రచనల్లోని పద్యాలను సినిమా నిర్మాతలు అడిగి తీసుకుని యధాతధంగా పాటలుగా వాడుకునేవారట. ఈ విషయం ఈనాటి మేటి సినిమా పాటల రచయిత అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్తుంటే నేను ఒకసారి విన్నాను. ఆయన పద్యాలంటే అంత మక్కువ మరి అందరికీ. ఈ పాట గురించి ఒక ఆసక్తికరమైన సంగతి ఒకటి నేను ఎక్కడో చదివాను ఒకసారి. అది ఏంటంటే ఈ పాట పల్లవిలో ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమనీ..అని వస్తుంది కదా..! ఇది విన్నప్పుడు మీకేమైనా సందేహం వచ్చిందా? మల్లెలు వేసవి మాసాల్లోనే వస్తాయి కదా..వెన్నెలేమో రాత్రి వేళల్లోనే వస్తుంది. అందుకని దేవులపల్లి వారు ఇది వెన్నెల వేళయనీ...ఇది మల్లెల మాసమనీ.. అని రాసారట. అయితే ఆయన దగ్గర రాసేవారో, లేక సినిమాకి పని చేసేవారో ఎవరోగానీ పొరపాటున అటుది ఇటు ఇటుది అటు చేసేశారన్నమాట. ఇంకేముందీ..చివరికి పాట ఇలా అయిపోయింది. కానీ విచిత్రమేమిటంటే, ఈ పాట విన్నవారెవరికీ అలాంటి సందేహం రాదు. పైగా ఇప్పుడు అలా అనుకుందామని ప్రయత్నించినా ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటేనే పాట బావుంది అనిపిస్తుంది. అదే మరి దేవులపల్లి వారు రాసిన ఈ పాటలో దాగున్న మాయ. సరే మరి మీరందరూ కూడా ఈ పాటని విని ఆనందించండి. ఊరికే విని ఆనందించి ఊరుకోకుండా మీ అభిప్రాయం చెప్పచ్చుగా.. ఒక్క రెండు వాక్యాలు రాస్తే మీ కంప్యూటర్ అరిగిపోదులెండి.. :) సరే మరి.. చూద్దాం...ఎవరు రాస్తారో..!

Monday, September 29, 2008

నా కంటిపాపలో నిలిచిపోరా...నీ వెంట లోకాల గెలువనీరా...

హాయ్ హాయ్...
మధుర గీతాలలోఇవ్వాళ నాకు చాలా చాలా ఇష్టం అయిన "నా కంటిపాపలో నిలిచిపోరా.. నీ వెంట లోకాల గెలువనీరా" అనే పాటని గురించి చెప్పాలనిపించింది. ఈ పాట వాగ్దానం చిత్రం లోనిది. ఈ సినిమా లో కథానాయిక కృష్ణ కుమారి కలగనే పాట. ANR గారు హీరో. అంటే ఈ పాట యుగళ గీతం. అసలు ఈ పాట లో ఒక్కొక్క వాక్యం ఎంత బాగా రాసారో. ఒక అమ్మాయి తనకి ఇష్టమైన అబ్బాయితో కలిసి ఎంతో ఆనందంగా జీవితం గడపాలని ఊహించుకునే పాట. అసలు పాట మొదట పల్లవిలో వచ్చే రెండు వాక్యాలలోనే చాలా గొప్ప భావాన్ని చాలా సరళమైన పదాలతో రాసారు. 1961 లో వచ్చిన ఈ పాటని దాశరధి గారు అద్భుతంగా రాస్తే, ఘంటసాల గారు మరియు సుశీల గారు ఇంకా అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకి సంగీత దర్శకత్వం పెండ్యాల నాగేశ్వరరావు గారు చేసారు. ఈ పాట లో పదాలకి తగ్గట్టుగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వెన్నెల్లో, చల్ల గాలికి లతలు, పూలు ఊగుతూ ఉండే set లో picturise చేసారు.
ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిల్లి వెలిగెను మనకోసమే...
నియ్యాలలో తలపుటుయ్యాలలో అందుకొందాము అందని ఆకాశమే... అని పాటలో వచేప్పుడు దృశ్యం కుడా అలాగే ఉంటుంది. పూర్ణ చంద్రుడు, వెన్నెలలో ఉయ్యాల ఊగుతూ ఆకాశాన్ని అందుకుంటున్నట్టు చూపిస్తారు.
మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాలు చేరేదమా... అని పాడుతున్నప్పుడు నిజంగానే మబ్బుల్లో విహరిస్తున్నట్టుగా దృశ్యం వస్తుంది.
ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే ఎంత అందంగా పాటలని చిత్రీకరించారో.. ఇలాంటి పాటలను చూస్తే తెలుస్తుంది. వినడానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చూడడానికి కూడా అంతే ఇంపుగా ఉంటుంది ఈ పాట. మరి ఇప్పుడేమో అన్ని పాటలని వేరే దేశాలు వెళ్లి రోడ్ల మీద, లేకపోతే పొలాల్లో, కొండల పక్కన డాన్స్ వేస్తూ చేస్తున్నారు. అన్నీ పాటలకీ అదే పద్ధతి. వైవిధ్యం ఉండట్లేదు. అంటే నా ఉద్దేశ్యం కొత్త పాటలన్నీ బాగోవని కాదు కాని అర్ధవంతమైన పాటలు చాలా తక్కువ వస్తున్నాయి అని. అంతే కదా మరి..!!
ఈ పాటలోని మాధుర్యాన్ని మీరు కూడా రుచి చూడండి. విని ఊరుకోకుండా మీ అభిప్రాయాలని నాకు చెప్పండి. ఇంకా మంచి మంచి పాటల గురించి చర్చించే అవకాశం ఉంటుంది.
ప్రేమతో..
మధుర వాణి

అజ్ఞాత గీతాలు

హాయ్ హాయ్...
ఈ వేళ నాకు ఒక కొత్త idea (= ?? మెరుపు లాంటి ఆలోచన :)) వచ్చింది. అది ఏంటంటే మనం అందరం ఎప్పుడు బాగా hit అయిన సినిమా పాటలనే వింటుంటాం. మనకి అవే తెలుస్తాయి అసలు. టీవీ లో, రేడియో లో అన్ని చోట్ల ఎప్పుడు ఆ పాటలనే మళ్లీ మళ్లీ వేస్తుంటారు. కానీ, ఒకవేళ ఒక సినిమా utter flop అయిందనుకోండి అసలు ఆ సినిమా వచినట్టే మనకి తెలీకుండా పోతుంది. అలాంటప్పుడు ఒక వేళ ఆసినిమా లో మంచి పాటలు ఉన్నా మనకి తెలీకుండానే పోతాయి. అలాంటి కొన్ని పాటలు నేను విన్నాను చాలా సార్లు. కొన్ని సార్లు ఆ సినిమా కి సంబంధించిన హీరో హీరోయిన్స్ కానీ, డైరెక్టర్ కానీ, సంగీత దర్శకుడు కాని ఆందరూ మనకి తెలియని కొత్త వాళ్లు ఉంటారు. కాబట్టి మనం అలాంటి సినిమాల్లోని పాటలు వినే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయము. కానీ.... అలాంటి సినిమాల్లో ఒకోసారి చాలా మంచి పాటలు ఉంటాయి. అవి మనం miss అయిపోతాము. కాబట్టి నాకు తెలిసిన అలాంటి పాటలని గురించి మన మధురవాణి లో చర్చించుదాం అనిపించింది. ఆ పాటలు ఒకవేళ నా దగ్గర ఉంటే నేను మీ అందరికి కూడా download చేసుకునే అవకాశం కలిగించడానికి ప్రయత్నిస్తాను. ఎంచక్కా, మీరు కూడా ఆ పాటలు విని ఆనందించవచ్చు. అలాగే ఊరికే విని ఊరుకోకుండా మనం మన అందరి అభిప్రాయాలను మధురవాణి లో పంచుకోవచ్చు. హ్హ హ్హ హ్హా :) ఎలా ఉంది నా మెరుపు లాంటి ఆలోచన.. అదే నా idea అండీ బాబూ...! ఏమి చేస్తాము మరి తెలుగు లో మన పరిజ్ఞానం ఈ స్థాయికి వచ్చింది చివరకి. ఇంగ్లీష్ పదాలతోనే చెప్పగలిగే, అలా చెప్తేనే అర్ధం చేసుకోగలిగే దుస్థితి వచ్చింది. అందుకే అసలు నేను తెలుగు లో blog మొదలు పెట్టింది, మనం నేర్చుకున్న తెలుగుని మర్చిపోకుండా కాపాడుకుందామని , మరియు ఈ ఇంగ్లీష్ పదాలను తగ్గించి తెలుగు పదాలతో మాట్లాడుతూ ఉందామని. సరే అయితే మరి ఈ శీర్షిక లాంటి దానికి ఏమి పేరు పెడదామా అని ఆలోచిస్తే అజ్ఞాత గీతాలు :) అని పేరు పెడితే బావుంటుందేమో అనిపించింది. మంచి తెలుగు పదాలతో మీకు ఎమన్నా వేరే idea (క్షమించండి.. అదే మెరుపు లాంటి ఆలోచన) వస్తే నాకు చెప్పండి. బావుంటే అప్పుడు ఆ పేరే పెడదాము.
సరే మరి...మీ అభిప్రాయాల కోసం చూస్తాను..!
ప్రేమతో...
మధుర వాణిSunday, September 28, 2008

చిటపట చినుకులు పడుతూ ఉంటే...

స్వాగతం...
రోజు దాదాపు ప్రతీ తెలుగు వ్యక్తికి తెలిసిన ఒక సరదా ప్రేమ గీతాన్ని గుర్తు తెచ్చుకుందాం.

post title చూసి నేను పాట గురించి ఇక్కడ రాస్తున్నానో మీకు అర్ధమయ్యే ఉంటుంది కదా..! సరే.. అదే ఆత్మబలం చిత్రం లోని "చిటపట చినుకులు పడుతూ ఉంటే.." అనే యుగళ గీతం. ఈ పాట వర్షంలో తడుస్తూ ప్రేమికులు ఆలపించే ప్రేమ గీతం. మనసు కవి ఆత్రేయ గారు రాసిన ఈ పాటకి K.V.మహదేవన్ గారు సంగీతాన్ని అందించారు. నటసామ్రాట్ అక్కినేని గారు, B.సరోజా దేవి గారు నటించారు. మీరు గమనించే ఉంటారు సరోజాదేవి గారు ఈ పాటలో రెండు జడలు వేసుకుని ఉంటారు. అది కూడా పూల జడలు. ఆ రోజుల్లో పెద్దవాళ్లు కూడా రెండు జడలు వేసుకునేవాళ్ళని మా అమ్మ చెప్పింది ఒకసారి. అదే fashion అప్పుడు. అదే మరి ఇప్పుడయితే చిన్నపిల్లలు కూడా పూల జడలు వేసుకోవట్లేదు కదా.. కనీసం జడలు వేసుకునేంత జుట్టు ఉండట్లేదనుకోండి అది వేరే విషయం :) మనలో చాలామంది అమ్మాయిలకి చిన్నప్పుడు పూలజడ photo ఉండేఉంటుంది. కాని ఇప్పుడు పిల్లలకి పాపం కనీసం photo కూడా ఉండట్లేదు గుర్తుగా. సరే.. అయితే ఈ విషయం మీరు గుర్తు పెట్టుకుని మీ పిల్లలకి పూల జడ వేయించి photo తీయించండి :)
ఇంక మళ్లీ పాట విషయానికి వస్తే, ఈ పాటని పాడింది ఘంటసాల గారు మరియు సుశీల గారు. వీరిద్దరి combination లో వచ్చిన ఎన్నో మధుర గీతాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రం 1964 లో ఇప్పటి హీరో జగపతి బాబు గారి తండ్రి అయిన ప్రముఖ నిర్మాత V.B. రాజేంద్రప్రసాద్ గారు Jagapathi art pictures banner లో నిర్మించారు. ఈ పాటని గురించిన మీ భావాలని ఇక్కడ తప్పకుండా పంచుకుంటారని ఆశిస్తున్నాను.
మీ అభిప్రాయాలకోసం ఎదురు చూస్తాను..!
ప్రేమతో..
మధుర వాణి

మధుర గీతాలు

హాయ్ హాయ్...
మధుర వాణిలో మధుర గీతాలు అని ఒక కొత్త శీర్షిక లాంటిది మొదలు పెడదామనిపించింది. మన తియ్యని తెలుగులో ఎన్నో మరింత తియ్యని తెలుగు పాటలు ఉన్నాయి కదా..! కొన్ని పాటలలోని పదాలను, భావాలను వింటుంటే ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుంది. కొన్ని పాటలలోని గాయకుల గాత్రం మనల్ని కట్టిపడేస్తుంది. మరికొన్ని పాటలలోని సంగీతం వీనుల విందుగా అనిపిస్తుంది. మరికొన్ని పాటల సందర్భోచితమైన భావాలు మనల్ని ఆ సన్నివేశంలో లీనమయ్యేలా చేస్తాయి. ప్రతీ ఒక్కరం ఒక్కో పాట విన్నప్పుడు ఒక్కోలాగా స్పందిస్తాం. ఒకోసారి మనలాగే ఆ పాట గురించి ఎవరన్నా స్పందించినప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ అలాంటి ఒక మంచి అనుభూతిని కలిగించే మన మంచి తెలుగు పాటల గురించి నా లాగా ఆలోచించే స్నేహితులతో పంచుకుందాం అనుకుంటున్నాను.
పాటను గురించిన మాటలతో పాటు ఆ పాటని మీరు download చేసుకొని వినే సౌకర్యం కలిగించడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా విని మనందరం మన అనుభూతులని పంచుకుందాం. ఏమంటారు మరి..??
ప్రేమతో...
మధుర వాణి

సుమతీ శతకం poem2

సుమతీ శతకం లో నుంచి ఈ రోజు ఇంకొక మధురమైన పద్యము ఇక్కడ ఉంచుతున్నాను.

అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా

నెక్కినఁ బారని గుర్రము

గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.


పద్యం లో అవసరం లో మన వెంట రాని బంధువులను వదిలెయ్యడమే మంచిదని చెప్తున్నారు. విషయం లో ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒక అనుభవం ఎదురయ్యే ఉంటుదని నా అభిప్రాయం. చిన్నప్పటి నుంచి ప్రతీ ఇంట్లో బంధువులను గురించి వచ్చిన ఎన్నో సమస్యలు చూసేఉంటాము. అసలు మనకి ఏదన్నా సమస్య వస్తే దాని పర్యవసానం గురించి బాధ పడటం కన్నా మన బంధువులు ఏమనుకుంటారు, మన గురించి మన కుటుంబాలలో ఎలాంటి మాటలు వినాల్సివస్తుంది అన్న విషయాలే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంటాయి. ఓకోసారి వాస్తవం లో జరిగే దాని కన్నా ముందుగానే ఎక్కువ ఊహించి భయపడి బాధపడే వాళ్ళను నేను, మీరు చాలా సార్లు చూసే ఉంటాము. ఏదయినా విషయం లో మనకి జరిగితే ఎలా స్పందిస్తామో ఎదుటి వాళ్ల గురించి కుడా అలాగే ఆలోచించగలిగితే మనిషిగా మన జీవితానికి కొంతైనా సార్ధకత్వం వస్తుందని నా అభిప్రాయం. ఎలాంటి మాటలకి మనం బాధపడతామో అలాంటి మాటలతో మనం ఎదుటి మనిషిని ఎప్పుడు బాధపెట్టకుండా చూడగలిగితే చాలు. ఎందుకంటే బాధపడే ఒక మాటని మర్చిపోడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు. అందుకే సాధ్యమయినంత వరకు మన మంచి మాటలతో తోటివారి మొహం మీద చిరునవ్వులను పూయించేందుకు ప్రయత్నిద్దాం..!!


ప్రేమతో ...

మధుర వాణి


Saturday, September 27, 2008

If you want happiness

Hi friends...

If you want to be happyy...???

Everyone of us want to be happy. But, at any given point of time, if we start thinking about our life, we always have a list of things that have to be fulfilled. Somehow we feel incomplete and we feel like if I get a promotion in job, if I get little more salary, if I get little more beautiful :) or if I get little more rich...then my life would be perfect and happy. But, the reality is that situation will never come because our wish list is keep on changing. When we look at other people with all our requirements, we think that they must be very happy in their life which is not true. Actually, happiness is nothing to do with all these parameters.

The thing is even if you have lot of money, status etc. you may not be happy. Because happiness lies in one's thinking and attitude. The person who is happy and content with his life is the richest person than a millionaire. I saw some poor people who don't have any secure life and living roadside, but they are happy and they can laugh from the bottom of their heart. I saw some of my friends who are happy even when they are in a deep sink of problems. Why I am telling these examples because, sometimes I really feel very insecure about life and start thinking like How I'll manage to get a new job, how I can be successful in my job or what will be my future...what not?? for each and every silly thing I start worrying.. I think this happens to all of us at times..BUT the only reason for this is our mindset. We just have to keep on believing in our self and a little hope.
I remember a small quote on hope from my school days.
"HOPE IS THE ONLY ROPE THAT KEEPS AWAY HEART FROM BREAKING"
I don't know who told this, but I feel that's the truth of life. One can't live even for a second if there is no hope. So, Let's hope for the best always..!!
One more thing I want to discuss..that is how many of us love or even like our jobs? Mostly a bigg NO comes as an answer... In a day of 24h, one third time goes for sleep, one third time goes to OUR JOB. And I strongly believe that during the remaining one third time also, our mood depends on the time we spent at work. So, WORK is the major part of life and also which decides your happiness. So, love what you are doing. If you can't, then follow your heart and do what you love. This is the best way to be happy.
Lastly, I remember one more quote, my friend always used to tell me this.
"ONLY A BUSY MAN CAN ENJOY THE LEISURE"
It is as simple as that. During weekdays, we always feel like having a holiday. But, if we get more holidays then we feel boring. So, we can really enjoy the leisure if we work hard for some time. The only we'll get to know the sweetness of the leisure time.

So...Let's love our work, enjoy our work, work busy...enjoy the leisure and STAY HAPPY...!!Prematho..
Madhura vaani

సుమతీ శతకం poem1

Hi everybody,

I feel like posting some sweet telugu poems in Madhuravaani. I still remember my school days, We all used to read telugu poems loudly in our 3rd or 4th class. Mostly, they are either from VEMANA shathakam or SUMATHI shathakam. People say that, these are one of the most valuale telugu literature. They teach us the values and principles of life. These are the best lessons one should learn to lead a happy and successful life. I feel proud to have such beautiful poems in our sweet telugu language. It's really great that they were written in such a simple telugu.
Anyways, Here I am posting the poems along with telugu and english transaltion.

So,People... start enjoying the sweetness of Sumathi shathakam from Madhura vaani.
And share your views about these poems.
I am starting with the first poem and will be posting one by one.
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

With the grace of Rama
Certainly to gain acceptance by one and all
Unimpeded flow of morals
I'll narrate, with mouth-watering taste, O! wise one

ప్రేమతో....
మధుర వాణి

BAPU...బాపు

బాపు గారి గురించి ఇంకా ఎక్కువ సమాచారం కావాలనుకుంటే ఆయన official website చూడండి.
Here is the link.
http://www.bapubomma.com/

You will find all the detials about him there. They also exhibited some of his paintings and cartoons.
Enjoy...!!

Prematho,
Madhura vaani

Welcome to Madhura vaani

Namassumanjali....I welcome you all to the world of Madhuravaani...sweet telugu world. I am posting a beautiful painting from the greatest telugu painter BAPU gaaru. The painting is called Shubhodayam. Iam very happy to start this blog with this beautiful painting.

I love his paintings and movies. I am sure that there is no telugu person who don't admire BAPU garu. He is the master of creativity. If you want to experience the telugu traditions and telugu beauty, the best way is to watch his movies. BAPU garu and his lifetime friend Mullapudi venkataramana garu who is a very famous telugu writer, they both made some beautiful and trendy movies in telugu. To name a few, MUTHYALA MUGGU, SEETHA KALYANAM, MISTER PELLAM, PELLI PUSTHAKAM....etc. One should not miss BAPU's cartoons also.

So, I am starting MADHURA VAANI with the great BAPU&MULLAPUDI. I welcome everybody who is interested in telugu wolrd to share your feelings.

Prematho...
Madhura Vaani