Sunday, December 09, 2012
Friday, August 26, 2011
ఈ ఆదివారమే తెలుగుబాట!
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!
★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★
హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.
హైదరాబాద్‌లో ఉన్న బ్లాగర్లంతా వచ్చి తెలుగుబాటను విజయవంతం చేయండి. బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ లేని మీ మిత్రులకు కూడా తెలుగుబాట గురించి తెలియజేయండి. తెలుగును అభిమానించే వారంతా ఓ చోట చేరటంలో మీ తోడ్పాటుని అందించండి.
గత ఏడాది తెలుగుబాట పైన బ్లాగుల్లో వచ్చిన కొన్ని నివేదికలు.
మురళీమోహన్ గారి నివేదిక
రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మన భాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని ఒక మహాఉద్యమంగా మారుద్దాం.
నాగ మురళీధర్ నామాల గారి మాటల్లో ఇక్కడ చూడండి..
తేట తేట తెలుగు
Sunday, April 03, 2011
ఉగాది శుభాకాంక్షలు మరియు పంచాంగం
బ్లాగ్మిత్రులందరికీ 'ఖర' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
పండుగ రోజు పంచాంగ పఠనం చేయాలి కదా మరి! ములుగు వారి తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాల కోసం ఇక్కడ చూడండి.
Monday, January 03, 2011
Sunday, September 26, 2010
An impressive one minute short film!
Beautiful theme and well made film! Hatsoff to the film maker!
Monday, March 15, 2010
ఉగాది శుభాకాంక్షలు మరియు పంచాంగం
బ్లాగ్మిత్రులందరికీ 'వికృతి' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Friday, May 01, 2009
శ్రీశ్రీ గారి సొంత గొంతుక వింటారా.?
Friday, April 03, 2009
సీత కళ్యాణం హరికథ.. ఘంటసాల గారి గాత్రంలో విని తరించండి..!
ఈ పండగ పూట ఘంటసాల గారి గాత్రంలో వచ్చిన సీతా కళ్యాణం హరికథ విని ఆనందించండి. ఈ హరి కథ 1961 లో వచ్చిన వాగ్ధానం సినిమాలో రేలంగి గారు చెప్తున్నట్టుగా చిత్రీకరించారు. ఈ పోస్టుకి ఎడమ పక్కన ఉన్న విడ్జెట్ లో వినే అవకాశం ఉంది. ఈ పాటని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి.
శుభాకాంక్షలతో..మధుర వాణి
Friday, March 27, 2009
విరోధి నామ సంవత్సర పంచాంగం.. మీ కోసం..!
ఉగాది పండుగ వస్తుందంటే.. పండుగ సంతోషం కన్నా.. ఎప్పుడెప్పుడు పంచాంగం చూద్దామా..ఈ ఏడు ఎలా ఉందో పరిస్థితి.. అని అందరికీ ఉత్సుకతగా ఉంటుంది. 2009-2010 విరోధి నామ సంవత్సర పంచాంగం నాకొక కాపీ దొరికింది జాలం లో. మీ అందరి కోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. పండగ పూట పంచాంగ పఠనం గావించి తరించండి.! పంచాంగం pdf కాపీ కోసం ఇక్కడ చూడండి.
శుభాకాంక్షలతో..
మధుర వాణి
Thursday, March 26, 2009
Monday, March 09, 2009
గ్లోబలైజేషన్- అమెరికా-ఇండియా- speech - One should not miss it..!!!
A Seminar on Global Economy By SWADESHI JAGARAN MANCH and VISION INDIA TRUST
సగటు వ్యక్తికి అర్ధమయ్యే రీతిలో శాస్త్రీయంగా.. చాలా చక్కగా వివరించారు ప్రస్తుత పరిస్థితిని.. మనమందరం తప్పకుండా విని తీరాలి. ఎలాగైనా వీలు చూసుకుని.. తప్పక వినండి ఈ ఉపన్యాసాన్ని..!
Monday, February 23, 2009
భారతీయ సంగీతానికి ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన చారిత్రాత్మక క్షణాలు..!! జయహో రెహమాన్..!!!

AR రెహమాన్... ఈ రోజు ప్రపంచం అంతా.. మన భారతదేశం వైపు తిరిగి చూసేలా చేసిన సంగీత తరంగం. 'స్లం డాగ్ మిలియనీర్' సినిమాకి గానూ, ఉత్తమ నేపథ్య సంగీతం (బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్), ఉత్తమ గీతం (బెస్ట్ సాంగ్ - జయహో) రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాడు. ఇది ప్రతీ ఒక్క భారతీయుడు ఆనందిచదగ్గ, గర్వించదగ్గ విషయం
AR రెహమాన్ సంగీతం గురించి ఏ భారతీయుడికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని అందరికీ తెలిసిందే. ఎన్నో విషయాల్లో రెహమాన్ ని మనందరం స్పూర్తిగా తీసుకోవాలి. వృత్తి పట్ల గౌరవం, నిబద్దత, కష్టపడటం, నిజాయితీ, అంకిత భావం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం... ఇవన్నీ అలవర్చుకున్న మనిషి ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలడు అని చెప్పడానికి రెహమాన్ ఒక నిలువెత్తు నిదర్శనం.

మన భారతదేశ కీర్తిపతాకని అంతార్జాతీయ వేదికపై రెపరెపలాడించిన మన AR రెహమాన్ కి ఇదే నమస్సుమాంజలి
మన రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న క్షణాలని ఈ క్రింది వీడియోలో చూడచ్చు.
Tuesday, January 13, 2009
తెలుగువారందరికీ మన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..!



ప్రేమతో..
మధుర వాణి
Monday, January 12, 2009
వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగుదాం..!!
When I Asked God for Brain & Brown
He Gave Me Puzzles in Life to Solve
He Showed Me Some Unhappy People
He Showed Me How to Work Hard
He Showed Me Opportunities to Work Hard
He Showed Me How to Help Others
He Gave Me Everything I Needed..!!
Wednesday, December 31, 2008
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!
ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ అడుగిడబోయే ఈ క్రొత్త సంవత్సరం 2009 అందరికీ ఎన్నో విజయాల్నీ, సుఖ సంతోషాల్నీ, ఆయురారోగ్యాలనీ, ప్రశాంతమైన జీవితాల్ని ప్రసాదించాలని... ప్రపంచమంతా మానవత్వం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ..
Saturday, November 29, 2008
Salute to our heroes
The peace and welfare of Indians will be secure only as we cling to the watchword of true patriotism.
“Our Country! When right keep it right; when wrong, set it right!”
A patriotic salute to our heroes
who sacrificed their lives to protect all our lives.
JAI HIND..!!!
Saturday, November 01, 2008
మా తెలుగు తల్లికి మల్లెపూదండ...!!!
ఈ రోజు మనం ఆనందోత్సాహాలతో గడపడానికి రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది ఇవ్వాళ తెలుగు భాషను మాట్లాడే వాళ్ళందరి కోసం ప్రత్యేక రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మరీ మనకి ఈ భాగ్యాన్ని కలిగించారు. ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకుని మన జోహార్లు తెలుపుదాం.
మరో సంతోషకరమైన వార్త ఏంటంటే.. ఈ ఏడు ఆంధ్ర అవతరణ దినోత్సవానికి మనకొక అపురూపమైన బహుమతి లభించింది. అదేంటంటే... మన కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకి ప్రాచీన హోదాని కలిగించింది. 1500 వందల సంవత్సరాల మన గత చరిత్రని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు కమిటీ సభ్యులు. సంస్కృతం, తమిళం తరవాత ఈ ప్రాచీన హోదాని పొందిన భారతీయ భాషలుగా తెలుగు, కన్నడ ని మన ప్రభుత్వం గుర్తించింది.మరి మనం గర్వించదగ్గ విషయమే కదా ఇది..!

ఈ సంతోషంలో.. మన శంకరంబాడి సుందరాచారి గారు రాసిన తెలుగు తల్లి గీతంతో అభివందనం చేద్దాం..!
మా కన్నతల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లీ
గల గలా గోదారి కదలిపోతుంటేనూ
బిర బిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేనూ
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండే దాకా
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ..! జై జై తెలుగు తల్లీ..!!
ప్రేమతో..
మధుర వాణి
Monday, October 27, 2008
దీపావళి శుభాకాంక్షలు..!!
'దీపావళి' అంటే దీపాల వరుస అని అర్ధం. దాదాపుగా మన భారతదేశం మొత్తం ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ దీపావళి. చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల దాక అందరూ చాలా రోజుల ముందునుంచే చాలా హడావుడి చేస్తుంటారు. ఎందుకంటే మరి టపాకాయల పండుగ కదా.. అందుకన్న మాట..!!టపాసులు కాల్చుకోవడం ఒక్కటే కాకుండా దీపాలు కూడా వెలిగించండి. క్రొవ్వొత్తులు కాకుండా మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి. అలాగే టపాకాయలను కాల్చేప్పుడు జాగ్రత్త సుమా..!!
మీకు, మీ కుటుంబ సభ్యులకూ, మీ స్నేహితులకూ... అందరికీ ఈ దీపావళి అనేక శుభాలనీ, సౌఖ్యాలనీ తీసుకురావాలని, ఆ లక్ష్మీ మాత కటాక్షం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని... మనస్పూర్తిగా కోరుకుంటూ....
ప్రేమతో...
మధుర వాణి
Tuesday, October 21, 2008
వికాస ధాత్రి
తెలుగు e-books కోసం ఈ వికాసధాత్రి website చూడండి. ఈ పేజీ ఇంకా పూర్తిగా తయారవ్వలేదు అనుకుంటా...
వాళ్లు ఇంకా మెరుగులు దిద్దుతున్నారు. కానీ ఒకసారి చూడండి.
మీకు నచ్చే అవకాశం ఉంది.
http://www.vikasadhatri.org/
చదివి ఆనందించండి..!
ప్రేమతో...
మధుర వాణి
Thursday, October 09, 2008
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు...
మీ కుటుంబ సభ్యులందరికీ, మీ స్నేహితులకీ, మీ శ్రేయోభిలాషులకీ, మీకూ... అందరికీ ఈ విజయదశమి అనేకవిజయాలని తీసుకురావాలని మనసారా కోరుతూ....ప్రేమతో...
మధుర వాణి









