Tuesday, January 26, 2010

కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..!

ఆకాశవాణి సమయం రాత్రి తొమ్మిదిగంటల ముప్పై నిమిషాలు. 'అలనాటి మధుర గీతాలు' కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా జగ్గయ్య, కృష్ణ కుమారి నటించిన 'ఉయ్యాల జంపాల' చిత్రం నుంచి ఘంటసాల, పి.సుశీల ఆలపించిన 'కొండగాలి తిరిగిందీ..' అనే పాట వినండి :-)

ఎప్పుడు పాట విన్నా గానీ, అంతెందుకు.. అసలు పాట మొదలవగానే నాకు రేడియో వింటున్న అనుభూతికలుగుతుంది. అందుకే అలా చెప్పానన్న మాట ;)

పాట 1965 లో వచ్చిన 'ఉయ్యాల జంపాల' అనే సినిమా లోది. పెండ్యాల గారి సంగీత సారధ్యంలో ఆరుద్ర రాసిన పాటని మన గాన గంధర్వుడు ఘంటసాల, సుశీలమ్మ పాడారు. సినిమాలో పాటని జగ్గయ్య, కృష్ణ కుమారిలపైనే చిత్రీకరించారు.


అసలీ పాట వినడానికెంత హాయిగా ఉంటుందో, సినిమాలో కూడా అంతే ఆహ్లాదంగా చిత్రీకరించారు. గోదావరిలో ఒక చిన్న పడవలో జగ్గయ్య ఒంటరిగా మెల్లగా తెడ్డుతో నీళ్ళని నెడుతూ పాట పాడుతుంటాడు. పక్కనే బారులు తీరిన కొబ్బరి చెట్లున్న ఒడ్డున కృష్ణకుమారి '....' అని వయ్యారంగా రాగాలుతీస్తూ.. పడవతో పాటూ నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కోనసీమలోనే తీసుంటారు పాటని.


పాటలో భావంఎంత సున్నితంగా ఉంటుందో.. అంతే మధురంగా ఘంటసాల పాడటం ఒక అందమైతే, కథానాయకుడు అంతే సున్నితమైన భావాలతో అభినయించడం మరింత అందాన్నిచ్చింది పాటకి. అలాగే, దాదాపు పాటంతా ఘంటసాల పాడగా, సుశీల మధ్యలో పలికించిన కూనిరాగాలు పాటకి ఒక అపురూపమైన శోభనందించాయి.


ఎన్ని సార్లు పాట విన్నా, ప్రతిసారీ పాట చివరలో వచ్చే 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..' అన్నవాక్యం దగ్గరకొచ్చేసరికి ఒక చిత్రమైన అనుభూతి కలుగుతుంటుంది నాకు :) మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒకసారి విని చూసాక పాట నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరనేది నా నమ్మకం. పాట సాహిత్యం క్రింద ఇస్తున్నాను. పట్టుమని పది వాక్యాలైనా లేవు పాటలో.! అయినా.. ఎంతందం దాగుందో మీరే చూడండి. అలాగే, పాట వినాలనుకుంటే ఇక్కడ చూడండి. మరింకేల ఆలస్యం..!?

కొండగాలి తిరిగిందీ..
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..

పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ..
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది..
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది..

పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది..

కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..

మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది..

పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..

కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..

Friday, January 15, 2010

బబుల్ గమ్ మొక్కు

కాలింగు బెల్లు మీద చెయ్యి పడిందో లేదో వెంటనే ధడాలున తలుపులు తెరుచుకున్నాయ్.
"ఏంటీ.. తలుపు దగ్గరే కాచుక్కూర్చుని అరక్షణంలో స్వాగతం చెప్పేసావ్. మళ్ళీ ఇవ్వాళేమన్నా బ్రేకింగ్ న్యూస్ గానీ, థ్రిల్లింగ్ స్టోరీ గానీ తెలిసిందా.!? ఆలస్యమెందుకు గబగబా చెప్పేసి నువ్వు బ్రేక్ తీసేస్కో."
"బ్రేకింగూ, థ్రిల్లింగూ కాదు గానీ.. ఇవ్వాళ ఒక షాకింగు న్యూస్ చెప్తాను. పైగా అది తెలిసిన న్యూస్ కాదు. మనింట్లో జరిగిన న్యూస్. కానీ, అది చెప్పే ముందు అసలు నీకు నా మీద ఎంత ప్రేముందో తేల్చాలి."
"ఇంకా నీ నోటి వెంట ముత్యం రాలలేదేంటా అనుకుంటున్నా.. ఉర్దూ వార్తలు చదివేవాడు 'ఆదా బర్సే' అన్నట్టు.. విషయం చెప్పాలన్నా ముందుమాట లాగా ప్రశ్నేంటే బాబూ..!?adus"
"అదంతా కాదు.. ముందు సమాధానం చెప్పు. నా మీద నీకు ప్రేమ ఉందంటావా.. లేదంటావా.?"
" లేదని ఎలా అనగలను బంగారం.. నాకసలే చాలా ఆకలేస్తోంది ఇవాళ. వంటింట్లోంచి ఘుమఘుమలాడుతున్న గుత్తొంకాయ కూరంటే ఎంతిష్టమో నువ్వంటే కూడా అంతిష్టం నాకు.love"
"అంతేనా..?"
"అంతేనా అంటే... వందసార్లు.. అహా.. వెయ్యిసార్లు గుత్తొంకాయ కూర చేస్తే ఎంతిష్టమో.. అంతిష్టం.. సరేనా.. ముందు అసలు విషయమేంటో చెప్పు బంగారం.."
"సరే.. చెప్తాను. కానీ, చెప్పాక.. నేను చేయమన్నట్లు నువ్వు చేయాలి కాదనకుండా..అలా మాటిస్తేనే చెప్తా మరి.."
" సరే.. మాటిచ్చేసాను."
"అసలేం జరిగిందంటే.. నేను ఇవాళ ఒక తింగరి పని చేసాను.sengihnampakgigi"
"వెరీ గుడ్డు.. నువ్వు తింగరి పని చేయకుండా ఉంటే కదా తేడా.. చేస్తే ఆరోగ్యంగా ఉన్నావన్నట్టే కదా.. ఇంతకీ ఏమా బృహత్కార్యము..?"
"మొదట్నుంచీ చెప్తాను. అసలేమయిందంటే.. నేను సాయంత్రం బయటికెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లో సమీర కనిపించింది. ఇద్దరం కలిసి కబుర్లాడుతూ షాపింగు చేసాం."
"అలా అలా సమీరతో కబుర్లలో పడిపోయి వచ్చే మూణ్ణెళ్ళకి కావలసినవి కూడా ఇప్పుడే కొనేసి వెయ్యికి కొందామనుకున్నదానివి ఐదువేలకి కొనుంటావ్.. అంతేగా.?duit"
"ఏంటీ..వెటకారమా.. అదేం కాదు గానీ చెప్పేది విను.."
"అది ఒక బబుల్ గమ్ తింటూ నాక్కూడా ఒకటిచ్చింది. అలా అలా అది నములుతూ ఇంటికొచ్చేసాను. రాగానే దాహం వేస్తుందని మంచినీళ్ళు తాగాను. సరిగ్గా.. అప్పుడే అనుకోకుండా ఒక ఘోరం జరిగిపోయింది. మంచినీళ్ళతో పాటుగా బబుల్ గమ్ కూడా మింగేసాను.tumbuk"
"వండర్ ఫుల్.. తర్వాత..? అయినా నోట్లో బబుల్ గమ్ ఉంచుకుని మంచినీళ్ళు తాగడం అవసరమా నీకు.?"
"చాలాసార్లు నేను మంచినీళ్ళు తాగేసి మళ్లీ బబుల్ గమ్ తినడం కంటిన్యూ చేస్తుంటాను. అలాగే అనుకుని గబుక్కున తాగేశాను. అదేమో గొంతులోకి వెళ్లి చచ్చింది. గొంతులోనే ఇరుక్కున్నట్టు అనిపించింది కానీ బయటికి రావే తల్లీ..చెల్లీ..అని ఎంత వీర ప్రయత్నం చేసినా కళ్ళవెంట నీళ్ళొచ్చి చచ్చాయి గానీ అది మాత్రం వచ్చి చావలేదు.nangih"
"గొంతులో ఇరుక్కున్నట్టు అనిపించడం కేవలం నీ ఫీలింగ్. నువ్వు మంచినీళ్ళు తాగినప్పుడే అది ఎంచక్కా నీ బొజ్జలోకి జారుకునే ఉంటుంది."
"అసలు నీకు కొంచెమైనా నా మీద ప్రేముందా.!? అయ్యో..పాపం.. బబుల్ గమ్ మింగేసిందే.. ఇప్పుడేవిటీ చేయడం.. అని కాస్తైనా ఆదుర్దా లేదు నీకు..putuscinte"
"నేనెందుకు అనవసరంగా ఆదుర్దా పట్టం .. 'బబుల్ గమ్ మింగినవారు పాటించవలసిన ధర్మసూత్రాలు' అన్న టాపిక్ మీద నువ్వీ పాటికే పెద్ద రీసెర్చ్ చేసుంటావుగా.. నువ్వే చెప్పు ఇప్పుడేం చేయాలో.."
"నువ్విప్పుడు బిగ్ బబుల్ కి మొక్కుకోవాలి నాకేమీ కాకూడదని.angkatkening"
"యు నో.. డోంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ అండ్ బబుల్ గమ్స్garupale"
"ఏం పర్లేదు..నువ్వు నమ్మకపోయినా బబుల్ గమ్ నమ్ముతుంది. నువ్వు మొక్కేస్తే బబుల్ గమ్ బయటికొచ్చేస్తుంది."
"అని నేను నమ్మను.. నువ్వు నమ్ముతున్నావ్ కదా.. పనేదో నువ్వే చేసేయ్.."
" పని నేను చేయాలంటే బబుల్ గమ్ నువ్వు మింగి ఉండాల్సింది."
"అదేంటి..!!??hah"
"అదంతే.. పెళ్ళాం బబుల్ గమ్ మింగితే మొగుడే మొక్కుకోవాలి. అదే బబుల్ గమ్ రూలు.. ఇప్పుడు నువ్వు నాకోసం మొక్కుబడి చెల్లిస్తావా లేదా.? అది చెప్పు ముందు.."
"ఇంతకీ ఏంటా మొక్కుబడి..?"
"ఏం లేదు.. నాకో నూట పదకొండు బబుల్ గమ్స్ కొనిస్తానని.. అలాగే నువ్వొక పదకొండు తింటాననీ మొక్కుకోవాలి. అంతే..celebrate"
"అమ్మ దొంగా.. ఇదా నీ ఎత్తు.. సరే, అలాగే చేస్తాలే గానీ.. నువ్వు నిజంగానే బబుల్ గమ్ మింగేసావా.. లేకపోతే మొక్కు చెల్లించడం కోసమేనా కథంతా..?"
"నిజంగానే మింగేసాను. కాకపోతే మింగెయ్యగానే గూగుల్ చేసి చూసా.. బబుల్ గమ్ మింగితే ఏమవుతుందీ అని."
"హబ్బా..! ప్రతీ దానికి గూగులొకటి దొరికింది నీకు.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు.."
"సర్లే.. అయినా గూగుల్ లేకపోతే ప్రతీ చిన్న విషయానికీ వాళ్ళనీ వీళ్ళనీ అడగడం ఎంత కష్టం చెప్పు.. ఇంతకీ నేను గూగుల్ చేస్తే ఏం తెలిసిందంటే.. బబుల్ గమ్ మింగేస్తే ఏమీ కాదంటా. దాని దారి అదే వెతుక్కుని బయటికొచ్చేస్తుందంటా.!
ఇంతకీ సంగతి తెలుసుకోడానికి నేను చూస్తుంటే.. ఇంకో విషయం తెలిసింది. అసలు బబుల్ గమ్ పదిసార్లు తింటే అందులో ఏడెనిమిది సార్లు మింగేస్తూనే ఉంటాను నేను అని ఒకళ్ళు.. అసలు నాకు బబుల్ గమ్ మింగడమే ఎక్కువిష్టం అని మరొకళ్ళు.. నేనూ అంతే, నేనూ అంతే.. అని వంత పాడేవాళ్ళు... ఇలా బోలెడు మంది కన్పించారు తెలుసా..!!"
"హుమ్.. వెర్రి వెయ్యి రకాలంటే ఇదే మరి.. ఇంతకీ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యేనా.. నూట పదకొండు బబుల్ గమ్ మొక్కుబడి కనిపెట్టావ్ నువ్వు..fikir"
"హీ హీ హీ.. encem భలేగా కనిపెట్టేసావే.. అయినా, నాకంత సాహసం చేయాలని లేదులే... ఒక్కసారి పొరపాటున మింగినందుకే భయపడి చచ్చాను. ఊరికే సరదాగా చెప్పాన్లే.. నువ్వేమంటావోనని.."
"నిజంగా అంతేనా.. లేకపోతే నీమీద నాకెంత ప్రేముందని పరీక్షించే టెస్టుల్లో ఇది రెండొందల ముప్పయ్యారోదా..!?nerd"
"హ్హి హ్హి హ్హీ jelirmalukenyit"