Sunday, December 21, 2008

కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..!!

పాట 'శుభోదయం' సినిమా లోనిది. సినిమా గురించి మొన్నే చాలా మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు అది చూడకపోతే ఇక్కడకెళ్ళి చూడండి.
ఇప్పుడు మాత్రం కమ్మటి పాటను విని ఆనందించండి. పాట వినిపిస్తే.. నచ్చలేదు అని చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు అని నా నమ్మకం. వేటూరి గారి సాహిత్యం ఎంత బావుందో మరో సారి చూడండి.కంచికి పోతావా కృష్ణమ్మా.. కంచి వార్తలేమి కృష్ణమ్మా..
కంచికి పోతావా కృష్ణమ్మా.. కంచి వార్తలేమి కృష్ణమ్మా..
కంచిలో ఉన్నది బొమ్మ.. అది బొమ్మ కాదు.. ముద్దుగుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా.. కంచి వార్తలేమి కృష్ణమ్మా..
కంచిలో ఉన్నది బొమ్మ.. అది బొమ్మ కాదు.. ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా..

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ.. బొమ్మ..
రాగమేదో తీసినట్టూ ఉందమ్మా..
ముసిముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ..
మువ్వగోపాలా.. మువ్వగోపాలా.. మువ్వగోపాలా.. అన్నట్టుందమ్మా..
అడుగుల సవ్వళ్ళు కావమ్మా.. అవి యెడదల్లో సందళ్ళులేవమ్మా..
అడుగుల సవ్వళ్ళు కావమ్మా.. అవి యెడదల్లో సందళ్ళులేవమ్మా..

కంచికి పోతావా కృష్ణమ్మా.. కంచి వార్తలేమి కృష్ణమ్మా..
కంచిలో ఉన్నది బొమ్మ.. అది బొమ్మ కాదు.. ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా..

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరేళ కంట నిదర రాదమ్మా..
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరే కంట నిదర రాదమ్మా..
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా..
ముద్దు మురిపాలా.. మువ్వగోపాలా..
నువ్వు రావేలా.. అన్నట్టుందమ్మా...
మనసు దోచుకున్న ఓయమ్మా.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా..
మనసు దోచుకున్న ఓయమ్మా.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా..

కంచికి పోతావా కృష్ణమ్మా.. కంచి వార్తలేమి కృష్ణమ్మా..
కంచిలో ఉన్నది బొమ్మ.. అది బొమ్మ కాదు.. ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా..

ముద్దు మురిపాలా.. మువ్వగోపాలా..
నీవు రావేలా..
కంచికి పోతావా కృష్ణమ్మా.. కంచి వార్తలేమి కృష్ణమ్మా..
పొంచి వింటున్నావా.. కృష్ణమ్మా..
అన్నీ మంచి వార్తలే.. కృష్ణమ్మా..

మధురమైన పాటని విని ఆనందించండి. మళ్ళీ కలుద్దాం..!

4 comments:

గీతాచార్య said...

ప్రియ బ్లాగ్స్ ని, మీరు పాటలని బాగా పరిచయం చేస్తున్నారే. మీ ప్రయత్నం చాలా బాగుంది. ఇది ఇజంగా మంచి పాటే. మీ నవతరంగ శుభారంభాన్ని కూడా చూశాను. మీ శైలి చాలా సరళం గా అందంగా ఉంది. మొన్న చెప్పిన ఫ్లాప్ సాంగ్ ని నేను బాగా రాశానని నమ్మకంతోనే పెట్టాను. నేనెప్పుడో రాసిన దానికి ట్యూన్ కూడా చేసుకున్నాను. కేవలం లోవ్ ఇంట్రెస్ట్ మాత్రమె కాదు. అండర్ కరంట్ గా ఒక objectivistic reality ni andulo చొప్పించాను. ఎవరూ దానిని పట్టుకోలేదు. మీరైనా పట్టుకోగలరేమో అని లింక్ ఇచ్చాను.

మొదటి రెండు లైన్లూ చూడండి. అది కేవలం ప్రేమ గీతం కాదు అని అర్ధం అవుతుంది.

"కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా..."

What is that to be in the eyes (say in heart) for there won't be any darkness?

It's love. right.

Also, rationality.
If we are rational, there won't be any darkness in our heart.
అప్పుడు స్వప్నిక లాంటి సంఘటనలుండవు.

మీరు నా బ్లాగ్ లో కామెంట్ రాస్తూ "గీతాచార్యా..
మీ స్టైల్ లో చెప్పలేను గానీ.. నా ఘోష కూడా అదే..
అయినా చాలామందికి మనం మాట్లాడేది చాలా వింతగా ఉంది.
అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో.. మనం పండగ చేస్కోవాల్సింది పోయి.. ఆటవిక న్యాయం.. గోంగూర పచ్చడి..అంటూ మాట్లాడుతున్నామేంటి..అని అన్నమాట." అన్నారు.

అది చూసి నా రేఅందో అర్ధాన్ని (మాట బాగోక పోతే సారీ) పట్టుకున్టారేమో అని ఒక ట్రయల్ వేశాను. నేను జోక్ చేయలేదు. మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి.

Ofcourse, remaining lines express love, and devine thoughts. A multiple idea. :-)కాస్త SD లెండి.

గీతాచార్య.

Unknown said...

అద్భుతమైన పాట వినిపించి మనస్సు పరవశింపజేసారు...నెనర్లు!

నేస్తం said...

chssls msnchi song ni post chesaaru vaani gaaru thanks

మధురవాణి said...

గీతాచార్య గారూ..
ఓపిగ్గా.. వివరించినందుకు కృతజ్ఞతలు.
నిజానికి.. నేను ఒక మామూలు పాఠకురాలనినన్నమాట..!
కథలు, నవలలు లాంటి వాటిని బాగానే అర్ధం చేసుకోగలను కానీ..
కవిత్వం అర్ధం చేసుకోవడంలో చాలా చాలా వీక్.. :)
కవితల్లో కొన్ని భావాలు బావున్నాయనిపిస్తాయి.. కానీ.. ఎక్కువ విశ్లేషించేంత లోతుగా నా ఆలోచనలు ఎందుకో వెళ్ళవు :(
అందుకనే మీరనుకున్న విధంగా నేను కనుక్కోలేపోయానన్నమాట..
అదీ సంగతి :)