Saturday, December 20, 2008

జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ - గ్లూ వైన్ విశేషాలు

జర్మనీలో క్రిస్మస్ వేడుకల గురించి రోజు కొన్ని కబుర్లు చెప్తాను మీకు. చాలా పాశాత్య దేశాల్లోలాగానే.. జర్మనీలో కూడా క్రిస్మస్, ఈస్టర్ రెండు పెద్ద పండుగలు. డిసెంబర్ నెల రావడంతోటే.. ఎక్కడ చూసినా క్రిస్మస్ కళ కనిపిస్తూ ఉంటుంది. బాగా అలంకరించిన క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ తాత బొమ్మలు, సమయంలోనే ప్రత్యేకంగా వచ్చే ఎన్నో రకాల చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇంకా ఎన్నెన్నో... విశేషాలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది.

జర్మనీలో ప్రత్యేకంగా డిసెంబర్ మొదటి, రెండో వారాల నుంచి 'క్రిస్మస్ మార్కెట్లు' మొదలవుతాయి. ఊరికి తగట్టుగా ఊరిలో arrangements ఉంటాయి. పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయన్నమాట. ఇవి మన ఎగ్జిబిషన్ టైపులో ఉంటాయి కొంచెం. కాకపోతే.. gaint wheel లాంటివి ఉండవు క్రిస్మస్ మార్కెట్లో.. చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. కొన్నీటిల్లో బొమ్మలు, ఊలుతో తయారు చేసిన దుస్తులు, చాక్లెట్ పూత పూసిన పండ్లు, ఇంకా మామూలు శాండ్ విచ్ లాంటి తిండి పథార్ధాలు వగైరా ఉంటాయి. అన్నీటికంటే ప్రత్యేకమైన item.. అందరూ ప్రత్యేకంగా వెళ్ళేది దేనికోసం అంటే.. అదే Glühwein (గ్లూ వైన్).


జర్మనీలో క్రిస్మస్ టైం కి బాగా మంచు పడుతుంది కాబట్టి. వాతావరణం చాలా చలిగా ఉంటుంది. సమయంలో బయట క్రిస్మస్ మార్కెట్ కెళ్ళి వేడి వేడిగా Glühwein తాగి పండగ చేసుకుంటారన్న మాట :) అసలు వైన్ వేడి వేడిగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా.. అదే మరి దీని ప్రత్యేకత. వైన్ ని పండగప్పుడు మాత్రమే తాగుతారు. ఎలా తయారు చేస్తారో చెప్తాను. వైన్ ని అమ్మే స్టాల్లో అప్పటికప్పుడు తయారు చేసి కప్పుల్లో పోసి ఇస్తూ ఉంటారు. ఒక చిన్న సైజు గంగాళం లాంటి దాంట్లో రెడ్ వైన్ పోసి సన్నని మంట మీద వేడి చేస్తారు. కాస్త వేడి అయ్యాక అందులో చక్కరతో పాటు చాల మసాలా దినుసులు వేస్తారు. అవేంటంటే.. దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మనం బిర్యానిలో వేసే జాజి పువ్వు, ఇంకా కొన్ని ఉంటాయి కదా (నాకు అన్నీటి పేర్లు తెలిదు :) అవన్నీ వేసి ఇంకాసేపు మరిగిస్తారు. అలాగే నారింజ పండు, నిమ్మ కాయలని తొక్కతో పాటే ముక్కలుగా కోసి అవి కూడా వేస్తారు. కొంచెం tangy flavor రావడానికన్నమాట.. బాగా వేడి చేసాక వేడి వేడి పొగలు కక్కుతున్న Glühwein ని కప్పుల్లో పోసి ఇస్తారన్న మాట. చిన్న స్టాల్స్ లోనే అమ్ముతారు కాట్టి బయట నుంచుని తాగడమే.. వేడి కప్పు చుట్టూ చేతులు పెట్టుకుని.. చక్కగా వేడి వేడి 'గ్లూ వైన్' ని సేవిస్తారన్నమాట. అదీ సంగతి.
పోయిన వారం.. మా ఇన్స్టిట్యూట్ లో అందరూ ఒకరోజు సాయంత్రం క్రిస్మస్ మార్కెట్ కి వెళ్దాం అందరం Glühwein తాగడానికి అన్నారు. ప్రతీ సంవత్సరం రోజుల్లో.. చిన్నా, పెద్దా తేడా లేకుండా బాసుతో సహా అందరం వెళ్తూ ఉంటామన్న మాట..! రోజు మేము వెళ్దామనుకునే టైం కి మంచుపూల వర్షం మొదలయ్యింది. అలా మంచులోనే వెళ్ళాం అందరం. మా ఇన్స్టిట్యూట్ లో అంతకుముందు ఒక వారం క్రితమే ఒక అబ్బాయి పెళ్లి అయ్యింది. సందర్భంగా వాళ్ల ఆవిడని కూడా తీసుకొచ్చాడు. వాళ్ల పెళ్లి అయిన సందర్భంగా మా అందరికీ రోజు Glühwein పార్టీ ఇచ్చారన్న మాట :)

ఇదంతా బానే ఉంది గానీ.. మరి పాపం వైన్ తాగని (తాగడం ఇష్టం లేని) నా లాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ.. అంటే.. kinder-punsch అని ఇంకోటి ఉంటుంది. అచ్చం Glühwein లాగానే చేస్తారు.. కాకపోతే ఇందులో వైన్కి బదులుగా ఆపిల్ రసం కానీ, ద్రాక్ష రసం గానీ వేసి చేస్తారు. kinder-punsch అంటే Child-punch అన్నమాట.. :) అలా అని పిల్లల కోసం మాత్రమే అనుకునేరు.. పెద్దవాళ్ళే ఎక్కువగా తాగుతారు. కాకపోతే.. పిల్లలు కూడా తాగగలిగింది అన్నమాట :)
రుచి మరీ గొప్పగా ఉంటుందా అంటే.. చలిలో.. వేడి వేడిగా.. తీయ తీయగా.. స్పైసీ గా అదొక వెరైటీగా ఉంటుందన్నమాట :)

అదీ జర్మనీ లో Glühwein గాథ.

నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే.. బాదం పప్పులకి చక్కర పూత వేసి.. వేయించి అమ్ముతారు (sugar coated roasted almonds). నాకు అవి చాలా ఇష్టం.. ఎంత బావుంటాయో :)

రోజు బాగా చలిగా ఉండడం వల్ల నేను ఏమీ ఫొటోస్ తీయలేదు. మళ్లీ ఒక రెండు మూడు రోజుల్లో వెళ్ళే ప్లాన్ ఉంది. Munich లో ఉన్న పేద్ద.. క్రిస్మస్ మార్కెట్ కి.. అపుడు తప్పకుండా ఫొటోస్ తీసి మీకు కూడా చూపిస్తాను..

మీ అందరికీ కూడా.. క్రిస్మస్ శుభాకాంక్షలు.


ఇంక సెలవు..
మధుర వాణి


16 comments:

Burri said...

అహా బాదం పప్పులకి చాకెట్లు/చక్కర పూత వేసి వేడి వేడిగా తింటే... జర్మని వదిలి వెళ్ళిన మరిచిపోలేని ఓ జ్ఞాపకం!!

రఘు బుర్రి

Niranjan Pulipati said...

Really Interesting :) chala manchi vishesalu andistunnaru..

Prashanth.M said...

what about bratwurst, boulette, champignon-pfanne??....come-on!!!....one cannot forget those....hmmmmmmmmmmmm...lecker!!!!!!

and yes...the hungarian langos, french crepes, the knobi-brot, ....

where do u live in Germany???

మధురవాణి said...

ప్రశాంత్ గారూ..
Iam a vegetarian. So, no idea of bratwurst and all :( I mean.. no idea of taste.

Mostly I love to eat all sorts of cakes and desserts :) also french crepes, Kaiserschmarrn etc.

I stay in munich.

మధురవాణి said...

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ప్రశాంత్ గారూ.. మీ బ్లాగులో ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. నిజంగా సూపర్ :)

Prashanth.M said...

Thanks మధురవాణి !.... Wirtshaftswoche ప్రకారం Munich జెర్మనీ లోని అన్ని నగరాలలో top నగరమని విన్నాను!...
నేను Jena లో ఉంటాను....... మ్యున్షెన్ నుంది సుమారు 4 గంటల ప్రయాణం!....

అన్నట్టు.....నెనూ వెజిటెరీనే ...కాని చాలా సార్లు experimentation చెయ్యడం నాకిష్టం !!....అదో తుత్తి!

మేఘ సందేశం said...

Hello Madhuravani garu,
i like your blog very much , felt happy by looking the way u present telugu in a nice way. asalu meeru madhuravani ani blog peru pettukunnapudae mee taste arthamu ayyindhi...i would like to know where in munich ur working and on what ...i am also living in germany but in berlin.

మధురవాణి said...

ఈశ్వర్ గారూ,
నా బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషం. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.
మీరు బెర్లిన్ లో ఉంటారా? నేనెప్పుడూ ఆ ఊరు వెళ్ళలేదు :(
I stay in the outskirts of munich. My work is related to animal physiology (some what basic research.

Thanks for visiting my blog.

Anonymous said...

Hello madhura vani garu,

Nice to see a telugu blog on Glühwein...there is also one more special drink called Glühmost ( I tasted it). About me, this is prashanth from villach, austria. I am looking to pursue Phd in micro electronics in germany. So,can u plz guide me. my mail add: mprashanthkumar@gmail.com

Regards
Prashanth

మేఘ సందేశం said...

మధుర వాణి గారు,
అలస్యముగా సమాధానము ఇస్తునందుకు క్షమించాలి. మీరు కుడా రీసేర్చ్ ఫిల్ద్ లొ ఉన్నారని తెలుసుకొని మీ మీద గౌరవము, నా మీద నాకు కొద్దిగా జాలి ఒకేసారి కలిగాయి. నేను మీ అంత కాకపొయిన , నాలొ కూడ కొద్దిగా భావుకత్వం ఉంది అని నా అభిప్రాయం...?? నేను కూడ అందరిలా నా భావాలు పదుగురితొ పంచుకొవలని బ్లొగ్ మెదలుపెడదామని అనుకొంటాను...కాని లాబ్ లొ ఎక్ష్పెరిమెంట్స్ చేస్తూ ..ఇవి అన్ని కుదిరే పనులు కాదులే అని నాకు నేను సర్దిచెప్పుకొనే వాడిని (నాకు బాగ బద్దకము అని ఒప్పుకొవడానికి కొద్దిగా ఆత్మాభిమానం అడ్డు వచ్చి) కాని మీ గురించి తెలిసాక , రాయాలని అని మనసులో ఉండాలి కాని , మనలని రాయకుండా ఏ పని ఆపలేదు అని తెలిసింది. hmm... it took 30 min to write this in telugu. i think you understood by this time that i am also a phd student in biology. i live in Berlin city. The recent globalization video was also very nice, i also wrote a comment there but using anonymous profile. ( cheppanugaa baddakamu ani )...keep writing good posts and many thanks for your reply.
ఈశ్వర్ రెడ్డి

మధురవాణి said...

ఈశ్వర్ గారూ..
వెనువెంటనే (అదేలెండి ఆలస్యంగా;) రిప్లై ఇచ్చి రీసెర్చ్ వారమని నిరూపించారు :)
ఈ నాలుగు లైన్లు తెలుగులో టైప్ చేయడానికి అరగంట పట్టిందన్నారు. మీరు తెలుగు టైపు చేయడానికి ఎం వాడుతున్నారో మరి? ఈ కింద ఇస్తున్న లింక్ ట్రై చేసి చూడండి. ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు.
http://www.google.com/transliterate/indic/telugu#
అదే విధంగా.. బ్లాగ్ పోస్టులు రాయడానికి అయితే బ్లాగర్లో నేరుగా తెలుగు transliteration option ఉంటుంది.
త్వరలోనే మీరు మంచి మంచి పోస్టులతో వస్తారని ఆశిస్తాను.
మీకున్న భావుకత్వం వల్ల.. నా రాతల్లో కూడా మీకు భావుకత కనిపిస్తుంది అనుకుంటాను ;) ఏదేమైనా నా బ్లాగు మీకు నచ్చడం నాకు సంతోషమే సుమా :)

మేఘ సందేశం said...

మధురవాణి గారు,
చాల ధన్యవాదాలు . నిజముగా ఈ లింక్ చాల బాగుంది .పూర్వము నేను లేఖిని వాడాను. మీరు మరల ఇంకో కుంటి సాకు చెపుతున్నాను అని అనుకోక పోతే ప్రస్తుతానికి నేను బ్లాగ్ లో పోస్ట్ ఏమి చెయ్యలేను.( కాని చదువుతూ మాత్రము వుంటాను ) ఎందుకంటే నేను నా థీసిస్ రైటింగ్ లో వున్నాను. బహుశా ఇంకో 2 నెలలు పట్టవచ్చు . ఆ తరువాత నేను నా పోస్ట్ - డాక్టోరల్ మరియు బ్లాగ్ రైటింగ్ రెండు ఒకేసారి మెదలు పెట్టాలని నా ఉద్దేశ్యము . అందుకు మెదటి ప్రయతన్ముగా సీట్ రిజర్వు చేసుకొన్నట్టుగా టైటిల్ మాత్రము రాసి వదిలిపెట్టాను. ఇంత రాయడానికి 5 నిముషాలు మాత్రమే పట్టింది . ఇక నేను కూడా ఇక తెలుగులోనే కామెంటుతాను. ప్రస్తుతానికి నేను రీసెర్చ్ వాడిని మాత్రము కాదు (ఎందుకంటే వెంటనే సమాధానము రాసాను కదా..!!)

Unknown said...

Hallo Madhuravani garu,

Its been now couple of months, I have been following telugu blogs. But was wondering if there is no one from Germany. Good to see you. Are you from munich? Good to know.
Intresting blog. Liked it thoroughly.

This is my first ever comment here. Telugu script use cheyatam telidu inka naku.

Wish to read from you.

మధురవాణి said...

@ Ecstacy,
Nice to hear that you liked my writings! Thanks for following my blog! Yes.. I stay in Munich.
ఇదే పోస్టులో పైన కామెంట్స్ లో ప్రశాంత్ గారున్నారు చూడండి. తను కూడా జర్మనీ లోనే ఉంటారు. తన ఫోటో బ్లాగ్ చాలా బాగుంటుంది. :)
---Telugu script use cheyatam telidu inka naku.---
అచ్చం ఇలాగే ఈ క్రింద ఇచ్చిన లింక్ లో టైపు చేస్తే తెలుగులో వచ్చేస్తుంది. చాలా తేలిక.. ఒకసారి ప్రయత్నించి చూడండి. :)
http://www.google.com/transliterate/indic/telugu#

Unknown said...

అరేయ్ వావ్ చాల సులువుగా ఉండండి. జిమెయిల్ ID ఇస్తే na old బ్లాగ్ లింక్ చేసింది, అసలు రాయటం మానేసి ఎన్ని రోజులు అయిందో.
కానీ ఇన్ని బ్లాగ్స్ చదివాకా చాలా ఉత్సహంగా ఉంది మల్లి రాయాలని. కానీ రాస్తే మా బుజ్జి monster గురించే ఇంకా.
థాంక్స్ ఫర్ స్క్రిప్జ్.
విల్ కీప్ పోస్టింగ్ ఇంకా.

మధురవాణి said...

@ Ecstasy,
చూసారా.. ఎంత చక్కగా రాసేసారో చకచకా తెలుగులో.. మీ బుజ్జి monster ఎవరో, ఆ కబుర్లేంటో చెప్పేస్తే బుద్ధిగా వినేస్తాం మరి! :)