చిన్నప్పుడు నాన్న వెంట ఏ మిఠాయిల దుకాణానికో, పుస్తకాల కొట్టుకో వెళ్ళినప్పుడు అక్కడ కళ్ళెదురుగా నోరూరిస్తూ కనిపించే మిఠాయిలన్నీ కొనేసుకుంటే బాగుండుననీ, కొట్లో ఉన్న రకరకాల పెన్సిళ్ళన్నీ మనింటికి తెచ్చేసుకుంటే బాగుండనీ అనిపించేది కదా.. అలాగే ఎప్పుడేది తోస్తే అది మాట్లాడెయ్యడం, ఏడవడం, నవ్వడం, ఎగరడం, గెంతడం, అరిచి గీపెట్టడం, ఉన్నపళంగా కూలబడి ఫలానాది కావాలని పేచీ పెట్టడం.. ఇలాంటివన్నీ దాదాపూ ప్రతీ ఒక్కరూ చిన్నతనంలో చేసే పనులే. కానీ, అదంతా చిన్నతనం కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోయేది. "ఇంకా చిన్నతనం కదూ.. కాస్త జ్ఞానం వస్తే అన్నీ వాళ్ళే తెలుసుకుంటార్లే.." అంటూ పెద్దవాళ్ళు కూడా పిల్లల చేష్టలని చూసీ చూడనట్టు పోతుంటారు.చిన్నప్పుడు ఇంట్లోనూ, బళ్ళోనూ నిత్యం మనకి కాపలా కాస్తూ "ఇది చెయ్యొద్దు, అలా చెయ్యాలి.." అంటూ వెంటపడి మనల్ని పద్ధతిగా సరైన దారిలో నడిపించడానికి చుట్టూ బోలెడు మంది. అదే ఇప్పుడైతే మనం పెద్దయిపోయాం కదా మరి.. అంచేత మనకి గొప్ప జ్ఞానంతో పాటుగా ఎప్పుడేది చేయాలో, దేన్ని ఎంతవరకూ తెలుసుకోవాలో బోల్డంత విజ్ఞత వచ్చేసింది(?) అని తలచి అందరూ మనల్ని "నీ అంతట నువ్వు సొంతంగా ఏదోక దారిలో నడవవోయ్.." అని లోకం మీద వదిలేస్తారు. పైగా మనం ఎదిగే కొద్దీ అవసరం అయినవీ కానివీ లెక్కలేనన్ని విషయాలు తెలిసిరావడం పుణ్యమా అని మరింత గందరగోళం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏతావాతా అన్నీ కలగలిపి ఇప్పుడు చచ్చినట్టు తెలిసొస్తుంది బతుకులో ఉన్న అసలు మజా ఏంటని.. ;)
మీరే చెప్పండి.. ఎవరికన్నా సలహాలు ఇవ్వడం, సుద్దులు చెప్పడం మహా సులువు గానీ మనకి మనం బుద్ధి చెప్పుకోడం ఎంత కష్టమైన పని అసలు.. నిర్మొహమాటంగా, నిర్దాక్షిణ్యంగా మన లోపాలు మనమే ఎంచి, "నువ్వు మారాల్సిందేనోయ్.." అని గొంతెత్తి అరిచి మరీ మనసు చెవి మెలిపెట్టి అదుపాజ్ఞలలో ఉంచడం.. హబ్బా.. మాటల్లో చెప్తుంటేనే నీరసం వచ్చేస్తోంది బాబూ.. చేతల్లో అంటే ఇంకెంత కష్టమో కదా.. ప్చ్.. :(
అసలు ముందు మనం ఫలానా విషయంలో నిగ్రహం పాటించాల్సిన అవసరాన్ని నిజాయితీగా గుర్తించడానికి తెగ సతమతమైపోయి, ఎలాగో అతి కష్టం మీద నిజాన్ని ఒప్పుకుని, సరే ఏమైతే అయింది ఘాట్టిగా ప్రయత్నం చేద్దామన్న నిర్ణయానికొచ్చి, రకరకాల వ్యూహాలు పన్నుతూ మన మీద మనమే గెలవడానికి యుద్ధాలు చేస్తూ, గెలిచామన్న ఆనందంలో మళ్ళీ ఓడిపోతూ, ఓడిపోతున్నామేమో అన్న బెంగలో అప్పటికప్పుడు ఏదోక మెట్టవేదాంతాన్ని ఆశ్రయించి మనకి మనం సర్ది చెప్పుకుంటూ...... చెప్తూ పోతే ఇదొక అంతు లేని కథ. కాదంటారా? ;)
సరదాగా కొన్ని ఉదాహరణలు చూద్దాం..
ఏదో కొంపలు మునిగిపోయే రాచకార్యాలని చక్కదిద్దుతున్నట్టు పది నిమిషాలకోసారి జీమెయిల్ చూసుకోడం..ఓ పక్కన ఆఫీసులో చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు బోలెడు ఉండి కూడా... ఓ ఐదు నిమిషాలు కూర్చుని ఫేస్బుక్లోనో, ప్లస్లోనో అప్డేట్స్ చూసి వెళదాం లెమ్మని ఐదు నిమిషాలు అనుకున్నది కాస్తా అరగంటవ్వడం..బ్లాగులో కొత్త పోస్ట్ రాసిన పాపానికి ఎవరన్నా దయ తలచి కొత్త కామెంటు రాసారేమోనని పదే పదే చెక్ చేసుకోవడం..ఈనాడు పేపర్, ఐడిల్ బ్రెయిన్, గ్రేటాంధ్రా తదితర వెబ్సైట్లు అర నిమిషానికోసారి రిఫ్రెష్ చెయ్యడం..
(ఇందులో ఎవరెవరి ఓపికని బట్టి వాళ్ళు ఆర్కుట్లూ, ట్విట్టర్లూ, మన్నూ మశానం అంటూ ఇంకా మన దుంప తెంచేవి ఎన్నున్నా.. అవన్నీ కలిపేసుకోవచ్చు. ఏ రాయైయేతేనేం! ;)రోజంతా 'క్రికిన్ఫో' లోనే తచ్చాడింది చాలక తెల్లవారి ఆఫీసులో మీటింగున్నా సరే అర్ధరాత్రుళ్ళు అరగంటకోసారి లేచి మరీ ఐఫోన్లో క్రికెట్ స్కోర్లు చూసుకోవడం..టీవీ సీరియల్ టైముకి చూడలేకపోతే ఆ ఎపిసోడ్లో హీరోయిన్ వాళ్ళ అత్త విషం కలిపిచ్చిన పాలు తాగేసి చచ్చిందా లేదా అన్న టెన్షన్ తో మనం చచ్చిపోవడం..యాంగ్రీ బర్డ్స్, గాడిద ఎగ్సూ ధ్యాసలో పడిపోయి తిండీ, నిద్రే కాకుండా అసలు కనురెప్పలు వాల్చడం కూడా మర్చిపోయేంతగా వీడియో గేమ్స్ ఆడటం..బ్లాగుల్లోనో, టీవీలోనో వంటల ఫోటోలూ, ప్రోగ్రాములూ చూసి అప్పటికప్పుడు ఆకలేసేసి అవే తినాలనిపించి పిచ్చెక్కిపోడం..బజ్లోనో, ప్లస్లోనో వాడి వేడి చర్చల్లో ఎడాపెడా కామెంట్సు రాస్తూ రాస్తూ ఎప్పటికో యథాలాపంగా గడియారం కేసి చూసుకుని కెవ్వుమనడం..వగైరా..
అసలిలాంటివన్నీ చూస్తుంటే మనోనిగ్రహం, ఆత్మనిగ్రహం మాదిరి నెట్టిగ్రహం (నెట్టు మీద నిగ్రహం :P) అని ఒక పదం కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. :Dఅసలు కన్నా ఫేకు ముద్దన్నట్టు.. నిజ జీవితంలో వాటి కన్నా ఈ మిథ్యా ప్రపంచంలోని విషయాల్లో నిగ్రహంగా ఉండటం మరింత కష్టమేమో అనిపిస్తుంటుంది నాకు. బయట ప్రపంచంలో కన్నా ఈ నెట్ ప్రపంచంలో మన వ్యాపకాలకి రెండో వ్యక్తి ప్రమేయం అక్కర్లేకపోవడం, మన చుట్టూ ఉండే వాళ్ళెవరి నియంత్రణ దాదాపుగా ఉండకపోవడం, మరీ ముఖ్యంగా ఈ వేదికపై ఎప్పుడూ శూన్యత అనే పరిస్థితికి ఆస్కారమే లేకుండా ఎవరున్నా, ఎవరు పోయినా, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ డైనమిక్ గా, లైవ్లీ గా ఉండటం.. ఇవన్నీ కొంతవరకూ కారణాలేమో మరి!
అన్నీటికన్నా విచిత్రం ఏంటంటే, ఎవరికి వారు.. "ఆఫ్టరాల్.. ఇదొక మిథ్యా ప్రపంచం.. ఊహాలోకం లాంటిది.. నా నిజ జీవితానికి దీని వల్ల ఒరిగేదీ, పోయేదీ ఏమీ లేదు. అంచేత నేనసలు చాలా తేలిగ్గా తీసుకుంటాను.." అని అనుకుంటూనే (అనుకుంటున్నామన్న భ్రమలోనా!?) వాళ్ళకి తెలీకుండానే ఇక్కడ జరిగే ప్రతీ విషయానికీ నిజజీవితంలో మాదిరే స్పందిస్తూ, విలువనిస్తూ పోతారు.ఇక్కడ కూడా పరిచయాలూ - స్నేహాలూ, అనుబంధాలూ - ఆత్మీయతలూ, అపార్థాలూ - గొడవలూ, వాదాలూ - ప్రతివాదాలూ, కక్షలూ - కార్పణ్యాలూ, కుట్రలూ - కుతంత్రాలూ, తిట్లూ - దీవెనలూ, నవ్వులూ - ఏడుపులూ... అన్నీ అచ్చంగా నిజ జీవితంలో మాదిరే అనుభవిస్తున్నామన్నది నిజం కాదంటారా?

ఇప్పుడు నిగ్రహం లేకపోవడం వల్ల వచ్చే ఇంకో రకం కష్టాలు చూద్దాం ..
బజార్లో షాపుల ముందున్న డిస్కౌంట్ బోర్డులో లేక డిస్ప్లేలో ఉన్న అందమైన బట్టలనో చూసి మంత్రం వేసినట్టు లోపలికెళ్ళిపోయి పర్సులు ఖాళీ చేసుకొచ్చుకోవడం..స్నేహితులో, పక్కింటి వాళ్ళో కొనుక్కున్న కొత్త నగల్ని చూసి అప్పులు చేసి మరీ బంగారం కొనుక్కోడం..ఈ ఒక్క రోజుకీ పిజ్జా తినేస్తాను.. రేపటి నుంచి మాత్రం జంక్ ఫుడ్ తినకుండా ఆరోగ్యకరమైన తిండే తింటాను అని గోడ మీద రాసి పెట్టుకోడం..బ్యాంకు వాడు గారంగా అడిగాడు కదాని డామ్మని పడిపోయి లోన్లు తీసుకుని తర్వాత ఏళ్ళ తరబడి వాటిని కట్టలేక సతమతమైపోడం,క్రెడిట్ కార్డు వాడు అడక్కముందే బోల్డు లిమిట్ ఇచ్చాడని మురిసిపోయి ఎడాపెడా గీకెయ్యడం..కొత్తగా రిలీజ్ అయిన మాక్ బుక్కో, ఐ ప్యాడో, సెల్ ఫోనో చూసి ఇంట్లో ఉన్న ఇద్దరు మనుషులకీ నాలుగో గాడ్జెట్ కొనడం..
ఇవన్నీ సంసారపక్షమైన సమస్యలన్నమాట.. :D ఇలాంటివి ఎవరికి వారు గుర్తించి బయటపడాల్సిందే తప్ప.. రెండో వ్యక్తి చూస్తూ ఊరుకోడం తప్ప పెద్ద చెయ్యగలిగిందేమీ లేదు.. పైగా, ఇలాంటి విషయాల్లో నిగ్రహం కోల్పోతే వాటి పరిణామాలు దీర్ఘకాలికంగా భరించాల్సి వస్తుంది. ఇలాంటివి ఒకటీ రెండు సార్లు పడి లేస్తే ఎవరైనా సరే తప్పకుండా నేర్చేసుకుంటారని నాకనిపిస్తుంది.
ఇంకో రకం కూడా ఉంది..అచ్చంగా మనసుకీ, భావోద్వేగాలకీ సంబంధించిందీ.. నవ్వు, ఏడుపు, నొప్పి, బాధ, కోపం, ఇష్టం, ప్రేమ, ద్వేషం, అభిమానం, అసహ్యం... ఇలాంటివి ప్రదర్శించడంలో నిగ్రహం చూపడం..సాధారణంగా ఇలాంటి వాటి గాఢత, మనిషిపై వాటి ప్రభావం, తదనంతర పరిణామాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. చిత్రం ఏంటంటే, ఇవి నిజ జీవితంలోనూ, మిథ్యా ప్రపంచంలోనూ సర్వ కాల సర్వావస్థల్లోనూ మన వెన్నంటే ఉంటాయి.
మనమూ, మన సంతోషమో, బాధో ముఖ్యం అనుకున్నవాళ్ళు మన మనసెరిగే ప్రవర్తిస్తారు. అలాక్కాదూ.. మాకదేం తేడా పడదని పట్టించుకోని వాళ్ళని మనం కూడా వదిలెయ్యడానికి సిద్ధపడాలి. అనుచితమైనదాని వైపే పదే పదే మనసు పరిగెడుతుంటే కాస్త పగ్గాలేసి వెనక్కి లాగి కూర్చోబెట్టాల్సిందే తప్పదు. అదే కదా మరి నిగ్రహం అంటే!
చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారని తెలిస్తే వాకిలి దగ్గరే కాలు కాలిన పిల్లిలా తెగ పచార్లు చేస్తుంటే మా అమ్మ నవ్వుతూ "ఎందుకే అంత ఆత్రం.. వాకిలి దాకా వచ్చినవాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారా?" అని నవ్వేది. అలాగే, నిజంగానే మన దగ్గరికి రాదలచుకున్న వాళ్ళు, మాట్లాడదల్చుకున్న వాళ్ళు గుమ్మం దాకానో, ఫోన్ దాకానో వచ్చి వెనక్కి వెళ్ళిపోరు కదా.. మనం కాస్త మనోనిగ్రహం పాటించి చాదస్తం తగ్గించుకుని అతిగా ఆలోచించడం మానేస్తే.. అదే మనసుకి సరైన మందు. అలాగే ఎప్పుడూ గుడ్డిగా మనసు మాటే కాకుండా అప్పుడప్పుడూ బుద్ధి మాట కూడా వింటే సరి.. దారి తప్పిపోకుండా ఉంటాం.
అదన్నమాట సంగతి.. ఇంతకీ మీరు ఏ విషయంలో నిగ్రహాన్ని సాధించాలో ఆలోచించుకున్నారా మరి? ;)