Friday, April 10, 2009

పాటల సందడి - ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకి అటో ఇటో.. ఎటో వైపు..!!

మనందరికీ ఎన్నెన్నో నచ్చిన పాటలు ఉంటాయి. కొన్ని పాటల్లో సంగీతం మదిని మెరిపిస్తే.. మరి కొన్ని పాటల్లో సాహిత్యం మురిపిస్తుంది.. మరి కొన్నీటిలో గాయకుల గాత్రం మైమరిపిస్తుంది. ఏదయితేనేం.. ఆయా పాటలు మాత్రం మన మనసుని ఆహ్లాదపరుస్తాయన్నది మాత్రం వాస్తవం. మన సినిమాల్లో అడపా దడపా మంచి మంచి పాటలు వచ్చి మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఎన్నెన్నో వచ్చి వెళ్తుంటాయి కాబట్టి.. కాలగమనంలో కొన్ని మరచిపోతుంటాం. ఎక్కడో అనుకోకుండా పాట వినపడగానే.. పాటతో పాటుగా పాటలు ఇదివరకు విన్నప్పటి గత స్మృతులు.. దాన్ని అల్లుకున్న భావాలెన్నో మనని ముప్పిరిగొంటాయి. అలా అనుకోకుండా ఒక చక్కని పాట గుర్తొస్తే భలే సంతోషంగా అనిపిస్తుంది. ఉద్దేశ్యంతోనే.. నా బ్లాగులో అప్పుడప్పుడూ కొన్ని పాటల్ని గుర్తు చేస్తూ ఉంటాను.

కొన్ని అద్భుతమైన పాటలు ఒకోసారి ప్రజాదరణకు నోచుకోవు. సినిమా ఫ్లాప్ అవ్వడమో లేక మరింకేదో కారణాల వాళ్ళో పాటలు ఎక్కువ మంది దరి జేరవు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పే 'ఎవరో ఒకరు ఎపుడో అపుడు' అనే పాట 1992 లో వచ్చిన రేవతి నటించిన 'అంకురం' అనే సినిమాలోనిది. పాట తెలిసిన వారందరూ అద్భుతమనే అంటారు. కానీ.. తెలియని వారు కూడా చాలామందే ఉన్నారన్నది నిజం. విచిత్రం ఏంటంటే.. పాట పల్లవి తెలిసిన చాలామందికి పాట మొత్తం తెలీదు. మరి కొంతమందేమో పాట ఉందని తెలుసు గానీ పెద్దగా వినలేదు అంటారు. నిజమేనోయ్.. పాట చాలా బావుంటుంది. కానీ.. మధ్య విననే లేదు అనే వారు మరి కొందరు.


సరే లెండి.. తెలిసి ఉన్నా.. తెలీకపోయినా.. మనందరం గుర్తు చేసుకోదగ్గ అద్భుతమైన పాట ఇది. సంగీత దర్శకుడు 'హంసలేఖ' స్వరపరచిన పాటని చిత్ర, బాలు ఆలపించారు. ఎన్నెన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్ని రాసిన సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారింది పాట. మనిషిలో పట్టుదలను, స్ఫూర్తిని రగిలించేలా భావం ఉన్నా పాటలు ఎన్నో ఉన్నాయి మన తెలుగులో. కానీ.. పాటలో సిరివెన్నెల గారి ప్రయోగాలు ఎంతో అబ్బురపరుస్తాయి. తొలివేకువ కూత కూసే కోడిని, నిశీధిలో తిరుగాడే మిణుగురు పురుగులనూ, ఎండ వేడికి ఒళ్ళు మండి ఆవిరయ్యే సముద్రాన్ని.. ఇలా ప్రకృతిలో ఉన్న వాటన్నిటినీ చూసి మనం స్ఫూర్తిని పొందాలని సిరివెన్నెల గారు చెప్పిన మాటలు పాట విన్న వారి మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయని నా అభిప్రాయం. అంతెందుకు అసలా పల్లవి చూడండి.. ఎవరన్నా ఏదైనా పనికి తొలి అడుగు వెయ్యాలా వద్దా అన్న సంశయంలో ఉంటే "ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు.. అటో ఇటో ఎటోవైపు.." వాక్యాలు వింటే.. ఖచ్చితంగా ముందడుగు వేసి తీరుతారు. ఏదైనా క్రొత్త బాటలో నడవాలన్న తలంపు వచ్చినవారికి రెండు మాటలు చెప్తే మది ఆత్మవిశ్వాసంతో నిండిపోతుంది. కాదంటారా.? "మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి.. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి.. వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది.."
సరే మరి.. నా వంతు అయిపొయింది. ఇంక ఇప్పుడు పాట సాహిత్యం చూసి, పాట విని అభిప్రాయం చెప్పే వంతు మీది :)

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది..!

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా..
అనుకొని కోడి కూత నిదరపోదుగా ..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా ..
మొదటి చినుకు సూటికా దూకి రానిదే..
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే ..
వాన ధార రాదుగా నేల దారికి..
ప్రాణమంటూ లేదుగా బ్రతకటానికి ..

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!

చెదరక పోదుగా చిక్కని చీకటి..
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి ..
దానికి లెక్క లేదు కాళరాతిరి..
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని..
రెప్ప వెనక ఆపనీ కంటి నీటిని..
సాగలేక ఆగితే దారి తరుగునా..?
జాలి చూపి తీరమే దరికి చేరునా..?

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!

యుగములు సాగినా నింగిని తాకక..
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా..
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా..
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే..
అంత వాడి ఆవిరై వెళ్లి చేరదా..?
అంత గొప్ప సూర్యుడు కళ్లు మూయడా..?
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా..?

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
అటో ఇటో ఎటో వైపు..!


26 comments:

సమిధ ఆన౦ద్ said...

Very meaningful song Madhura garu. My favorite song and another song that I like a lot is "కలకానిదీ విలువైనదీ బ్రతుకూ బ౦గారు......". Try to find this song for download. I will be the first one to get it from your website. I have a load of them I could not find online. Nice to remember a nice song after a long time. By the way, you are in research? What field do you work in if I may ask you? Coz I am in research too, that's why!

Vinay Chakravarthi.Gogineni said...

sirivennela gara idi raasindi...........i have some doubt abt it...but excellent and song and we can get some inspiration esp

చెదరక పోదుగా చిక్కని చీకటి..
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి ..
దానికి లెక్క లేదు కాళరాతిరి..

పరిమళం said...

one of my favourite song ! thanks!

మరువం ఉష said...

ఈ సినిమా, రేవతి భావ ప్రకటన నా కళ్ళలో ఇంకా సజీవంగావున్నాయి. నిజానికి నేను ఏదైనా మొదలు పెట్టేప్పుడు ఎవరైన "ఎందుకు క్రొత్తగా,," బాణీ ప్రశ్నలు వేస్తే నా సమాధానం ఈ పాటే. సిరివెన్నెల గారి కొన్ని సంభాషణల్లో ఈ పాట తావుచేసుకుంది. మొత్తం సాహిత్యాన్ని అందించినందుకు చాలా కృతజ్ఞతలు.

Thnaks for the effort and it is in deed a commendable job you. Kudos, Madhura!

మురళి said...

చాలా మంచి పాట అండి.. నాకు రేవతి, ఓంపురి గుర్తొచ్చేస్తారు ఈ పాట వినగానే.. సినిమా కూడా చాలా సార్లు చూశాను..

మాలా కుమార్ said...

మధురవాణి గారు,
మీరన్నట్లు నాకూ మొదటి లైనులే తెలుసు.ఎప్పుడు అంతే పాడుకుంటు వుంటాను. పుర్తిగా వినిపించినందుకు థాంక్స్.

krishna rao jallipalli said...

మీరన్నట్లు చాలా మందికి (నాక్కూడా) మొదటి లైను మాత్రమె తెలుసు. ఎందుకంటే ఈ పాట మకుటంతో TV9 లో ఒక ప్రోగ్రాము ఉంది. (సోషల్ వర్కర్స్ పై). పాట బాగుంది. మీకు అబినందనలు. హేమిటో ఈ రోజు మహిళా బ్లాగర్లు (అనుకుంటున్నాను) అందరూ పాటల మీద పడ్డారు. GOOD. NEXT TIME, జోకుల మీద పాడమని ప్రార్తన.

సుజాత వేల్పూరి said...

ఈ పాట ఎంత ఇష్టమో చెప్పలేను మధురవాణీ నాకు! సిరివెన్నెల ఎన్ని పాటలు రాసినా నేను ఆయన రాసిన ప్రతి పాటకీ"ఈ పాటకైతే పాదాభివందనం చెయ్యొచ్చు" అనుకుంటాను. వినడానికే కాదు, అనుసరించడానికి కూడా ఈ పాట ఇష్టమే!

ప్రతి వాక్యం ఒక ఆణీముత్యం! కర్తవ్య బోధ ఇంతకంటే బాగా ఎవరు చేయగరలు? సీతారామ శాస్త్రి ఒక అద్భుతం ఈ సృష్టిలో!

నిషిగంధ said...

మంచి పాటని, దానితోపాటే ఆ సినిమాని గుర్తు చేశారు.. ఈ సినిమా ప్రభావం నన్ను నెలల తరబడి వదల్లేదు.. ఇక ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే!! One of the best inspirational songs!

వేణూశ్రీకాంత్ said...

సిరివెన్నెల గారి అద్భుతమైన ఆణిముత్యాల లో ఇదీ ఒకటి. చాలా చక్కని పాట పరిచయం చేసారు మధురవాణి గారు.

Vamsi Krishna said...

Thanks for the song...

Kumar said...

Hi Madhura..
My fav song too..
alaagey inko vishayam...
"pattudala" movie lo "eppudu oppukovaddu raa otami" kuda inspirational ga untundi..meeru viney untaaremo ee paatiki..

చైతన్య said...

అద్భుతమైన పాట

చైతన్య.ఎస్ said...

మంచి పాట ..ధన్యవాదాలు

మధురవాణి said...

స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేను పోస్ట్ చేసిన పాట మీ అందరికీ నచ్చడం నాక్కూడా సంతోషమే కదా :)
@కుమార్ గారూ.
మీరు చెప్పిన పాట నాకు తెలీదండీ.. తప్పకుండా వినే ప్రయత్నం చేస్తాను.
@ సుజాత గారూ..
సిరివెన్నెల గారి గురించి నాది కూడా ఇదే అభిప్రాయం. బాగా చెప్పారు.
@ నిషిగంధ గారూ..
మీకో విచిత్రం చెప్పనా.. సుజాత గారి వ్యాఖ్య చూశాక ఎందుకో మీరు గుర్తొచ్చారు నాకు. నా బ్లాగులో మీ వ్యాఖ్య ఎప్పుడు వస్తుందో.. అనుకుంటూ పడుకుని పొద్దున్నే లేచి చూసేసరికి మీ వ్యాఖ్య ఉంది. ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను.
నా బ్లాగుకి వేంచేసినందుకు ధన్యవాదాలు :)

నిషిగంధ said...

నేను మీ బ్లాగు కి చాలాసార్లు వచ్చాను.. నిజ్జంగా నిజం.. కానీ కామెంటే టైం లేక చదివేసిన రోజులే అన్నీ.. సారీ :(

నేస్తం said...

వాణి గారు చక్కని పాటను మళ్ళీ పరిచయం చేసారు ... నిజమే సిరివెన్నెల గారి తరువాతే ఏ పాటల రచయిత అన్నా అనిపిస్తుంది ఒక్కోసారి

మధురవాణి said...

@నేస్తం,
నాదీ మీ మాటే. అదేనండీ మరి సిరివెన్నెల గారి మహత్యం.!
@నిషిగంధ గారూ..
ఇంత చిన్నదానికి సారీ ఎందుకండీ.. మీరు మరీనూ.. మీరు వచ్చి చదవగలిగే విషయం ఉంటే నా బ్లాగులో సంతోషమే కదా..! అయినా చదవడమే ముఖ్యం గానీ.. ప్రతీసారి కామెంట్ రాస్తేనే చదివినట్టు కాదు కదండీ.! మొత్తానికి మీరు చదివారన్న సంగతి నాకు తెలిసిపోయింది కదా :)
అలాగైతే.. అప్పుడప్పుడూ నా బ్లాగు వైపు ఓ లుక్కెయ్యండి చాలు.

bharath said...

చాలా మంచి పాట ఇన్నాళ్ళు వీలుల విందుగా విన్నాము
ఇప్పుడు కన్నుల విందుగా చదివాము THANKS FOR THAT

మీకు టైముంటే రుద్ర వీణ లోని ఈ పాటకు మీ వాక్య వినాలనుంది
నమకు నమకు ఈరేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని

పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను

పక్క వాని గుండెల నిండా చిక్కనైన రోదన నిండ
ఏ హాయి దరి రాదు నీ వైపుకు
లాంటి చక్కని చరణాలు ఉన్నాయి ఈ పాటలో

REARDS
JAYABHARATH

భరత్ said...

adbhutamaina pata ni malli gurtu chesinanduk thanx madhura vani garu...
e pata lo chala manchi artam undi...

సమిధ ఆన౦ద్ said...

మీకు కుదిరినప్పుడు స్నేహగీత౦ సినిమాలో "వస౦తమేదీ మరి౦చి రాదు" అనే పాట విని చూడ౦డీ. బహుశా మీకు దాని గురి౦చి కూడా స్ప౦ది౦చి వర్ణి౦చాలనిపిస్తు౦దేమో. నాకు నచ్చి౦ది. పదిమ౦దికీ పనికొచ్చే పాట అది.

నీహారిక said...

హమ్మయ్య!ఇప్పటికి రాయగలిగాను.మధురవాణి గారూ,ఈ పాట కోసం అంకురం సినిమా 5 సార్లు చూసాను.

భావకుడన్ said...

మధురవాణి గారు

మంచి పాట...అదే చిత్రంలో అనుకుంటా....."బండెళ్ళి పోతోంది చెల్లెలా బ్రతుకు బండెళ్ళి పోతోంది ఛెల్లలా" అంటూ గుడ్డి ముష్టి వాళ్ళు పాడుకునే పాట ఒకటి ఉంటుంది ఆ కోసం ఎంత వెతుకుతున్నానో...మీకు దొరికితే నాకు పంపించరా?

padmaja said...

ee pata chala bagundi chala rojula tarwata inta manchi sahityam unna pata vinnamu chala thanks padmaja

jasmines said...

mee abiruchiki thanks

భావకుడన్ said...

Thanks again for a timely the reminder.