Thursday, November 24, 2011

ఊ అనూ.. ఊహూ అనూ..


"ఏవండీ.. ఇక్కడ కూర్చోవచ్చా?"
"ఊ.."
"బస్ ఎప్పుడొస్తుందో మీకు తెలుసాండీ?"
"ఊహూ.."
"ఈ బస్సు ఎక్కుతున్నారంటే మీరు మా కాలేజీనాండీ?"
"ఊహూ.."


"హాయ్.. నన్ను గుర్తు పట్టలేదాండీ.. నిన్న కలిసాం కదా!"
"ఊహూ.."
"ఓ.. మర్చిపోయారా.. పోనీ నన్ను మళ్ళీ గుర్తు చెయ్యమంటారా?"
"ఊహూ.."
"అదేంటండీ.. నిన్న ఈ కాలేజీనా అనడిగితే కాదన్నారు.. అయితే మీరూ ఇక్కడే చదువుతున్నారన్నమాట!"
"ఊహూ.."
"మరిక్కడున్నారేంటి .. ఎవరన్నా ఫ్రెండ్స్ కోసం వచ్చారా?"
"ఊ.."


"హాయ్.. ఏంటండీ.. రోజూ ఇదే బస్సెక్కి ఇదే కాలేజీకి వచ్చేది కేవలం ఫ్రెండ్స్ ని కలవడం కోసమేనా?"
"ఊ.."
"మీ పేరేంటో తెల్సుకోవచ్చా?"
"ఊహూ.."
"ప్చ్.. అయితే మీకు మాటలు రావాండీ పాపం?"
"ఊహూ.."
"మాట్లాడకపోయినా కనీసం పోట్లాడతారేమో అనుకున్నానండీ.. అయితే నా ఉపాయం పని చెయ్యలేదన్నమాట!"
"ఊ.."
"పోనీలెండి.. రేపు మళ్ళీ ఇదే టైముకి కనిపిస్తారుగా.."
"ఊహూ.."
"నా కోసం కాదండీ.. కాలేజీకి వస్తారుగా అంటున్నా.."
"ఊ.."


"హాయ్.. చాన్నాళ్ళైంది కనిపించి.. బావున్నారా?"
"ఊహూ.."
"ఏంటీ.. నిజంగా బాగాలేరా?"
"ఊ.."
"మీరు మూగో కాదో తెలీదు గానీ మిమ్మల్ని చూసీ చూడగానే నాకొచ్చిన మాటలు కూడా మర్చిపోతానండీ నేను.."
"ఊ.."
"మీరు చాలా అందంగా ఉంటారండీ.."
"ఊ.."


"ఏడాదిగా చూస్తున్నాను.. మీకు 'ఊ.. ఊహూ' తప్ప వేరే మాటలేవీ నేర్పించలేదాండీ మీ ఇంట్లో వాళ్ళు?"
"ఊహూ.."
"నాతో మాట్లాడటం మీకిష్టం లేదాండీ?"
"ఊహూ.."
"మీ పక్కన కూర్చోవచ్చాండీ?"
"ఊహూ.."
"బస్ ఎప్పుడొస్తుందో తెలుసాండీ?"
"ఊహూ.."
"మీరంటే నాకు చాలా ఇష్టమండీ.."
"ఊ.."
"ఒట్టి ఇష్టమే కాదు.. బోల్డు ప్రేమ కూడానండీ.."
"ఊ.."
"మీక్కూడా నేనంటే ఇష్టమేనా మరి?"
"ఊహూ.."
"నేను మీ చెయ్యందుకోవచ్చాండీ?"
"ఊహూ.."
"ఊహూ.. అంటే ఊ.. అని అర్థమాండీ?"
"ఊ.."

కొన్నాళ్ళు గడిచాక....



"ఏవండీ.. ఏవండోయ్.. మిమ్మల్నే పిలిచేది.. ఎంత పిలిచినా పలకరే అసలు?"
"
ఊ.."
"
ఇందాకటి నుంచీ నేను గొంతు చించుకుని మరీ చెప్పేది మీరేమన్నా ఆలకిస్తున్నారా?"
"
ఊ.."
"
అసలు నిన్న మీకేం చెప్పాను.. ఆ పని చేసుకొచ్చారా?"
"
ఊహూ.."
"
మీరేం మనిషండీ బాబూ.. కనీసం ఒక్కసారన్నా నేను చెప్పిన పని చెప్పినట్టు చేసుకొచ్చారా?"
"
ఊహూ.."
"
సరేలే.. భోజనంలోకి గుత్తి వంకాయ కూర చేసాను. సరిపోతుంది కదా.."
"
ఊ.."
"
ఓ పక్కనుంచి శోష వచ్చేలా నేనింతలా మాట్లాడుతుంటే మీరేం బదులివ్వరేంటండీ.. మూగవారైపోయారా ఏంటి??"
"
ఊ.."
"
ఈ మధ్యన మీరు చాలా మొద్దుమొహంలా తయారవుతున్నారండీ.. ఆ సంగతేమన్నా తెలుస్తోందా?"
"
ఊ.."
"
రెండేళ్ళుగా చూస్తున్నాను.. మీకు 'ఊ.. ఊహూ' తప్ప వేరే మాటలేవీ నేర్పించలేదాండీ మీ ఇంట్లో వాళ్ళు?"
"
ఊహూ.."
"
అసలు పెళ్ళి కాకముందు ఎన్నేసి మాయ మాటలు చెప్పారండీ.. అంటే అవన్నీ అబద్ధాలే కదూ?"
"
ఊ.."
"
అంటే నిజంగా అబద్ధాలు చెప్పారు అనేనా??"
"
ఊ.."
"
నా మీద మీకు బొత్తిగా ప్రేమ లేకుండాపోయింది కదూ?"
"
ఊ.."
"
అసలు నాతో మాట్లాడటం కూడా మీకు నచ్చట్లేదు కదూ!"
"
ఊ.."
"
చీ చీ.. మీ మాయ మాటలు నమ్మి మిమ్మల్ని పెళ్ళాడటం నాదే బుద్ధి తక్కువయ్యింది.."
"
ఊ.."
"
హూ..నా ఖర్మ కాకపోతే... అయినా మీలాంటి మనిషితో ఇంక మాటలనవసరం.."
"
ఊ.."
"(*&&^%^$
£(&*($£&($%*£"
"^&*(%*(
£%^$&**)(^%&$£"

ఏదో వస్తువు నేల మీద పడి భళ్ళున బద్దలైన శబ్దం..

"
ఓ.. అయ్యయ్యో.. కింద ఎలా పడిపోయింది? సర్లే.. పోతే పోయిందిలే.. నువ్వేం బాధపడకు.. ఇంతకీ మీ ఫ్రెండ్ స్నేహ ఏమంది అప్పుడు.. చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేసావేంటి?"
"................
tension"


ఈ టపా వెనక ఉన్న చిన్న పిట్ట కథేంటంటే మన శిశిర ఉంది కదా.. అదేనండీ.. తన 'ఎదసడి' ని మధురంగా తన అక్షరాల్లో నింపి మనకి వినిపిస్తూ వుంటుందే.. ఆ శిశిర.. తను చిన్నప్పుడు బాగా విన్న పాట ఒకదాని కోసం వెతుకుతూ మీకేమైనా తెల్సా అని నన్ను అడిగారు. "ఊ అనూ.. ఊహూ అనూ.." అని మురళీకృష్ణ సినిమాలోని పాట అది. అయితే తను వెతికినప్పుడు దొరకలేదట. దానిక్కారణం ఏంటంటే, ప్రేమలో ఊ ఉంటుంది గానీ ఊహూ ఎందుకుంటుందిలే అనుకున్నారట తను. అయితే నేనీ పాట వెతికి పంపాక "అయితే ప్రేమలో ఊహూ కూడా ఉంటుందా.. అదెలాగో మీరే చెప్పాలి మధురా.." అన్నారు సరదాగా. అది చూసి నవ్వుతున్నప్పుడు వచ్చిన సరదా ఆలోచనే ఈ టపా అన్నమాట! :)

అమ్మాయ్.. శిశిరా.. ఇప్పుడు అర్థమైందా.. ప్రేమలో ఊ లు, ఊహూ లు రెండూ ఉండే అవకాశం ఉందని.. :)