Saturday, November 15, 2008

నీ ప్రశ్నలు నీవే.. ఎవ్వరో బదులివ్వరుగా..! నీ చిక్కులు నీవే.. ఎవ్వరో విడిపించరుగా..!

హాయ్ హాయ్..
పైన వాక్యాలు చూశారుగా.. చాలా బావున్నాయి కదా..! ఇవి ఒక పాట ప్రారంభపు వాక్యాలు. మొదలే ఇలా ఉంది ఇంక పాట మొత్తం ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా..! నిజంగానే చాలా బావుంటుంది. మధ్యనే విడుదలైన 'కొత్త బంగారు లోకం' అనే సినిమాలో సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన మరో అమృత బిందువు పాట. పాటను SPబాలసుబ్రమణ్యం గారు అత్యద్భుతంగా ఆలపించారు. అసలు ఆయన పాడడం వల్లనే పాటకి అంత అందమొచ్చింది అనడం సరియైన మాట. మిక్కీ జె మేయర్ సంగీతం కూడా బాలు గారి గాత్రానికి తోడయి ఇంకా వినసొంపుగా ఉంది. సినిమాలో ఏదో సన్నివేశపరంగా పాట రాసి ఉండవచ్చు. కానీ, పాట వింటుంటే.. మనలో ప్రతీ ఒక్కళ్ళకీ.. మన మనసును తట్టి చెప్తున్నట్టుగా ఉంటుంది. పాటలో ప్రతీ ఒక్క వాక్యం ఒక జీవిత సత్యం. నేను చెప్పడం ఎందుకులే గానీ..మీరే ఒకసారి చూడండి పాట సాహిత్యాన్ని.



నీ ప్రశ్నలు నీవే.. ఎవ్వరో బదులివ్వరుగా..!
నీ చిక్కులు నీవే.. ఎవ్వరో విడిపించరుగా..!
గాలో నిన్ను.. తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో.. తెలియదంటే చెల్లదుగా..!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..!
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక వుంటుందా..!

బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..!
పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..!
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..!
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా..!

వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే జువేముంది..
సుడిలో పడు ప్రతి నావా.. చెబుతున్నది వినలేవా..!

పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొ పుటగా తన పాఠం వివరిస్తుందా..!
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా..!

కడతేరని పయనాలెన్ని.. పడదోసిన ప్రయాలెన్ని..
అని తిరగేసాయా చరిత పుటలు.. వెనుచూడక ఉరికే జతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు..
ఇది కాదే విధి రాతా.. అనుకోదేం ఎదురీతా..!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..!
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగానంపక వుంటుందా..!

బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..!
పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..!
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!


1 comment:

వేణూశ్రీకాంత్ said...

వాణి గారు మీ బ్లాగ్ బాగుందండీ... పాట సాహిత్యం ఇస్తూ కాస్త పరిచయం ఇంకా మరోచరిత్ర లాంటి మంచి సినిమాల గురించి పరిచయం వీటితో పాటు అప్పుడప్పుడూ కార్టూన్ లూ వెరసి మంచి సరదాగా ఉంది... Keep going.