Sunday, November 02, 2008

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..!! కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..!!!

హాయ్ హాయ్...
ఈ వేళ మీ అందరి కోసం మరో కొత్త కోయిల స్వరం మోసుకొచ్చాను. అది కూడా 'ఆవకాయ బిర్యాని' సినిమాలో నుంచే..!
ఇదివరకే రెండు స్వరాలని గురించి మీకు చెప్పాను కదా...ఇది మరోటి అన్నమాట. సినిమా ఒక పల్లెటూరులో ఆవకాయ చేసి అమ్ముకునే అమ్మాయికీ, ఆటో నడుపుకునే అబ్బాయికీ మధ్యన జరిగే ప్రేమ కథ అని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. ఈ పాట వింటే మనకి కొంత వరకు ఆ సంగతి అర్ధం అవుతుంది. అమ్మాయిని, ఆవకాయ తో పోలుస్తూ ఒక సరి కొత్త ప్రయోగం చేసారు ఈ పాటలో రచయిత వనమాలి గారు. పాటని సైంధవి అనే కొత్త అమ్మాయి పాడింది. ఈ పాటలో చెప్పుకోవాల్సింది...అబ్బాయి పాడే వాక్యాల గురించి. సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి స్వయంగా పాడారు. మనకి పాట వినగానే అబ్బాయి గొంతు చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంది అనిపిస్తుంది. అసలు ఈ పాటకి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది కూడా ఆ గొంతే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, వనమాలి గారు అందించిన సాహిత్యం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా, inspirational గా ఉంది. అటు సంగీత పరంగా గానీ, సాహిత్యపరంగా గానీ ఈ పాట ఎంత బావుందో మీరే ఒకసారి విని చూడండి .

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది.. కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ..!

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది.. కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ..!

కొత్తావకాయే తనకంటి ఎరుపాయే... ముంగిళ్ళలో.. మురిపాలే మూతి విరుపాయే.. కారాలు నూరే.. సందళ్ళు కొలువాయే.. కాలాలు మారే కథలే ఇక మొదలాయే..


గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..!!
కళ్ళల్లో
తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ...!!!

ఏ నదితో ఏ వైరం..ఈ నావను వెంటాడిందో.. ఒంటరిగా చేరిందీ తీరం.. గుండెల్లో ఈ భారం..ఎందాకా నడిపిస్తుందో..తేల్చదుగా ఎన్నటికీ దూరం..
దారే పూలే పరిచీ కడదాకా.. నిన్నే రమ్మంటే.. చేరే గమ్యం ఎంతో గొప్పైనా.. అర్థం ఉంటుందా..! పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదౌతుందా.. తెగువే ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాదా..!

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..!!
కళ్ళల్లో
తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ...!!!

ఏ ఓటమి ఎదురైనా..ఆశే మీ వెన్నంటేనా.. వేకువకై పరుగే ఆగేనా..! చినుకల్లే మొదలైనా..చిగురించిన పరిచయమేదో..చివరికి ఆ సంద్రంగా మారేనా..!
నింగీ నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా.. పొంగే వానే వంతెన వేసిందా.. ఆ కల నిజమవదా..! ఏనాడు కలవని దిక్కులు కలిసిన వింతలు కంటికి ఎన్నో కనబడలేదా..! చీకటి వెలుగులు గీసిన చిత్రం నీదే..!!!

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..!!
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..
.!!!

No comments: