Sunday, November 16, 2008

ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా.. ఎవరున్నారని నీలా నాకైనా..!

హలో హలో..
ఇప్పుడు మీ అందిరికీ మరో కొత్త కోయిల స్వరాన్ని వినిపించబోతున్నాను. నేను మధ్యనే పాటని విన్నాను. పాట బావుందనిపించింది. అందుకే మీతో కూడా ఒక మాట చెప్దాం అనిపించింది. ఇంతకీ పాట పల్లవి పైన పేరులో చూశారుగా.. అదే.. "ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా.. ఎవరున్నారని నీలా నాకైనా..!". పాట మధ్యనే రిలీజ్ అయిన 'యువత' అనే సినిమాలోనిది. 'హ్యాపీ డేస్' చిత్రంలో రాజేష్ గా అందరినీ ఆకట్టుకున్న నిఖిల్ సిద్ధార్థ్ సినిమాలో కథానాయకుడు. కొత్త అమ్మాయి అక్ష హీరోయిన్ గా నటించింది. యువత స్నేహం, ప్రేమ చుట్టూ కథను అల్లారు దర్శకులు పరశురామ్. దర్శకుడిగా ఆయనకిదే తొలి చిత్రం. సినిమాకి సంగీతం మణిశర్మ, సాహిత్యం కృష్ణ చైతన్య అందించారు. మృదువుగా సాగిపోయే ప్రేమ గీతాన్నిహేమచంద్ర, హరిణి చాలా బాగా పాడారు. సాహిత్యం కూడా బావుంది. మీరూ ఒకసారి చూడండి. మెల్లగా సాగిపోయే మెలోడీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది.



ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నీలా నాకైనా..!
ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నాలా నీకైనా..!


గాలై నిను తాకెయ్ నా .. నిప్పై నిను కాల్చెయ్ నా..

వానై నిను తడిపెయ్ నా.. తడిసే వయసున..

ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నీలా నాకైనా..!


మగువా.. తగువా.. మాటల గొడవా..
చనువా.. చొరవా.. ఆట..

అలవా.. వలవా.. అలలో జడివా..
వినవా వినవా నా మాట..!


తడి ఆరని బాటని దాటనీ.. అణువణువుని నేనే అనీ..
చేరని నీడని తాకనీ.. తనువున తడి తానే అనీ..
నును వెచ్చని శ్వాసని నేననీ.. వణికిన చలిలో రానా..!
తను మెచ్చిన నా మది లేదనీ.. నలువైపులా తానేననా..!


గాలై నిను తాకెయ్ నా .. నిప్పై నిను కాల్చెయ్ నా..

వానై నిను తడిపెయ్ నా.. తడిసే వయసున..

కలతా.. వనితా.. కలలా కవితా..
చరితా.. భవితా.. నీవేగా..!
జనతా.. యువతా.. తిడితే పడతా..
చెడితే చెడతా.. నేనేగా..!


సుడిగాలిని రివ్వని రాకనీ.. తన మొర విని పోవే అనీ..
నాదని నీదని ప్రేమనీ.. ఎవరెవరిని అంటారనీ..
పసిపాపని కానని తానని.. అలిగిన చెలి లోలోన..
చెలి తాకని చూపుని దాచనీ.. కలిగిన గిలి నాదేనా..!


గాలై నిను తాకెయ్ నా .. నిప్పై నిను కాల్చెయ్ నా..
వానై నిను తడిపెయ్ నా.. తడిసే వయసున..


ఎవరున్నారని నాకైనా.. ఎవరున్నారని నీకైనా..
ఎవరున్నారని నీలా నాకైనా..!



No comments: