Wednesday, August 24, 2011

నీ జ్ఞాపకం!


మొదటిసారి మన మధ్య మాట కలిసి స్నేహం కుదిరిన చోటు జ్ఞాపకమే!
మోమాటంతో ఆలోచించి ఆచితూచి పొదుపుగా నువ్వాడిన మాటలు జ్ఞాపకమే!
నీ స్నేహంలోని స్వచ్ఛతకి నా పెదవులపై విరిసిన మల్లెల నవ్వులు జ్ఞాపకమే!
నే చెప్పే కబుర్లు శ్రద్ధగా వింటూ మౌనంగా కళ్ళతోనే నవ్విన క్షణాలు జ్ఞాపకమే!
నీ మాటల్లో పదే పదే తొంగి చూసే అద్దం లాంటి నీ మనసు జ్ఞాపకమే!
నీ గుండెల్లో దాగున్న ఆపేక్షనంతా అక్షరాల్లో నింపి నా దోసిట్లో ఒంపిన రోజు జ్ఞాపకమే!
నను కళ్ళెత్తి సూటిగా చూడనివ్వని నీ చురుకైన చూపులు జ్ఞాపకమే!
మౌనంగా ఊసుల్ని పంచుతూ నా చూపుని కట్టి పడేసే నీ అరనవ్వు జ్ఞాపకమే!
నీ పక్కన నడుస్తున్నప్పుడు తొలిసారి నా గుండె లయ తప్పిన అనుభవం జ్ఞాపకమే!
నా అరచేతిలో వెచ్చగా ఒదిగిపోయి నను మురిపించిన నీ చేతి స్పర్శ జ్ఞాపకమే!
చివరిసారి భారంగా నను వదిలి వెళ్తున్నప్పుడు నీ కళ్ళల్లో మెరిసిన తడి తెరలు జ్ఞాపకమే!
మొత్తంగా నువ్వు నాకు పంచి ఇచ్చిన ప్రతీ క్షణం నాకెన్నటికీ మరపురాని మధుర జ్ఞాపకమే!

21 comments:

ఫోటాన్ said...

మీ అనుభూతులు అక్షరమై జ్ఞాపకానికే జ్ఞాపకం గా నిలిచాయి....
ప్రతి రోజు పోస్ట్ రాసేస్తే మీకేం బాగానే వుంటుంది... పదాలు తెలియని నాలాంటి వాళ్లకు ఏం కామెంటాలో తెలియక పిచ్చోల్లైపోతే అందుకు మీరే బాధ్యులు... :)

--
హర్షం

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

మీ మధుర జ్ఞాపకాలు అన్నీ బహు అద్భుతం....

ఇందులో నాకు బాగా నచ్చిన జ్ఞాపకాలివి :)
//నీ గుండెల్లో దాగున్న ఆపేక్షనంతా అక్షరాల్లో నింపి నా దోసిట్లో ఒంపిన రోజు జ్ఞాపకమే!//
//నను కళ్ళెత్తి సూటిగా చూడనివ్వని నీ చురుకైన చూపులు జ్ఞాపకమే! //

Sravya V said...

బావుదండి , నాకు అదేదో పాట ఉంటుంది కదా ఏంటో సరిగా గుర్తు రావటం లేదు కాని "జ్ఞాపకమే " అని ఆ పాట గుర్తొచ్చింది ఇది చదువుతుంటే !

వేణూశ్రీకాంత్ said...

కొన్ని ఙ్ఞాపకాలు చాలా బాగున్నాయ్ మధురా..
శ్రావ్య గారు నాకు రాజా సినిమాలోని "ఏదో ఒక రాగం" పాట గుర్తొచ్చింది మీరు చెప్పింది కూడా అదేనా :)

Sravya V said...

వెణు గారు అదే అదే ఆ పాటే :)))

Amarendra Reddy Sagila said...

Madhura garu, baavundi....

కృష్ణప్రియ said...

చివరిసారి భారంగా నను వదిలి వెళ్తున్నప్పుడు నీ కళ్ళల్లో మెరిసిన తడి తెరలు జ్ఞాపకమే! **** :-(

కొత్తావకాయ said...

:) nice

Raj said...

heart touching...

గిరీష్ said...

Super lines..

naa pere nagu...parledu chadhavavachu said...

talented...

gayatri said...

super :):):)

Santosh Reddy said...

జ్ఞాపకాల దొంతేరని వోలికించి
మీ మదిలో భావాలు పలికించి
"మధుర "మైన ఈ పాటను రచించి
నా గుండె లోతులుని స్పృశించి
నా కంటిలో దాగిన జల్లుని రప్పించి(న)......మీకు నా వందనాలు ....!!!

Oka Nestam said...

Chaala Chaala baagundi....mee perantha madhuram ga undi....
--FRIEND

Anonymous said...

Excellent! You are too good.

Kamalaker said...

Heart touching.....

Sriharsha said...

nice eppati lagane....

kiran said...

మొదటి సారి నీ బ్లాగ్ చూసి ఆశ్చర్యం తో నోరు తెరచిన నా మొహం జ్ఞాపకమే..
కొన్ని వందల సార్లు చూసినా ప్రతి సారి ఆ నోరు తెరుచుకోడం ఆశ్చర్యమే...
kevvvvvvvvvvvvvvvvv....కిరణ్ కవిత రాసిందిఈఈఈఈఇ :))))

జ్యోతిర్మయి said...

ఎదలో దాగిన .....ఏవో ... జ్ఞాపకాలు కదిలిన సవ్వడి వినిపిస్తోంది మధుర గారూ....

మధురవాణి said...

@ హర్షా,
బాబోయ్.. చాలా పెద్ద పొగడ్త ఇచ్చేసారుగా.. థాంక్యూ సో మచ్! :)

@ అవినేని భాస్కర్, అమరేంద్ర, కొత్తావకాయ, రాజ్, గిరీష్, నాగు, గాయత్రి, ఒక నేస్తం, అనానిమస్, కమలాకర్, భారతీయ...
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.. :)

@ శ్రావ్య, వేణూ..
నిజమే కదా.. రాసేప్పుడు నాకు తట్టనే లేఉద్.. మీరు చెప్పాక గుర్తొచ్చింది.. ఆ పాట చాలా బాగుంటుంది.. థాంక్యూ! :)

మధురవాణి said...

@ కృష్ణప్రియ,
హుమ్మ్.. :)

@ సంతోష్ రెడ్డి,
భలే చిట్టి కవిత చెప్పేసారే! అయితే నా అక్షరాలు మీ జ్ఞాపకాల దొంతర కదిలించాయంటారు.. :) ధన్యవాదాలు!

@ కిరణ్,
హహ్హహ్హా... కిరణూ... నువ్వు కేకగా అసలు.. :)))) థాంక్యూ సో మచ్!

@ జ్యోతిర్మయి,
జ్ఞాపకాల సవ్వడి వినసొంపుగానే ఉంటుంది కదండీ.. కాసేపా సంగీతాన్ని ఆస్వాదించెయ్యండి మరి! :)