Wednesday, August 03, 2011

నా జడగంటల మంత్రం!

నాకు చిన్నప్పటి నుంచీ పట్టీలన్నా, జడగంటలన్నా చాలా చాలా ఇష్టం.senyum అబ్బో.. ఈ మాత్రం ఇష్టం ఏ తెలుగమ్మాయికైనా ఉంటుందిలేవోయ్ అనుకుంటున్నారా.. అవుననుకోండి.. అయినా సరే, నాకు ఊహ తెలీనప్పటి నుంచే బోల్డు ఇష్టం అన్నమాట! మా అమ్మ చెప్తూ ఉంటుంది.. నేనింకా నెలల వయసులో ఉన్నప్పుడే నా కోసం మొదటిసారి పట్టీలు కొనుక్కొచ్చి పెట్టారంట ఒక రోజు. ఆ పట్టీలు పెట్టుకున్న ఆనందంలో ఆ రోజే నడిచేసానంట నేను.malu అసలు అంత బుల్లిగా ఉన్నప్పుడే అంత తొందరగా ఒక్క రోజులోనే నడిచెయ్యడం చూసి చాలా ఆశ్చర్యపోయారంట ఇంట్లో అందరూ..rindu మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఈ సంగతి.. నువ్వసలు చాలా తొందరగా నడిచేసావ్.. తొందరగా మాటలు నేర్చేసుకున్నావ్.. అన్నీ గబగబా నేర్చేసుకున్నావ్ అంటుంది. చిన్నప్పుడు ఇసుకలో ఆడుకుంటూ బోల్డుసార్లు పట్టీలు పారేసుకునేదాన్ని. పాపం మళ్ళీ మళ్ళీ మా అమ్మ కొనిచ్చేది. చిన్నప్పటి నుంచీ ఎప్పుడూ పట్టీలు లేకుండా లేను అసలు. స్కూల్ దాటే వయసొచ్చాక మాత్రం నాకు పట్టీలు కొనాలంటే మా అమ్మకి నీరసం వచ్చేది. అసలు ఆ షాపు వాడి బుర్ర తినేసేదాన్ని నేను. ఇంత సన్నగా ఉండాలి, ఇలాంటి మువ్వలు ఉండాలి, ఈ డిజైన్ ఉండాలి, ఇంత సన్నంగా ఉండి, ఆ మువ్వలతో ఇలాంటి డిజైన్ ఉందా.. అంటూ షాప్ వాడికి కూడా పిచ్చెక్కించేసే దాన్ని. నిజానికి నాకు నగలు, బంగారం అలాంటివి పెద్ద ఆసక్తి ఉండదు. మా అమ్మ స్నేహితులందరూ "ఆహా.. నీకెంత అదృష్టమో.. మీ అమ్మాయికి బంగారం మీద మోజే లేదు.. అస్సలు అది కావాలీ ఇది కావాలీ అని అడగదు.." అంటూ ఉంటారు.encem అయితే, మిగతా ఏం పట్టించుకోని నేను మాత్రం పట్టీల విషయంలో చాలా గారం చేసేదాన్ని. వేరే ఏం అడగను కాబట్టి మా అమ్మ పాపం భరిస్తూ ఉంటుంది ఇప్పటికీ ఈ విషయంలో. మళ్ళీ ఏదో ఒక జత ఉంటే సరిపోదు.. బోల్డు రకాల పట్టీలు కావాలన్నమాట నాకు.. వెండివి, బంగారు రంగులో ఉండే పంచాలోహాలవి అనో ఏదో అంటారు అవీ, ఫ్యాన్సీ వి, పూసలు ఉండేవి, బోల్డు రకాలు కొనుక్కున్నేదాన్ని. హుమ్మ్.. ఇక్కడికొచ్చాక పట్టీలు పెట్టుకునే అవకాశం పోవడం నాకు చాలా చాలా బెంగగా అనిపించే విషయం.

అలాగే నాకు జడ గంటలన్నా కూడా మహా ఇష్టం. నాకు జడగంటలతో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప జ్ఞాపకం ఉంది.sengihnampakgigi అప్పుడు నాకు ఎనిమిదేళ్ళ వయసుంటుంది. నాలుగో తరగతిలో ఉన్నా. మా స్కూల్లో ఏదో సాంస్కృతిక కార్యక్రమాల కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే, స్కూల్ వార్షికోత్సవం లాంటిదన్నమాట. పెద్దయ్యాక అంత కళాపోషణ లేకుండాపోయినా ఆ వయసులో చాలా ఉత్సాహంగా పాల్గొనేదాన్ని నేను. అయితే ఏదో డ్యాన్స్ కోసం లంగా వోణీలు వేసుకుని జడగంటలతో జడ వేసుకోవాలన్నమాట.. అప్పటికి ఇంకా రెండు రోజులు టైం ఉంది అసలు కార్యక్రమానికి. ఈ లోపు మేమందరం చాలా శ్రద్ధగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. పనిలో పనిగా ఎవరెవరు ఏ రంగు లంగా వోణీలు వేసుకుంటున్నారు, లేకపోతే ఎవరిని అడిగి తెచ్చుకుంటున్నారు.. లాంటి చర్చా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంతలో నాకు జడ గంటలు లేవన్న సంగతి గుర్తొచ్చింది.gigil అరెరే.. ఇప్పుడెలా.. ఎవరిని అడిగి తీసుకోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా.. ఒక స్నేహితురాలు ఆపద్బాంధవురాలిలాగా నా కష్టం తెలుసుకుని నన్ను కరుణించి.. నువ్వేం బెంగ పెట్టుకోకు.. నీకు జడగంటలు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. అంది. సరేలే.. ఇంత ఇదిగా చెప్తోంది కదా అనుకుని హమ్మయ్యా అనుకున్నా నేను. తర్వాత రోజు తను నా దగ్గరికొచ్చి "నీకోసం జడ గంటలు దొరికేసాయి. మనం వాళ్ళింటికి వెళ్ళి తెచ్చుకుందాం ఇవ్వాళ" అని చెప్తే సరే అన్నా నేను.

మేమిద్దరం కలిసి బయల్దేరాం. ఎవరింటికి అని అడగలేదు నేను అప్పటిదాకా.. తీరా బయలుదేరాక మా వీధిలోకే తీసుకెళ్ళింది. మా వీధిలో నాకు తెలీకుండా ఎవరబ్బా అని నేను ఆలోచనలో ఉండగా ఒక ఇంటి వాకిలి ముందు ఆగం ఇద్దరం. పద లోపలికి వెళ్దాం అంది తను. ఆ ఇల్లు ఎవరిదో చూసాక నాకు పై ప్రాణాలు పైనే పోయాయి.sedih అది మాకు చాలా దగ్గరి చుట్టాల ఇల్లు. వరసకి పెదనాన్న అవుతారు. వాళ్ళ అమ్మాయి అంటే నాకు అక్క వరస అయ్యే అమ్మాయి దగ్గర జడ గంటలు తీస్కోడానికి వెళ్ళామన్నమాట మేము. అందులో పెద్ద ట్విస్ట్ ఏముంది అనుకుంటున్నారా.. చాలా పెద్ద ట్విస్టే ఉంది మరి.. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలదు. వాళ్ళకి, మాకూ మాటలు లేవన్నమాట. వాళ్ళింటి ముందు రోడ్డు మీద కూడా మేము ఒక్క క్షణం అయినా నిలబడే వాళ్ళం కాదు. వాళ్ళింటి వైపు చూసినా, వాళ్ళ పిల్లలతో మాట్లాడినా మా ఇంట్లో తెలిస్తే జాతర జరిగిపోతుంది. అదీ చిక్కు. నాకైతే కాళ్ళల్లో వణుకు వచ్చేసింది. నేను రాను లోపలికి. నేను గానీ వీళ్ళింటికి వచ్చాను, పైగా జడ గంటలు కూడా తీసుకున్నాను అని మా అమ్మకి తెలిస్తే నా వీపు విమానం మోత మోగిస్తుంది..marah నాకేం వద్దు..takbole నేను వెళ్ళిపోతా అని బిక్క మొహం వేసా నేను. నా స్నేహితురాలేమో ససేమిరా ఒప్పుకోకుండా.. "అబ్బా.. నువ్వు మరీ ఎక్కువ భయపడిపోతున్నావ్.. అయినా, మీ అమ్మకి ఎందుకు తెలుస్తుంది.. ఎలా తెలుస్తుంది.. మనం రేపొద్దున్న జడ గంటలు తీసుకుని రాత్రికి మన డ్యాన్స్ అయిపోయాక తనవి తనకి తిరిగి ఇచ్చేస్తాం. అంతే కదా! ఇందులో పెద్ద ఘోరం నేరం జరిగిపోయేది ఏముంటుంది. నేను చెప్తున్నా కదా విను.. నువ్వు నడువు ముందు" అని చాలా మొహమాట పెట్టేసింది. అప్పటికీ నా భయం పూర్తిగా పోలేదు. అంతలోనే నాకో అతి తెలివి అయిడియా తట్టింది. "మాకూ, వాళ్ళకి మాటలు లేవు కదా.. అందుకని నేను వాళ్ళింటి లోపలికి వచ్చి అడగను గానీ, నువ్వే వెళ్ళి అడిగి తీస్కుని రా.. మళ్ళీ నువ్వే తిరిగి ఇచ్చేద్దువు గానీ.." అన్నాన్నేను. సరేలే అని పాపం నా స్నేహితురాలు నాకోసం తనే వెళ్ళి అడిగి వచ్చింది. రేపొద్దున్నే వచ్చి తీసుకుంటాం అని చెప్పాను అంది. హమ్మయ్యా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నా నేను. కానీ, అప్పుడు నాకు తెలీలేదు ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్స్ ఫెస్టివల్ అని..encem

ఆ తర్వాత రోజు.. ఆ రోజు రాత్రికే మా డ్యాన్స్ ప్రోగ్రాం. అయితే, అందరం కలిసి జడలోకి పువ్వులు సమకూర్చుకునే పనిలో భాగంగా ఎవరింట్లో పువ్వులున్నా అన్నీ కోసుకొచ్చి, ఎవరితోనో ఒకరితో కట్టించుకుని సాయంత్రానికి సిద్ధం చేసుకునే పనిలో హడావిడిగా ఉన్నాం. ఈ లోపు నా స్నేహితురాలు అన్నమాట ప్రకారం నాకోసం మా పెదనాన్నగారమ్మాయి దగ్గరి నుంచి జడగంటలు అడిగి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత మా ఫ్రెండు పద్మ వాళ్ళింట్లో ఇంకా బోల్డు కనకాంబరాలు ఉన్నాయి. అందరం కలిసి అక్కడికి వెళ్ళి అవి కూడా కోసుకుని అక్కడే మాలలు కట్టించుకుని ఎవరివి వాళ్ళు తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. పద్మ వాళ్ళింటి ముందు పందిరి కింద ఒక మంచం వాల్చి అందరం స్కూల్ బ్యాగులూ అవీ దాని మీద పడేసి, కనకాంబరం పూలు కోసే పని పూర్తి చేసి, ఆ మంచం మీదే కూర్చుని మాలలు పూల కట్టించుకుని తీస్కుని ఎప్పటికో మధ్యాహ్నం దాటాక ఎవరిళ్ళకి వాళ్ళం బయలుదేరాం..

ఆ రోజు సాయంత్రం తీరిగ్గా డ్యాన్స్ ప్రోగ్రాం కోసం రెడీ అవ్వడానికని అన్నీ సర్దుకుంటూ జడ గంటల కోసం చూసుకుంటే అవి కనిపించలేదు. ఎంత వెతికినా ఎక్కడా లేవు. నాకు గుండె జారిపోయింది. వెంటనే నా స్నేహితులందరి దగ్గరికీ వెళ్ళి పొద్దున్న నేను తీసుకున్న జడగంటలు కనిపించట్లేదు.. ఎక్కడో పోయాయి. మీకేమన్నా కనిపించాయా అని ఏడుపు మొహంతో అడిగాను అందరినీ.. అందరూ నాకు తెలీదంటే నాకు తెలీదన్నారు.garupale ఇంక అప్పుడు చూడాలి నా మొహం. ఏడుపు తన్నుకొచ్చేస్తోంది..nangih అదేదో నా సొంత జడగంటలైనా అంత బాధ ఉండకపోను.. పోనీ, తీసుకున్నది కూడా ఎవరి దగ్గర.. మాకు బద్ధ శత్రువుల్లాగా భావించే వాళ్ళ దగ్గర. ఇప్పుడీ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద కురుక్షేత్రం జరుగుతుందోనని తల్చుకుని ఊహించుకుని నాకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. అదేదో సినిమాలో ఎంటీవోడి లాగా అహో.. ఈ డ్యాన్స్ ప్రోగ్రాం వచ్చినదిపో, జడగంటలు కావలనేలా.. కావలెను పో.. నేను ఎవరివో అడుగుట ఎలా.. అడిగితిని పో.. అది అస్మదీయులే అగుట ఎలా..adus ఈ టైపులో నా బాధ వర్ణనాతీతం అయిపోయింది.. ఆ బాధలోనే, ఏడుపులోనే జడగంటలు, గాడిద గుడ్డూ ఏవీ లేకుండానే ఏదో తూతూ మంత్రంలాగా నా డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయింది అనిపించేసా! gigil

ఆ తతంగం అంటే ఎలాగో అయిపోయింది సరే కానీ.. నాకు మాత్రం అప్పుడే మొదలయ్యింది అసలు కథ! ఇప్పుడు వాళ్ళ జడగంటలు వాళ్ళకి వెనక్కి ఇచ్చెయ్యాలి. ఎలా అన్నదే సమస్య.soal నాకు ఎంత ఆలోచించినా ఏ ఉపాయమూ తోచట్లేదు.. అలా ఒక రెండు రోజులు సరిగ్గా తిండీ నిద్రా కూడా లేకుండా నాలో నేనే తెగ మథనపడిపోయా.gigil పక్క నుంచి మా పెదనాన్నగారమ్మాయి తన జడగంటలు తిరిగిమ్మని నా స్నేహితురాలిని అడుగుతోంది. లేకపోతే పాపం మరి వాళ్ళమ్మ చేతిలో తనకి ఉంటుంది కదా వాయింపు. చివరికి నాకున్న ఒకే ఒక్క దారి ఇంట్లో చెప్పెయ్యడమే అని అర్థం అయ్యింది. ఎలా చెప్పాలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాను.nerd పదే పదే మా అమ్మ వెనకాలే తిరుగుతూ, తన మొహంలోకి చూస్తూ తనకి విషయం చెప్పాక నన్ను ఎలా ఉతికేస్తుందా అని ఊహించడానికి ప్రయత్నం చేస్తూ ఉండిపోయా.fikir

ఈ లోపు నాకు బోల్డు ధైర్యం వచ్చే మార్గం ఒకటి దొరికింది. అదేంటంటే, మా అమ్మమ్మ పరమ భక్తి పరాయణురాలు కదా.. అంచేత తను రోజూ గుడికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆవిడకి గుళ్ళో ఎవరో ఒక చిన్న కార్డ్ ముక్క ఇచ్చారు. అంటే, అదొక విజిటింగ్ కార్డ్ అంత సైజులో ఉంది. మా అమ్మమ్మ అది తీసుకొచ్చి నాకిచ్చి అందులో ఏం రాసుందో చదవమంది. మా అమ్మమ్మకి అప్పటికి చదవడం రాదు. ఇప్పుడు బాగా వచ్చులెండి. నేర్చేసుకుంది.senyum ఆ కార్డులో ఏముందంటే... మృత్యుంజయ మంత్రం అని హెడ్డింగ్ పెట్టి.. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.. ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్!.. అని రాసుంది. అది చదివేసి కార్డు వెనక్కి తిప్పి చూస్తే ఈ మంత్రాన్ని ప్రతీ దినమూ 108 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించినచో అన్నీ రకాల భయాలూ, బాధలూ, ఇబ్బందులూ, సమస్యలూ తొలగిపోవును.. అని రాసుంది. అంతే, అది చూడగానే నాకు జ్ఞానోదయం అయిపోయింది. నన్ను ఈ జడగంటల కష్టం నుంచి గట్టెక్కించగలిగే జ్ఞానజ్యోతి ఇదే ఇదే అనిపించింది.menari నేను యమా అర్జెంటుగా ఈ మంత్రం నేర్చేసుకుని 108 సార్లు చదివడం పూర్తి చేసి అప్పుడు జడగంటల విషయం అమ్మకి చెప్తే మంత్ర మహిమ వల్ల నన్నేం కోప్పడదు.. అని అద్భుతమైన ఆలోచన వచ్చింది నాకు.

వెంటనే నా దీక్ష ప్రారంభించేసి ఆ మంత్రం చదివేద్దాం అనుకుని గబగబా బట్టీ పట్టాను కష్టపడి. కానీ, భక్తి శ్రద్ధలతో అన్నారు కాబట్టి ఎందుకైనా మంచిది ఆ కార్డు ముక్క చూస్తూ ఒక్క పొల్లు పోకుండా చదివితే గానీ సత్ఫలితాలు రావేమో అన్న అనుమానం చేత ఇంక నేను ఆ కార్డు చేతిలో పెట్టుకుని చూస్తూ మంత్రపఠనం మొదలెట్టా.doa ఆ రోజేమో ఆదివారం. టైము తొమ్మిదో పదో అవుతుంటే మా అమ్మ రూలు ప్రకారం కుంకుడుగాయలు, మందారాకు కలిపి నాకు తలంటుపోయడానికి రెడీ అయిపోయి నన్ను రమ్మని పిలిచింది. నేనేమో 108 ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా అని నానా హైరానా పడిపోతుంటే తనేమో... తొందరగా రా.. నాకవతల బోల్డు పనుంది. అని గట్టిగా కేకేసింది. నాకేమో నా తపస్సు మధ్యలో ఆపడం ఇష్టం లేదు. ఇంక లాభం లేదనుకుని ఆ కార్డ్ ముక్క పట్టుకుని వెళ్ళిపోయా తలంటించుకోడానికి. గాబు దగ్గర పక్కన ఉన్న చిన్న పిట్టగోడ మీద ఆ కార్డ్ ముక్క పెట్టేసి కుంకుడు రసం కళ్ళల్లో పడుతుందని కూడా లెక్క చేయకుండా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి ఆ కార్డు ముక్క చూస్తూ తెగ జపించేస్తున్నా మంత్రాన్ని.doa

కాసేపటికి మా అమ్మకి అర్థమయింది ఏదో తేడాగా చేస్తున్నా అని.. ఏంటీ.. ఏం చదువుతున్నావ్.. ఆ కార్డ్ ముక్కేంటి.. అని అడిగేసింది. అప్పుడు నేను మహానటి సావిత్రిలా జీవించేస్తూ.. అంటే.. అమ్మా.. అదీ అమ్మమ్మ ఇచ్చింది. ఆ మంత్రం చదివితే బాధలన్నీ పోతాయంట.. అందుకని చదువుతున్నా.. అని చెప్పా.jelir దానికి బదులుగా మా అమ్మ నవ్వేసి.. ఉన్నట్టుండి నీకంత బాధలేం వచ్చాయ్ ఇప్పుడు.. ఏడ్చినట్టే ఉంది నీ భక్తి.. మరీ ఇంత ఇదిగా స్నానం చేస్తూ కూడా చదవక్కరలేదు. తర్వాత తీరిగ్గా చదువుకుందువులే.. ఇంక తలంటు అయిపోయింది.. నువ్వు తొందరగా స్నానం ముగించి ఇంట్లోకి రా.. అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటికి బతికిపోయాను.kenyit

ఆ తర్వాత నేను నా మంత్రపఠనంలో మునిగిపోయి ఉండగానే, మా అమ్మకి జడ గంటల విషయం తెలిసిపోయింది. మా పెదనాన్న గారమ్మాయికి ఇంట్లో వీపు విమానం మోత మొగిపోయి ఆ సౌండ్ ఎవరో మధ్యవర్తుల ద్వారా మా అమ్మ దాకా వినిపించేసింది.jelir అప్పటికే నా మంత్రపఠనం సంగతి కూడా చూసి ఉండటం వల్ల మా అమ్మకి నన్నేమీ అడక్కుండానే విషయం మొత్తం అర్థమైపోయింది. నేను చాలా భయపడుతున్నా అని కూడా తెలిసినట్టుంది. నన్నొక్కమాట కూడా అడగలేదు. ఆ పోయిన వెండి జడగంటల డబ్బులు అసలు కంటే ఇంకొంచెం ఎక్కువే వేసి మధ్యవర్తుల ద్వారా పంపించేసింది మా అమ్మ. ఆ మరుసటి రోజు మా నాన్న నాకోసం కొత్త వెండి జడ గంటలు కొనుక్కొచ్చి ఇచ్చారు.menari అప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయానో మాటల్లో చెప్పలేను.celebrate మంత్రమహిమ మరీ అంత గొప్పగా ఉంటుందా అని బోల్డు అబ్బురపడిపోయాను.rindu అప్పటికీ ఇప్పటికీ నాకొచ్చిన ఒకే ఒక మంత్రం అదొక్కటే!sengihnampakgigi

మా బంగారుతల్లికి జడగంటలు లేవనే కదా ఎవరివో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవి పోయాయని మనకి చెప్పలేక పాపం ఎంత భయపడిపోయిందో పిల్ల.. అని అమ్మా, నాన్న చాలా బాధపడ్డారనీ, అందుకే వెంటనే నాకోసం కొత్త జడగంటలు కొనిచ్చారని నాకు చాలా ఏళ్ళ తర్వాత గానీ తెలీలేదు.senyum ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వొస్తుంటుంది గానీ అమ్మా నాన్నా మాత్రం అప్పటి నా ఇబ్బందిని తల్చుకుని ఇప్పటికీ కొంచెం బెంగపడిపోతుంటారు.

27 comments:

Sravya V said...

మధుర వామ్మో మీ నమ్మకాలు మాములివి కావండి బాబోయ్ :))) మొత్తానికి ఆ జడగంటలు సంపాదించిన మాత్రం మాములిది కాదు :)))

కృష్ణప్రియ said...

:)
మంచి సస్పెన్స్ లో పెట్టారు.. ఏమైందో ఏంటో అని కష్టం మీద ఆఖరి లైన్లు చదవకుండా ఉండగలిగాను...

S said...

:)))

మనసు పలికే said...

హహ్హహ్హా.. మధురా.. సూపరుగా ఉంది నీ జడగంటల మంత్రం. నన్నైతే నిజంగా నా చిన్న తనానికి తీస్కెళ్లావు. అదేంటో, నీ టపాలు చూసిన ప్రతి సారీ, నాకు బోలెడు ఙ్ఞాపకాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అరే, నాక్కూడా ఇలాగే జరిగింది కదా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే. టపా మాత్రం సూపరు:)))

Vineela said...

అబ్బ నాకు కూడా పట్టిలే చాల ఇష్టం..వేరే ఈ ఆభరణం కన్నా. మీ లాగే నాది కూడా ఒకటే రెక్విర్మేంట్ లో..సన్న గ ఒక్కటే మువ్వలు తో వుండాలి చిన్ని మామిడి పిందె నాకు మరీ ఇష్టం..అదేంటో పట్టిలు పెట్టుకోకుండా ఇల్లు కదలని నేను ఇలా ఇక్కడ బోసి కాలు తో తిరుగుతున్నట్టు వుంటుంది.

హరే కృష్ణ said...

ఆహా అమ్మ నాన్నలు ఎంత మంచి వాళ్ళు
వాళ్ళ ప్రేమ గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే
సస్పెన్స్ తో మొదలెట్టి ఎన్టీ ఒడి సినిమా క్లైమాక్స్ సీన్ లో కరుణ రసం నిండిన పరోప జడగంటల కార సీన్ కళ్ళకి కట్టినట్టు చూపించేశారు
ఒక సూపర్ లైక్ :)

ఇందు said...

మధురా!! ఒక్కసారి అలా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయావ్! పట్టీలు,జడగంటలు,పరికిణీలు హ్మ్! ఏంటో కదా.... ఇప్పుడు అవన్నీ వేసుకోవాలన్నా వేసుకోలేం! :))

టపా చాలా బాగుంది మధురా! నీ పేరులాగే స్వీట్ గా :)

ఇందు said...

ఇప్పుడే కదా టపా పడింది...అపుడే కామెంట్సా? నేనే ఫర్స్ట్ కామెంట్ అనుకున్నా :(((

MURALI said...

నేనూ మంత్రం నేర్చుకోవాలి.

kosuru said...

paapam aa pedananna gari ammayi. mee tappuku tanu bali ayipoyindi!!!

ఆ.సౌమ్య said...

హహహ బావుంది నీ కథ...నాక్కూడా పట్టీలంటే చాలా ఇష్టంగా ఉండేది ఒకప్పుడు!

తృష్ణ said...

ఎంతా ఓపిగ్గా రాసావు మధురా..! నాకు పట్టీలంటే ప్రాణం. ప్రతి ఏడు కొత్త రకం మార్చేస్తూ ఉంటాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ అసలు పట్టిలు లేకుండా ఎప్పుడూ లేను..మీ టపా చదివి నేనూ ఏవో జ్ఞాపకాల్లోకి వెళ్పోయా..

తృష్ణ said...

జడగంటల మంత్రం...super..:)

శేఖర్ పెద్దగోపు said...

you are so lucky Madhura....

sunita said...

hahaha!baagundi. mari ippuDoovaesukunTunnaaraa?paTTeloo, jaDaganTalu?

రాజ్ కుమార్ said...

హహహ.. మంచి సస్పెన్స్ గా, సాఫీగా సాగిమ్దండీ ఈ పోస్ట్. మొత్తానికి కొత్త జడగంటలు కొట్టేశారన్న మాట.
మంత్రం ఎఫెక్ట్ బాగా ఉందన్నమాటా..;)

నైస్ పోస్ట్ అండీ..

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ మంత్రం ఒక్క జడగంటలకే పని చేస్తుందా? బంగారు వడ్డాణాలకి ఏమైనా మంత్రాలు ఉన్నాయా? ఉంటే దయ చేసి పంపించండి... ద.హ

వేణూశ్రీకాంత్ said...

హ హ హ భలే ఉంది మధురా.. అలా చిన్నప్పటి రోజుల్లోకి తీసుకు వెళ్ళిపోయారు.. సో స్వీట్ :-))

ఛాయ said...

మంచి పట్టున్న పోస్ట్. అందరి మనసు పట్టిలు మీరే లాగేసుకున్నారు. ఇప్పటికి ఎన్ని పోగేసుకున్నారు:) అదేనండి దాచుకున్నారు....

ఛాయ said...

అన్నట్లు గుళ్ళో అందని గంట పట్టిలు జడగంటలు పెట్టుకుని కొట్టిన జ్ఞాపకం గుర్తు తెచ్చారు!!

SJ said...

bagundandi mee jadagantala mantram...

kiran said...

హహహః....నువ్వు కేక మధుర...ఆ మంత్రం నీకు భలే సాయం చేసింది..:)
ఎంతైనా అమ్మ నాన్నలు ఎంత sweeto కదా...
నేనిక్కడ పాపం మా బుజ్జి మధుర కొట్టించుకున్దా అని చివరి వరకు tension పడుతూ చదివితే ..కథ సుఖాంతం ఐంది ..:)

మధురవాణి said...

@ శ్రావ్య,
హిహ్హిహ్హీ.. అంటే, మరి అది అప్పటి అమాయకత్వం అన్నమాట! అవును.. ఏ మాటకామాటే.. ఆ మంత్రానికి ఎంత శక్తి లేకపోతే అలా వెంటనే జడ గంటలు వచ్చేస్తాయి నాకు.. :))

@ కృష్ణప్రియ,
ఓహ్.. అంత టెన్షన్ పెట్టేసానా అయితే! :P

@ S,
:)))

@ మనసు పలికే,
థాంక్యూ అప్పూ.. నీకు నీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయా.. మరింకేం.. అవన్నీ చెప్పేసెయ్ మాకు.. ఎంచక్కా బుద్ధిగా వినేస్తాం! :)

@ వినీల,
హుమ్మ్.. ఏం చేస్తాం.. చివరికి పట్టీలు లేకుండా బతికే రోజులు కూడా వచ్చేశాయ్.. అని నిట్టూరుస్తూ ఉంటానండీ నేనూ మీ లాగే! :(

Ennela said...

పోస్ట్ చాలా బాగుంద్ మధురా...
అవునా! మీరెవ్వరూ పట్టీలు పెట్టుకోరా!..నా కాళ్ళకి పట్టీలు మట్టెలు నేను తియ్యనే తియ్యను...అలాగే వాటి తోనే సాక్స్ షూస్ వేసుకుంటా..(మీరూ ప్రయత్నించండి)

మధురవాణి said...

@ హరేకృష్ణ,
"పరోప జడగంటల కార సీన్"... ఆ.. హహ్హహ్హహా.. :)))
అవును.. అమ్మానాన్నల ప్రేమ గురించి మీరు చెప్పింది నిజం.. అలాంటి వాళ్ళ కడుపునా పుట్టడం ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టం అనుకుంటాను నేనైతే! :)

@ ఇందు,
థాంక్యూ స్వీట్ ఇందూ!
హుమ్మ్.. నాకూ అదే బెంగ.. అవన్నీ ఇప్పుడు కావాలన్నా వేసుకోలేం కదా! :(
హహ్హహ్హా.. నీకూ ఈ ఫాస్ట్ కామెంట్ సరదా ఉందా అయితే! :))

@ మురళీ,
అలాగే నేర్చేసుకోండి.. కానీ, జడగంటలు ఎవరి కోసం కోరుకుంటారు మరి? ;)

@ కోసూరు,
అంటే తను వాళ్ళమ్మకి తెలీకుండా చెయ్యలేదు కాబట్టి రిస్క్ తక్కువండీ.. ;)

@ ఆ.సౌమ్య,
థాంక్యూ సౌమ్యా.. అంటే ఏంటీ.. పట్టీలంటే ఇప్పుడు ఇష్టం లేదా? :(

మధురవాణి said...

@ తృష్ణ,
అయితే నా జడగంటల మంత్రం బావుందా! థాంక్యూ! :)
అదృష్టవంతులు మీరు.. నేనూ ఇండియాలో ఉన్నంత కాలం పట్టీల్లేకుండా అసలెప్పుడూ లేను.. ఇక్కడికొచ్చాకే కుదరట్లేదు.. :(

@ శేఖర్ పెద్దగోపు,
I feel so too! :)

@ సునీత,
థాంక్సండీ! ఉహూ.. ఇప్పుడేం వేసుకోట్లేదు.. అందుకే ఇలా తలచుకుంటున్నా చిన్నప్పటి రోజుల్ని.. :)

@ రాజ్ కుమార్, వేణూ శ్రీకాంత్,
థాంక్యూ ఫ్రెండ్స్.. :))

@ బులుసు గారూ,
మీరు ప్రయత్నించి నాకు చెప్పండి వడ్డాణాలకి ఈ మంత్రం పని చేస్తుందో లేదో! ;) :D

మధురవాణి said...

@ ఛాయ,
హహహ్హా.. మనసు పట్టీలైతే బోల్డు పోగేసుకున్నాను.. :))
నాక్కూడా ఆ జ్ఞాపకం ఉంది.. ఎగిరేప్పుడు పాదాలకి అడ్డం పడుతున్న పరికినీని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో గుళ్ళో గంటని కొట్టడానికి ప్రయత్నించిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి.. :))

@ సాయి,
థాంక్సండీ! :)

@ కిరణ్,
హహ్హహ్హ్హా.. టెన్షన పడ్డావా .. నన్నెప్పుడూ ఒక్కసారి కూడా కొట్టలేదు కిరణూ అసలు.. వెధవ పని చేశాను కాబట్టి ఊరికే అది నా భయం అన్నమాట.. అంతే!

@ ఎన్నెల,
థాంక్యూ! :)
మట్టెలతో ప్రయత్నించాను కానీ, పట్టీలతో షూస్ వేస్కోడం నా వాళ్ళ కాలేదు.. :( మెట్టెలు కూడా చాలా గుచ్చుకుంటాయి కొన్ని రకాల షూస్ వేస్కున్నప్పుడు.. :(