
క్షణ క్షణానికీ నువ్వే నేనైపోతుంటే క్రమంగా మాయమైపోతున్న నేననే నా కోసం ఎక్కడని వెతకనూ?
నా కళ్ళ ముందే అనుక్షణం అమాంతంగా నువ్వులా ఎదిగిపోతున్న నన్ను నేనెలా నిలువరించగలనూ?
నాకే సొంతమనుకున్న నా మనసు పుస్తకంలోని ప్రతీ అక్షరమూ నువ్వు చదివేస్తుంటే నేనింకే భాషలో రాసుకోను?
నా కనురెప్పల చీకటి తెరల మాటున దాచుకున్న ప్రతి స్వప్నంలోనూ నీ వర్ణాలే మెరుస్తుంటే ఎలా?
నా పాదాలు వేసే ప్రతి అడుగూ నీ వైపే సాగితే.. నా కనులు చూసే ప్రతీ చిత్రంలోనూ నీ నవ్వుల పరిమళాలే అద్దితే ఎలా?
నీ రూపాన్ని దాటి వేరేదీ చూడని నా కంటిపాపలకి.. నీ ఊసు తప్ప వేరేది ఆలకించని నా వీనులకి ఏమని భయం చెప్పనూ?
నా ప్రతీ శ్వాసలో చేరిపోయి క్షణానికోసారి నా గుండెల్లో చొరబడిపోతూ నాలో నువ్వే నిండిపోతుంటే ఎలా పట్టి ఆపనూ?
నా గొంతు మాటున దాగుండి నేనాడే మాటల్లో పదానికో మారు నువ్వు బయటపడిపోతుంటే నేనెలా పెదవిప్పనూ?
నా అరచేతిలో శాశ్వతంగా ముద్రించుకుపోయిన నీ వేలి గురుతుల జాడల్ని నేనెలా చెరిపివేయగలనూ?
అల్లంత దూరాన ఉండే నువ్వు నా తనువులో సప్తస్వరాలు పలికిస్తుంటే నీ నుంచి ఎలా తప్పించుకోనూ?
నను తాకిన నా చేతి స్పర్శలోనైనా సరే నీ స్పర్శే చేరి అల్లరిగా తడిమేస్తుంటే నీతో నేనెలా పడగలనూ?
నీ నుంచి దూరంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తే నా ప్రమేయం లేకుండానే మళ్ళీ నీ వైపుకే పది అడుగులు పడిపోతుంటే ఎలా?
నిరంతరం నీ ధ్యాసలో నిలిచిపోతున్న కాలాన్నెలా కదిలించనూ.. నీ సమక్షంలో ఉరకలేసే కాలాన్ని పరుగాపమని ఎలా అదిలించనూ?
ఇదెంతటి చోద్యం కాకపోతే.. ఒక్క నువ్వు ఒక్క నాలో ఇన్ని వేనవేల తలపుల్ని పూయించడం ఎంతటి వైచిత్ర్యం కదూ!
నా నువ్వైపోతూ నీ నేనుగా మారిపోతున్నఈ క్షణాన.. ఏమని చెప్పాలి నీకసలు.. ఏమని అడగాలి నిన్నసలు.. ఎవరనుకోవాలి నిన్నసలు..!?
30 comments:
ప్రతి భావమూ స్వచ్ఛమైన కొత్త ప్రేమలా ఉండి :)
beautiful expression of love...love is beauty...thank u Mam..
వావ్.. మధుర, అద్భుతంగా రాసావు:) చిన్న చిన్న పదాల్లో ఎంత గొప్ప భావాలో, పూర్తిగా వశమైపోవడాన్ని చాలా అందంగా వర్ణించావు:)) చాలా చాలా బాగుంది.
Awesome!!!
excellent..!! :)
As usual.. I have no words to describe ur words... excellent.. awesome, beautiful,..
మీకు మీరే సాటి....
--
HarshaM
ప్రేమని అక్షరరూపంలో పెట్టలేమని అంటారుకానీ నిన్ను చూస్తే అనిపిస్తుంది.....నువ్వు ఏదైనా అక్షరాల్లో పెట్టేయగలవ్! హాట్సాఫ్ మధురా!
Wow!
ఇవన్నీ దాచి పెట్టుకొనీ..కొంచేం అటూ ఇటూ మార్చి ఫ్యూచర్ లో యూజ్ చేసుకుంటానండీ... సూపరు.. ;)
Superb ...ఇంతకీ మీ నువ్వు కి వినిపించారా...లేక మీ మనసులోంచి బయటకి రాకముందే చదివేసుంటారా...:)
superb....................
చాలా చాలా బాగుంది మీ కవిత...ప్రతి పదం నచ్చింది. .
mee bhava prakatana,varnana atyadbhutam.Mee blog maro lokaniki teesukupotundi..madhura smrutula loniki..Dhanyavadalu
నా కనులు చూసే ప్రతీ చిత్రంలోనూ నీ నవ్వుల పరిమళాలే అద్దితే ఎలా?
చదివిన ప్రతిసారి కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. చాల బావుంది మధుర.
Wowwwwwwwwwwwwwwww
that's the only word that is coming out of my mouth...........!!!!!!
అద్భుతం
మంచి హైట్స్ లో ఉన్నది లాస్ట్ 4 లైన్స్ లో కాస్త దిగిందని అనిపించింది....ఒక్క నువ్వు ఒక్క నేను , . . . నా నువ్వై . . . నీ నేను పదాలు అంతగా అతకలేదు...మధుర గారు... టోటల్ గా డిఫరెంట్ గానే ఉంది...
మధురా చాలా బాగా రాశారు. అయితే నాదో చిన్న సందేహం. అసలు "నేను" "నువ్వవుతున్నప్పుడు", "నువ్వయినప్పుడు" ఇంక నాది అనే భావం ఎందుకు. ప్రత్యేకంగా "నేను" అన్న ఉనికి కావాలన్న స్పృహ ఉంటుందా? ఆ స్థాయికి వెళ్ళాక మిగిలేది "నేనో" లేక "నువ్వో" అంతే కదా.
అన్నట్టు జర్మనీలో చెరుకు ముక్కలు అంత ఎక్కువగా దొరుకుతున్నాయా ఏంటి? అక్షరాల బదులు చెరుకు ముక్కలు వాడేశారు :)
superb :) :)
WOW !!! అని తప్ప ఇంకేమనగలను...
Very nice!
great expression of nice feelings madhura garu
@ అవినేని భాస్కర్, కెక్యూబ్ వర్మ, మనసు పలికే, పద్మవల్లి, కిరణ్, హర్ష, ఇందు, హరేకృష్ణ, వేణూరాం, స్ఫురిత, భారతీయ, డేవిడ్, సత్య, శైలబాల,
రాజ్, అరుణ్, లోకనాథ్, శంకర్, నాగార్జున, వేణూ శ్రీకాంత్, కృష్ణప్రియ,
క్రాంతి కుమార్ మలినేని..
వ్యాఖ్యానించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. మీ అందరి స్పందన నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. బోల్డు ప్రోత్సాహాన్ని కూడా అందించింది. థాంక్యూ సో మచ్! :)
@ వేణూరాం,
అలాగే.. హ్యాపీగా వాడేస్కోండి.. :)
@ స్ఫురిత,
హహ్హహ్హా.. అంతే అంతే.. మనసులోనే చదివేసుంటారని సరిపెట్టుకుందాం.. ;)
@ లోకనాథ్,
అలాగంటారా.. ఏమోనండీ మరి.. అప్పటికి అలాగే రాయాలనిపించింది.. ఏమైనా మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు థాంక్సండీ.. :)
@ శంకర్ గారూ,
అంటే ఇక్కడ సందర్భం... నేను పూర్తిగా నువ్వు లా మారిపోయే క్రమంలో ఉన్నాను.. నాలో వస్తున్న ఈ కొత్త మార్పు నాకే విచిత్రంగా ఉంటోంది.. అని ఓ పక్క ఆశ్చర్యపోతూనే మరో పక్కన ఆ అనుభూతిని అపురూపంగా తల్చుకుంటూ మురిసిపోవడం అన్నమాట!
పూర్తిగా నేను నువ్వులా, నువ్వు నాలా మారిపోయి గుర్తు తెలీకుండా మొత్తంగా ఒక్కరే అయిపోడం కన్నా, నా మనసుకి నచ్చినట్టుగా కనిపిస్తున్న నా నిన్ను ఒక అడుగు దూరంగా నించుని చూసే అనుభూతి కూడా బాగుంటుందేమో ఒకోసారి! ఏమంటారూ?
హిహ్హిహ్హీ.. నా అక్షరాలూ చెరుకు ముక్కల్లా అనిపించాయా.. అమ్మో.. ఎంత గొప్పగా పొగిడేశారూ.. :))))) థాంక్యూ సో మచ్!
మదుర గారు
హాట్స్ అప్....మదుర గారు మాటలు రావటం లేదు అండి ఈ కవిత గురుంచి ఎంత చెపీన ఎని కామెంట్ లు ఈచిన సరి పోవు అండి......అందుకే హాట్స్ అప్ మదుర గారు
థాంక్యూ సో మచ్ విజయ్ గారూ.. :)
మదుర గారు మీరు నను గారు అనకండి ప్లీజ్ నేను మీ కన్నా చైనా వాడిని
అండ్ మీరు రాసిన జర్మిని కబురులు అండ్ మీ వాలెట్ పోయనపటి కబురులు చదువుతా ఉన్నాను అండి
చాల బాగా రాసారు అండి థంక్ ఉ మదుర గారు
అలాగే విజయ్.. ఇప్పటికే చాలాసార్లు చెప్పావు కదా.. ఇక నుంచి మీరు అననులే.. :)
ఓపిగ్గా నేను రాసేవన్నీ చదువుతున్నందుకు బోల్డు ధన్యవాదాలు. :)
మదుర గారు
మీరు రాసిన జర్మిని కబురులు అండ్ వాళ్ళ మార్యద లు గురుంచి చదివి నానూ అందు లో ఫ్లవర్ గార్డెన్ గురంచి అండ్ ఫ్రూట్ ట్రీ గురుంచి చదివి ఆచేరేయ పోయాను .... అండ్ చాల థాంక్స్ అండి ఈవి అని మా కోసం షేర్ చేసిందుకు .అండ్ థాంక్స్ అండి నన్ను గురుతు పెట్టుకునుదుకు .
Thanks Vijay! :)
Post a Comment