నా ఆకాశపు నీలిరంగుని ఎవరో ఎత్తుకెళ్ళిపోతుంటే తెల్లబోయి చూస్తుండిపోయాను నిస్సహాయంగా..
చుక్కలన్నీ జలజలా నేలరాలిపోయాయి కలకాలం అమావాస్య చీకటిలోనే పడుండమని శపిస్తూ..
అలల ఊపిరి ఆగిపోయింది శాశ్వతంగా మనఃసంద్రాన్ని మూగతనంలోనే మగ్గిపొమ్మని శాసిస్తూ..
హృదయ విలయానికి పొంగిన కన్నీటి వరదలో కళ్ళల్లోని కలలన్నీ గూడు ఖాళీ చేసి పోయాయి..
ఇంతటి శూన్యంలోంచి కూడా నా అక్షరాలు వెలికి వచ్చి నన్ను సముదాయిస్తూ నీకు మేమున్నామంటూ ఊరడిస్తున్నాయి..!
Monday, August 15, 2011
నా అక్షరాల ఓదార్పు!
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
wow!
Good one..
ఇంతటి శూన్యంలోంచి కూడా నా అక్షరాలు వెలికి వచ్చి నన్ను సముదాయిస్తూ నీకు మేమున్నామంటూ ఊరడిస్తున్నాయి..!
ఇది చాలా బావుంది
Nice
మీ అక్షరాలకు మెచ్చిన నేస్తాలం మేము ఉన్నాం గా.
చాలా బాగుంది మధురా!!! :)
అద్భుతం
hmmmmmm.....soooper...
@ కృష్ణప్రియ, వేణూ శ్రీకాంత్, హరే కృష్ణ, భారతీయ, లోకనాథ్, ఇందూ, రఘు, కిరణ్...
థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్! :)
@ లోకనాథ్..
ఉన్నారుగా మరి.. అందుకే నా అక్షరాలు మీ స్నేహం చేస్తున్నాయి.. :))
Post a Comment