Friday, August 12, 2011

ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మ వరమో!

నాకు సంకీర్తన అనే పేరు చాలా ఇష్టం. అందుకని కొన్ని నెలల క్రితం 'సంకీర్తన' సినిమా చూసాను. 1987 లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ, గిరీష్ కర్నాడ్ తదితరులు నటించగా గీతాకృష్ణ కథ, దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. సంభాషణలు తనికెళ్ళ భరణి గారు వ్రాశారు. ఈ సినిమాకి ప్రాణం ఇళయరాజా సంగీతం అనుకోవచ్చేమో!

ఈ సినిమాలో పాటలు నేను ఇదివరకు ఎక్కువ విని ఉండకపోయినా బాగుంటాయన్నట్టు నాకు గుర్తు. అదెలాగంటే, ఒకసారి చిన్నప్పుడు అంటే స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఇంట్లో స్వర్ణకమలం, సంకీర్తన సినిమా పాటల కేసెట్ ఉంటే, నేనూ మా తమ్ముడూ కల్సి ఇవేవో డొక్కు పాటలనుకుంటా అని ఫిక్స్ అయిపోయి అందులో ప్రేమికుడు, జీన్స్ సినిమా పాటలు రికార్డ్ చేసాం.. అప్పటి నుంచీ మా నాన్న ఒకసారి అక్షింతలు వేసి ఊరుకోకుండా గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ తిట్టేవారు.. అంత మంచి పాటలు పాడు చేసారా అని.. అలాగే 'కిషోర్ కీ యాదే' నో ఏదో పేరున్న హిందీ కేసెట్ ని కూడా అలాగే చేసాం అనుకోండి అది వేరే కథ!jelir

అయితే, మొన్నా మధ్య ఈ సంకీర్తన సినిమా చూసానన్నాను కదా! గొప్ప సినిమా అని చెప్పను గానీ, బానే ఉంటుంది సినిమా. రమ్యకృష్ణ మాత్రం చాలా నచ్చేసింది నాకీ సినిమాలో.. తనకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు.. మోహంలో భావాలు పలికిస్తూ కళ్ళతోనే మాట్లాడేస్తుంది చాలా సార్లు.senyum

మళ్ళీ పాటల విషయానికొస్తే సినిమా చూసేప్పుడు ఒకసారి విన్నాక మళ్ళీ వాటి సంగతే మర్చిపోయాను. నిన్నెందుకో ఈ సినిమా పాటలు విన్నా చిమట మ్యూజిక్ లో. అన్నీ పాటలు బావున్నాయి గానీ నేను మాత్రం 'ఏ నావదే తీరమో..' అనే పాట దగ్గర ఆగిపోయా! ఎంతలా ఆగిపోయానంటే.. అంటే నిన్నటి నుంచీ ఇప్పటి దాకా ఈ ఒక్క పాటే వినేస్తూ ఊ ఊ.. వినేస్తూనే ఉన్నా!rindu

మనుషుల మనసుల్ని చదివేసినట్టు పాటలు రాసే మనసు కవి ఆత్రేయ గారి సాహిత్యం, KJ ఏసుదాస్ గారి మార్దవం నిండిన గొంతులో పలికిన భావం, ఇళయరాజా గారు కూర్చిన మృదుమధురమైన సంగీతం... అబ్బబ్బా... వింటూ ఉన్న కొద్దీ మనసు లోతుల్లో ఎక్కడో ఏదో కదిలిపోతున్నట్టు ఒక చిత్రమైన భావన.. ప్రేమ, బెంగ, దిగులు, ఎడబాటు, వేదాంతం.. ఇలా ఎన్నో రకరకాల భావాలు కలిసిపోయి మాటల్లో చెప్పలేని ఒక వింత అనుభూతి కలుగుతోంది. కానీ, ఎన్నిసార్లు విన్నా ఇంక చాల్లే అని మాత్రం అనిపించట్లేదు.. నేను ఇంకొన్ని రోజుల దాకా ఈ ఒక్క పాటలోనే బతికేస్తానేమో!sengihnampakgigi

నీకూ.. నాకే.. చెల్లిందనూ..! నీవూ.. నేనే.. సాక్ష్యాలనూ..! కలగానో.. కథగానో.. మిగిలేది నీవే.. ఈ జన్మలో! పాటలో ఈ వాక్యాలు అయితే ఎన్ని వందల సార్లు విన్నా తనివి తీరనంత నచ్చేసాయి.. Haunting అంటారే.. అలా ఈ పాట నన్ను వెంటాడుతున్నట్టుంది నా చెవుల్లో నిలిచిపోయి..senyum

ఏ నావదే తీరమో..
ఏ నేస్తమే జన్మ వరమో!
కలగానో.. కథగానో..
మిగిలేది నీవే.. ఈ జన్మలో!

నాలోని నీవే నేనైనాను..
నీలోని నేనే నీవైనావు..
విన్నావా ఈ వింతను..
అన్నారా ఎవరైననూ..
నీకూ.. నాకే.. చెల్లిందనూ..!

ఆకాశమల్లే నీవున్నావు..
నీ నీలి రంగై నేనున్నాను..
కలిసేది ఊహేననూ..
ఊహల్లో కలిశామనూ..
నీవూ.. నేనే.. సాక్ష్యాలనూ..!

పాట వినాలనుకుంటే ఇక్కడ చూడండి.

వీడియో కోసం ఇక్కడ చూడండి.

14 comments:

Sriharsha said...

Nice....
so meeku melody ante baga istam ankunta

జైభారత్ said...

స్పందించే ప్రతి మనసుని వెంటాడే గొప్ప తాత్వికత ఉన్న ఈ పాటని పరిచయం చేసినందుకు చాల చాల థాంక్స్ మధుర గారు... కలగానో.. కథగానో.. మిగిలే.............ది నీవే.. ఈ జన్మ....లో! గుండెల్ని పిండే భావముంది ఈ పాటలో....

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

ఈ సినిమాలోని ఇళయరాజగారి పాటలన్నా, ఈ సినిమా చిత్రీకరించిన తీరన్నా నాకూ చాలా ఇష్టం. గుర్తుచేసినందుకు థ్యాంక్స్

వెన్నెల్లో ఆడపిల్ల said...

మంచి పాట గురించి తెలియచేసారు. వెంటనే chimata music కి వచ్చి ఆ పాట వినేసాను. ఇళయరాజా గారి మీద అభిమానం పెంచే పాటలు ఎన్నో ..

వెన్నెల్లో ఆడపిల్ల said...

నాకు ఇందులో వేవేలా వర్ణాలా పాట కూడ ఇష్టం.

kiran said...

నాకు కూడా ఈ పాట బాగా నచ్చేసింది....thank u మధుర for sharing ..:)

suma said...

oka manchi message unna movie gurinchi gurtu chesinanduku thanks. nene akkuva vevelaa.. varnala.... song mathrame vinnanu. aa naavade teeramo vinna tarvatha idi kuda chala bagundi. very nice

వేణూశ్రీకాంత్ said...

పాట ముందు వచ్చే ఆలాపన చాలా వెంటాడుతుంటుంది.. సంకీర్తనలో పాటలన్నీ తరచుగా వింటుంటాను కానీ మీలాగే ఒకో సీజన్ లో ఈ "ఏనావదే తీరమో" పాటలో పడి అలా పదే పదే వింటూ నన్నుకోల్పోతాను. చాలామంచి పాట గుర్తుచేశారు.

రవికిరణ్ పంచాగ్నుల said...

మంచి పాటని/చిత్రాన్ని గుర్తు చేసారు మధురగారూ.. మీరన్నట్టు సంగీతమూ.. సాహిత్యమూ రెండూ వెంటాడుతూనే ఉంటాయి..

మురళి said...

మంచి పాట! 'సంకీర్తన' సినిమా గురించి ఓ సరదా సంగతి. ఓ సన్నివేశంలో రమ్యకృష్ణ నాగార్జునని 'నువ్వేమన్నా అన్నమాచార్యుడివనుకుంటున్నావా? కీర్తనలు రాస్తావా?' అని ఎద్దేవా చేస్తుంది.. ఓ పదేళ్ళ తర్వాత అనుకుంటా, నాగార్జున 'అన్నమయ్య' గా నటించడం, మళ్ళీ అందులో రమ్యకృష్ణే నాయిక కావడం.. ఇదంతా చరిత్ర.. 'వేవేలా' పాట కూడా బాగుంటుందండీ..

మధురవాణి said...

@ భారతీయ,
అవునండీ నాకు మెలోడీలంటే ఎక్కువిష్టం.. :)

@ లోకనాథ్,
ధన్యవాదాలండీ.. మీ మాటలతో ఏకీభవిస్తాను.. :)

@ అవినేని భాస్కర్,
సేమ్ పించ్! :)

@ వెన్నెల్లో ఆడపిల్ల,
నేను కూడా వినగానే ఈ పాట గురించి రాయకుండా ఉండలేకపోయానండీ.. అంతలా నచ్చేసింది.. :)
నాకు సంకీర్తన సినిమాలో 'వేవేల వర్ణాల' పాటతో పాటు 'మనసే పాడెనులే, మనసున మొలిచిన, కలికి మేనులో'.. పాటలు కూడా నచ్చాయండీ.. :)

@ కిరణ్, సుమ..
You are most welcome! :)

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
ఇంకేం చెప్పగలను.. సేమ్ పించ్ అనడం తప్ప.. ;)

@ రవికిరణ్,
అవునండీ.. agreed! :)

@ మురళి,
హహ్హహ్హా.. భలే భలే! భలే సరదా సంగతిని పట్టుకున్నారండీ మీరు.. థాంక్యూ మాతో పంచుకున్నందుకు.. :))
అవునండీ.. ఆ పాటొక్కటే కాకుండా మరి కొన్ని మెలోడీస్ ఉన్నాయి ఈ సినిమాలో.. :))

K V V S MURTHY said...

Yes, the Trio of legends gave their best...no doubt..I like this song very much..!!!

మధురవాణి said...

@ K V V S MURTHY,
Thanks for your response.