చిన్నప్పుడు ఆదివారమో, ఏదన్నా
పండగ సెలవలు వచ్చాయంటే చాలు నేనూ, మా తమ్ముడూ కలిసి రోజంతా ఒకటే ఆటలు ఆడేవాళ్ళం. అయితే, చాలాసార్లు మా ఆటలకి ఇంట్లో పెద్దవాళ్ళ
దగ్గర్నుంచీ ఆంక్షలు ఎదురవుతూ ఉండేవి. ఉదాహరణకి మధ్యాహ్నం ఎండలో బయట ఆడకూడదు,
ఇసుకలో పడి దొర్లకూడదు, వీధిలో దుమ్ములో ఆడకూడదు ఇలాంటివన్నమాట. ఇదివరకొకసారి
జామచెట్టు మీద మా ఆటల గురించి చెప్పాను కదా. అప్పుడు చెప్పినట్టు రోజూ మధ్యాహ్నం
భోజనాలయ్యాక మా అమ్మమ్మేమో వాళ్ళ భక్తి బృందం స్నేహితులతో కలిసి పురాణ
కాలక్షేపానికి వెళుతుండేది. మా అమ్మేమో పనులన్నీ అయ్యాక కాసేపు పడుకునేది. నాకూ,
మా తమ్ముడికి మహా ఇష్టమైన సమయం అన్నమాట అది. మామూలప్పుడు
టాం అండ్ జెర్రీలా కొట్టుకున్నా ఆ కాసేపు మాత్రం "తమ్ముడంటే ప్రాణం" అన్నట్టు నేనూ,
"అక్క మాటే వేదం" టైపులో
వాడూ ఆదర్శ అక్కాతమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళం. మా అమ్మ కాస్త నిద్రలోకి జారుకునేదాకా బుద్ధిమంతుల్లా
ఇంట్లో హాల్లో కూర్చుని ఏ అష్టా చెమ్మానో ఆడుకుని, ఒకసారి అమ్మ నిద్రపోయింది అని నిర్ధారించుకున్నాక
మెల్లగా పిల్లుల్లాగా ఇంట్లోంచి బయటపడేవాళ్ళం. మా ఇంటి వెనకాల బోల్డు స్థలం, పశువుల కొట్టం (అందులో పశువులు లేవులెండి
అప్పటికి.. ఖాళీ కొట్టం), ఒక
రేకుల షెడ్డు.. ఇలాగ ఆటలకి కావలసినంత స్థలం ఉండేది. ఎప్పుడూ మేమిద్దరమే కాకుండా,
వేరే చుట్టుపక్కల పిల్లలతో కలిసి
రకరకాల ఆటలు ఆడేవాళ్ళం. దొంగ-పోలీసు, నేల-బండ లాంటి అందరికీ తెలిసిన ఆటలే కాకుండా చిన్నప్పుడు మేము బాగా ఆడే,
మాకు బాగా ఇష్టమైన ఆట ఒకటి ఉండేది. దాని
పేరే 'చెన్నాయ్ కుప్పలు'.
చెన్నాయ్ కుప్పలు ఆట ఎలా ఆడతారంటే, ముందుగా ఉన్న పిల్లలందరం రెండు జట్లుగా విడిపోతాం. రెండు జట్లకీ ఎవరెవరి వాటా కింద ఏమేం స్థలాలు వస్తాయో నిర్ణయిస్తాం. సాధారణంగా ఆటలో ఉన్న పిల్లల ఇళ్ళు, పశువుల కొట్టాలూ లెక్కలోకి వస్తాయి. అది కూడా న్యాయంగా సరిసమానంగా పంచుకుంటాం అన్నమాట. ఉదాహరణకి మా జట్టులో నేనూ, మా తమ్ముడూ, స్రవంతి, శ్రీనూ, భద్రం ఉన్నామనుకోండి.. మా నలుగురి ఇళ్ళూ మా వాటాలోకి వస్తాయన్నమాట. ఇలా రెండు జట్ల మధ్యనా ఆస్తి పంపకాలు అయ్యాక అసలు ఆట మొదలెడతాం. రెండు జట్ల వాళ్ళూ వాళ్ళకి కేటాయించిన ఇళ్ళలో ఎక్కడైనా రహస్య స్థావరాలలో ఎవ్వరికీ కనపడని విధంగా ఇసుకతో చిన్న చిన్న కుప్పలు పొయ్యాలి. ఇవే చెన్నాయ్ కుప్పలు. ఈ ఇసుక కుప్పలు తక్కువ చోటులో ఎక్కువ కుప్పలు పట్టేలా పద్ధతిగా పెట్టడం ఎంత బాగా వస్తే అది అంత గొప్ప ఆర్టు. జట్టులో వాళ్ళందరం కలిసి మా తెలివితేటల్ని బాగా ఉపయోగించి, చర్చించి ఎదుటి జట్టు వాళ్ళు కనుక్కోడానికి కష్టమయ్యే జాగాలు ఏంటీ అని ఊహించి, గబగబా సాధ్యమైనన్ని ఎక్కువ చెన్నాయ్ కుప్పలు పొయ్యాలి. ఈ చెన్నాయ్ కుప్పలు పోసే విషయంలో ఒకొక్కళ్ళ క్రియేటివిటీ మాత్రం ఒకరిని మించి ఒకరిది మా గొప్పగా ఉండేది. రాళ్ళ కింద, చెక్కల కింద, ఏవైనా డబ్బాల కిందా, రోళ్ళ కిందా, చెట్ల చాటున, చివరికి ఇంటి వెనకాల బయట ఉన్న బక్కెట్లు, తపేళాల కిందా (ఇంట్లో ఇసుక పోస్తే వీపు చీరేస్తారు కదా మరి.. :D), చెప్పుల కిందా.. ఇలా కాదేదీ అనర్హం అన్నట్టు ఇసుక కుప్పలు పోసేవాళ్ళం. అబ్బాయిలైతే కొట్టంలో పై కప్పు కింద ఉన్న దూలాల (పాత కాలంలో పెంకుటిళ్ళకి కప్పు వేయడంలో వాడే పెద్ద పెద్ద చెక్క మొద్దులు) మీద కూడా ఇసుక కుప్పలు పోసేవాళ్ళు. ఇంక అమ్మాయిలయితే ఒద్దికగా ముగ్గులకి చుక్కలు పెట్టినట్టు (మరీ అంత చిన్నవి కాదు గానీ అంత ఒద్దికగా అన్నమాట) ఇసుక కుప్పలు పోసి వాటి మీద ఏ రోకలిబండో, పీటో పెట్టడం లాంటివి చేసేవాళ్ళం. చివరికి స్నానాల గది, తులసికోట లాంటి స్థలాల్ని కూడా వదిలేవాళ్ళం కాదు. :)
ఈ విధంగా సాధ్యమైనంత తొందరగా చకచకా ఇసుక కుప్పలు పోసే పని పూర్తి చేసి, 'మనం చాలా గొప్పగా చెన్నాయ్ కుప్పలు పోసేసాం' అని సంతృప్తిగా అనిపించాక ఎదుటి వాళ్ళని తేలిగ్గా గెలవగలం అన్న ధైర్యం వచ్చిన జట్టు ఇక ఎదుటి వాళ్ళని సవాల్ చేస్తూ బయలుదేరుతుందన్నమాట. అయితే చెప్పా పెట్టకుండా వెళ్తే అవతల జట్టు వాళ్ళ ప్రైవసీకి భంగం కదా.. అందుకని, అల్లంత దూరం నుంచే 'మేము వస్తున్నామహో..' అని వాళ్ళకి ఢంకా బజాయించి చెప్పినట్టు "ఉడతా ఉడతా ఊచ్.. చెన్నాయ్ కుప్పలు తాచ్.." అని గట్టిగా అరుస్తూ బయలుదేరతారు. నిజానికి అది "చెన్నాయ్ కుప్పలు దాచెయ్.." అన్నమాట.. దాన్ని కాస్తా మేమిలా అరిచేవాళ్ళం. ఈ అరుపులూ, కేకలు వినపడగానే అవతలి వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎక్కడ పోసే కుప్పలు అక్కడ ఆపేసి గబగబా పొజిషన్ లోకి వచ్చేస్తారన్నమాట. ఇప్పుడు అరుస్తూ వెళ్ళిన జట్టు వాళ్ళు అవతలి వాళ్ళ స్థలాల్ని సోదా చెయ్యడం మొదలెడతారు. ఈ ఘట్టం మహా పసందుగా ఉంటుంది. ఏదో సీబీఐ ఎంక్వైరీ మాదిరి అవతల వాళ్ళ హావభావాల్ని గమనిస్తూ, ఎక్కడన్నా కింద నేల మీద ఇసుక గుర్తులు కనిపిస్తాయేమో వాటి సాయంతో ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని గాలిస్తూ తెగ వెతికేస్తాం. ఒక్కొక్కటీ వెతికి పట్టుకుని ఆ కుప్పల్ని చెరిపేస్తూ పోతూ, ఎన్ని కుప్పలు పట్టుబడ్డాయో లెక్క పెట్టుకుంటాం. అలా అలా చాలాసేపు సోదాలు జరిగాక వాళ్ళు పెట్టినవన్నీ పట్టుబడ్డాయా, ఇంకా ఏమైనా మిగిలాయా అని అడుగుతాం. దీనికి కూడా ఒక గమ్మత్తైన భాష ఉంటుంది. "మీ గుగ్గిళ్ళన్నీ ఉడికాయా?" అని అడిగితే వాళ్ళు "ఉడకలేదు" అన్నారంటే ఇంకా కనిపెట్టనివి మిగిలాయని అర్థం. ఇలా అడిగేప్పుడూ, లేదని చెప్పేప్పుడు మహా ఫోజు కొట్టేసేవాళ్ళంలే.. "అప్పుడేనా.. ఇంకా చాలా ఉన్నాయ్ మా దగ్గర.." అని వాళ్ళు బడాయిగా చెప్తుంటే ఈ వెతికే జట్టు వాళ్ళు ఉడుక్కుని ఇంకా పడీ పడీ వెతికేసేవాళ్ళు.
ఇందులో మళ్ళీ తొండి చేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎలాగంటే "మీ గుగ్గిళ్ళు ఉడికాయా?" అని అడగంగానే బిక్క మొహమేసి "ప్చ్.. ఏదోలే.. ఒకటో రెండో చిన్నవి మిగిలాయి అంతే" అని ఎదుటి వాళ్ళని తప్పు దోవ పట్టించడం, లేకపోతేనేమో ఒక్కొక్కటీ పట్టు బడ్డప్పుడు "వార్నీ.. ఇది కూడా కనిపెట్టేసారా? అసలు అన్నీటికంటే ముఖ్యమైనది, ఎక్కువ కుప్పలు పోసింది ఇక్కడే.. ప్చ్.. ఇలాగైతే మేమింకా ఓడిపోయినట్టేనేమో.." అంటూ జాలిగా మొహం పెట్టి అవతల వాళ్ళని బోల్తా కొట్టించడం, ఎక్కువ లేకపోయినా ఇంకా మావి బోల్డున్నాయి అని చెప్పి బడాయి మాటలు చెప్పి అవతల వాళ్ళని గాబరా పెట్టడం... ఇలా బోల్డన్ని ట్రిక్కులు ఉండేవి. ;) మొత్తానికి ఎలాగైతేనేం వాళ్ళు ఇంకా కుప్పలు ఉన్నాయనని చెప్పినంత సేపూ ఈ ప్రహసనం కొనసాగీ సాగీ మనకి చేతనైనంత వరకూ వెతికాక "ఇంక మా వల్ల ఇంతే అయింది.." అని తేల్చేస్తాం. అప్పుడు వాళ్ళూ మనం కనిపెట్టలేకపోయిన కుప్పలని చూపిస్తారు. అవి కూడా లెక్కపెడతారు. ఉదాహరణకి మనం కనిపెట్టినవి వంద కుప్పలు ఉంటే అవి మనకొచ్చిన పాయింట్స్ అన్నమాట. కనిపెట్టలేనివి ఒక యాభై ఉంటే అవి వాళ్ళకి వచ్చిన పాయింట్స్ అన్నమాట. ఒకవైపు వారి సోదాలు అయ్యాక అచ్చం ఇలాగే రెండో జట్టు వాళ్ళ స్థలాలు కూడా వెతికి అక్కడ కూడా లెక్క తేల్చాక, చివరి నికరం ఎవరికెక్కువ పాయింట్లు వస్తే ఆ జట్టు గెలిచినట్టు. ఇదే చెన్నాయ్ కుప్పలు ఆట అంటే.. :)
ఈ ఆట ఆడటం చాలాసేపు పడుతుంది. ఆడగా ఆడగా కొన్నాళ్ళకి రహస్య స్థావరాలు అనుకున్నవి అందరికీ తెలిసిపోయి ఇంకా ఇంకా కొత్త జాగాలు కనిపెట్టడం చాలా కష్టంగా ఉండేది. కానీ, అందులోనే గొప్ప సరదా కూడా ఉండేది. అయితే మొదట్లో ఇలా ఆడేవాళ్ళం కాస్తా కొన్నాళ్ళకి ఈ ఆటని మోడ్రనైజ్ చేసాం. అదెలాగంటే, ఇసుక కుప్పలు పోసే బదులు సుద్ద ముక్కో, చాక్ పీసో, బొగ్గు ముక్కలో తీసుకుని గీతలు పెట్టడం అన్నమాట. ఈ రకంగా ఆడితే ఆట తేలికవుతుంది. అలాగే, ఇసుక కుప్పలు పెట్టడం కన్నా గీతాలు గీయడానికి జాగాలు ఎక్కువ దొరుకుతాయి కదా.. ఇహ చూస్కోండి దొరికిన చోటల్లా గీతలు గీసి పడేసేవాళ్ళం. పీటల కిందా, చెక్క స్టూళ్ళ కిందా, ఇనుప రేకు కుర్చీల కింద వైపునా, గోడల మీదా, గాబుల (నీళ్ళ తొట్టి) మీదా, రాళ్ళూ రప్పల మీదా.. ఒకటి కాదు.. చివరికి పొయ్యిలో సగం కాలిన కట్టెపేళ్ళని కూడా వదిలేవాళ్ళం కాదు. సాధారణంగా మేము ఈ ఆట ఆడేది మధ్యాహ్నం పూట. ఆ సమయంలో ఇళ్ళల్లో పెద్దవాళ్ళందరి దృష్టి పిల్లల మీద ఉండేది కాదు. పనులకి పోయేవాళ్ళూ, చేలకి పోయే వాళ్ళు పోగా, మిగిలిన కొంతమంది ఆడవాళ్ళు కూడా ఎంచక్కా కునుకు తీయడమో, ఇరుగు పొరుగింట్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకోడమో చేసేవాళ్ళు. కాబట్టి మా మీద అజమాయిషీ ఉండకపోవడంతో ఆట పేరు చెప్పి చేతికి అందిన చోటల్లా సుద్ద గీతలో, బొగ్గు గీతలో గీసేవాళ్ళం. ఇసుక కుప్పలు పోసినప్పుడు కూడా అప్పుడప్పుడూ పెద్దవాళ్ళతో తిట్లు పడేవి, పొయ్యిలో ఇసుక పోసామనో, తులసి కోటలో ఇసుక పోసామనో గదిమేవాళ్ళు కానీ, ఈ బొగ్గు గీతలు వచ్చాక మరీ అధ్వాన్నంగా తయారయింది పరిస్థితి. పీటలూ, కుర్చీలూ, గోడలూ సర్వం బొగ్గుమయం అయిపోడంతో "ఈ పొలగాళ్ళ ఆటలు సల్లగుండ.. కొంపంతా ఆగం ఆగం చేస్తున్నారు" అంటూ కొంచెం గట్టిగానే పడేవి పెద్దవాళ్ళ ప్రైవేట్లు. అదన్నమాట మా చెన్నాయ్ కుప్పల ఆటంటే. :)
చిన్నప్పుడు నేనూ, మా తమ్ముడూ బాగా ఇష్టంగా ఆడుకున్న ఆట ఇది. ఇప్పటికీ అప్పుడప్పుడూ మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం.. మాతో పాటు మా అమ్మా, అమ్మమ్మా కూడా మేము ఏమేం వస్తువుల మీద బొగ్గు గీతలు గీసి పాడు చేసామో గుర్తు చేస్తూ ఉంటారు. కొసమెరుపు ఏంటంటే నిన్ననే మా అమ్మ చెప్తోంది.. ఇప్పటికీ మా ఇంట్లో ఉన్న కొన్ని చెక్క స్టూళ్ళ అడుగున ఇంకా సుద్ద ముక్కల గీతలు ఉన్నాయంట. మా అమ్మ అలా చెప్తుంటే ఆహా.. ఏమి మా అదృష్టం.. మా చిన్నప్పటి జ్ఞాపకాల చిహ్నాలు ఇంకా అంత పదిలంగా ఉన్నాయా అని భలే సంబరంగా అనిపించిందిలే.. :-)

25 comments:
చాలా బావుంది మీ చెన్నాయ్ కుప్పలాట. మీ సుద్దముక్క గీతలలాగ మీ ఈటపా కూడా చాన్నాళ్ళు(గుర్తు)ంటుంది.
:) చాలా బాగుంది మీ ఆట, చిన్నప్పుడు మెము కొంచెం ఇలాంటిదె ఒకటి ఆడే వాళ్ళం. ఇందులో ఒక్కరే దొంగ (దొంగ కోసం పంటలు వెసుకోడం తెలుసు కదా) సరె, దొంగ దోసిట్లో ఇసుక పోసి, వెనకనుంచి వాళ్ళ కళ్ళు మూసి ఎక్కడెక్కడో తిప్పే వాళ్ళం... అలా అలా తిరిగిన దారినే తిరుగుతూ.. వెనక్కి తిప్పి, ముందుకు తిప్పి, ఎక్కడో ఒక చోట ఈ ఇసుకని కుప్పగా పోయించేయాలి. మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామొ అక్కడకు తీసుకు వచ్చి కళ్ళు వదిలెయ్యాలి. ఇప్పుడు దొంగ వెళ్ళి, ఆ ఇసుక కుప్పను కనుక్కోవాలి. కనుక్కుంటే గెలిచినట్టు, లెకపోతే ఓడిపోయినట్టూ.
భలే ఉండేది, వాళ్ళూ వెతుకుతుంటే, వెనక జనాలంతా వాళ్ళాని తప్పు దారి పట్టించడమూ అంతా...
Thanks for sharing the fun game. Wish I knew this when I was kid.. Anyway, will teach it to my son.. :)
:)
మీ రచన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసిందండి. అప్పడు దొంగ-పోలీసు, నేల-బండ ఇలా ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. పాపం ఈనాటి పిల్లలకు చెప్పుకోవటానికి ఇలాంటి జ్ఞాపకాలు ఉండకపోవచ్చు.
సూపర్ పోస్ట్ ..థాంక్స్ .....
మీ ఆటలు చాలా బాగున్నాయండి. నేను చిన్నప్పుడు, టాం సాయర్ లాగా, హకల్బెరీఫిన్ లాగా చెట్లు పుట్టలు పట్టుకు తిరిగిన రోజులు గుర్తుకు తెచ్చారు:)
భలేగా ఉంది ఆట! మీ చిరునామా ఇస్తే అక్కడకి వచ్చేసి మీతో మళ్ళీ ఈ ఆట ఆడేస్తాను ;) ఏమంటారు?
nenu kudaa vastagaa :)
మేము వీటిని వెన్నెల కుప్పలు అని ఆడేవాళ్లం.బాల్యం లోని ఆటలు మరపురాని జ్ఞాపకాలు.మనసును మురిపించి మా వయసును మరిపించే మీ పోస్టులు మాకు ప్రాణవాయువునందిస్తాయి.
మీ చిన్నప్పటి జ్ఞాపకాలను మాకు పంచి మాకూ వాటిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మధురవాణి గారు!
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురమే!
Best Wishes,
Suresh Peddaraju
మేమూ వీటిని వెన్నెల కుప్పలనేవాళ్లం. కాకపోతే మధ్యాహ్నం పూట కాదు.. రాత్రిళ్లు కరెంటు పోయాక వెన్నెల్లో ఎక్కువగా ఆడేవాళ్లం
Nice :)
:))
భలే గమ్మత్తు గా ఉందీ ఆట, ఆట పేరు కూడా..మా ఊర్లో ఈ ఆట ఎవ్వరికీ తెలీదు, తెలిసుంటే ఎంచక్కా ఎక్కడ చూసినా బొమ్మలు గీసి ఇప్పుడు చిన్ననాటి ముచ్చట్లు చూసుకుని మురిసిపోయే వాళ్ళం మీలా.
ఇప్పటికీ కొన్ని గోళీ కాయలు, బొంగరాలు బోలెడు జ్ఞాపకాలు దాచుకున్నాం లెండి గుర్తుగా.
చాలా ఆసక్తిగా రాశారు. చిన్న నాటి ముచ్చట్లు ఎప్పుడూ గుర్తుచేసుకోవటం మధురమే మధురవాణి గారూ!
చిట్టితల్లీ...ఈ వేసవిలో మధురాంటీ మనింటికి వస్తార్ట, ఆ చాక్ పీసులు, మార్కర్లు అన్నీ దాచేయ్ నాన్నా...
interesting
హ్హహ్హహా.. నాకీ ఆట తెలీదు తెలుసా! బాగుందండీ!
@ నాగేస్రావ్,
మీ వ్యాఖ్య కూడా నాకలాగే గుర్తుండిపోతుందండీ.. ధన్యవాదాలు.. :)
@ Ruth,
మీరు చెప్పిన ఆట పేరు దూదూ పుల్ల కదూ.. మేము కూడా బాగా ఆడేవాళ్ళం.. భలే సరదాగా ఉంటుంది కదూ.. :))
@ Slate Flash,
ఈ ఆట చాలామందికి తెలీదనుకుంటానండీ. మీ అబ్బాయికి నేర్పించేసి తనతో పాటు మీరు కూడా ఆడండి.. ఇంకా సరదాగా ఉంటుంది కదా.. :)))
@ కష్టేఫలే,
:)
@ anrd,
ఇప్పటి పిల్లలక్కూడా బోల్డు ఆటలున్నాయి కానీ, మనం ఆడుకున్నవి కాదు. ఇప్పుడు వాళ్ళు ఆడే ఆటలు అప్పట్లో మనకి లేవు కదండీ.. తరాల అంతరాలు అంటే ఇలాంటివేనేమో మరి!
@ పరుచూరి వంశీకృష్ణ,
థాంక్యూ.. :)
@ జయ,
మీరూ అంతేనా.. నేను కూడా చేలమ్మటి, చెట్లమ్మటి బానే తిరిగేదాన్ని.. :))
@ రసజ్ఞ, ప్రిన్స్,
అలాగలాగే వచ్చెయ్యండి.. మనందరం కలిసి ఎంచక్కా ఆడుకుందాం.. :D
@ నిరంతరమూ వసంతములే....,
నా జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు సంతోషమండీ.. స్పందించినందుకు ధన్యవాదాలు.
@ C. ఉమాదేవి, బాలు,
మీ ఇద్దరి వ్యాఖ్యలు చూసి చాలా సంబరంగా అనిపించిందండీ.. అందరూ ఈ ఆట తెలీదనే వాళ్ళనే చూసాను. ఇన్నాళ్ళకి తెలుసనీ చెప్పినవాళ్ళు కనిపించారు. 'వెన్నెల కుప్పలు' అనే పేరు ఎంతందంగా ఉందో కదా! స్పందించినందుకు బోల్డు ధన్యవాదాలు. :)
@ ఫోటాన్,
థాంక్స్.. :)
@ జలతారు వెన్నెల,
:))
@ చిన్ని ఆశ,
మా ఆట మీక్కూడా నచ్చినందుకు సతోషంగా ఉంది. అవునండీ గమ్మత్తైన ఆటే.. భలే సరదాగా ఉండేదిలే.. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)
@ జ్యోతిర్మయి,
ఆహాహా.. మీకేనా తెలివి.. మాకు లేదనుకున్నారా.. ఎంచక్కా వచ్చేప్పుడే పెద్ద డబ్బా నిండా చాక్ పీసులూ, మార్కర్లూ తెచ్చుకుంటాగా నేను.. :)))))
@ puranapandaphani
థాంక్సండీ..
@ కొత్తావకాయ,
అయితే మీకూ కొత్తేనన్నమాట ఈ ఆట.. :)
థాంక్స్ ఫర్ ది కామెంట్.
హ హ భలే ఉందండి ఈ ఆట....
బాల్యం లోకి తీసుకెళ్ళి పోయారు....
అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తు వచ్చేసింది చదువ్ తుంటే
ఎంతైనా బాల్యం బాల్యమే .... నచ్చింది :)
@ శేఖర్,
మీ చిన్నప్పటి ఆటలన్నీ గుర్తొచ్చాయా.. :))
అవునండీ.. బాల్యంతో మరేదీ సాటి రాదు. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. :)
Madam me blog bagundi itharulanu mechukune me manasu chalaaaaaaa bagundi
Post a Comment