Monday, May 21, 2012

నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో..


నేను అప్పుడప్పుడూ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ యూట్యూబ్ లో పాత తెలుగు సినిమాలు చూస్తుంటాను. మొత్తం మూడు గంటల సినిమాని కొంచెం కొంచెంగా ఒక మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేస్తుంటానన్నమాట. అలా మొన్నొక రోజున కృష్ణ, కె ఆర్ విజయ జంటగా నటించిన 'కోడలు పిల్ల' అనే సినిమా చూసా.. సినిమా భలే సరదాగా ఉంటుందిలే. అసలీ సినిమాకి కోడలు చేసిన శపథం అని పెట్టాల్సిందేమో పేరు. చాలా పాత సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా నాగభూషణం మేకవన్నె పులి లాంటి విలన్. హీరోయిన్ కోడలుగా అతనింటిలో చేరి ఎత్తుకి పై ఎత్తులు వేసి అతని బండారం బయటపెట్టి ఎలా బుద్ధి చెప్పిందనేది చిత్ర కథ. హీరోయిన్ శపథం నెరవేర్చడానికి ఆమెకి తోడుగా నిలిచే కథానాయకుడు, సెంటిమెంటు పండించడానికి మంచి మనసున్న గుడ్డి తల్లిగా అంజలీ దేవీ, మనల్ని నవ్వించే బాధ్యత తీసుకోడానికి రాజబాబు, అల్లు రామలింగయ్య సినిమాలో ఇతర పాత్రధారులు.  :-)

అయితే ఈ సినిమాలో ఒక పాట మొదటిసారి వినగానే నాకు భలే నచ్చేసింది. అప్పటి నుంచీ 'నన్ను తాకే ఎవ్వరో ఎవ్వరో..' అంటూ పాట పల్లవిని పదే పదే వల్లే వేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చాలాసార్లే వినేస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన ఈ పాటకి ఆరుద్ర గారు సాహిత్యం అందిస్తే, జి.కె వెంకటేష్ గారు సంగీత సారథ్యం వహించారు. మెల్లగా, హాయిగా సాగిపోయే మెలోడీ పాటలు నచ్చేవారికి ఈ పాట తప్పకుండా నచ్చుతుంది.

ఈ పాటని ఇక్కడ వినొచ్చు..

నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..
తడి మేను వణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో..
నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..

నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో..
నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో..
చెలి పక్కన ఉంటే నే పరవశామౌతా.. చెలి పక్కన ఉంటే నే పరవశామౌతా..
ఈ చక్కని చుక్క చెక్కిలి నొక్కుట ఏమో.. కల ఏమో..

దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనె లాంటి మనసు కలిపెనో..
దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనె లాంటి మనసు కలిపెనో..
ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే.. ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే..
ఈ మధుర మధుర మధుర భావమేమో.. వలపేమో..

నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..
తడి మేను వణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో..
నన్ను తాకె ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో..


7 comments:

నాగేస్రావ్ said...

మీరు చెప్పినట్లు అరవంలో 'సబదం' (శపధం) ఈ సినిమా పేరు. ఆ పాటే అరవంలో కూడా వినిచూడండి ఇక్కడ: http://www.raaga.com/play/?id=156411

♛ ప్రిన్స్ ♛ said...

nice song

హరే కృష్ణ said...

చాలా బావుంది మధుర :)
కరెంట్ షాక్ పోస్ట్ గుర్తొచింది
ఈ పాట బాక్ గ్రౌండ్ పెట్టుకొని ఆడుకుంటే కెవ్వ్ కేక :)
పుట్టినరోజు కామెంట్ :P

మధురవాణి said...

@ నాగేస్రావ్,
హహ్హహ్హా.. అవునా.. అయితే తమిళంలో సరైన పేరు పెట్టారన్నమాట.. మీరిచ్చిన పాట విన్నానండీ.. భాష అర్థం కాకపోయినా అచ్చం రెండు పాటలూ ఒకేలా ఉన్నాయి కదా.. బాలు పాడటం వల్లేమో.. బోల్డు ధన్యవాదాలు.. :)

@ ప్రిన్స్,
థాంక్సండీ..

@ హరేకృష్ణ,
థాంక్సండీ పుట్టినరోజు పాపాయి గారూ.. :))
ఇంతకీ ఆ కరెంట్ షాక్ పోస్ట్ ఏంటీ.. నాకు గుర్తు రావట్లేదు. :(

చిన్ని ఆశ said...

ఎప్పుడూ ఈ పాట వినలేదు, ఆ సినిమా కూడా తెలీదు. విన్న మొదటిసారే చాలా ఆకట్టుకుంది. బహుశా ఆనాటి బాలుగారి పాటలు, ప్రత్యేకించి కృష్ణ గారికి పాడినవి చాలా వరకూ మొదటిసారే ఆకట్టేస్తాయి.
ఎప్పుడూ వినని మంచి పాట ని పరిచయం చేశారు, అభినందనలు!
మీ తీరిక వేళల్లో చూసే సినిమాల్లో ఇలా మంచి ముత్యాల్లాంటి పాటలు మరిన్ని పరిచయం చేస్తూండండి ;)

Anonymous said...

పాట చాలా చాలా బాగుందండి... మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు...

మధురవాణి said...

@ చిన్ని ఆశ,
నేనూ ఇదే మొదటిసారండీ ఈ పాట వినడం. వినగానే నచ్చేసింది. నాలాంటి వాళ్ళకి పరిచయం చేద్దాం కదాని పోస్ట్ రాసాను. మీక్కూడా నచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే తప్పకుండా నాకు నచ్చిన పాటల్ని మీతో పంచుకుంటాను. ధన్యవాదాలు. :)

@ అనానిమస్,
సంతోషమండీ.. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. :)