Thursday, March 15, 2012

నా అన్వేషణ!


నిన్నా నేడూ పగలూ రాత్రీ అనుక్షణం నిర్విరామంగా వెతుకుతూనే ఉన్నాను..
యుగయుగాల నుంచీ సాగుతోందీ వెతుకులాట..
దేని కోసం వెతుకుతున్నాను?
ఎవరి కోసం వెతుకుతున్నాను?
ఎక్కడని వెతకాలి?
అసలెందుకు వెతకాలి?
ఏమో.. అన్నీ ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు!
నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..
కాలాలు కదలిపోతున్నాయ్.. రోజులు తరిగిపోతున్నాయ్..
ఆశలు చెదిరిపోతున్నాయ్.. నమ్మకాలు చెరిగిపోతున్నాయ్..
ఆయువు కరిగిపోతోంది.. ప్రాణం ఇగిరిపోతోంది..
ఇంకా ఇంకా చీకటిని చీల్చుకుంటూ ఆకాశపు అంచుల దాకా.. సముద్రపు లోతుల దాకా..
ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!

32 comments:

A Homemaker's Utopia said...

A restless soul...చాలా చాలా బాగుంది...:-)

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఓ నిరంత రాన్వేషీ ! మహోన్నతమ్ము ,
నమ్ము , సతత సత్యాన్వేషణమ్ము , మీకు
తోడు మేము , మనకు ముందుగూడ , మనకు
తదుపరి కూడ కొనసాగు , నిదియె నిజము .

బ్లాగు: సుజన-సృజన

జలతారువెన్నెల said...

చాలా బాగా రాసారు.

శశి కళ said...

nice....good poet nuvvu madhura

చిన్ని ఆశ said...

అది ప్రేమాన్వేషణే ఏమో !!!
మనసుకి అక్షర రూపం ఇవ్వటంలో సమర్ధులండీ మీరు, మధురవాణి గారూ! :)

mahi said...

చాలా చాలా బాగా రాసారు.

C.ఉమాదేవి said...

నిత్య కవితాన్వేషణ మీది.జారిపడిన అక్షరాలను ఒడిసి పట్టుకుని అక్షరమాలలు అల్లుకుంటూ సాహితీ సరస్వతి గళాన పేరుస్తున్న మధురవాణీ నీ మంజుల కవితానాదమొక తీరనిదాహం.

Anonymous said...

అంతులేని అన్వేషణ, బాగుంది. మీ బ్లాగ్ ఓపెన్ అవడం చాలా ఆలస్యం అవుతోంది. చూడండి

లోకనాథ్ said...

ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
వావ్..కేక..సూపరో..సూపర్.

హరే కృష్ణ said...

చాలా బావుంది మధుర :)

out of box :P
ఈ అన్వేషణలో ఎన్నో మైలు రాళ్ళు
Century of Centuries :)
Congratulations to God of Cricket :)

Sravya Vattikuti said...

ఏంటో మధుర మరీను ctrl +F కొట్టొచ్చు గా :P

శివరంజని said...

అన్వేషణ గురించి చాలా బాగా రాసావు మధు .... కాని మనకి ఈ అన్వేషణ గురించి తెలియదు కాని పొద్దస్తామను ఆఫీస్ లో పడి ... ఏ ఫైల్ ఎక్కడ పెట్టాను .. ఏ డిడి ఎక్కడ పెట్టానో అని అన్వేషించడమే సరిపోతుంది నాకు :(

శివరంజని said...

@ శ్రావ్యఓఓఓఓఓ కెవ్వో కెవ్వు అర్జెంట్గా నీ కామెంట్ కి ఒక వంద లైక్ లు కొట్టాలి

శివరంజని said...

@ శ్రావ్యఓఓఓఓఓ కెవ్వో కెవ్వు అర్జెంట్గా నీ కామెంట్ కి ఒక వంద లైక్ లు కొట్టాలి how?????

సిరిసిరిమువ్వ said...

శ్రావ్యా..:))

గిరీష్ said...

>>నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..>>

wow..super true

శేఖర్ (Sekhar) said...

good :)

మధురవాణి said...

@ A Homemaker's Utopia, జలతారు వెన్నెల, శశికళ, mahi, లోకనాథ్, గిరీష్, శేఖర్..
స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)

@ వెంకట రాజారావు . లక్కాకుల,
భలే చెప్పారండీ.. నిజమే, ఈ అన్వేషణకి ఆద్యంతాలు ఉండవేమో! చాలా సంతోషం మీ వ్యాఖ్యకి.. ధన్యవాదాలండీ.. :)

@ చిన్ని ఆశ,
అంతేనంటారా? ఏమో.. అయితే అయ్యుండొచ్చు.. ;)
మీ ప్రోత్సాహకరమైన ప్రశంసల రుచి మధురం.. నేను బాగా అలవాటుపడిపోతున్నాను సుమీ.. థాంక్యూ! :)

మధురవాణి said...

@ C. ఉమాదేవి,
నా అర్హతకి మించిన ప్రశంసైనా సరే చాలా సంబరపడిపోయానండీ మీ వ్యాఖ్య చూసి. . నా రాతలని ఓపిగ్గా చదువుతూ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని అందించే మీకు సర్వదా కృతజ్ఞురాలిని. ధన్యవాదాలండీ.. :)

@ కష్టేఫలే శర్మ గారూ,
నా బ్లాగులో మంచు పూలు రాలడం కోసం పెట్టిన 'కోడ్' వల్ల పేజ్ లోడ్ అవ్వడం స్లో అవుతుందనుకుంటాను. ఇప్పుడది తీశాను. ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకుంటున్నా.. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

@ హరేకృష్ణ,
హహ్హహ్హా.. నువ్వు సూపర్ గా అసలు.. Congratulations to our god!
థాంక్స్ ఫర్ ది కామెంట్. :)

@ శ్రావ్య,
What an idea ma'am saab! :)

@ శివరంజని,
హహ్హహ్హా.. నీ అన్వేషణ ఇంకా బాగుంది.. :)
థాంక్స్ ఫర్ ది కామెంట్..

పరిమళం said...

మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

సుభ/subha said...

Nice one!
నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ:)

oddula ravisekhar said...

మానవ జీవిత లక్ష్యం ఏమిటి ?అలాగే మన జీవిత లక్ష్య మేమిటి? (వ్యక్తిగతం గా )ఈ రెండు ప్రశ్న లు మనిషిని తరతరాలుగా వెన్నాడుతున్నాయి .ఈ అన్వేషణ మనిషిని ఇంత వరకు తీసుకు వచ్చింది .ఈ క్రమం లో ఎంతోమంది తత్వవేత్తలు ఎన్నో సిద్ధాంతాలు చెప్పారు .వారికి కలిగిన జ్ఞానం మేరకు !అవి మనకు ఏమయినా దారి చూపించాయా అని ఆలోచించుకుంటే పాక్షికమే అని తెలుస్తుంది .మనకు మనం మన అంతరంగ లోతుల్లోకి పోతే మన మెంతో అర్థం చేసుకోవచ్చని జిడ్డు కృష్ణముర్తి చెబుతారు.అప్పుడు ఆ అన్వేషణకు ఒక ముగింపు కనబడుతుంది.అక్కడే ఆ సత్యం ఆవిష్క్రుతమవుతుంది అదే సజీవ చైతన్యం .

Anonymous said...

ఈ అన్వేషణ 'సత్యం' కోసం కావచ్చు.

మధురవాణి said...

@ పరిమళం, సుభ..
ధన్యవాదాలండీ.. కాస్త ఆలస్యంగా మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు. :)

@ oddula ravisekhar,
నేను జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు ఎప్పుడూ చదవలేదండీ. May be I should read them some time. Thanks for your comment! :)

@ bonagiri,
నిజమే కావొచ్చండీ.. సత్యం బోధపడితే మనిషికి ఈ ఆరాటం తగ్గి ప్రశాంతత దొరుకుతుందేమో.. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

Lasya Ramakrishna said...

మంచి కవిత. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

More Entertainment said...

hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding.

More Entertainment

vijay.... said...

మదుర గారు మీ అన్వేషణ సూపర్ అండి చాల బాగా రాసినారు అండి

మధురవాణి said...

@ లాస్య రామకృష్ణ,
ధన్యవాదాలండీ.. మీక్కూడా కాస్త ఆలస్యంగా రామనవమి శుభాకాంక్షలు. :)

@ More Entertainment,
Thanks!

@ విజయ్,
థాంక్యూ విజయ్.. :)

Anudeep said...

కరెక్ట్ గా ఒక నెల అయింది మీరు చివరి పోస్ట్ రాసి.ఇంకోటి రాయండి!

మధురవాణి said...

@ అనుదీప్,
హహ్హహ్హా.. భలే గమనించారే! అంటే మీరింత శ్రద్ధగా ఫాలో అవుతున్నారన్నమాట నా బ్లాగుని.. ఇవాళే ఒక కొత్త పోస్ట్ వేసాను చూడండి. చాలా సంతోషంగా అనిపించిందండీ మీ స్నేహపూర్వక పలకరింపు చూసి. మీ అభిమానానికి బోల్డు ధన్యవాదాలండీ.. :)

Meraj Fathima said...

మీ అన్వేషణలోని భావుకత చాలా బాగుంది.

మధురవాణి said...

@ Meraj Fathima
ధన్యవాదాలండీ.. :)