Monday, July 25, 2011

నేనూ - గడియారమూ - నువ్వూ


గోడ గడియారంలో గంటల ముల్లు సెకన్ల ముల్లుతో పోటీ పడుతోంది..
నా కళ్ళెదురుగా నువ్వున్నావు.. నువ్వు మాత్రమే ఉన్నావు.. వెనకా, ముందూ, పక్కనా, పైనా, క్రిందా వేరే ఏవీ కనిపించట్లేదు.. నా కళ్ళ నిండా నువ్వే నిండిపోయావు..

గోడ గడియారంలో సెకన్ల ముల్లు గంటల ముల్లుతో పోటీ పడుతోంది..
నా కళ్ళెదురుగా నువ్వేనా ఉన్నావు.. చూపు మసకబారుతున్నట్టుంది.. నిన్ను పోల్చుకోలేకపోతున్నాను.. కంటిపాపలోంచి నీ రూపం కరిగి కన్నీళ్ళలో కొట్టుకుపోతోంది..

గోడ గడియారానికి ఊపిరి ఆగిపోయినట్టుంది.. కాలం కాలం చేసినట్టుంది..
నా కళ్ళెదురుగా నువ్వున్నావా.. ఎంతగా కళ్ళు విప్పార్చుకుని వెతికి వెతికి చూస్తున్నా వెనకా, ముందూ, పక్కనా, పైనా, క్రిందా ఏవీ కనిపించట్లేదు.. నువ్వు కూడా..!



*మా సెమినార్ హాల్లో గోడ గడియారానికి ఏదో చిత్రమైన జబ్బొచ్చి గంటల ముల్లు గిరగిరా తిరుగుతోంది.. దానికేసి చూస్తూ ఎటో వెళ్ళిపోయిన నా ఊహలే ఇవి.. ;)

9 comments:

Kranthi M said...

"గోడ గడియారానికి ఊపిరి ఆగిపోయినట్టుంది.. కాలం కాలం చేసినట్టుంది.." Great one

చాణక్య said...

"కాలం కాలం చేసినట్టుంది"

క్రాంతి గారిలాగే నాక్కూడా ఈ మాట బాగా నచ్చింది. ఇంతకీ మీ కళ్లలో నిండిపోయి, కన్నీళ్లలో కొట్టుకుపోయిన ఆ 'నువ్వు' గింజ గారెవరో..?

వేణూశ్రీకాంత్ said...

చిత్రంగా ఉంది :-)
కాలం కాలం చేయడం మాత్రం బాగుంది :)

సుజ్జి said...

:D

nani said...

అంత తొందరగా కాలాన్ని కాల్చేసారు ఎందుకండీ......?
ఇంకొన్నాళ్ళు కాలాన్ని కదిలించాల్సింది.
అప్పుడు ఇంకొన్ని మధురాలను మేం ఆస్వాదించి ఉండేవాళ్ళం కదండీ......?

MURALI said...

"గోడ గడియారంలో గంటల ముల్లు సెకన్ల ముల్లుతో పోటీ పడుతోంది.." "గోడ గడియారంలో సెకన్ల ముల్లు గంటల ముల్లుతో పోటీ పడుతోంది.." "గోడ గడియారానికి ఊపిరి ఆగిపోయినట్టుంది.."

మూడు విరుద్ధ సందర్భాలను చెప్పెందుకు మీరెన్నుకున్న మార్గం బావుంది. ఆలోచన కలిగినందుకు మీరు, ఆలోచన కలిగించిన గడియారము ఇద్దరూ అభినందనీయులే.

జైభారత్ said...

వాహ్వా వాహ్వా ....మధుర గారు...

kiran said...

బాగుంది :)

మధురవాణి said...

@ క్రాంతి కుమార్ మలినేని, వేణూ శ్రీకాంత్, సుజ్జీ, కిరణ్, లోక్ నాథ్,
థాంక్యూ ఫ్రెండ్స్! :)

@ The Chanakya ,
థాంక్సండీ.. ఆ 'నువ్వు' గింజ ఎవరంటే .. నా కళ్ళల్లో నుంచి పారిపోదాం అని ఎవరనుకుంటే వాళ్ళే ఆ 'నువ్వు'! ;)

@ నాని,
కాలాన్ని నేనైనా మీరైనా ఏం చెయ్యగలమండీ.. నచ్చినా నచ్చకున్నా కాలప్రవాహాన్ని అనుసరించి కొట్టుకుపోవడం తప్ప కాలాన్ని పట్టి ఆపడం మనకి సాధ్యమా! :)

@ మురళీ,
థాంక్యూ! అవును.. నాలో ఈ ఆలోచన కలిగించినందుకు ఆ గోడ గడియారానికి కూడా థాంక్స్ చెప్పాల్సిందే! :)