Wednesday, July 20, 2011

గాలికి ఎదురీత!


చల్లటి ఇగం లాంటి ఈదురుగాలి నా మొహాన్నే వీస్తోంది బలంగా దురుసుగా! ఆ వణికించే హోరుగాలిని తట్టుకుని స్థిమితంగా నిలబడి ఏమైనా సరే ముందడుగే వెయ్యాలనీ ఆ సుడిగాలి ఉరవడికి లొంగిపోయి వెనుకంజ వేయరాదని తీర్మానించుకున్నాను నేను!

మనసు మీద యుద్ధం ప్రకటించినట్టు గతంలోంచి స్మృతుల గాలి ఝూమ్మని వీస్తోంది అంతే విసురుగా! ఆ జ్ఞాపకాల దుమారానికి తల వంచకుండా గతంలోకి జారిపడిపోకుండా ధైర్యాన్నంతా కూడగట్టుకుని వర్తమానంలోకే సాగిపోవాలని తాపత్రయపడుతోంది నా మనసు!

మేమిద్దరమూ గుండె చిక్కబట్టుకొని కలసికట్టుగా గాలివాటుకి ఎదురీదాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాగానీ ఆ ధాటికి నిలువలేక ఇద్దరమూ ఒకేసారి చేతులెత్తేశాం! మా ఓటమికీ గాలి గెలుపుకీ దాఖలాగా కళ్ళల్లోంచి హృదయం పొంగి చెంపల్ని ముంచెత్తుతోంది!

16 comments:

ఆ.సౌమ్య said...

హ్మ్ ఓటమిని ఒప్పుకోలేను :(

Afsar said...

"చల్లటి ఇగం లాంటి ..."

"ఇగం" ఆ పదం మా వూళ్ళో విన్నాను, ఇప్పుడు ఇక్కడ.
ఇలాంటి పదాల్ని రికార్డు చెయ్యడం కోసమయినా కొన్ని చిన్న వ్యాసాలు- ఇలాంటివి- రాయాలి మీరు!

Arun Kumar said...

ఓటమిని ఒప్పుకోలేను :(

Chocopeppy said...

:( ayyo papam!!

వేణూశ్రీకాంత్ said...

’ఇగం’ ఓ కొత్తపదం నేర్చుకున్నాను...
కళ్ళలోంచి హృదయం పొంగి చెంపలని ముంచెత్తడం బాగుంది.. స్మృతుల గాలి చాలాసార్లు ఉధృతమే..

నేను said...

మనసు మీద యుద్ధం ప్రకటించినట్టు గతంలోంచి స్మృతుల గాలి ఝూమ్మని వీస్తోంది అంతే విసురుగా! ఆ జ్ఞాపకాల దుమారానికి తల వంచకుండా గతంలోకి జారిపడిపోకుండా ధైర్యాన్నంతా కూడగట్టుకుని వర్తమానంలోకే సాగిపోవాలని తాపత్రయపడుతోంది నా మనసు!
//

ఇటువంటి యుధ్ధంలో నా మనసు గెలిచింది..
గతంలోంచి స్మృతుల గాలి ఎంత బలంగా వీయాలని ప్రయత్నించినా దాన్ని పిల్లగాలిగా మార్చి దాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది !
అప్పుడప్పుడూ అటువంటి గాలికోసం ఎదురుచూస్తూ వుంటుంది !!

(ఇక్కడ పిల్లగాలి అంటే ఏ పిల్ల గాలి అని అడక్కండి :P)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

సంబంధమే లేకుండా రాస్తున్ననని అనుకోకండి. ఇంత అందమైన రాధ బొమ్మ ప్రొఫైల్ లో పెట్టారు. చాలా చాలా బాగుంది. మంచి మంచి బొమ్మలు పెడతారు మీరు. మరి నాకేమో అక్కడ కృష్ణుఁడు వెనకనుంచి కనిపించాడు.బొమ్మ గీసినవాళ్ళు రాధనింత అందంగా గీశారు.కృష్ణుణ్ణి ఇంకెంత అందంగా గీశారో, చూడాలని ఉంది. చూపించరూ! మీ కృష్ణుణ్ణి చూపించమని మేమేం అడగలేదు లేమ్మా, మనందరి కృష్ణుణ్ణి మాత్రం చూపించమని మనవి.

మధురవాణి said...

@ సౌమ్యా, అరుణ్..
అన్నే సార్లూ గెలుపే కావాలంటే కుదరదుగా మరి! కొన్నిసార్లు ఓటమిని తప్పించుకోలేం! :)

@ అఫ్సర్ గారూ,
మా ఇంతో మా అమ్మమ్మా, అమ్మా ఈ పదం వాడతారండీ.. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను కాబట్టి నేనూ వాడుతుంటాను. మీ సూచన పాటించడానికి ప్రయత్నిస్తాను. కానీ, మరీ నాకన్ని ప్రత్యకమైన పదాలు తెలీదేమోనండీ.. :P

@ Chocopeppy,
అవునండీ పాపం నేను! :))

మధురవాణి said...

@ వేణూ,
నిజమే.. జ్ఞాపకాల ఉధృతిని తట్టుకుని గెలవడం చాలాసార్లు అసాధ్యమే! :)

@ బద్రి,
మీరు బతక నేర్చినవారు సుమీ! ఆ శక్తే అందరికీ ఉంటే సగం బాధలు పోయినట్టే! ;)

@ మందాకినీ,
హహ్హహ్హా.. భలేవారే! నా కృష్ణుడిని ఇచ్చేయ్యమంటే ఇవ్వనంటాను గానీ, చూపించటానికేం భాగ్యమండీ! ;) మీరూహించినది కరక్టేనండీ.. ఆ ఫోటోలో రాధ కృష్ణుడి మురళీ గానం వింటూ కూర్చుంది. మొత్తం ఫోటోని నేను ఈ పోస్టులో పెట్టాను. అక్కడకెళ్ళి మీకు నచ్చినంత సేపు చూడొచ్చు. కావాలంటే, కృష్ణుడి ఫోటో కూడా కాపీ చేసుకోవచ్చు మీరు.. కానీ, ముద్నే చెప్తున్నా కృష్ణుడిని మాత్రం ఇచ్చేది లేదండోయ్! ;) :D
http://madhuravaani.blogspot.com/2011/06/blog-post_27.html

raaam..... said...

namastey madhura garu...i dont understand how u get such beautiful thoughts....mi anni posts kuda oka manchi silent cinema chustuna feelig ni kaligistai...by the way nenu shiva 2006 lo adaganidey song kuda update chesa okasari chudandi...blog telusu kada...
www.ragabanam.blogspot.com
intha manchi manchi feels ni istunnaduku miku chala chala thnx...inka yenno blogs ivvalani korukuntuna...

nani said...
This comment has been removed by the author.
nani said...
This comment has been removed by the author.
nani said...

ఈ సారి యుధ్ధం చేసేప్పుడు నేను కూడా సాయంచెయ్యనా ?
ఇలా రాయవచ్చో లేదో నాకు తెలియదు.....
తప్పైతే మన్నించండి.

మధురవాణి said...

@ raaam,
చాలా పెద్ద ప్రశంసే ఇచ్చారండీ నా అక్షరాలకి.. మీకు బోల్డు ధన్యవాదాలు.. తప్పక రాస్తూ ఉండటానికి ప్రయత్నిస్తానండీ!
మీ పాటల బ్లాగులో సాహిత్యం కలక్షన్ బావుందండీ..:)

@ నాని,
మీరేం తప్పుగా అనలేదు గానీ.. ఇలాంటి యుద్ధాలలో ఎవరికీ వారే పోరాడాలి కదండీ.. మనతో మనకే యుద్ధం కదా మరి! :)

kiran said...

హ్మ్మ్మమ్మ్మ్మం...:(

మధురవాణి said...

Kiran.. :)