Friday, July 01, 2011

నా మనసులో కురిసిన ప్రేమ వాన!

మొన్న సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చేప్పుడు చూస్తే ఆకాశమంతా నల్లనల్లగా కమ్మేసిన పల్చటి మేఘాలు, చల్లగా హాయిగా వీస్తున్న గాలీ.. వానొచ్చేలా ఉందోచ్.. అనుకున్నా. ఆ తర్వాత నేను వాన కోసం చాలా ఎదురు చూస్తూ ఉండిపోయా రాత్రి దాకా.. ఆ క్షణంలో నాకు తెలీదు.. మరి కాసేపట్లో సరిగ్గా తేదీ మారే సమయానికి అస్సలు ఎదురు చూడని ఓ పెద్ద జడివానేదో గభాల్న వచ్చేసి నన్ను చుట్టేస్తుందనీ, ఆ ప్రేమవర్షపు జల్లుల్లో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ, ముద్దగా తడిపేస్తూ మురిపించి మైమరపిస్తుందనీ.. అదే నా మనసులో కురిసిన ప్రేమవానన్నమాట! ;)

నిన్న పొద్దున నేను ఇంట్లోంచి బయటికొచ్చే సమయానికి రాత్రంతా కురిసిన జడివాన కాస్తా తెరిపిచ్చి, ఎటు చూసినా కనుచూపు మేరా... రాత్రంతా వానలో జలకాలాడి తాజాగా, వాన చినుకులతో మెరుస్తూ ముద్దుగా కనిపిస్తున్న పచ్చని చెట్లూ, పువ్వులూ... అలసటంతా పోయి మనసంతా తేలిక పడినట్టు కనిపిస్తున్న పల్చటి ఆకాశం... నేనలా నడుస్తూ ఉంటే నా మీదకి దురుసుగా దూసుకొచ్చేస్తూ చలచల్లగా తగులుతూ సన్నగా గిలిగింతలు పెడుతున్న గాలీ... వీటన్నీటికీ తోడు నా మనసులో మధువుని ఒంపేస్తున్న ప్రేమవాన! ఎటు చూసినా స్వచ్ఛత, ప్రశాంతతతో నిండిపోయున్నట్టు అత్యంత ఆహ్లాదంగా ఉన్న ఆ వాతావరణంలో నిజంగా నేనేదో ప్రత్యేకమైన ప్రేమైకలోకంలో ఉన్నట్టు అనిపించింది.. :)

ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు కదూ! ఉండండి.. మరింత వివరంగా నేను చెప్తాను కదా! ;)


నిన్న నా పుట్టినరోజన్నమాట! నేను ఏదో చిన్నప్పుడు తప్ప నా పుట్టిన రోజుని ప్రత్యేకంగా పట్టించుకోక చాలా ఏళ్ళయిపోయింది.. అంటే, ప్రత్యేకంగా కారణాలేం లేవు గానీ, ఎందుకో నేను పుట్టాను అన్న విషయాన్ని మరీ అంత ప్రత్యేకమైన విషయంలా, గొప్ప సంబరంలా తల్చుకోలేదన్నమాట! కానీ, నిన్న మొదటిసారి నేను పుట్టాను అని ఇంతమంది సంతోషంగా నన్ను విష్ చేసేసరికి.. ఏంటో చెప్పలేనంత ఆనందంగా ఉంది.. నేను నిన్నటి నుంచి మబ్బుల్లోనే విహరిస్తున్నా!
ఇప్పటి నా అనుభూతిని ఈ జన్మలో మర్చిపోలేను.. ఇంకెన్ని పుట్టినరోజులొచ్చినా ఇది మాత్రం చాలా ప్రత్యేకంగా నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నిజానికి నా మనసులో ఉన్నంత సంతోషాన్ని, సంబరాన్ని మాటల్లో పెట్టడం సాధ్యం కాకపోయినా, ప్రయత్నం చేద్దామని కూర్చున్నాను..

నేను పొద్దున్నే లేవగానే మొదట చూసింది ఈ బుజ్జమ్మ విష్ నే! చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. What a way to start my birthday morning కదా! :) తర్వాత ఎప్పట్లాగే అమ్మా, నాన్న, తమ్ముడూ ఫోన్ చేసి విష్ చేసారు. ఇంకా అమ్మమ్మ, చిన్నమావయ్య, అత్తయ్య, మా బుజ్జి మ్యాగీ విష్ చేసారు. ఇంకా బోల్డుమంది స్నేహితులు మెయిల్స్, గ్రీటింగ్స్ పంపారు. అయితే ఈ సారి ప్రత్యేకత ఏంటంటే, నా బ్లాగ్ ఫ్రెండ్స్ బోల్డు మంది దగ్గరి నుంచి ఎన్నెన్ని శుభాకాంక్షలు.. వచ్చాయో! ఒకరా.. ఇద్దరా.. ఇంతమంది ప్రియనేస్తాలు ఇంత అభిమానంగా, ఆప్యాయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఎంత సంబరంగా ఉందో మాటల్లో చెప్పలేను.. అసలు ఇంత ప్రేమనీ, ఇన్నేసి శుభాకాంక్షలని అందుకోగలనని, అందుకుంటానని కలలోనైనా ఊహించలేదెప్పుడూ..



వేణూ..
ఇంకా కమ్మటి పాటలతో విష్ చేసిన నా ప్రియనేస్తాలందరికీ....... చాలా చాలా థాంకులు.. అసలు నాకు ఆనందంలో కళ్ళల్లోంచి మాటలొచ్చేస్తున్నాయ్.. ప్రస్తుత్తానికి మీ మాటల్నీ, పాటల్నీ మళ్ళీ మళ్ళీ వింటూ మురిసిపోతూ ఉన్నా.. మీ అందరి ప్రేమాభిమానాలకి చెప్పలేనంత సంతోషంగా ఉంది.. నాకు మాటలు ఎక్కువ తోచట్లేదు.. నా కోసం ఇంత ప్రేమగా బోల్డు మంచి మంచి పాటలు వెతికి తీస్కొచ్చి నా పుట్టిన రోజుని అందమైన పాటలా మార్చేసినందుకు మీ అందరికీ ఎన్ని థాంక్స్ చెప్పినా సరిపోదు..

సౌమ్యా..
హహహ్హా సౌమ్యా.. ఎంత ముద్దుగా రాసారు.. నా గురించి మీరు చెప్పింది చూసి చాలా చాలా మురిసిపోయాను. రీసెర్చ్ స్కాలర్స్ పక్కన ఉన్నప్పుడు ఆ మాత్రం విధేయతని చూపెట్టాలి కదా మరి! మీరన్నట్టు మనిద్దరిదీ ఒక ప్రత్యేకమైన స్నేహబంధం కదా... ఒకే పుట్టిల్లు... ఒకే సొంతూరు లాగా! నిజమే.. చాలా చిత్రంగా కలిసాం కదూ రెండోసారి బ్లాగుల్లో.. :)

శ్రియా..
థాంక్స్ బుజ్జీ.. నువ్వు చెప్పిన పాటంత మధురంగా నేనుంటానో లేదో గానీ, నువ్వు మాత్రం ఉంటావురా! నిజం! :) That's soo soo sooooooooooooooo sweet of you! నిజానికి నాకేం చెప్పాలో తెలీట్లేదు.. అంత సంతోషంగా ఉంది.. కాబట్టి, నువ్వే అర్థం చేసేస్కో! :))))

ఒరేయ్ తమ్ముడూ సంతోష్..
నువ్వు రాసిన అక్షరాల వెనకున్న ప్రేమని చూసి నాకు కళ్ళలోంచి ప్రేమ పొంగి పొర్లిపోతోంది.. :P I've no words to say something! I'm really touched! Thanks for your Love! :) And.. we'll rock.. as always! :)

మంచు గారూ..
ఏంటండీ మంచు గారూ.. నేనెంత కృష్ణుడి పోస్ట్ రాస్తే మాత్రం నన్ను నిజంగా రాధని చేసేసారే! అయినా రాధని పిలిస్తే కాదని అనగలరా ఎవరైనా! అందుకని పోన్లెండి.. పలికేస్తాను. చాలా చాలా బోల్డు థాంక్స్ మీకు.. నా పుట్టినరోజుని పెద్ద పండగలా మార్చేసినందుకు.. ;)

నా కోసం ఇంకా మెయిల్లో, ఫోన్లో పుట్టినరోజు విషెస్ చెప్పిన బోల్డు మంది ప్రియమిత్రులందరికీ, నా మనసుకి చాలా చాలా దగ్గరైన నేస్తాల గురించి ఇంకా బోల్డు చెప్పాలనే ఉంది. కానీ, అప్పుడింకో వంద పేజీలన్నా రాయాల్సొస్తుంది.. అంత ఉంటుందన్నమాట.. అప్పుడు మీరు పారిపోతారుగా.. అందుకని ఇంక ఊరుకుంటున్నా!
నేస్తాలూ.. మీ అందరి ప్రేమాభిమానాలకి, నా అదృష్టానికి చాలా చాలా మురిసిపోతున్నాను. నిజంగా మీరందరూ కలిసి నేను ఎప్పటికీ మర్చిపోలేని అందమైన పుట్టినరోజు జ్ఞాపకాన్ని పంచారు.. అందరికీ చాలా చాలా చాలా బోల్డు ధన్యవాదాలు చెప్తున్నానన్నమాట! Love you all! :)

అన్నట్టు నా పుట్టినరోజు సందర్భంగా మా ఇంటబ్బాయ్ ఏం అనుకున్నాడో చెప్పలేదు కదూ.. "హమ్మయ్య.. పుట్టినరోజు సంబరాలు జరపడంలాంటి అలవాటు లేని పనులు బలవంతంగా చేసే బాధ తప్పింది నాకు. ఎంచక్కా మధుర స్నేహితులందరూ తనని శుభాకాంక్షలతో, పాటలతో చాలా చాలా సంతోషపెట్టేసారు.. కాబట్టి, నేను ఏ మాత్రం శ్రమ తీసుకోకుండా తన మోహంలో నవ్వుల్ని మాత్రం చూసి ఆనందిస్తే సరిపోతుంది.." అని. ;)

ఈ పుట్టిన రోజుకి చాలా చాలా ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతులు రెండున్నాయి. ఒకటి చాలా యేళ్ళ తర్వాత పోస్టులో ఒక బర్త్ డే గ్రీటింగ్ అందుకోవడం, అలాగే మొదటిసారి నాకెంతో ఇష్టమైన పువ్వులతో పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవడం.. నన్నింతగా మురిపించిన నా ప్రియనేస్తానికి ఒక పెద్ద THANKS చెప్తున్నా.. :)

అలాగే, అస్సలు ఊహించని విధంగా నా పుట్టినరోజున నాకు ఎంతో ఇష్టమైన గొల్లపూడి మారుతీరావు గారితో శుభాకాంక్షలు చెప్పించి, ఎప్పటికీ గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకాన్ని కానుకగా ఇచ్చినందుకు నా ఆత్మీయ నేస్తానికి బోల్డు ముద్దులు ఇచ్చేస్తున్నా.. :))




నా ఈ బ్లాగు నా మనసుకి అద్దంలాంటిది, నా ఆరోప్రాణం లాంటిది.. అసలీ బ్లాగే లేకపోయుంటే నేను ఎన్నెన్నో అందమైన అనుభూతుల్ని పొందగాలిగేదాన్ని కాదు.. ఇవ్వాళ నేను ఇంత సంబరంగా అందుకుంటున్న ఇంతటి గొప్ప ప్రేమాభిమానాలు దొరికేవే కాదు..నా కోసం ఇంత ఆనందాన్ని పంచిస్తున్న ఈ బ్లాగుకి ఇంతవరకూ నేనెప్పుడూ కనీసం థాంక్స్ అన్నా చెప్పలేదు. :( అందుకే ఇప్పుడు చెప్తున్నా.. ఓయ్ బ్లాగూ.. నీకు బోల్డు థాంక్సోయ్ ... :))

ఒక నేస్తం చెప్తే తెలిసింది ఈ పోస్టుతో నా బ్లాగులో 175 పోస్టులు అయ్యాయని.. ఇంకా మరెన్నో ఊహలు, ఊసులు, ఆలోచనలు, అనుభూతులు, జ్ఞాపకాలు పంచుకునే అవకాశం రావాలనీ, ఎప్పటికీ ఈ అభిమానాలూ, ప్రేమలూ, స్నేహాలూ, బ్లాగూ అన్నీ నా మనసుకి ఇంతే దగ్గరగా ఉండాలని కోరుకుంటూ...

* ఈ మధ్య మరీ అన్నీ ఇలాంటి ఎమోషనల్ పోస్టులే రాస్తున్నానని మొన్నామధ్య ఎవరో అభిమానంగా అనానిమస్ కామెంట్ కూడా పెట్టారు. ఈ పుట్టినరోజు జ్ఞాపకాల్ని నా బ్లాగులో శాశ్వతంగా దాచుకోవాలనిపించి ఇదంతా రాస్తున్నాను. ఈ ఒక్కసారికీ నా ఈ సెంటిమెంటుని భరించెయ్యండి.. తర్వాత వచ్చే పోస్ట్ లో మీకు బాగా నవ్వు తెప్పించే కబుర్లు చెప్తానేం! ఉంటాను మరి..! :)

15 comments:

శ్రీనివాస్ said...

:)

విరిబోణి said...

Any Way Belated Happy birthday Madhuravani gaaru :)

జైభారత్ said...

ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే..ఏం చేయను..?

Pranav Ainavolu said...

పుట్టినరోజు నాడు అందరికీ చాలామంది శుభాకాంక్షలు చెబుతుంటారు. అందులో కొన్ని మాత్రం మనసుకు హత్తుకుపోతాయి. ప్రేమను భరించడం కూడా కష్టం అనిపిస్తుంటుండప్పుడు :)

మీరు ఇలా బ్లాగు రాస్తూ అందరి మొహానా నవ్వులు పులుముతూ, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ... బిలేటెడ్ బర్త్ డే విషెస్! (తెలుగులో ఏమనాలో సరిగా తెలియదు)

prabandhchowdary.pudota said...

Belated Happy Birthday Madhuravaani gaaru.....

HarshaBharatiya said...

Belated happy birth day wishes

gayatri said...

Belated Happy birthday Madhuravani gaaru :)

జయ said...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మధురవాణి గారు. ఆలస్యంగా కాదులెండి. ఎందుకంటే మీ ప్రియ స్నేహితుల మధ్య ఎన్ని రోజులైన ఆనందంగా పుట్టిన రోజు జరుపుకుంటూనే ఉండండి.

మధురవాణి said...

@ శ్రీనివాస్,
:)

@ విరిబోణి, ప్రణవ్, prabandhchowdary.pudota, శ్రీహర్ష, గాయత్రి, జయ..
శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు! :)

@ loknath kovuru,
హిహ్హిహ్హీ.. :) :)

@ ప్రణవ్,
భలే చెప్పారండీ.. నిజమే! అప్పుడప్పుడూ అలానే అనిపిస్తుంటుంది ప్రేమని భరించడం కూడా కష్టమేనని.. :)

@ జయ గారూ,
హీ హీ హీ.. మీరు విష్ చెయ్యాలే గానీ ఎన్నాళ్ళైనా పుట్టినరోజు జరుపుకుంటూనే ఉంటాను.. :))

ఆ.సౌమ్య said...

:))
ఇదెప్పుడు రాసావు? నేను చూడనేలేదు.

మధురవాణి said...

@ సౌమ్యా,
ఆ తెల్లారే రాసాను. బహుశా అప్పుడు వీకెండ్ అనుకుంటా.. అందుకే మిస్సయ్యారేమో! ;)

Unknown said...

ninnu wish cheyadam marichanu madhura. ippudu wish chestunna many happy returns of ur birthday

మధురవాణి said...

హహ్హహ్హా.. థాంక్యూ సో మచ్.. శైలూ డియర్! :))

జ్యోతిర్మయి said...

మధురవాణి గారూ..ఈ మధ్యే మీ బ్లాగులన్నీ చదువుతూ వున్నా 'మీ' అంటే మీ అందరివీనూ...నాకు తెలియని ప్రపంచం ఒకటుందని అర్ధమైంది. 'నేనొక కథ రాశానోచ్'
అని రాసిన టపా చదివి అబ్బ ఈ అమ్మాయి మొదటి కథ రాసింది కాబోలనుకున్నా...కాని మీ బ్లాగ్ మొత్తం చదివాక మిమ్మల్ని అభినంది౦చకుండా ఉండలేకపోతున్నా.
మీ గురించి తలచుకుంటే నాకు జలపాతం గుర్తొస్తుంది. ఏ బ్లాగ్ చూసినా మీ వ్యాఖ్యలే కనిపించాయి. మీరిలా బ్లాగు వనంలో నవ్వుల పువ్వులు పూయిస్తూ కలకాలం హాయిగా ఉండాలి.

మధురవాణి said...

@ జ్యోతిర్మయి గారూ,
తెలుగు బ్లాగులనేవి ఇన్నున్నాయి అని తెలిసిన కొత్తలో నేనూ అచ్చం మీలాగే సంబరపడ్డాను. :) నా బ్లాగు మొత్తం చదివారంటే ఎంత శ్రమ తీసుకుని ఉంటారో, ఎంత ఓపిక కావాలో నేనూహించగలను.. జలపాతంతో పోల్చినందుకు ఆనందంగా ఉంది.. మీ ఆశీస్సు ఫలించాలని కోరుకుంటున్నా.. మీ ప్రోత్సాహపూర్వక అభినందనలకి బోల్డు బోల్డు ధన్యవాదాలు..