Wednesday, July 14, 2010

జ్వరమొస్తే.. ఎంత బాగుంటుందీ!

జ్వరమొస్తే బాగుండటమేంటీ మరీ చోద్యం కాకపోతే.. యీ పిల్లకి వేపకాయంత వెర్రి ఉన్నట్టుంది అనుకుంటున్నారు కదా మీరందరూ! ఇప్పుడు నేను చెప్పేదంతా విన్నాక, వేపకాయంత కాదు.. ఏకంగా గుమ్మడికాయంత ఉందని తెలుస్తుందిలెండి. నాకున్నలాంటి తిక్క లక్షణాలు, విచిత్రమైన కోరికలు యీ భూ ప్రపంచంలో ఎవరికీ ఉండవు.. అంటుంది మా అమ్మ. హీ హీ హీgelakguling

మీకెవరికైనా జలుబు చేస్తే ఇష్టమా? నాకు మాత్రం భలే ఇష్టం తెలుసా జలుబు చేస్తే! జలుబంటే నా ఉద్దేశ్యం.. ముక్కూ మొహం పింక్ కలర్లోకి మారిపోయి, గొంతు వాసిపోయి, తల బద్దలయిపోయే తలనొప్పితో విక్స్ యాక్షన్ 500 టాబ్లెట్ ఎడ్వర్టైజ్మెంట్లో లాగా అవడం కాదు. ఏదో కొంచెం లైట్ గా జలుబు చేసి ముక్కుతో మాట్లాడుతుండాలి. గొంతు కొంచెం మారిపోవాలి. అంతే!jelir అలా ఉంటే నాకిష్టం. కానీ, ఒకసారి జలుబొస్తే గొంతు మారడంతోనే ఆగదు కదా! పైన చెప్పిన విక్స్ ఎడ్వర్టైజ్మెంట్ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అది మాత్రం ఇబ్బందే!

చిన్నప్పుడు ఉయ్యాల ఊగుతూనో జారిపడో దెబ్బ తగిలించుకుంటే, నాకా దెబ్బ తగ్గే లోపు ఇంట్లో వాళ్లకి పట్టపగలే చుక్కలు కనిపించేవి పాపం! ఎందుకంటే, నాకేదైనా చిన్న దెబ్బ తగిలితే అది తగ్గేదాకా నా కళ్ళన్నీ అక్కడే! రోజంతా నా ధ్యాస గాయం మీదే ఉంటుంది. " దెబ్బ ఎప్పుడు తగ్గుతుంది, గాయం మీద ఎందుకు చెక్కు కట్టింది, చెక్కు తీసెయ్యకూడదా, ప్లాస్టర్ పీకేస్తే ఏమవుతుంది, ఇంకా ఎన్ని రోజులకి తగ్గుతుంది.." లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఇంట్లోవాళ్ళ బుర్ర తినేసేదాన్ని. అందుకని నా యీ హింస తట్టుకోలేక మా ఇంట్లో వాళ్ళందరూ తమకి జ్వరమొచ్చినా పర్లేదు గానీ, నాకు మాత్రం రాకూడదని గట్టిగా అనుకుంటారు పాపం!sengihnampakgigi

అందరూ ఏదో స్కూలో, కాలేజో ఎగ్గొట్టడానికి జ్వరం రావాలని కోరుకుంటారు కదా! నాకేమో జ్వరం ఎందుకిష్టమో తెలుసా! ఇంట్లో వాళ్ళు బాగా ముద్దు చేస్తారు కదా మనకి ఒంట్లో బాలేకపోతే. అందుకన్నమాట! మళ్ళీ జ్వరమంటే నోరంతా చేదయిపోయి, బోలెడంత నీరసం వచ్చెయ్యకూడదు. స్కూలుకి వెళ్ళేంత ఓపిక ఉండకూడదు కానీ, ఆడుకునేంత, టీవీ చూసేంత ఓపిక మాత్రం ఉండాలి. అలా రావాలన్నమాట జ్వరం. ఓసారేమయిందో తెలుసా! అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళొద్దాం పదండి.nerd

నాకో తొమ్మిదేళ్ళు, మా తమ్ముడికో ఏడేళ్ళు ఉన్నప్పుడు ఒకసారి మా తమ్ముడుకి ఆటలమ్మ పోసింది. అప్పుడు వాడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. నేనేమో ఇంటిని ఏకచ్చత్రాధిపత్యంగా ఏలేస్తూ ఉండేదాన్ని. వాడికి హాస్టల్లోనే అమ్మవారు పోస్తే ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే చాలా ఎక్కువైపోయింది పాపం. ఏవో మందులు కూడా వాడారులే గానీ, తగ్గడానికి బాగానే టైం పట్టింది. అప్పుడు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు. దాదాపు తగ్గే టైముకి వాడికి ఐస్క్రీములూ, బిస్కెట్లు అన్నీ కొని తెచ్చారు.

ఇదంతా చూసి నేను కూడా వాడి చుట్టూనే తిరిగేదాన్ని. అదేదో అంటించేసుకుంటే ఎంచక్కా నేను కూడా కొన్నిరోజులు బడి మానేసి వాడితో పాటే ఇంట్లో ఉండిపోవచ్చు. పైగా, ఐస్క్రీములూ, బిస్కెట్లూ బోనస్ కదా అనుకున్నా! అప్పటికీ మా అమ్మ ప్రతీ క్షణం నాకు కాపలా కాస్తుండేది నేను వాడి దగ్గరికెళ్ళి అంటించుకోకుండా! కానీ, నేను దేవాంతకురాలిని కదా! మొత్తానికి నేనూ అంటించేసుకున్నా వాడి దగ్గర నుంచి. మొదట ఒక చిన్న పొక్కు రాగానే అబ్బో.. తెగ ఆనందపడిపోయాను నేను.celebrate మా అమ్మేమో చాలా కంగారు పడిపోయింది పాపం. మర్నాడే నాన్న నన్ను ఆసుపత్రికి తీస్కెళ్ళి అప్పట్లోనే ఒక్కో టాబ్లెట్ నలభై రూపాయలున్నవి కొని వాడి నాకు వెంటనే తగ్గిపోయేలా చేశారు. ప్చ్.. ఏం చేస్తాం! నేనంత రిస్కు తీసుకున్నా గానీ వర్కవుట్ కాలేదు.gigil తరవాత నాన్న నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని "ఇలా ఐస్క్రీములు తినడం కోసం జ్వరాలూ, జబ్బులూ తెచ్చుకోకూడదు నానా! ఇంకోసారెప్పుడూ ఇలా చేయకు. కావాలంటే, నీకు ఐస్క్రీములు నేను తెచ్చిస్తానుగా!" అని బుజ్జగిస్తూ చెప్పారు.malu

ఇలాంటిదే ఇంకో ముచ్చట కూడా గుర్తొస్తోంది. నేను డిగ్రీ చదివే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు రోజు సాయంత్రం స్నేహితురాళ్ళందరం కలిసి డాబా ఎక్కి దిక్కులు చూస్తూ,కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. లోపు దృశ్యం మమ్మల్నందరినీ ఆకర్షించింది. అదేంటంటే, ఎదురింటి డాబా మీద చిన్న పిల్లలు కొంతమంది కరంట్ షాక్ ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసేసరికి మా అందరికీ కూడా అలా ఆడుకోవాలనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా అమలుపరిచేసాం! వాళ్ళంటే చిన్న పిల్లలు కాబట్టి చెంగు చెంగున గెంతుతూ హాయిగా ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళలా ఆడగలిగేంత సీన్ మాకు లేదన్న సంగతి కాసేపటికే అర్ధం అయింది. ఎలాగంటే, ఎవరో నాకు కరంట్ చెప్పేస్తారన్న కంగారులో నేను ఆవేశంగా పరిగెత్తుతూ ఢామ్మని కింద పడ్డాను.sedih దెబ్బకి మోకాలు చిప్ప పగిలింది. అంటే, ఏదో ఫ్రాక్చర్ అన్నంత ఊహించుకునేరు. అంత లేదు.. కొద్దిగా కొట్టుకుపోయింది. అంతే! కానీ, అది నాకు తగిలింది కాబట్టి, దాదాపు ఫ్రాక్చర్ కిందే లెక్క. నేనంత హంగామా చేసే టైపు కదా మరి! దెబ్బ తగలడం వల్ల కొంచెం ఒళ్ళు వెచ్చబడింది. అంతే.. కాలేజీకి ఎగనామం పెట్టేసి వెంటనే ఇంటికి చెక్కేసా!kenyit

ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు సెలవలేం లేకుండా ఇలా ఊడిపడ్డానేంటీ అని. నాకెంత జ్వరమోచ్చిందో తెలుసా అని ఎందుకొచ్చిందో కూడా చెప్పా! అందరూ నవ్వారు. నాన్న టెంపరేచర్ చూసి ఒక డిగ్రీ పెరిగిందిలే.. రేపటికి అదే తగ్గిపోతుందిలే అన్నారు. డాక్టరు దగ్గరికి కూడా తీసుకెళ్ళలేదు. పైగా రెండ్రోజులైనా ఇంట్లో ఎవ్వరూ నాకు జ్వరం వచ్చిందనే విషయాన్నే పట్టించుకోలేదు. ఇంకంతే.. నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల రోజు రాత్రి బేర్ మని ఏడ్చేసా!nangih ఎవరికీ అర్ధం కాలేదు నేను ఎందుకేడుస్తున్నానో! వెక్కుతూ మధ్యలో నేనే చెప్పా ఏడుపెందుకూ అని. నాకు దెబ్బ తగిలి, జ్వరం వచ్చి ఇంటికొస్తే మీరసలు నన్నూ, నా జ్వరాన్ని పట్టించుకున్నారా? హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత ఏడుపొచ్చిందో తెలుసా అసలు! తీరా ఇంటికొస్తే నన్నెవరూ పట్టించుకోట్లేదు. ఇంటికి రావడం కంటే హాస్టల్లో ఉండటమే నయం అంటూ అరలీటరు కన్నీళ్లు కార్చేసా! నేనలా ఏడుస్తుంటే అమ్మా, నాన్నా చాలా సేపు నవ్వారు. నాన్నేమో సర్లే అని చెప్పి నన్ను దగ్గరికి తీసుకుని బుజ్జగించి అన్నం తినిపించారు. అంతే! నా జ్వరం దెబ్బకి తగ్గిపోయింది. తరవాత మళ్ళీ ఎప్పుడూ కరంట్ షాక్ ఆడే ప్రయత్నం చేయలేదు!takbole

అప్పుడంటే అలా సరిపోయింది గానీ, ఇప్పటిలా ఇంటికి చాలా దూరంలో ఉన్నప్పుడు మాత్రం నాకు తలనొప్పి వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు బాగా గుర్తొచ్చేసి తెగ ఏడుపొచ్చేస్తుంది.sedih అప్పటికీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని తినేస్తుంటాననుకోండి.encem అయినాసరే, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే 'జ్వరమొస్తే.. ఎంత బాగుంటుందీ..' అనుకుంటాను. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రం నొప్పులూ, జ్వరాలూ రానే కూడదు!senyum

41 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఇప్పుడు ఆఫీస్ ఎగరగొట్టేందుకు జ్వరం వద్దా? :)

http://promotetelugu.wordpress.com/ said...

:)

3g said...

:-).

స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా లెక్కల పరీక్షకు ముందు జ్వరమొస్తే బాగుండుననుకొనేవాడ్ని కాని దురదృష్టం ఏంటంటే నాకెప్పుడూ సెలవుల్లోనే జ్వరమొచ్చేది. :-(

Unknown said...

nenu kuda ditto meelaagane...


ayina manaki jwaramocchinaa janaalu pattinchuko pothe chaala edupu vasthundi kada........ :-(

Anonymous said...

బ్రహ్మాండంగా ఉంది !!

నేస్తం said...

అమ్మో తల్లీ..నేను ఇక నవ్వలేను..పోస్ట్ కంటే ముందు ఆ స్మైలీలు అదరిపోయాయి..

జాహ్నవి said...

madhura vani gaaru,
same pinch... naaku meelane jalubu raavaalani korika... naa gontu maaradam ante booldanta ishtam...

kaanee naaku jalubu eppudooo raade... okavela vachinaa ilaa vachi alaa poyedi......

janmaki o sivaraatri laa eppudainaa change ayyedante adi e sunday no padedi... friends ki naa gontu maarindane vishayam elaa cheptaam appudaite...

pch.... naa gontu maaraali... andarikee ee vishayam cheppaali... anna korika ippatikee teeraledu....
:-(

chaala vishaadaam kadaa... andi...

హరే కృష్ణ said...

పోస్ట్ అయితే సూపర్
డిగ్రీ లో కరెంట్ షాక్ ఆటలు ఆడుతారా ?
హేమిటో

Ramu S said...

అందరికీ మామూలు ఆకలి వేస్తే...నా పుత్రరత్నానికి 'బర్గర్ ఆకలి', 'ఐస్క్రీం ఆకలి' అవుతుంటాయి. వెధవ...చాలా చిన్నప్పుడే ఆకలిలో రకాలు సృష్టించి...చంపే వాడు. 'మమ్మీ...నాకు అన్నం ఆకలి కావడం లేదు," అనే వాడు. మధురవాణి గారి బ్యాచు.
రాము
apmediakaburlu.blogspot.com

psm.lakshmi said...

ఈ పోస్టు అసలు చూడవలసినవారు చూశారా లేదా ఏమీ లేదు ముందు జాగ్రత్త పడతారని.
psmlakshmi

నాగప్రసాద్ said...

:-) :-)

జయ said...

మీకు జ్వరాలు నొప్పులూ కలకాలం వస్తూనే ఉండుగాక. Happy fever Day:)

మాలా కుమార్ said...

హ హ హ

చందు said...

ఏంటో హ్హ హ్హ హ్హ ...... :-)))

స్థితప్రజ్ఞుడు said...

మీరు మరీను....చిన్న చిన్న దెబ్బలకే ఊరంతా గోల చెయ్యడం పక్కన పెడితే....మీకున్న కోరికలు దాదాపు అందరు చిన్నపిల్లలకీ ఉండేవే....

ఈ మధ్య రోగాలేమి రావడం లేదు...స్కూల్ మానడం కుదరడం లేదు అని చెప్పి......

వేరే క్లాసులో ఎవడికో కళ్ళకలగ వచ్చిందని తెలిసి....పని గట్టుకుని వాడి దగ్గరికి వెళ్లి....కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన రోజులున్నై తెలుసా......

భావన said...

బాలేవారే మీరు. ఆయువుంటే గాయం అంత సుఖం లేదని మీ లాంటి వాళ్ళను చూసే పెట్టి వుంటారు. అవును మన అంతట మనమే చేసుకునేప్పుడు వొంట్లో బాగోకుండా వుంటే కష్టం. డబుల్ ది వర్క్ ఐపోతుంది.

వెంకట్ said...

వామ్మో ఈ అమ్మయిలు నాకు అర్థం కారు ;)

divya vani said...

బాగుంది మధురవాణి గారు ,నాకుకూడా మీలాగే జలుబు చేసినపుడు గొంతు మారితే బాగుంటుంది, నా వాయిస్ ని నేనే రికార్డు చేసుకొని వింటాను బాగుంటుంది కదా :) అని.

krishna said...

హహ్హహహ్హా.. చాలా బాగుంది.. మీలానే నేను కూడా ఒకసారి అక్కకి ఆటలమ్మ వచ్చి తెగ ఐసు క్రీములు, స్వీటులు లాగిస్తుంటే కుళ్లుకుని, కుట్ర పన్ని మరీ అంటిచుకున్నాను. కానీ ప్చ్.. ప్లాన్ అట్టర్ ప్లాప్:(
అందరూ స్వీటులు గట్రా తెచ్చి పెడుతుంటే తిందామని హెంత ఆశపడ్డానో.. కానీ తినలేకపోవడం ఒకటే కాదు, నా కోసం తెచ్చినవన్ని మా అక్క ( అప్పటికి తనకి తగ్గి పోయింది )తినేసింది వా:( అంతా తొండి ...

శివరంజని said...

హ హ హ .... ఎంత మంచి కోరిక మీకు జ్వరం కావాలా ?? మీకు లానే నాకు డౌట్స్ ఎక్కువ పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఇంట్లోవాళ్ళ వి ఫ్రెండ్స్ వి బుర్ర తినేస్తుంటాను..ditto మీకు లానే

రాధిక(నాని ) said...

నాకుస్కూల్ లో చదువుతుండగా ఎక్కువగా పరీక్షలప్పుడు జ్వరం వచ్చేది .కానీ జ్వరం తగ్గేక మళ్లి పరిక్షలు పెట్టేవారు.అదింకా బాదగా ఉండేది.:(

bharath nunepalli said...

mee flashback chala bagundandi... poina vaaram nenu maa project leader ki jwaram peru chepi 2 days leave teskuni haayi ga rest teskuna. papam maa team anta nanu oka week anta paramarsincharu :-D
mee katha vinaka, na experince gurtu vachindi...

Anonymous said...

పాపం మీ తమ్ముణ్ణి 7 ఏళ్ళ వయసులో హాస్టల్ లో పెట్టి చదివించారా

Anonymous said...

లక్ష్మి గారి మాటే నాదీను . ఇలా భయపెడితే ఎలా అమ్మాయ్ . పాపం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు......

Vinay Chakravarthi.Gogineni said...

nenu epudu ila cheyaledu and korikalu evi levu .........

but post baagundi.............

మనసు పలికే said...

మధురవాణి గారు.. మీరు సూ...పర్ అండీ.. మీ వెర్రి కాస్త నాకు కూడా అంటినట్లనిపించింది.. మీ బ్లాగులు చదివీ చదివీ నేను కూడా ఈ మధ్య అలాగే ప్రవర్తిస్తున్నానేమో అనిపిస్తుంది. మొత్తానికి నేను మీ బ్లాగు కి చాలా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాను. ..:) అందరికీ మీ బ్లాగుని చూపిస్తున్నానండీ :)

మంచు said...

వేపకాయంతొ ... గుమ్మడికాయంతొ ఇంకా అర్ధం కాలేదు :-))

సుభగ said...

:-) :-) బాగుందండి
జరుగుబాటుంటే జ్వరమంత భోగం లేదని ఊరకే అన్నారా?

నాకు చిన్నప్పుడు జ్వరం రావడం ఎంతో ఇష్టంగా ఉండేది. అమ్మా వేడి అన్నంలో నెయ్యి,వాము,ఉప్పు కలిపి పెట్టేది. ఆ వాము అన్నపు రుచి మళ్ళీ జ్వరమున్నపుడే బాగుంటుంది. చీటికి మాటికి పోట్లాడే అన్నయ్య కూడా చాక్లెట్లు తీసుకువచ్చి ఇస్తాడు అమ్మ చూడకుండా.

..nagarjuna.. said...

పోస్టు కెవ్..... :)
నేస్తంగారి మాటే నాదీనూ
ఏం పెట్టి(రాసి)చేసాడొగాని ఈ యాహూవాడు, స్మైలీలతో చంపేస్తున్నాడు..

Siri Vennela said...

నిజమేనండి నేను అలాగే చేసేదాన్ని , ఇంకా నెను హస్టెల్ నుంచి వచ్చిన ఎవరు నాకోసం ఏమి తెలేదని ఏదో ఒక వంక చుపించి గొడవ చెసేదాన్ని,
ఇప్పుడు ఇంటి నుంచి దూరం గ ఉంటుంటే తెలుస్తుంది అప్పుడు ఇంట్లొ ఎంత రాణి లాగ చూసుకునే వాళ్ళు అని

Kamalaker said...

nenu neelaane anukunevaanni maa tammunni choosi.... anukunnano ledo vachesindi ........... nuvvannatte Junk food ready.. Kaani appude vachindi chikku em tinalanipincahdu kadaa so daanikanna raakapovadame better anipinchindi kaneesam routine food ayina tine adrustam vuntundi........Inka ippudu vaste naa daanikanna narakaame best...........Very gud post

మధురవాణి said...

@ చిలమకూరు విజయమోహన్,
అలా జ్వరం తెచ్చుకుని ఆఫీసు ఎగరగోట్టినా, ఆ పని మళ్ళీ తెల్లారి మన నెత్తినే పడుతుంది.:( కాబట్టి ఆ కోరిక లేదండీ ప్రస్తుతానికి. ;-)

@ http://promotetelugu.wordpress.com/
:-)

@ 3g,
అయ్యయ్యో.. అలా జరిగేదా మీకు! అంతేనండీ.. మనక్కావలసినట్టు ఏదీ జరగదు. వద్దన్నప్పుడే వస్తుంది. అసలు సెలవుల్లో జ్వరమొస్తే ఎంత వేస్ట్ కదా.. ఇంట్లో వాళ్ళు ఆడుకోనివ్వరు కూడానూ :(

@ నిఖిత చంద్రసేన,
మనిద్దరం ఒకే జట్టన్నమాట అయితే! అయినా, మనకి జ్వరం వచ్చినప్పుడు పట్టించుకోకుండా ఉండటానికి ఇంట్లోవాళ్ళకి ఎన్ని గుండెలుండాలి పాపం! ;-)

@ harephala,
ధన్యవాదాలండీ! :-)

మధురవాణి said...

@ నేస్తం,
మిమ్మల్ని నవ్వించానంటే నా పోస్ట్ బాగున్నట్టే! థాంక్యూ :-) కదా.. ఆ స్మైలీలు అంత బాగున్నాయనే బాగా వాడబుద్దేస్తోంది నాక్కూడా ;-)

@ జాహ్నవి,
ఆహా..కాహ్నవి.. జలుబొస్తే ఇష్టం అనే వాళ్ళు నేను తప్ప మరొకరు ఉంటారని ఇన్ని రోజులూ అస్సలు అనుకోలేదు. ;-) మీ కోరిక త్వరలోనే తీరాలని ఆశీర్వదిస్తున్నా! ;-)

@ హరే కృష్ణ,
ధన్యవాదాలు. ఇలాంటి మాటలన్నీ మనసులో అనుకోవాలి గానీ, ఇలా పైకనేస్తారా ఎక్కడన్నా? అయినా, డిగ్రీ అయితే మాత్రం కరెంట్ షాక్ ఆడకూదడా అధ్యక్షా.. అని నేను గట్టిగా అడుగుతున్నాను. :-D

@ Ramu S,
అవునాండీ..మీ స్నేహిత్ కూడా మా బ్యాచేనా? మా తమ్ముడికి కోడా అంతే ఎప్పుడూ అరిసెల ఆకలి, సున్నుండల ఆకలి వేస్తుంటుంది. ;-)

@ కొత్తపాళీ,
గురూ గారూ.. థాంక్యూ! :-)

మధురవాణి said...

@ PSM లక్ష్మి,
మీరు మరీనండీ.. చూస్తే మాత్రం ఇహ ఇప్పుడు చేయగలింగింది ఏముందీ చెప్పండి? అయినా తినబోతూ ముందే రుచెందుకండీ పాపం! ;-) ఇహ ముందుజాగ్రత్తలంటారా.. అది నా తలనొప్పి కాదుగా! హీ హీ హీ :-ద

@ నాగ ప్రసాద్,
:-) :-)

@ జయ,
హహ్హహా.. భలే ఆశీర్వదించారు! థాంక్యూ! కానీ, ఇక్కడో కండిషన్ ఉంది. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడే రావాలి మరి! అలా సవరించి దీవించాలి మరి. ;-)

@ మాలా కుమార్,
హీ హీ హీ.. అంత నవ్వొచ్చేసిందా మీకు? థాంక్యూ! :-)

@ సావిరహే,
అంతేనండీ.. అంతే! :-)))

మధురవాణి said...

@ స్థితప్రజ్ఞుడు,
మీరు చెప్పింది నిజమే గానీ, ఈ కోరికలన్నీ నాకు చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. అదే మరి అసలు విషయం! ;-)
హహ్హహా..మీరు చేసిన పని భలేగా ఉందిగా! నాకు మాత్రం కళ్ళకలకలంటే భయం కొంచెం. అందుకే ఎప్పుడూ అలా అంటించుకునే ప్రయత్నం చేయలేదు. ;-)

@ భావన,
నిజంగా అలాంటి స్మాఎథ ఒకటి ఉందా! అయితే మీరన్నట్టు నాలాంటి వాళ్ళని చూసే పెట్టి ఉంటారు. :-D

@ వెంకట్,
హహ్హహ్హహా.. మీకలా అర్ధం అయిందన్నమాట! అలాగే కానివ్వండి.. ఏం చేస్తాం! ;-)

@ దివ్య వాణి,
అయితే జలుబు విషయంలో మీరూ నా జట్టేనన్నమాట! మారిన గొంతుని రికార్డ్ చేసి వింటారా.. చూడబోతే ఈ విషయంలో మీరు నాకంటే నాలుగాకులు ఎక్కువే చదివినట్టున్నారుగా! ;-)

@ కృష్ణ,
ప్చ్... అచ్చం నాకులానే జరిగిందన్నమాట! చా.. మనం హెంత కష్టపడి ప్లాన్ వేస్తాం.. ఏంటో అలా ఫ్లాప్ అయిపోతుంటాయి. ప్చ్! :(

మధురవాణి said...

@ శివరంజని,
హహ్హహా... బుర్ర తినేసే విషయంలో మనిద్దరం ఓ జట్టన్నమాట అయితే! ;-)

@ రాధిక (నాని),
హమ్మో.. ఇది మరీ దారుణం కదండీ! దానికంటే, ముందు మామూలుగా అందరితో పాటు పరీక్ష రాయడమే నయం కదూ!

@ bharath nunepalli,
హహ్హహ్హా.. అయితే మీరిప్పుడు కూడా ఈ జ్వరం చిట్కాని ఉపయోగిస్తున్నారన్నమాట! ;-)

@ అనానిమస్,
అవునండీ.. అప్పుడు కొన్ని కారణాల వల్ల హాస్టల్లో వేశారు. హాస్టల్ మరీ దూరం కాదు. మా ఊరి నుంచి ఒక 25 నిమిషాలు పడుతుంది బండి మీద. ఓ మూడేళ్ళ తరువాత మళ్ళీ ఇంట్లో ఉన్నాడు కొన్నేళ్ళు. మొత్తం మీద ఇంట్లోనూ, హాస్టల్లోనూ మారుతూ చదువుకున్నాడు.

మధురవాణి said...

@ లలిత,
హహ్హహ్హా... నేనేం భయపెట్టానండీ! ఉత్తినే నాలుగు ముచ్చట్లు చెప్పాను. అంతేగా! ;-)

@ Vinay Chakravarthi.Gogineni,
థాంక్సండీ! అయితే మీరు చిన్నప్పుడు చాలా మంచి పిల్లాడన్నమాట! :-)

@ అప్పు,
హహ్హహా... అవునా! :-) :-)
చాలా సంతోషంగా ఉంది. Thanks for sharing my blog with your friends. :-)

@ మంచు. పల్లకీ,
మంచు గారూ.. అర్ధం కాలేదా మీకు? అలా అయితే ఓసారి మీకిష్టమైన పేరుతో పిలవమంటారా? ;-)

మధురవాణి said...

@ సుభగ,
"జరుగుబాటుంటే జ్వరమంత భోగం లేదనీ" -- సామెత బాగుందండీ! :-)
జ్వరం వచ్చినప్పుడే తినే ఆ వాము అన్నం గురించి నాకు తెలీదండి. అవునండీ.. ఒంట్లో బాలేనప్పుడు అందరూ చాలా ప్రేమగా చూసుకుంటారు. అందుకేగా మరి జ్వరం వస్తే ఇష్టం అనిపించేది! ;-)

@ నాగార్జున,
థాంక్సండీ! నిజమే.. ఆ స్మైలీలు ఎంత ముద్దుగా ఉంటాయో కదా! :-)

@ సిరివెన్నెల,
నేనూ అచ్చం మీలానే చేస్తాను ఇంటికెళ్ళినప్పుడు. మీరు చెప్పింది నిజమండీ.. ఇంటి నుంచి బయటకొచ్చాకే ఇల్లు విలువ బాగా తెలుస్తుంది. :-)

@ కమలాకర్,
Thank you! అవును.. మరీ బాగా జ్వరం వస్తే.. ఏమీ తినాలనిపించదు అసలు. పైగా నీరసం కూడా వచ్చేస్తుంది. అందుకే ఏదో కొంచెం రావాలి అంతే! ;-)

Sai Praveen said...

సూపర్ అండి :)
జ్వరం వచ్చి స్కూల్ ఎగ్గోట్టేయ్యాలని అందరు పిల్లలు అనుకుంటారు కానీ ఇలా చికెన్ పాక్స్ అంటించుకుని మరి ఎగ్గోట్టాలని ట్రై చేసింది మీరు ఒక్కరేనేమో :)
ఆ ఏడుపు సీన్ తో మమ్మల్ని చాలా నవ్వించేసారు

Anonymous said...

నేను స్కూల్ రోజుల్లో ఎప్పుడూ అల అనుకోలేదు . అప్పుదంతా అమ్మో నేనీ స్కూల్ కి వెళ్ళాక పోతే లేస్సొంస్ ఎవరో చదువుతారు, బోర్డు మీద నొతెస్ ఎవరు రాస్తారు అని అనుకునేదానిని.
ఒక్క రోజు స్కూల్ కి వెళ్ళాక పోతే నన్ను స్కూల్, నేను స్కూల్ ని చాల మిస్ అవుతామని బెంగ. కాని ఇప్పుడు మాత్రం ఆఫీసు కి వెళ్ళలంటే చాల ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉత్తిత్తినే బోబం స్కారే వస్తే బాగుణ్ణు, లేదా ఫల్సె ఫైర్ అలారం రావాలి, స్య్స్తెంస్ షట్ డౌన్ అయిపోవాలి. ఏవో ఇలాంటి పిచ్చి ఆలోచనలు.

మధురవాణి said...

@ సాయి ప్రవీణ్,
మీ కామెంటుకి జవాబు ఇవ్వలేదని రెండేళ్ళ తర్వాత చూసి తెలుసుకున్నానండీ.. :P
హిహ్హిహ్హీ.. నా ఘనత గుర్తించారు మీరు. క్షమాపణలు మరియు ధన్యవాదాలు. :)

@ అనానిమస్,
అయితే మీరు చిన్నప్పుడు చాలా సిన్సియర్ స్టూడెంట్ అన్నమాట.. బాగు బాగు.. :)
నిజమేనండీ.. చిన్నప్పుడు ఏదో ఒక కారణంతో అప్పుడప్పుడూ స్కూలుకి సెలవలొచ్చేవి కానీ ఈ డొక్కు ఆఫీసులకి మాత్రం చస్తే సెలవలు రావు అలాగా.. :( :(
ఏ మాటకామాటే, ఆఫీసుకి సెలవు రావడం కోసం మీకొచ్చిన అయిడియాలు మాత్రం సూపర్ గా ఉన్నాయి.. :D
ఎప్పటిదో పాత పోస్ట్ చదివి ఓపిగ్గా కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు. :)