Tuesday, July 06, 2010

మిస్ 'పనిమంతురాలు'

అదేంటోగానీ నేను చిన్నప్పటి నుంచీ మహా చురుకైన పిల్లని. అంటే చకచకా అన్నీ పనులు చక్కబెట్టడంలో అనుకునేరు. కానే కాదు.. కూర్చుని మాటలు చెప్పడంలో! చిన్నప్పటి నుంచీ స్కూలు, చదువుకి సంబంధించిన విషయాలేవైనా సరే ఎప్పుడూ చురుకే. కానీ, ఇంటి దగ్గరికొచ్చేసరికి మాత్రం.. ప్రతీ దానికీ అమ్మ నామస్మరణమే! స్కూలుకెళ్ళే రోజుల్లో నా దినచర్య ఎలా ఉండేదంటే, పొద్దున్నే తక్కువలో తక్కువ కనీసం ఓ పదిసార్లు మా అమ్మ వచ్చి నన్ను నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. నిద్ర లేపిన ప్రతీసారి సాగరసంగమంలో కమలహాసన్ లా భంగిమ మారుస్తూ మంచంలో ప్రదక్షిణాలు చేయడం నేను చేసే మొదటి పని. "ప్లీజ్ అమ్మా.. ఒక్క ఐదు నిమిషాలాగి మళ్ళీ లేపు" అనే మాటని తారకమంత్రంలా ప్రతీ ఉదయం స్మరిస్తూ ఉండేదాన్ని. నా యీ ప్రహసనం చూసి మా నాన్న గోడ గడియారంలో ఇరవై నిమిషాలు ఫాస్ట్ గా పెట్టారు. అయినా, నేను నా అమోఘమైన తెలివితేటలు ఉపయోగించి ఆ ఇరవై నిమిషాలు లెక్కేసుకునే లేచేదాన్ని. స్కూలు టైముకి సరిగ్గా ఓ అరగంటో, నలభై నిమిషాలో మిగిలి ఉన్నప్పుడు లేచేదాన్ని. ఇంక ఆ తరవాత టూత్ బ్రష్ దగ్గరి నుంచీ స్కూల్ టై, సాక్స్ దాకా అన్నీ అమ్మ అందివాల్సిందే! ఎనిమిది, తొమ్మిది తరగతులకి వచ్చేసరికి పక్కూర్లో ఉన్న స్కూల్లో చేరడం వల్ల రోజూ ఆటోలో వెళ్ళొచ్చేదాన్ని. ఆటో వచ్చే టైముకి చక్కగా రిబ్బన్లతో జడలల్లి, టిఫిను కూడా తినిపించి, లంచ్ డబ్బాతో సహా నన్ను సిద్దంగా ఉంచేది మా అమ్మ. సరిగ్గా ఆటోలో కాలు పెట్టబోయే ముందు "అమ్మా.. మంచినీళ్ళు" అని కేకేసేదాన్ని. అదేంటో తెలీదు కానీ ఎక్కడికన్నా బయటికెళ్ళాలంటే చాలు, సరిగ్గా అప్పుడే దాహమేస్తుంది నాకు. ఇప్పటికీ మా అమ్మ అంటుంది "చిన్నప్పటి నుంచీ యీ అలవాటు పోలేదు నీకు" అని.

అప్పుడప్పుడూ మా అమ్మా, అమ్మమ్మా కొంతమంది అమ్మాయిల గురించి తెగ మెచ్చుకునేవారు. ఎందుకంటే, వాళ్ళందరూ చాలా ఒద్దికగా, పద్దతిగా ఇంటి పనులూ, వంట పనులూ చక్కగా చేయడం, వాళ్ళింట్లో వాళ్లకి సహాయంగా ఉండటం, అన్నీటికంటే ముఖ్యంగా 'అమ్మాయంటే అలా ఉండాలి' అనే సర్టిఫికేటుని అందరి దగ్గరి నుంచీ పొందటం... వగైరా గొప్ప లక్షణాలన్నీ కలిగి ఉండటం వల్ల అలా మెచ్చుకునేవాళ్ళు. అలా మెచ్చుకుని ఊరుకోకుండా, మధ్య మధ్యలో నా మీద పడేవాళ్ళు. "నువ్వూ ఉన్నావ్ ఎందుకూ.. అమ్మాయన్నాక అన్నీ పనులూ చక్కబెట్టే నేర్పరితనం ఉండాలి. రేపు వెళ్ళే ఇంటి దగ్గర 'ఎవరమ్మా నిన్నింత గొప్పగా పెంచిన ఆ మహాతల్లి' అని నీ మొహం మీదే మమ్మల్ని అ(క)డుగుతారు?" అంటూ ఎప్పుడన్నా అన్నారనుకోండి. వెంటనే నేనేం తడుముకోకుండా "అదేంటే అలా అంటారు.. ఎంత మాట ఎంత మాట.. వాళ్ళంతా ఇదిగా అడిగితే మా తల్లి గారు ఫలానా.. మా అమ్మమ్మ గారు ఫలానా.. అని ఆ మాత్రం వివరాలు చెప్పకపోనా ఏంటి?" అని బదులు చెప్పేదాన్ని నేను.jelir వాళ్ళు అప్పుడేమంటారో మీకు తెలుసుగా! ఏముందీ.."ఇలా మాటకి మాట చెప్పమంటే మాత్రం ముందుంటావ్! నువ్వు కూడా కాస్తో కూస్తో పని నేర్చుకోవచ్చుగా" అంటారు.

ఏదో మాటల సందర్భంలో అలా ఓ మాట అంటుంది గానీ, మా అమ్మ ఎప్పుడూ గట్టిగా నువ్వీ పని చెయ్యి అనేది కాదు. ఎలా అంటుంది పాపం నా బద్ధకం గురించి తెలిసి కూడా. ఓసారిలాగే సోఫాకి అతుక్కుని టీవీ చూస్తూ "అమ్మా.. మంచీళ్ళు.." అని కేక పెట్టాను. మా అమ్మకి ఒళ్ళు మండి "పొద్దుటి నుంచీ అలానే బద్దకంగా పడుకుంది గాక, పదడుగుల దూరంలో ఉన్న మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేవా? నేను చేస్తున్న పనాపి నీకు తెచ్చివ్వాలా? నీకు దాహమేస్తే నువ్వే తెచ్చుకో" అని సహాయ నిరాకరణోద్యమం చేద్దామనుకుంది నా మీద. కానీ, నేను మాత్రం అలాగే బద్దకంగా టీవీ చూస్తూ దాహం సంగతే మర్చిపోయాను. ఓ అరగంటయ్యాక మా అమ్మెందుకో ఆ గదిలోకొచ్చి నీళ్ళు తాగావా అంటే లేదన్నాను. అంతే, మా అమ్మకి చాలా కోపం, బాధా రెండూ కలిగాయి. ఇంత బద్దకమా అని కోపం.. దాహం వేసినా ఇంతసేపు నీళ్ళు తాగకుండా ఉన్నానే అని బాధ. పాపం అప్పటికప్పుడు ఓ గ్లాసు మంచినీళ్ళు తెచ్చి తాగించింది. అంతటి ఘన చరిత్రన్నమాట నాది! topiencem

అలాంటి నాకు ఓ రోజు బుర్రలో ఏదో పురుగు తిరిగి మా అమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా నేనివాళ నీకు పనిలో సాయం చేస్తాను అని అడిగా! నాలో వచ్చిన ఆ పెనుమార్పుకి మా అమ్మకి ఉక్కిరి బిక్కిరై కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చినంత పనయింది. సరే, యీ దొండకాయలు కోసివ్వు అంది. సరేనని చెప్పి వంట గదిలో కాకుండా హాల్లో మధ్యలో ఓ పేద్ద సెట్టింగు వేసుకున్నా దొండకాయలు కోసే ప్రాజెక్టు కోసం. ఓ పేద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని, అందులో దొండకాయలేసి అది తీస్కెళ్ళి అక్కడ పెట్టుకున్నా. ఇంకో గిన్నేమో కోసిన ముక్కలేయడానికి, మరొకటేమో, తీసేసిన ముచ్చికలు వెయ్యడానికి పెట్టుకున్నా. కడిగిన కాయలు తుడవడానికి ఒక నేప్కిన్ పెట్టుకున్నా. కాయలు కోయడానికి ఓ చెక్క, కోసే ముక్కలు ఆ చెక్క మీద నుంచి కింద పడిపోకుండా జాగ్రత్త కోసం దాని కింద ఓ పేద్ద ప్లేటు, ఓ కత్తి, యీ సెట్టింగు అంతా పెట్టడానికి ఒక పీట, అలాగే నేను కూర్చోడానికి మరో పీట... ఇలా ఓ అరగంటసేపు అటూ ఇటూ తిరిగి, అదెక్కడుంది ఇదెక్కడుంది అని మా అమ్మని విసిగించి కావలసిన సరంజామా అంతా అమర్చుకున్నా. ఎదురుగా టీవీ పెట్టుకుని, చేతికందేట్టు రిమోట్ కూడా పెట్టుకున్నా! ఇహ జైహింద్ అనుకుని దొండకాయలు తరిగే మహా యజ్ఞం మొదలు పెట్టా! ఎంతో పద్దతిగా, ఒద్దికగా ఒక్కొక్క దొండకాయ మీదా స్పెషల్ కేర్ తీస్కుంటూ తరగడం మొదలెట్టా. అదేంటో, అంత ఇదిగా శ్రద్ధ తీస్కుని తరుగుతున్నా ముక్కలన్నీ తలా ఒక సైజులో వస్తున్నాయి. అయినా సరే అలుపెరుగని మహా యోధురాలిలాగా అలా అలా ఓ గంట పైగా ఎంత తరిగినా ఆ అరకేజీ దొండకాయలు మాత్రం అయిపోవట్లేదు. యీ లోపు మా అమ్మ వచ్చి "ఆహాహా.. బంగారమ్మా.. ఎంత పనిమంతురాలివే నా తల్లీ.. ఇంత పేద్ద వేదిక ఏర్పాటు చేసుకున్నావన్నమాట యీ పనికి! సర్లే.. ఇలా అయితే ఇవ్వాళ రాత్రికి అందరం పస్తుండాల్సి వస్తుంది. కష్టపడింది చాల్లే! ఇంక నేను కోసుకుంటాను" అని చెప్పి తీస్కెళ్ళిపోయింది. ఓ ఐదు నిమిషాల్లో మిగిలినవి తరిగేసి కూర చేసేసింది. అందరూ అన్నం తినేప్పుడు "యీ రోజు కూర కోసం దొండకాయలు కోసింది నేనే! అది నేనే!" అంటూ వాళ్ళందరికీ మెతుక్కోసారి చొప్పున మళ్ళీ మళ్ళీ చెప్పి చంపేసాను.sengihnampakgigi ఆ దెబ్బకి హడలిపోయి అందరూ మూకుమ్మడిగా మా అమ్మని ప్రార్థించారు.. ఇక మీదట నా చేత ఇలాంటి బృహత్కార్యాలు చేయించద్దని.tensiondoa

మరుసటి రోజు ఒకటే గొడవ నేను నా కుడి చెయ్యి నొప్పిగా ఉందని చెప్పి.nangih ఏదో ఆటల్లో దెబ్బ తగిలించుకున్నానేమో అనుకుంది మా అమ్మ. మోచెయ్యి పైన జబ్బంతా వాసినట్టు ఒకటే నొప్పి. చాలాసేపటికి మాకు అర్ధమయ్యింది. ఆ నొప్పి క్రిందటి రోజు పెట్టుకున్న 'దొండకాయలు తరిగే ప్రాజెక్టు' మూలంగానేనని. నాన్నొచ్చాక చెప్పింది అమ్మ 'మీ రాకుమారి గారు ఎంతటి సుకుమారులో చూడండి. గట్టిగా ఓ ఇరవై దొండకాయలు తరిగినందుకు చెయ్యి వాపు వచ్చిందని ఇవ్వాళంతా నా చేత నొక్కించుకుంటూనే ఉంది" అని. నేనేమో "గంటకి పైగా చాలా కష్టపడి తరిగాను నాన్నా" అని దీనంగా మొహం పెట్టుకుని చెప్పాను. మా ఇద్దరి వాదోపవాదాలు శ్రద్దగా విన్నాక నాన్న ఇలా తీర్పు చెప్పారు. "హెంత మాట హెంత మాట... మా అంతఃపురంలో మా ముద్దుల రాకుమారి చేత దొండకాయలు తరిగించుటయా! అహో.. ఎంతటి ఘోరము.. నా చిట్టితల్లి మీద అంత భారం మోపి నీవేమి చేయుచున్నావు. ఇక మీదట యీ ఇంట్లో నా బంగారుతల్లి చేత ఇటువంటి కష్టతరమైన పనులు చేయించే ప్రయత్నం ఎవరైనా చేసినచో యీ మహారాజు దండనకి గురి కావాల్సి వస్తుంది" అంటూ హుకుం జారీ చేసి నన్ను దగ్గరికి తీసుకుని కాసేపు చెయ్యి నొక్కి పెట్టారు. celebrate

ఇప్పుడు చెప్పండి మీరే.. నేనెంత పనిమంతురాలినో!sengihnampakgigikenyit


34 comments:

Sravya V said...

హ హ హ బాగుంది మిస్ పనిమంతురాలు గారు :)

సుజ్జి said...

అమ్మాయా.. నీ అంత పనిమంతురాలు నువ్వే కదా అంట!!
నువ్వేలాగే ముందుకు వెళుతూ శ్రీమతి పనిమంతురాలివి కావాలని కోరేసుకుంటున్న!! ;)

పరిమళం said...

:) :)

Anonymous said...

నా తల్లే నా బంగారమే....ఎంత పనిమంతురాలో .
(పాపం ఎక్కడ పుట్టిపెరుగుతున్నాడో వెర్రినాగన్న ఈ జన్మకి వాడి పని మటాషే )

హరే కృష్ణ said...

హ హ్హ
భలే రాసారండీ

శిశిర said...

:)

మాలా కుమార్ said...

చాలా గొప్ప పనిమంతురాలివి తల్లీ . నీఅంత పని మంతురాలు ఈ లోకం లోనే లేదంటే నమ్ము .

ఏకాంతపు దిలీప్ said...

ఎవరు కాదన్నారూ? కాదంటే మహారాజు గారు అంతఃపురానికి పిలిపిస్తారేమో! :)

sphurita mylavarapu said...

హుం...మహారాణి గారు ఇప్పుడు కూడా అలాగే వున్నారా...?భారత దేశం యువరాణీ గారు...Germany దేశం లో ఇంకేదో అయ్యుంటారే...:)

..nagarjuna.. said...

యువరాణి వారికి జేజేలు. అయినా పనిమంతురాలు అని అనిపించుకోవడానికి మీరు సిద్దం చేసిన ఆ సభాస్థలి వర్ణణే చాలు ఎంత గో......ప్ప్ప శ్రద్దాసక్తులుగల పనిమంటులో చెప్పడానికి వేరే ఎవరో నిర్దారించడం దేనికి ;)

పోస్టుకి స్మైలీలు రచ్చ రచ్చగా ఉన్నాయి... :)

swapna@kalalaprapancham said...

nidra varaku chadiva post. same nannu nenu chusukunnattu undi.
school lo unapudu sunday roju baga nidrapoyedanni. ma amma nannu lepadaniki shathavidhala try chesedi. okkosari mi frnd vachhinde ani, inko sari mi frnd call chesinde ani, inko sari ekamga fan bandh chesedi. fan lekapothe gaali adaka chiraku lesi ventane meluka vastadi naku. aa trick ma amma ki baga telusu. ippatiki ma intlo gadiyaram oka 20mins fast gane pedutharu. office ki veletapudu tondaraga vellali ani ado satisfaction. ma dad ika nidra leche daaka pattu vadalani vikramarkudu laaga leputune untadu ayina manam vinam,nanna plz okka 10 mins tarvatha lestanu antu ala daily antune unta. glass ikadi nunchi akkadiki tisi pettedi kuda ledu manam. ma amma tho daily naku akshinthalu, okavela lekapothe a roju edo pedda wonder jariginatte. epudo na buddi marithe epudina chinna help chestanu ika chudu a roju pandage panduga naku , ma amma tega mechhukuntadi a rojantha ma amma ivala chala kashtapaddadi ani ;) ala epudo yr ki oka roju vastundi ala mechhukodam ;)
so miru kuda na antha miss panimanthuraalu annamata. inkevarina unnara ;)

nijamga mrg ayyi job chese vallu ela manage chesukuntaro emo, apudu ila amma undaduga :(

Inthaki mi current position enti,student aa, working aa or married aa?

Rachana said...

Madhuragaru meru kuda okapudu nalane manchi panimanthulanamata :)

భావన said...

హ హ హ గొప్ప పనిమంతురాలివే.. లలిత డైలాగే నాది కూడా. పెళ్ళెయ్యాక ఒక సారి దొండకాయల ప్రహసనం రిపీటో... అంతే ఇక మిగతా జీవితం హాయి గా గడిపెయ్యవచ్చు యువ రాజా వారే చూసుకుంటారు. ;-)

సవ్వడి said...

" పనిమంతురాలు నెం. 1 " అనే బిరుదుని ప్రధానం చేస్తున్నాం.
సూపర్... భలే నవ్వించారు.

Enimidi said...

"ఆనంద బాష్పాలు" బదులు "ఆనంద భాష్పాలు" అని అచ్చు తప్పు పడింది.
మీ బ్లాగ్ను తెలుగు బ్లాగ వరల్డ్లో ఆడ్ చెయ్యండి. telugublogworld.blogspot.com/

రాధిక(నాని ) said...

మదురవాణీగారు,మీరూ మా అమ్మాయి లాగానే మంచి పనిమతురాలేననమాట. :):)

సుజాత వేల్పూరి said...

హెవరక్కడ? ఈ రాకుమారిని బందించి జైల్లో పడేసి రెండు బస్తాల దొండకాయలు ఒక మొద్దు కత్తీ పడేయండి.గంటలో మొత్తం తరిగేయాలి. లేకపోతేనా...!

శివరంజని said...

అయ్ .... నా గురించే నా మీరు చెప్పేది ... మధుర గారు నాన్న గారం ఎక్కువ గా ఉన్నవాళ్ళు అందరూ ఇలాగే మిస్స్ పనిమంతులు అవుతారేమోనండి. పోస్ట్ మాత్రం కెవ్వు కేక ...

గీతిక said...

ha ha ha. చాలా బాగా వ్రాశారు.

కానీ పోస్ట్ సగంలోనే ఆపేసేరేంటండీ...?

దొండకాయలు కొయ్యడానికి, దానివల్ల వచ్చిన చెయ్యి నొప్పికి ఒక పోస్ట్... ఓకె. మరి గంటసేపు దొండకాయలు కోసినందుకు.. ఆ జిగురుతో వేళ్ళు మొద్దుబారడం గురించి, అది పోయేవరకు మీరు పడ్డ కష్టాల గురించి...?

next.. సీక్వెల్ వ్రాయండి.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

Anonymous said...

madhuravaani gaaru,

mee blog ni nenu eenadu paper lo choosi chadavadam modalu pettanu. saradaaga, malli malli chadivinchela untaayi mee posts anni. mukhyangaa mee germany kaburlu, mee chinnappati kaburlu, bangaram mucchatlu naaku baaga nacchayi. ee 'miss panimanthuralu' blog kooda saradaaga navvukovadaaniki baaga raasaru. manamedo saradaga raasukunte paravaledu kaani, naaku ee blog chadivaka oka vishayam cheppa buddi ayyindi. adi mimmalni uddesyincho, leka marokarini uddesyincho kadu sumandi. idi kevalam naa personal opinion maatrame. meeru kooda deenini sportive gaa teesukuntaaru ani anukuntunnanu.

naa uddesyam lo ammayilaki chaduvu entha mukhyamo, inti panulu kooda anthe mukhyam. ante, chaduvu maanesi pani chesthu kurchovadam kadu nenu anedi. ee aadapillaina putti intlo gaarabangaane peruguthundi. kaani aa gaarabam valla aa ammayiki pani kooda nerpakunda unte pelli ayina tharuvatha konni kashtalu thappavu. ade pelli ki munde kontha inti pani, kontha vanta pani nerchukuni undi unte tharuvatha tharuvatha aa training aa ammayiki enthagaano upayoga paduthundi ani naa abhiprayam. entha sepu amma manaku cheyyadame kaani, okka saari manamu amma ki chesthe aame pade aanandam andulo manam pade aanandam, ivi anni chepthe kaadu, anubhavisthene baaguntaayi. meeru ituvanti topics meeda blog okati raasthe adi charchaku kooda baaguntundi. maro vidhangaa anukokandi. mee blog chamatkaaranga, haayiga undi. kaani naaku ee sandarbham lo ee point kooda chepthe baguntundi ani anipinchindi. meeru maro vidhanga dayachesi bhavinchakandi.

sunita said...

hahaha!baagundi.

..nagarjuna.. said...

@సుజాతగారు : అలా చేస్తే రాణివారు కోసిన ముక్కలతో వారు స్వయంగా వండిన కూరను తినాల్సి వస్తుందిమరి...మరి బంధించమంటారా!?

సుజాత వేల్పూరి said...

నాగార్జున,
మనకేం పని ఆ కూర తినే దాకా? జైల్లో పడేసి తాళాలు రాజు గారిముందు పడేసి పారిపోదాం! రాజుగారికెలాగూ తప్పదు రాకుమరి వంట తినక!

ఆ.సౌమ్య said...

హ హ హ ఈ పోస్ట్ చదువుతూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. ఇలాగే మా అమ్మోసారి అర్జంటు పని మీద బయటికెళ్ళాలి బెండకాయలు తరిగి వేయిస్తావా అంది. నేను ఓ అలాగే అని చెప్పి బెండకాయలని చక్కగా కడిగి, అలా నీళ్ళు నీళ్ళుగా ఉండగానే మూకుడులో వేసి పైన కాస్త నీళ్ళు చిలకరించి మరీ మూత పెట్టా. ఓ 10 నిముషాల తరువాత చూద్దును, జిగురు జిగురుగా ఉంది పదార్థం, ఏమయ్యిందో అర్థం కాక, కాసింత ఉప్పు, పసుపు, కారం వేసి చూసా. అబ్బే జిగురు ఎర్రరంగుకి మారింది తప్ప తేడా ఏమీ లేదు. స్టవ్ కట్టేసి బుద్ధిగా వచ్చి కూర్చున్నాను అమ్మొచ్చేవరకు. రాగనే నా వలకం చూసి గ్రహించేసింది నేను వంట తగలెట్టానని. వెళ్ళి చూస్తే ఏముంది ముక్కుచీమిడి కి ఎక్కువ, బంక జిగురికి తక్కువ అన్నట్టుంది. బెండకాయల్లో ఎవడైనా నీళ్లు చిలరకిస్తాడుటే నీ మొహం అని నాలుగు విసుర్లు విసిరి మళ్ళీ అప్పటికప్పుదు వంకాయలు తరిగి కూర చేసింది మా అమ్మ. ఆ జిగురు పదార్థం అంతా నేనే నా చేతులతో బయట పారబోసాను. నాకెంత బాధనిపించిందో అప్పుడు, నా మొదటి వంట ఇలా కాలవపాలయ్యిందే అని :P

karthik said...

మీరు ఒక మోస్తారు పనిమంతులు మాత్రమే అసలు నా గురించి మీకు తెలీదులాగుంది.. ఒకసారి ఈ టపా చదవండి..
http://nenu-naa-svagatam.blogspot.com/2007/08/blog-post.html

@సౌమ్య,
నువ్వు కూడా పర్లేదు..కానీ నా స్థాయికి ఎదగాలంటే ఉబుంటూ సాయంతో చెహోవ్ రచనలు చదువు !

ప్రసాదం said...

మీ కూరల సంగతి తిన్నవారికి ఎరుక, రెండు టపాలూ బావున్నాయి.

@ సౌమ్య గారూ,

" నాకెంత బాధనిపించిందో అప్పుడు, నా మొదటి వంట ఇలా కాలవపాలయ్యిందే అని "

మీరు భలేవారండీ, తిన్నవారు ఆస్పత్రి పాలవడం కంటే అది కాలవ పాలు కావడమే నయం కదా?

మధురవాణి said...

@ శ్రావ్య వట్టికూటి, హరేకృష్ణ,
థాంక్సండీ! :-)

@ సుజ్జీ,
నీ దీవెన బాగుంది గానీ శ్రీమతి అయ్యాక కూడా ఇంత పనితనం చూపిస్తే తన్ని తగలేస్తారేమో అమ్మాయా.. ;-)

@ పరిమళం, శిశిర
:-) :-)

@ లలిత,
అబ్బ.. మీరు మరీ అలా పొగిడేస్తుంటే నాకు సిగ్గేస్తోంది బాబూ.. ఏదో అంతా మీ అభిమానం! ;-) :-D

@ మాలాకుమార్,
అలా అన్నారు.. బాగుంది. :-) ఇలా అనిపించుకోవాలనేగా నా పనితనం గురించి మీ అందరికీ చెప్పింది. హీ హీ హీ ;-) :-D

మధురవాణి said...

@ ఏకాంతపు దిలీప్,
అవునండీ.. కాదంటే రాజుగారు అంతఃపురానికి పిలిపించి నేను వండిన వంటలన్నీ మీ చేత తినిపిస్తారు. ;-)

@ స్ఫురిత,
మరేనండీ.. బాగా చెప్పారు. మీరొక్కరే అసలైన పాయింటుని క్యాచ్ చేశారు. మనందరం మన ఇంట్లో ఉన్నన్ని రోజులే కదండీ ఈ రాకుమారి వైభోగాలు.. బయటికొచ్చాక అవన్నీ మాయమైపోతాయ్ :-(
అదేదో సినిమా పాటలో "కాలేజీలో ఉన్నప్పుడు మహారాజులు.. గేటు దాటాక మామూలు ప్రజలౌదురు" అంటారు. అలాగే అమ్మాయిలు కూడా పుట్టింట్లో ఉనప్పుడు మహారాణులు... బయటికొచ్చాక మామూలు స్త్రీలౌతారు" ;-)

@ నాగార్జున,
చాలా థాంక్సండీ.. నా పనితనాన్ని, నాకున్న గో..ప్ప శ్రద్ధాసక్తులనీ సరిగ్గా అర్ధం చేసుకున్నారు. :-)

@ స్వప్న,
మీరూ ఇదే కేటగిరీ అన్నమాట! ఇంకా, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ వైభోగాలు చెల్లుతున్నాయి. మీరూ ఓసారి ఇంటి నుంచి బయటపడితే మాలాగే అవుతారు. పైన స్ఫురిత గారికి చెప్పిన మాట చూడండి ఓసారి. నా ప్రస్తుత పరిస్థితి ఏంటని అడిగారు.. తరువాతి టపాలో రాశాను చూడండి. :-)

@ రచన,
మీరూ నా జట్టేనా! నాబోటి పనిమంతులు చాలామందే కనిపిస్తున్నారు. సంతోషంగా ఉంది. :-)

మధురవాణి said...

@ భావన,
అసలు మీరు ఎంత అద్భుతమైన అయిడియా ఇచ్చారో తెలుసా? ఈ ఎత్తుకి తిరుగే ఉండదింక. ఇలాంటి అమూల్యమైన అవిడియాలు అప్పుడప్పుడూ విసురుతుండండీ. ;-) :-ద

@ సవ్వడి,
చాలా థాంక్సండీ.. నా పనితనాన్ని గుర్తించి బిరుదు ప్రధానం చేసినందుకు. :-) :-)

@ ఎనిమిది,
చాలా థాంక్సండీ తప్పు సరిదిద్దినందుకు. మీరు చెప్పినట్లే నా బ్లాగు కలిపాను మీ వెబ్సైటులో.

@ రాధిక (నాని),
మీ అమ్మాయి నా జట్టంటే, మీరు ఈ పనితనాన్ని భరిస్తున్న అమ్మల జట్టవుతారన్నమాట! ;-) :-ద

@ సుజాత, నాగార్జున
హమ్మో..రాకుమారికి హింతటి కఠిన శిక్ష వేస్తారా? అలా అయితే ఆ శిక్ష అమలు చేయడానికి జీవితకాలం పడుతుందేమో! అయినా, నాగార్జున గారు భలే అవిడియా ఇచ్చారుగా! రాజుగారితో చెప్పి ఆ పని చేయిస్తాను. హన్నా.. రాకుమారిని జెయిల్లో వేసి పారిపోతారా? అలా చేస్తే మిమ్మల్ని వెతికి పట్టుకొచ్చి జీవితాంతం రాకుమారి చేతి వంట తినిపిస్తారు రాజు గారు. ;-) :-D

మధురవాణి said...

@ శివరంజని,
పోస్ట్ నచ్చినందుకు సంతోషం :-) మీరు చెప్పింది నిజమే! చూడబోతే మనలాంటి పనిమంతులే ఎక్కువలా ఉంది. వెరీ గుడ్డు :-)

@ గీతిక,
నా పోస్టు మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ! సీక్వెల్ రాసాను చదివి చెప్పండి ఎలా ఉందో! :-)

@ అనానిమస్,
ముందుగా మీ సుదీర్ఘ వ్యాఖ్యకి ధన్యవాదాలు. నా బ్లాగుని ఓపిగ్గా మొత్తం చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన ప్రతీ మాటతోనూ నేను ఏకీభవిస్తానండీ! పోస్ట్ నిడివి ఎక్కువైపోతుందని మొత్తం ఒకసారే పోస్ట్ చేయలేదు నేను. మళ్ళీ దీనికి కొనసాగింపు రాశాను. అది కూడా చదివి మీ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తాను. మీరు చాలా మంచి మాట చెప్పారు. ఇందులో వేరేగా అనుకోడానికేమీలేదండీ! వివరంగా మీ అభిప్రాయం తెలియజేసినందుకు మరోసారి కృతజ్ఞతలు. :-)

@ సునీత,
ధన్యవాదాలండీ! :-)

మధురవాణి said...

@ సౌమ్య,
చాలా బాగుందండీ మీ పనితనం కూడా.. అయితే మీరూ నాకెదురొస్తారన్నమాట పనితనంలో! ;-)

@ కార్తీక్,
మీ టపా చూసానండీ! మీ స్థాయికి మేమెవరం సరితూగేలా లేము :-D

@ ప్రసాదం,
థాంక్సండీ! మరేనండీ.. రుచి తిన్నవారికే ఎరుక.. అది బ్రహ్మ రహస్యం!! :-) :-)

tankman said...

బెండకాయలు తుడవడానికి నాప్కిన్ పెట్టుకున్నారు చూడండి ....అది సూపర్

మధురవాణి said...

@ sanju -The king!!!
:-D :-D

సలక్షణ దీక్షిత ఘనపాఠి సన్నిధానం said...

దొండకాయ కూర చాలా ఇష్టం నాకు దాని లాగే మీ టపా కూడా బాగుంది