Friday, December 19, 2008

నా ప్రేమ నవ పారిజాతం.. పలికింది ప్రియ సుప్రభాతం..!!

హాయ్ హాయ్..
పైన టైటిల్ చూసారుగా.. ఇది ఒక పాట పల్లవి. "నా ప్రేమ నవ పారిజాతం.. పలికింది ప్రియ సుప్రభాతం" అనే పాట 1990 లో మరో '20 శతాబ్దం' అనే సినిమాలోది. సుమన్, లిజి, సుమన్ రంగనాథన్ తదితరులు నటించారు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి జె.వి రాఘవులు గారు సంగీతాన్ని అందించారు. పాటలన్నీ బాలు, సుశీల పాడారు. చిత్రంలోని పాటలన్నీటినీ డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు మరియు జొన్నవిత్తుల రాసారు. వీళ్ళిద్దరిలో పాటని ఎవరు రాసారో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. నేను సినిమా ఎప్పుడూ చూళ్ళేదు. పాట సన్నివేశం మాత్రం ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసినట్టు లీలగా గుర్తుంది. ఒక డాబా మీద హీరో-హీరోయిన్లు పరిగెత్తుతూ పాట పాడుతుంటారు. హీరోయిన్ లంగావోణిలో రెండు జడలు వేసుకుని ఉంటుందనుకుంటా.. అదొక్క సీనే నాకు గుర్తుంది. డాబాకి చుట్టూ పిట్టగోడ కూడా లేనట్టు గుర్తు.. అప్పుడు నాకు భయమేసింది కూడా.. వీళ్లేంటి చుట్టూ గోడ లేకపోయినా భయం లేకుండా పరిగెత్తేస్తున్నారు..పడిపోతే ఎలా.. అని :)

పాట మాత్రం వినడానికి చాలా బావుంటుంది. సినిమాలో బాగా ప్రసిద్ది పొందిన మరో పాట 'అమ్మను మించిన దైవమున్నదా'.. పాట చాలా మందికి ఇష్టం. దాని గురించి మరోసారి చెప్తానులే గానీ.. ఇప్పుడు మాత్రం పాట విని చూడండి. పాట సంగీతంతో పాటుగా.. సాహిత్యం కూడా బావుంటుంది. మీరే చూడండి ఓసారి..

నా ప్రేమ నవపారిజాతం..
పలికింది ప్రియ సుప్రభాతం..
నా ప్రేమ నవ పారిజాతం..
పలికింది ప్రియసుప్రభాతం..

నీ ఎద వీణపై.. మన కథ మీటగా..
నీ ఎద వీణపై.. మన కథ మీటగా..
అనురాగాల రాదారి రానా.. నూరేళ్ళ బంధాన్ని కానా..

నా ప్రేమ నవ పారిజాతం..
పలికింది ప్రియ సుప్రభాతం..

వేదంలో స్వధంలా స్థిరంగా.. సాగాలి.. సుఖంగా.. శుభంగా..
స్నేహంలో యుగాలే క్షణాలై.. నిలవాలి వరాలై నిజాలై ..
గత జన్మ బంధాలు నేడు.. జతగూడి రావాలి చూడు..
గగనాల పందిళ్ళలోన.. సగభాగమౌతాను నీకు..
ఇక సుముహూర్త మంత్రాలలోన.. శృతి చేయి అనురాగ వీణ...

నా ప్రేమ నవ పారిజాతం..
పలికింది ప్రియ సుప్రభాతం..

ఈనాడే ఫలించే తపస్సే.. ప్రేమించి వరించే వయస్సే..
లోకాలే జయించే మనస్సే.. నీకోసం నిజంగా తపించే..
సరసాల సమయాలలోన.. మనసారా పెనవేసుకోనా..
అనువైన నా గుండెలోనా.. కడదాకా నిను దాచుకోనా..
ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా.. పరువాలు పండించుకోనా..

నా ప్రేమ నవ పారిజాతం..
పలికింది ప్రియ సుప్రభాతం..

నీ ఎద వీణపై.. మన కథ మీటగా..
నీ ఎద వీణపై.. మన కథ మీటగా..
అనురాగాల రాదారి రానా.. నూరేళ్ళ బంధాన్ని కానా..

నా ప్రేమ నవ పారిజాతం..
పలికింది ప్రియ సుప్రభాతం..

2 comments:

శిశిర said...

ఈ పాట జొన్నవిత్తుల రాశారు మధురా. నాకు చాలా ఇష్టం ఈ పాట.

మధురవాణి said...

ఓహో.. జొన్నవిత్తుల గారు రాసారా ఈ పాట.. థాంక్యూ సో మచ్ శిశిరా! :)