Friday, June 01, 2012

ప్రేమ ఖైదు


నీకై ఎదురుచూస్తూ చూస్తూనే నిశ్శబ్దంలో గంటలూ రోజులూ గడుస్తాయి..
నన్ను నీ జ్ఞాపకాలకి బందీగా చేసి నీ ఊహలకి ఎరగా వేసి వెళ్ళిపోతావు..
అడుగులో అడుగేస్తూ నీ వెంటే పడుతూంటే పరాగ్గానైనా వెనుదిరిగి చూడవు..
అతికష్టం మీద నీ వెనక పరుగాపి నిలకడగా నించోబోతే గారంగా నవ్వి కవ్విస్తావు..
మౌనముద్రలోకి జారిపోవాలని ప్రయత్నిస్తున్న ప్రాణాన్ని ప్రేమగా తట్టి లేపుతావు..
మళ్ళీ మళ్ళీ ఆద్యంతాలు తెలియని అగాథమంటి నీ ప్రేమ ఖైదులోనే పడదోస్తావు..
మన మధ్యన అదృశ్యంగా మంచుతెరలా నిలిచిన దూరం కొలతలకీ అందనిదేమో..
నువ్వే నాకు అర్థం కావో.. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోతానో.. మాయో మర్మమో..
అదేదైనా గానీ.. బహుశా నాకెప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలానే మిగిలిపోతుందేమో!

10 comments:

Anonymous said...

నువ్వే నాకు అర్థం కావో.. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోతానో..

అదే విష్ణు మాయ

జలతారు వెన్నెల said...

Sweet! చాలా బాగుంది.

వనజ తాతినేని/VanajaTatineni said...

ప్రేమంటే !? అంతు చిక్కని ప్రశ్నేమో .. ఏమో ! కదా!? మధుర గారు.
బాగుంది. చాలా బాగుంది.

వెంకట రాజారావు . లక్కాకుల said...

ప్రేమ మధుర మండ్రు , పిచ్చి యనియు నండ్రు
అంతులేని ప్రశ్న యండ్రు గాని
అసలు ప్రేమ కున్న అద్భత శక్తియే
'అర్థ మవని తనము' ఔన కాద ?
----- సుజన-సృజన

హరే కృష్ణ said...

Beautiful Madhura :)

Madhu Pemmaraju said...

nice expressions..depicting the ifs and buts...chala baaga raasaaru

Unknown said...

నిజమే ఆ అగాధం లోతెన్నటికీ అంతు చిక్కదు...
ఎప్పటిలానే భావానికిచ్చిన అక్షర రూపం చాలా బాగుంది.

మధురవాణి said...

@ కష్టేఫలే,
అంతేనంటారా శర్మ గారూ.. :))
స్పందించినందుకు ధన్యవాదాలు. :)

@ జలతారు వెన్నెల, హరేకృష్ణ, Madhu Pemmaraju, చిన్ని ఆశ,
అభినందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)

@ వనజవనమాలి,
అంతే అంతే.. అదే ఖాయం చేసుకోండి.. ;)
వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. :)

@ వెంకట రాజారావు . లక్కాకుల,
<<అసలు ప్రేమ కున్న అద్భత శక్తియే
'అర్థ మవని తనము' ఔన కాద ?
భలే చెప్పారండీ.. నిజమే! ఎప్పట్లాగే చక్కటి పద్యం రాసిచ్చారు.. ధన్యవాదాలు. :)

Unknown said...

అందుకే దానిని ప్రేమ అన్నారు :P

బాగుంది :)

మధురవాణి said...

మీదీ అదే మాటన్నమాట.. అలాగలాగే! ;)
ధన్యవాదాలు.. :)