Tuesday, December 20, 2011

ఇదేనా.. ఇదే నా.. మొదటి ప్రేమలేఖ!


ప్రియమైన మీకు,
"మీకు ఏంటి మీకు.. నాకో పేరుంది తెలీదా.." అన్నట్టు అలా కోపంగా చూడకండి. మరేం చెయ్యమన్నారు చెప్పండి నన్ను. ఇప్పటికే పది కాయితాలు మార్చాను మిమ్మల్ని ఏమని పిలవాలో తెలీక. అసలు జవాబు రాయకుండా ఊరుకుందామనుకున్నాను గానీ పేద్ద బడాయిగా నా జవాబు చూసే ఎంత నచ్చానో తెలుసుకుంటానని ముందరి కాళ్ళకి బంధం వేసేసారుగా! పైగా నా మాటల్లో వినాలనుంది అని గారంగా అడుగుతూనే అంతలోనే నీ ఇష్టం అంటూ నిష్టూరమాడేసరికి ఎలాగైనా జవాబు రాయక తప్పింది కాదు.

అయినా, మీరసలు మహా గడుసువారు సుమా! మీకేం.. ఎంచక్కా నాలుగు వాక్యాలు ఉత్తరం రాసి పడేసారు. ఆ ఉత్తరం నా కంటే ముందు మా చిన్నారి చేతిలో పడటం వల్ల నాకెన్ని తిప్పలొచ్చిపడ్డాయో మీకేమన్నా తెలుసా! అది అక్కా అని పిలవడం మానేసి.. క్షణానికోసారి "రాధీ.. నా ప్రియమైన రాధీ.." అంటూ నా ప్రాణాలు తోడేస్తోంది. ఇంకా నయం, నాన్నగారు చూసారు కాదు. మీ ఉత్తరం సంగతి నాన్నగారికి చెప్పకుండా దాచడం కోసం రోజూ నేను మా చెల్లి గాడిద చెప్పిన పనల్లా చెయ్యాల్సి వస్తోంది తెలుసా మీకు! అప్పటికీ మా చిన్నత్తకి తెలిసిపోయింది. మీ ఆయన ఆషాఢం దాకా కూడా ఆగేట్టు లేడే అమ్ములూ.. తాంబూలాలు కూడా తీసుకోక మునుపు నించే ప్రేమలేఖలు రాస్తున్నట్టున్నాడుగా.. అంటూ ఆట పట్టించింది.

అసలయినా మీకు కాస్తైనా భయం భక్తీ ఏవన్నా ఉన్నాయా అని.. ఆ రోజున పెళ్ళి చూపులప్పుడు కూడా అంతే.. మా పడమటి గదిలో ఐదు నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత బయటికి వెళ్తూ వెళ్తూ చుట్టూ ఎవ్వరూ లేరు కదాని వెనక నుంచి నా జడ పట్టుకు లాగారా.. మా రాజి పిన్ని చూడనే చూసింది.. తర్వాత వంట గదిలోకి వెళ్ళినప్పుడు అమ్మా, పెద్దమ్మా, అత్తా, బామ్మా అందరి ముందూ నన్ను దొరకబుచ్చుకుని "ఏమే అమ్ములూ.. కాబోయే శ్రీవారు జడొక్కటే లాగాడా.. లేకపోతే చెయ్యి పట్టుకు లాగాడు కూడానా?" అని అడిగేసరికి అందరూ ఘొల్లున నవ్వారు. అబ్బ.. సిగ్గుతో చచ్చిపోయాను తెలుసా!

ఆ రోజు మీరు నన్ను చూసి వెళ్ళిపోయాక రాత్రి భోజనాల దగ్గర మీ గురించిన మాటలు వచ్చాయి. నేనూ, చిన్నారి పక్క గదిలోకి వెళ్ళి కూర్చుని పెద్దవాళ్ళ మాటలన్నీ ఆలకిస్తున్నాం. పెదనాన్నగారేమో "అబ్బాయి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. అమ్ములుకి బంగారం లాంటి సంబంధం చూసావురా" అని మెచ్చుకోలుగా అనేసరికి నాన్న కళ్ళల్లో ఎంత నిశ్చింతో! ఇంతలో బాబాయేమో "అబ్బాయి బుద్ధిమంతుడే కాదన్నయ్యా.. చాలా తెలివైనవాడు, సమర్ధుడు కూడా. మన అమ్ములు నిజంగా అదృష్టవంతురాలు" అన్నాడు. "ఒక్క పిల్లాడే కాదు కుటుంబమంతా కూడా చాలా నెమ్మదస్తుల్లా ఉన్నారు. మనలో యిట్టే కలిసిపోయారు. మన పిల్ల సుఖపడుతుందిలే" అంది పెద్దమ్మ. ఆ తర్వాత నాన్నగారు పెదనాన్నగారితో "చెరువు కింది మాగాణి రెండెకరాలు అమ్ముదాం అనుకుంటున్నా అన్నయ్యా.. అమ్ములుకి కొత్త నగలు చేయించుదాం.. నా బంగారు తల్లికీ ఏ లోటూ జరగకూడదు" అంటూ చెప్తుంటే నిజం చెప్పొద్దూ.. నా కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా రాలిపోయాయి. చిన్నారి నన్ను దగ్గరికి తీసుకుని బుజ్జగించింది. ఆ రోజు రాత్రంతా కలత నిద్రే అయ్యింది నాకు. మీకు నేను నచ్చాను, మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి భార్యని అవబోతున్నానన్న ఆనందం, ఉద్వేగం ఒక వైపూ, అమ్మా వాళ్ళందరినీ తలచుకుని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోవాలన్న భయమూ, బెంగా మరో వైపూ. అసలీ మధ్యన బాధా, సంతోషం రెండూ కలగలిసిపోయి పదే పదే నా కళ్ళు కన్నీళ్ళ కొలనులౌతున్నాయి.

మీరు చాలా గుర్తొస్తున్నారు. మీ చురుకైన చూపులు కూడా పదే పదే గుర్తొస్తున్నాయి. అసలు మొన్నొకరోజు చిన్నారి ఏమందో తెలుసా.. మీరు పైకి అలా బుద్ధిమంతుల్లా కనిపిస్తారు గానీ చాలా అల్లరివారంట.. మా ఇంటి నుంచి వెళ్ళేప్పుడు బయట వాకిలి దాకా వెళ్ళాక మా పడమటి గది కిటికీ వైపు తిరిగి నన్ను చూసి కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పారంట. అన్నట్టు, బామ్మకి మీరెంత నచ్చారో తెలుసా.. తూర్పు వీధిలో ఉండే సీతమ్మ గారని మా బామ్మ నేస్తురాల్లెండి. ఆవిడ వచ్చినప్పుడు మిమ్మల్ని తెగ పొగిడేసింది. మా అమ్ములుకి కాబోయే మొగుడు ఎంత అందగాడనీ, ఆరడుగుల ఎత్తూ, ఎత్తుకి తగ్గ రూపం, శ్రీరామచంద్రుడిలా ఉంటాడు తెలుసా.. పై దేశంలో చాలా పెద్ద ఉద్యోగం. పెళ్ళయ్యాక మన అమ్ములుని కూడా తీసుకెళతాడు. అంతా మా వరాల తల్లి అదృష్టం" అంటూ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా బుగ్గలు పుణికింది. ఇంతలో చిన్నత్త వచ్చి "అవుననవును.. ఆరడుగుల అందగాడే.. దీన్ని ఒక్క చేత్తో ఎత్తి భుజాన వేసుకుపోగలడు కూడానూ!" అంది. అందరూ నవ్వుతుంటే సీతమ్మ గారేమో "పోనీలేమ్మా.. నీ నోము ఫలం బాగుంది.. రాముడంటి మొగుడు దొరికాడు.." అనగానే మా చిన్నారి కోతి వచ్చి "రాముడు కాదు అమ్మమ్మా.. బావ గారు సాక్షాత్తూ కృష్ణుడే.. ఆయన పేరు కూడా అదే.. కదా అక్కా.." అంటూ ఒకటే నవ్వడం నన్ను చూసి. అన్నట్టు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా.. ఇంతకీ మీరు రాముడా.. కృష్ణుడా?

మన పెళ్ళి ముచ్చటేమో గానీ పెళ్ళయ్యేలోపు మా చిన్నారి నన్ను వేపుకు తినేసేలా ఉంది. దాని కంట పడకుంటా ఈ ఉత్తరం రాయాలంటే నా తల ప్రాణం తోకకొస్తోంది. అప్పటికీ మీ ఉత్తరం వచ్చిన రోజు నించీ ఒకటే గొడవ.. జవాబు ఏమని రాస్తావక్కా.. మా పెరటి కొబ్బరిచెట్టు మీ కుశలం అడిగే.. అంటూ కవిత్వం రాస్తావా అని. అన్నట్టు, కవిత్వం అంటే గుర్తొచ్చింది... ఆ రోజున మీరేవన్నారూ.. కవిత్వం అంటే మీకిష్టమా అని అడిగితే.. "ఇష్టమే.. కాకపోతే నా కోసం ఎవరన్నా రాస్తేనే.." అని కదూ! అమ్మో.. మీరు మాటల్లో అస్సలు దొరకరు.. ఇంత మాయ మాటలల్లడం ఎక్కడ నేర్చుకున్నారసలు.. మీరొచ్చి వెళ్ళిన నాటి నుంచీ మీరాడిన ప్రతీ మాటా పదే పదే గుర్తొస్తూనే ఉన్నాయి తెలుసా!

నిన్న సాయంత్రం నా ప్రాణ స్నేహితురాలు సుప్రియ వచ్చింది. "ఏమే రాధికా.. పెళ్ళి కొడుకులో నీకు బాగా నచ్చింది ఏంటే?" అని అడిగింది. అవునూ.. మీలో ఏం నచ్చిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే మీ కళ్ళు, నవ్వు, మాటలు.. అన్నీ వరసగా గుర్తొచ్చి ఏమని చెప్పాలో తోచక.. ఏంటో మొత్తంగా నచ్చేసినట్టున్నారే.. అనేసరికి అది నవ్వే నవ్వు నన్ను చూసి. "మొత్తానికి పిల్లాడు మొనగాడేనే.. లేకపోతే నీలాంటి మొండి పిల్లని ఒక్క చూపులోనే ఇంత మాయలో పడేస్తాడా.." అంటూ తెగ నవ్వింది. "పోవే.. మరీ చెప్తావు.. నువ్వు మాత్రం ఏడాది క్రితం నీ పెళ్ళి చూపులయ్యాక మీ ఆయన నచ్చాడని చెప్పలేదూ.." అని కస్సుమన్నాను దాని మీద. "అన్నాను లేవే.. కానీ, మరీ నీలా ఇంత మాయలో మేవెవరమూ పడిపోలేదమ్మా.. ఏంటోలే.. అంతా కృష్ణ మాయ.." అని చాలా సేపు ఏడిపించింది నన్ను.

ఈ రోజు పొద్దున్న ఏమైందో తెలుసా.. ఉదయాన్నే చిన్నారీ, నేనూ రామాలయానికి బయలుదేరుతుంటే అమ్మ పిలిచి పోయినేడాది సంక్రాంతికి అల్లించిన పొడవాటి ముత్యాల దండ వేసుకోమంది. "అబ్బా.. వద్దమ్మా.. ఇంత పెద్ద దండ పొట్ట దాకా వచ్చి చక్కిలిగింతలొస్తాయి. నేను వేసుకోనమ్మా.." అని గారం చేస్తుంటే ఇంతలో చిన్నత్త వచ్చి "అలా అంటే ఎలాగే అమ్ములూ.. రేపు పెళ్ళయ్యాక చక్కిలిగింతలు అని చెప్పి పుట్టింటికి పారిపోయి వచ్చేస్తావా ఏంటీ.." అంటూ నా తల మీద మొట్టికాయ వేసింది. చూడమ్మా.. చిన్నత్త రోజూ నన్నెలా వేధిస్తోందో.. అన్నాను అమ్మకి ఫిర్యాదు చేస్తున్నట్టు.. "నేనేమన్నానే రాక్షసీ.. పెళ్ళయ్యాక రోజూ మంగళ సూత్రాలు వేసుకోనంటే మీ అత్తగారు తరిమెయ్యగలరు. అలవాటు చేసుకోవాలమ్మా అని మంచిగా చెప్తుంటేనూ.." అంది. చిన్నత్త మీద పంతం కొద్దీ ముత్యాల దండ వేసుకుని కోపంగా గుడికి వెళ్ళిపోయాను. మేము గుడి నుంచి వచ్చేసరికి నాన్నగారు ఆచారి గారితో మన నిశ్చితార్ధం ముహూర్తం గురించి మాట్లాడుతున్నారు. పై వచ్చే శుక్రవారం బావుందట. పెళ్ళికేమో వైశాఖ మాసంలో ముహూర్తం చూద్దాం అనుకుంటున్నారు. మావయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడారు కూడానూ.. అంటే ఇంకో పది రోజుల్లో మళ్ళీ మాకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగిస్తారన్నమాట. అన్నట్టు మీకు తెలుసా.. బామ్మ చెప్పింది నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోనట్టేనంట. అంటే, మీరప్పటికి సగం సొంతమైపోతారన్నమాట!

తెలుసా.. చిన్నత్త అన్నదని కాదు గానీ ఇప్పుడు నాకు మెడలో నుంచి ముత్యాల దండ తియ్యాలనిపించట్లేదు. మీ చేతులతో నా మెడలో మూడు ముళ్ళు వేసే అపురూప క్షణాల కోసం, నన్ను మీకు సొంతం చేసే మంగళ సూత్రాలు నా గుండెలపై నిలిచే మధుర క్షణాల కోసం మురిపెంగా ఎదురు చూస్తున్నాను. నాకు మీరెంత నచ్చారో మొత్తంగా చెప్పాలంటే ఎంత పెద్ద ఉత్తరం రాసినా సరిపోదు. అసలే లెక్కల చదువులు చదివినట్టున్నారు స్వామి వారు... అలవాటులో పొరపాటుగా అలా ఉత్తరంలోని అక్షరాలని లెక్కలు కట్టి నా ప్రేమని బేరీజు వెయ్యకండని మనవి.
మీ రాక కోసం కోటి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను.

అచ్చంగా మీకే సొంతమైన..
మీ రాధీ

44 comments:

sandeep said...

"నాన్నగారు ఆచారి గారితో మన నిశ్చితార్ధం ముహూర్తం గురించి మాట్లాడుతున్నారు."

నిశ్చితార్ధం కాకముందే ఇంత పే.......ద్ద ఉత్తరమే????
ఇంక నిశ్చితార్ధం తర్వాతో????

శిశిర said...

:) beautiful.

Unknown said...

మధురవాణి గారూ!
ఎప్పటిలానే మీ శైలీ, మాటలూ, పదాలూ, అందులో దొరలిన తెలుగుతనం, ఆడతనం, కొంటెతనం, చిలిపితనం, మురిపెం, ప్రేమా...ఇలా అన్నీ అద్భుతం. శ్రీవారు చదువుకుని లోలోపల ఎంత సంబరపడిపోతారో... ;)

ramakumari Balantrapu said...

brahmandamgaa varnimcavu talii....god bless you!

సుభ/subha said...

"హు.. అప్పుడే ఐపోయిందా ఉత్తరం? ఇంకా రాయొచ్చు కదూ రాధీ.. రాధీ.. ఆహా పేరే మనోహరం..."
ఇది చదివిన అబ్బాయి గారి మనోభావం ఇలా ఉంటుందేమో అనిపిస్తోందండీ నాకు. అనిపించడమేంటి? ఇలాగే ఉంటుంది. :):):)

Padmarpita said...

మీదైన శైలిలో బహుబాగుంది:)

raamudu said...

Radha krishna pranayam manoharam.

నిషిగంధ said...

మధురా, 'దూరాన ఉన్న నిన్ను తలచీ...' అన్న అంశం మీద నీకు డబుల్ డాక్టరేట్ ఇవ్వచ్చేమో! హమ్మో, ఆల్మోస్ట్ రోజుకొక మిస్సింగ్ యూ, థింకింగ్ ఆఫ్ యూ లతో మధురంగా పలకరిస్తావేం!! అసలు ఎలా.. ఎలా..... ఎలా అమ్మాయ్? :))

రాజేష్ మారం... said...

Wow. ..

sunita said...

as usual in your style:))

sunita said...

నీకూ, కొత్తావకాయగారికి బాగుంది అని చెప్పడం శుద్ధ వేస్టు మధూ!!

రసజ్ఞ said...

ఇప్పుడు నాకు కాబోయే శ్రీవారికి లేఖ ఎలా వ్రాయాలో తెలిసింది. సమయం వచ్చినప్పుడు ఇదే రూటు ఫాలో అయిపోతా! చాలా బాగుందండీ!

hari bondada said...

Chaala Baagundandi! So nice.

Sudha said...

చాలా చాలా చాలా....బావుంది మధురా!! అప్పుడే అయిపోయిందా :-( ...అలా చదువుతూనే వుండాలనిపించింది..

Unknown said...

అన్నట్టు చెప్పటం మరిచామండోయ్ మధురవాణి గారూ, బాపు గారి బొమ్మ మీరు రాసిన "మొదటి ప్రేమ లేఖ" కి చాలా చక్కగా కుదిరించి, మరింత నిండు తెలుగుదనం తొణికిసలాడుతూ...

pallavi said...

woww... nice love letter... chala baga rasaru..

Anonymous said...

Hi Madhura how r u?
article is so cute,
nw a days n't gettng time 2 read or update my blog..I pity myself.

kastephale said...

జాణతనం ఉట్టిపడింది

శోభ said...

"అసలే లెక్కల చదువులు చదివినట్టున్నారు స్వామి వారు... అలవాటులో పొరపాటుగా అలా ఉత్తరంలోని అక్షరాలని లెక్కలు కట్టి నా ప్రేమని బేరీజు వెయ్యకండని మనవి".....

ఈ మాటలు మీ ప్రేమలేఖకే హైలెట్ మధురవాణిగారూ... నిజంగా చాలా చాలా బాగుంది మీ రచన.. సారీ సారీ మీ ప్రేమలేఖ... :)

Anonymous said...

Superb.It's reminding my sweet memories.

Disp Name said...

అదేమొనండీ , అక్కడ రాజీ గారు శ్రీమతి కి శ్రీ వారి ప్రేమ లేఖ రాస్తున్నారు. ఇక్కడ మీరేమో శ్రీవారికి ప్రేమ లేఖ రాస్తున్నారు. అంతా 'గాంధర్వ' గోళం గా వుంది! వస్తోంది క్రిస్సుమస్సు ! అవుతోంది మనసు కిస్సుమిస్సు ఈ లవ్ లేఖల్స్ చూస్తూంటే !!

చాలా బాగా రాసారు ! కీప్ ఇట అప్ !

చీర్స్
జిలేబి.

Disp Name said...

కష్టే ఫలే మాష్టారు,

'వట్టి జాణతనం కాదండీ! ఇది 'జర' మణీ జాణ 'ధనం' !!

చీర్స్
జిలేబి.

జ్యోతిర్మయి said...

కృష్ణ మాయ బాగా అర్ధం అయ్యింది మధుర గారూ..

Unknown said...

ప్రియమైన మీకు,
"మీకు ఏంటి మీకు.. నాకో పేరుంది తెలీదా.." అన్నట్టు అలా కోపంగా చూడకండి. మరేం చెయ్యమన్నారు చెప్పండి నన్ను. ఇప్పటికే పది కాయితాలు మార్చాను మిమ్మల్ని ఏమని పిలవాలో తెలీక.

ఇక్కడ పడిపోయాను.
నిజ్జమే కదా...ఇక...ముత్యాల దండ దగ్గర...మంగళ సూత్రం కి లింక్ చేసి రాయడం...చాలా బావుంది మధుర
నువ్వు నవల ఎప్పుడు రాస్తావో నా కోరిక ఎప్పుడు తీరుస్తావో ...??

A K Sastry said...

మా పెళ్లికి మా మామగారు నిశ్చయ తాంబూలాలు ఇచ్చి, పుచ్చుకొని వెళ్లాక, నేను నా కాబోయే శ్రీమతికి "Congratulations to my beloved" అని రంగుల్లో, ఆర్టిస్టిక్ గా వ్రాసి పంపిన ఒక పేజీ కాగితాన్ని చూసి, భయంతో చెమటలుపట్టి, ఖంగారు పడిపోయిందట!

ఇంక పెళ్లయ్యాక, నేను వ్రాసిన కవితాత్మక వుత్తరం "రారాదా...నారాధా..." వగైరాలతో--చదువుకొని, అపురూపంగా దాచుకొంది. వాళ్ల వాళ్లు అందరూ నన్ను కవిగారు అనడం మొదలెట్టారు, విషయం చూచాయగా తెలిసి. ఆమె పేరు రాధ కాదండోయ్! కానీ నేను ఇప్పటికీ రాధీ అనే పిలుస్తాను--యేకాంతంలో.

36 యేళ్ల తరవాత, మళ్లీ ఆ ముచ్చట్లు గుర్తు చేశారు!

చాలా సంతోషం.

కీపిటప్.

Anonymous said...

brilliant

మధురవాణి said...

@ సందీప్,
హహ్హహ్హా.. భలే సందేహమే వచ్చిందండీ మీకు. ఏమో మరి.. అప్పుడైతే ఇంకెంత పెద్ద ఉత్తరాలు రాస్తుందో మనకి తెలీదు. రాధికని అడిగి తెలుసుకోవాల్సిందే! :))))

@ శిశిర,
థాంక్యూ.. :)

@ చిన్ని ఆశ,
నా లేఖ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ ప్రశంసకి బోల్డు ధన్యావాదాలు. ఈ లేఖకి తెలుగుదనం నిండిన బాపు బొమ్మైతే సరిగ్గా సరిపోతుందనిపించింది. అందుకే అదే పెట్టేసాను. :)

@ balantrapu venkata sesha rama kumari,
మీ ఆశీస్సులకి ధన్యవాదాలండీ.. :)

మధురవాణి said...

@ సుభ గారూ,
హహ్హహ్హా.. అంతేనంటారా.. అబ్బాయి గారి మనసు మీరు కనిపెట్టేసారన్నమాట! ధన్యవాదాలు. :)

@ పద్మార్పిత, దూర్వాసుడు..
స్పందించినందుకు ధన్యవాదాలండీ.. :)

@ నిషీ.. మై డియర్ నిషీ..
ఈ రోజు రాత్రికి భోజనం అక్కర్లేదు నాకు.. కడుపు నిండిపోయిందోచ్.. నువ్వెంత మంచిదానివి.. ఎంచక్కా నాకు ఇంకో డాక్టరేట్ ఇచ్చేస్తా అంటున్నావ్.. :))))
ఎలా ఎలా ఎలా.. అంటే.. ఏం బదులు చెప్పాలో తెలీక నేనిప్పుడు "ఎలా ఎలా ఎలా ఎలా తెలుపనూ.. ఎదలోని ప్రేమనూ.. మృదువైన మాటనూ.." అని పాడుకోవలసివస్తుంది.. ;)
అయితే నీకీ సంగతి తెలీదా.. అందంగా ఆలోచించే, రాసే నేస్తాలున్నవాళ్ళకి అలాగే వచ్చేస్తుందట.. :D

@ రాజేష్ మారం,
థాంక్యూ! :)

మధురవాణి said...

@ సునీత గారూ,
ఎప్పట్లాగే మీ వ్యాఖ్య చాలా ఆప్యాయంగా దగ్గరిగా అనిపించింది. అంత అద్భుతంగా రాసే కొత్తావకాయ గారి పక్కన నా పేరా.. అమ్మయ్యో.. ఇంత పెద్ద ప్రశంసే! థాంక్యూ థాంక్యూ.. :))

@ రసజ్ఞ గారూ,
హహ్హహ్హా.. అయితే మీకు ప్రేమేలేఖ రాయడమెలాగో పాఠం చెప్పానంటారు.. సంతోషం.. :)

@ hari bondada,
ధన్యవాదాలండీ! :)

@ సుధ గారూ,
మీరిలా వెతుక్కుంటూ వచ్చి మరీ చెప్పారంటే మీకు నా ప్రేమలేఖ చాలా నచ్చిందని తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం నా బ్లాగు దాకా వచ్చి ఓపిగ్గా వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.:)

మధురవాణి said...

@ పల్లవి,
ధన్యవాదాలండీ.. :)

@ రాధికా,
ఎలా ఉన్నావూ? చాన్నాళ్ళైపోయింది నువ్వు కనిపించి.. అంత బిజీ బిజీ అయిపోయావా? Thanks for the comment and nice to see you back!

@ కష్టేఫలే,
:))

@ శోభ,
నాక్కూడా ఈ లేఖలో బాగా నచ్చిన వాక్యం అదేనండీ.. థాంక్యూ! :)

మధురవాణి said...

@ తొలకరి,
థాంక్యూ! ఆహా.. ఎంత లక్కీ అండీ మీరు.. ఎంచక్కా బోల్డు ప్రేమలేఖలు రాసుకున్నారన్నమాట.. సూపర్! :))

@ జిలేబీ గారూ,
జర మణీ నుంచి మీకు ధన్యవాదాలండీ.. :)
హహ్హహహా.. భలే ఉందండీ మీ కామెంటు. 'గాంధర్వ' గోళం గా ఉందా! :))
అవును.. భలే చిత్రం కదా..రాజి గారూ నేనూ అనుకోకుండా ఒకేసారి బొమ్మ పెట్టి ప్రేమ లేఖలే రాసాం..

@ జ్యోతిర్మయి,
కృష్ణ మాయ అర్థమైపోయిందా మీకు.. బాగు బాగు! :)

@ పక్కింటబ్బాయ్ గారూ,
ధన్యవాదాలండీ.. :)

మధురవాణి said...

@ శైలబాల,
థాంక్యూ సో మచ్ శైలూ డియర్! హహ్హహ్హా.. నీ కోరిక తీర్చమంటావా? నన్ను నవల రాయమని మొట్టమొదట అడిగింది నువ్వే శైలూ.. నిజంగా రాయడమంటూ జరిగితే ముందు నీకే చెప్తాను చూద్దాం నిజంగా ఎప్పటికైనా రాయగలనేమో! ;)

@ కృష్ణశ్రీ గారూ,
అయితే రాధీ అనే పేరు మీక్కూడా ఇష్టమైన పేరన్నమాట! భలే బావున్నాయండీ మీ ప్రేమలేఖల జ్ఞాపకాలు. పోస్టులో వచ్చే ఉత్తరాలు మోసుకొచ్చే సంబరాలు మీ తరం వాళ్లకి తెలిసినంత గొప్పగా మాకు తెలీవు.. మీ జ్ఞాపకాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.. :)

హరీష్ బలగ said...

హలో మధు గారూ .. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలాగూ మిమ్మల్ని పొగడడం మానేసాను కాబట్టి, చిన్న కోరిక కోరేస్తున్నా డైరెక్ట్ గా.. సుభ గారు చెప్పినట్టుగా మీ ప్రేమ లేఖ చూసి శ్రీవారు ఎలా ఫీల్ అయుంటారో కదా అని నాకూ అనిపించింది.. మరి అదేదో మీరే మీ శ్రీవారి లోకి పరకాయ ప్రవేశం చేసి, ప్రత్యుత్తరం రాయొచ్చుగా మాకోసం? కావాలంటే మీ ఇంటాయన ఫీలింగ్స్ అడిగి కాపీ కొట్టేయండి. ఇంతకుముందు చెప్పారో లేదో తెలియదు గాని, మీ ఇంటాయన పేరేంటి? (అబ్బూ మరీ అంత సిగ్గు పడకండి పేరు చెప్పడానికి.. ఈ ఒక్కసారి చెప్పేయండి.)
...... హరీష్

Anonymous said...

కృష్ణ
కోసం రాధా మనసులో పడే వేదన, త్వరగా చూడాలనే ఆకాంక్ష వాళ్ళిద్దరి మద్యలో జరిగిన చిలిపి అల్లర్లను గుర్తుచేసుకొని ఆమె పడే సిగ్గు ఆ కృష్ణుడి లోని చిలిపితనం , తన మీద రాధా పెంచుకున్న ప్రేమ చాల అందంగా రాసారు మధురవాణి గారు మీ మధురమైన రచన అద్బుతంగా ఉంది

మధురవాణి said...

@ హరీష్,
thanks for your comment. చాన్నాళ్ళకి కనిపించారే! మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉత్తరం మొదట్లో రాధిక వాళ్ళ శ్రీవారు ఏదో నాలుగు వాక్యాలు రాసి పడేసే రకం అన్న మాట గమనించారా? అంచేత, ఇప్పుడు నేను పరకాయ ప్రవేశం చేసి మరో ఉత్తరం రాసినా అందులో పెద్ద విషయం ఉండదు. అదన్నమాట సంగతి! ;)

హేవిటేవిటీ.. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుని పట్టుకుని మీ ఇంటాయన పేరు చెప్పెయ్యండి అని నిలదీస్తారా.. హన్నన్నా.. తప్పు కదూ! :))

@ శ్వేత గారూ,
రాధిక లేఖ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. Thanks for your compliment! :)

హరీష్ బలగ said...

మధుగారూ ! నేను రాధిక శ్రీవారిలోకి ప్రవేసించమనటం లేదు. మీ శ్రీవారిలోకి. అసలు పెళ్లి అయ్యాక కూడా మీలాగా రోజుకొక ప్రేమలేఖ రాసే శ్రీమతి ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి! మీ ఇంటాయన పెట్టి పుట్టారు. వెరీ లక్కీ. బ్లాగు లో రాధిక అనో ఇంకేదో మారు పేర్లతో రాస్తున్నా అవన్నీమీ ఇంటాయన ని ఊహించుకునే రాసుంటారు గా..
బ్లాగ్ నిర్వహించలేకపోయినా మా కాలేజీ లో జరిగే ఒక కాన్ఫరెన్స్ కి website నిర్వహించే అవకాసం వచ్చింది. అందులో బిజీ. (పరిశోధనలో బిజీ అని భ్రమ పడుతున్నారేమో అని చెప్తున్నా. అంత లేదు.).
సరే మీ శ్రీవారి పేరు చెప్పొద్దు గాని, పెళ్లి తరవాత జతకలిసిన తోక తో పాటు మీ పూర్తి పేరు చెప్పండి. అందులోనే ఆయన పేరు ఉంటుందిగా అపుడు. (ఏ ఇంటి ఆడపడుచు అయినా ఇలా చెప్పొచ్చు. :-) )

మీతోపాటు మన బ్లాగ్మిత్రులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.

జ్యోతిర్మయి said...

@ హరీష్ గారూ ఇన్ని టపాలు చదివాక ఇంకా పేరు తెలియకపోవడమేమిట౦డీ..మాకందరికీ తెలిసిపోతేనూ...

మధురవాణి said...

@ హరీష్,
హహ్హహ్హా.. మీరు సామాన్యులు కాదుగా అసలు.. చెప్పేదాకా వదిలేలా లేరు.. :D
జ్యోతిర్మయి గారి కామెంట్ చూసారా? తను చెప్పింది నిజమే.. కృష్ణుడికి ఉన్న సవా లక్ష పేర్లలో తన పేరు కూడా ఒకటి! ఇంకంతే.. మీరింకేం ప్రశ్నలు అడక్కుండా ఊ.. అనేసి ఊరుకోవాలన్నమాట ఇప్పుడు.. సరేనా! :))
అలాగే మీరు ఊహించుకుంటున్నట్టు నేనేం రోజుకొక ప్రేమలేఖ రాయనండి. అంత చిత్రం లేదిక్కడ! ఈ ఒక్కసారికీ ఇలా సరదాగా ప్రయత్నించానంతే! :))

అయితే ప్రస్తుతానికి రీసెర్చ్ ని కాస్త పక్కకి నెట్టి కాన్ఫరెన్స్ పనుల్లో బిజీగా ఉన్నారా? పోన్లెండి.. ఏదోక పనిలో బిజీగా ఉండటమే ముఖ్యం.. బ్లాగైతే ఏంటి, వెబ్సైట్ అయితే ఏంటి..:))
మీక్కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

@ జ్యోతిర్మయి,
హహ్హహ్హా.. భలే చెప్పారే. థాంక్యూ థాంక్యూ! :)

జ్యోతిర్మయి said...

"అంత చిత్రం లేదిక్కడ!" ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలే వేరులే అర్ధాలు వేరులే...

మధురవాణి said...

@ జ్యోతిర్మయి,
అబ్బా.. ఇదన్యాయం కదూ.. మళ్ళీ నన్నిరికించేస్తారా ఇలాగ.. :( అయినా, అది మగవాళ్ళు కుళ్ళు కొద్దీ రాసి పాడుకునే పాటండీ.. మనం అస్సలు పాడకూడదు.. (తప్పదు కదా మరి.. ఎలాగోలా నన్ను నేను రష్చించేస్కోవాలిగా! ;)

అయినా, ఇలా రోజూ ఉత్తరాలు రాస్తానంటే, "నిన్నూ, నీ సోదినీ భరించడం నా వల్ల కాదు తల్లోయ్.." అని నన్ను వెళ్ళగొట్టేసే ప్రమాదం లేదంటారా.. మీరే చెప్పండి. ముందే చెప్తున్నా.. అప్పుడు మాత్రం మీ ఇంటికే వచ్చేస్తా.. ఎంచక్కా మీ బుజ్జోడితో ఆడుకోవచ్చు కదా! :))

SIVA KUMAR YEKULA said...

telugu nijamga entha baguntunda....entha maduramga undi ee telugu...

మధురవాణి said...

@ శివ గారూ,
చాలా గొప్ప ప్రశంస ఇచ్చేశారండీ.. బోల్డు ధన్యవాదాలు. :)

smspostbox said...

very nice... sweet vaani..

మధురవాణి said...

@ smspostbox,

Thanks!