Thursday, December 15, 2011

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

ఈ పాట 2004 లో SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతడే ఒక సైన్యం' అనే సినిమాలోది. ఎప్పట్లాగే ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది కూడా కృష్ణారెడ్డి గారే. జగపతి బాబు, నేహ జంటగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడినట్టు లేదు. అంచేత ఈ సినిమా గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చనుకుంటాను.

ఈ సినిమాలో మిగతా పాటల గురించి తెలీదు గానీ ఈ పాట మాత్రం చాలా బాగుంటుంది. ఈ పాట 2003 సంవత్సరానికి గానూ ఉత్తమ నేపథ్య గాయనిగా సునీతకి నంది అవార్డ్ తెచ్చిపెట్టింది. చంద్రబోస్ గారు చక్కటి సాహిత్యాన్ని అందించారు. పాటలో రాసినట్టు తేట తేట తెలుగు పదాలతో తేనెలొలికే ఒక మంచి పాట ఇది. ఈ పాటని ఇక్కడ వినొచ్చు. :)

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట..
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట..
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట..
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట..
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట..
నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట..
పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట..
చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట..
పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట..
అందరు మెచ్చే పాట.. ఒకరికి అంకితమిచ్చే పాట..
పదాలు అన్నీ బోయీలై ప్రేమ పల్లకిని మోసే..
నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట..
కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట..
నదులలోని జీవరాగమే నింపుకున్న పాట..
వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట..
ప్రకృతి నేర్పిన పాట.. చక్కని ఆకృతి దాల్చిన పాట..
మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసే..
నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట..
నీలిమబ్బులకు స్నానం పోసే చిటపట పాట..
రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట..
కన్నతల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట..
దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట..
నా పాట తేట తెలుగు పాట.. నా పాట తేనెలొలుకు పాట..

5 comments:

వేణూశ్రీకాంత్ said...

నాకూ ఈ సినిమాలో ఈ ఒక్కపాటే బాగుంటుందని గుర్తు. కానీ సినిమా చాలా బాగుంటుంది, మంచి కామెడీ.. లాజిక్కుల బుర్ర పక్కన పెట్టేసి కాసేపు హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేయచ్చు :-)

మౌనముగా మనసుపాడినా said...

nice song

Kottapali said...

టెంప్లేట్ బావుంది

వేణూశ్రీకాంత్ said...

హే కొత్త టెంప్లేట్ చాలా బాగుంది :-) జింబ్లీ జూపర్బ్.. అబ్బే అలా ఖంగారుపడకండి లంచ్ కి కేరళ రెస్టారెంట్ కి వెళ్ళాను అక్కడ భోజనం ఎలాఉందంటే పక్కటేబుల్ కేరళైట్ సోంఫ్ నములుతూ ఇచ్చిన జవాబది (simply superb) అనమాట.

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
ఈ సినిమా గురించీ నాదే ఇదే అభిప్రాయం వేణూ.. మరోసారి సేమ్ పించ్! :)

హహ్హహ్హా.. అయితే కేరళ రెస్టారెంట్లో భోజనం అంత బాగుందంటారా నా బ్లాగు కొత్త టెంప్లేట్.. థాంక్యూ థాంక్యూ.. :)))

@ మౌనముగా మనసు పాడినా,
ధన్యవాదాలండీ.. :)

@ కొత్తపాళీ,
మీకూ నచ్చిందా అయితే కొత్త టెంప్లేట్.. అయితే నేను హ్యాపీ హ్యాపీ.. థాంక్స్ గురువు గారూ.. :)