Sunday, July 10, 2011

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్..

2001 లో కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బెంద్రే నటించిన 'మురారి' సినిమాలోది పాట. మణిశర్మ సంగీత సారథ్యంలో చిత్ర పాడిన పాటని సిరివెన్నెల రాసారు.

ఎప్పట్లాగే సిరివెన్నెల గారిని చాలా పొగిడేస్తా అనుకుంటున్నారేమో అస్సలు కాదు. నేను కాలేజ్లో చదువుకునే రోజుల్లో వచ్చింది సినిమా.. అప్పట్లోనే పాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది. ఎంతంటే కోపంలో మళ్ళీ మళ్ళీ బోల్డు సార్లు వినేదాన్ని. అలా విన్నందుకు మళ్ళీ ఇంకా కోపం ఎక్కువైపోయి కోపంలో మళ్ళీ మళ్ళీ వినాల్సి వచ్చేది.malu పైగా అప్పటికీ ఇప్పటికీ ఇన్నేళ్ళయినా నా ఫీలింగ్ ఏం మాత్రం మారినట్టు లేదు..sedih

అసలూ.. అంటే అన్నాం అంటారు గానీ.. ముందే ఒళ్లంతా పొగరు పట్టినencem అబ్బాయిలతో అమ్మాయిలకి బోల్డు కష్టాలైతే, దానికి తగ్గట్టు సిరివెన్నెల గారు ఇలా అమ్మాయిల మనసుల్లోకి దూరిపోయి చూసొచ్చినట్టు ఇంత వివరంగా రహస్యాలన్నీ బయటికి చెప్పేస్తే ఎలాగండీ అసలు? నేనీ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా! అసలే ముందే పొగరుబోతు అబ్బాయిలతో వేగడం కష్టం అయితే, దానికి తగ్గట్టు వాళ్లకి అమ్మాయిలు మనసులో ఇలా అనుకుంటారు బాబూ.. అని చక్కగా వివరంగా చెప్పేస్తే.. ఇంకప్పుడు వాళ్ళ పొగరు ఒకటికి పదింతలై తర్వాత వాళ్ళని భరించడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో మీకేమన్నా తెలుసా అసలు?nangih అసలా రెండో చరణంలో చూసారా.. అలాంటి రహస్యాలన్నీ ఇలా బయటికి చెప్పేస్తారా ఎవరన్నా?gigil అసలయినా నేరంలో సిరివెన్నెల గారితో పాటు సగం పాపం కృష్ణవంశీకే దక్కుతుంది. అందుకే ఇద్దరినీ కలిపి ఖండించేస్తున్నాtakbole

సినిమాలో నాకు ప్రత్యేకంగా నచ్చింది ఒకటి ఉంది.. అంటే చాలా ఉన్నాయిలెండి.. కానీ, ఒకటి చెప్తా ఇప్పుడు.. అబ్బాయి అమ్మాయి వల్ల చాలా కలవరపడిపోతూ తన గురించి ఆలోచించే సందర్భంలో ఇప్పుడు నేను చెప్తున్న పాట వస్తుంది.. తల్చుకునేది అబ్బాయైతే పాటేమో అమ్మాయి అబ్బాయి గురించి ఎలా ఫీలవుతుందో చెప్తున్నట్టు ఉంటుంది. అలాగే, ఇంకో సందర్భంలో అమ్మాయి అబ్బాయి గురించిన తలపుల్లో కొట్టుకుపోతున్న సందర్భంలో తను ఊహించుకునే పాటేమో అబ్బాయి అమ్మాయి గురించి ఏమనుకుంటున్నాడో చెప్తున్నట్టు ఉంటుంది.. అంటే, సాధారణంగా సినిమాల్లో మనం చూసేదానికి వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట! ఏంటీ.. నా కవి హృదయం మీకు అర్థం కాలేదా!jelir అన్నట్టు, మీకు తెలుసో లేదో.. ఇలాంటివి అర్థం కాకపోయినా అలా చెప్పకూడదు బయటికి.. మనసులోనే ఉంచేసుకోవాలి.. సరేనా!sengihnampakgigi అన్నట్టు, ఇంకో పాట కూడా చాలా బాగుంటుంది అని చెప్పా కదా.. అది "అందానికే అద్దానివే.." అన్న పాట! పైగా పాటలో హీరో గారు "నిన్ను గెలిచేందుకే.. నాకు పొగరున్నది.." అంటూ మహా బడాయిగా పాడేస్తూ ఉంటాడు కూడా!encem

అన్నట్టు, మరో మాట.. అసలు కథానాయికలని రంగురంగుల ప్లెయిన్ చీరల్లో అందంగా చూపించాలంటే కృష్ణవంశీ తర్వాతే ఎవరైనా!love 'నిన్నే పెళ్ళాడతా' సినిమాలో టబూ, పాటలో సోనాలిని చూసాక మీరూ ఒప్పుకుంటారు సంగతి!

అసలు చిత్ర ఎంత బాగా పాడతారనీ.. ఆవిడ ఎప్పుడూ అంతే తియ్యగా పాడతారనుకోండి.. కానీ ప్రత్యేకంగా పాట చివర్లో వచ్చే తన నవ్వంటే నాకు భలే ఇష్టం..love మీరూ విని చూడండి ఓసారి! సరే... ఇంక పాట వినండి.. చూడండి.. అలాగే, అమ్మాయిలయితే మీకు కూడా నాలాగా కోపం వచ్చిందా రాలేదా చెప్పండి.kenyit అలాగే, మంచబ్బాయిలైతే మీరూ మీ అభిప్రాయం చెప్పొచ్చు. పొగరుబోతులైన అబ్బాయిలైతే మాత్రం.. పాట మీ కోసం కాదు.. దయ చేసి వినకండి.. మళ్ళీ మీతో బాధలు పడే అమ్మాయిల ఉసురు నాకు తగలగలదు!jelir

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది మోమాటం..
నువ్వంటే మరి.. అదేదో ఇది.. అనేద్దామనే ఉన్నదీ..
ఫలానా అని తెలీదే మరి.. ఎలా నీకు చెప్పాలనీ..
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది మోమాటం..

వెంట తరుముతున్నావేంటీ ఎంత తప్పుకున్నా..
కంటికెదురు పడతావేంటీ ఎటు చూసినా..
చెంప గిల్లిపోతావేంటీ గాలి వేలితోనా..
అంత గొడవపెడతావేంటీ నిద్దరోతు ఉన్నా..
అసలు నీకు చొరవేంటీ తెలియకడుగుతున్నా..
ఒంటిగా ఉండనీవేంటీ ఒక్క నిముషమైనా..
ఇదేం అల్లరి.. భరించేదెలా.. అంటూ నిన్నెలా కసరనూ!
నువ్వేం చేసినా.. బావుంటుందని.. నిజం నీకెలా చెప్పనూ!

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది మోమాటం..

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా..
ఏడిపించబుద్ధవుతుంది ఎట్టాగైనా..
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా..
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా..
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా..
లేని పోని ఉక్రోషం తో ఉడుకెత్తనా..
ఇదేం చూడకా.. మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా..
అదేంటో మరీ.. పొగరే నచ్చి పడి చస్తున్నా.. అయ్యో రామా!

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది మోమాటం..
నువ్వంటే మరి.. అదేదో ఇది.. అనేద్దామనే ఉన్నదీ..
ఫలానా అని తెలీదే మరి.. ఎలా నీకు చెప్పాలనీ..
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా.. లవ్ యు చెప్పేసేయ్.. అంటోంది ఆరాటం..
లవ్ యూ.. లవ్ యూ.. లవ్ యూ.. లవ్ యూ.. లవ్ యూ.. లవ్ యూ.. :))))))




10 comments:

Unknown said...

Very nice.. ఆ సినిమాలో పాటలన్నీ దాదాపుగా బావుంటాయి. మీరు భలే రాసారు మధురా..

Anonymous said...

I see ........

శ్రీనివాసమౌళి said...

chalaaa manchi pATa.. అసలు నీకు ఆ చొరవేంటీ తెలియకడుగుతున్నా bhalE line.. muccaTEstundi enni saarlu vinnA pATa mottam..

btw meeru cheppina renDava pATa.. chandrabose rachana.. baaga vrASAru ayana kUDA

manchi pATa gurinchi.. antE manchigaa vrAsinanduku :)

srinivas pv said...

Hi Madhuravani,

Nice analysis :)

Thanks,
Srinivas

Sriharsha said...

నిజమే కృష్ణవంశీ చాలా అందం గా చూపిస్తారు
అండ్ చాలా బాగా రాసారు

జైభారత్ said...

మధుర గారు ఇదేమన్న న్యాయమా చెప్పండి..ఏం పనిచేయనివ్వకుండా ఇలా మీ బ్లాగ్ చుట్టే తిప్పెస్కుంటే ఎలాగండి అసలు...చాల చాల బాగా వ్రాస్తున్నారు...

వెంట తరుముతున్నావేంటీ ఎంత తప్పుకున్నా..
కంటికెదురు పడతావేంటీ ఎటు చూసినా..

నువ్వేం వ్రాసిన .. బావుంటుందని.. నిజం నీకెలా చెప్పనూ............?????

వేణూశ్రీకాంత్ said...

మీ వ్యాఖ్యానం చాలా బాగుంది మధురా...

మధురవాణి said...

@ ప్రసీద,
థాంక్యూ! అవునండీ.. అన్నీ పాటలూ బావుంటాయి ఈ సినిమాలో.. :)

@ అనానిమస్..
ఆహా.. అలాగా..! :)

@ శ్రీనివాసమౌళి..
అవునండీ.. ముచ్చటైన పాట.. ధన్యవాదాలు.. :)

@ శ్రీనివాస్, శ్రీహర్ష, వేణూ శ్రీకాంత్,
థాంక్యూ ఫ్రెండ్స్! :)

@ loknath kovuru,
హహ్హహ్హాహ్హ.. మీ వ్యాఖ్య చూసి చాలాసేపు నవ్వుకున్నానండీ.. నా రాతలు మీకు అంతగా నచ్చడం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.. :)

జ్యోతిర్మయి said...

పాట చాలా సార్లు విన్నాను.... కానీ మీ రాతలో మునిగాక... దానికేదో కొత్త అందం వచ్చినట్లు౦దండీ..

మధురవాణి said...

@ జ్యోతిర్మయి,
హహ్హహ్హా.. అమ్మో పెద్ద పొగడ్తే ఇచ్చారుగా.. థాంక్యూ! :))