Wednesday, July 06, 2011

నిన్నూ...



నా ఫోన్ కేకేసినప్పుడల్లా నువ్వేనేమో అనుకుంటున్నా..
నువ్వు కాదని తెలిసినప్పుడల్లా ఆ కోపంలో దాని గొంతు నొక్కెయ్యాలనిపిస్తుంది..
ఎవ్వరు పిలిచినా నువ్వనుకునే పలికేస్తున్నా..
ఎవ్వరు ఎదురుపడినా నీ పోలికలే వెతుక్కుంటున్నా..
ఎవ్వరు మాట్లాడినా నీ గొంతే పోల్చుకుంటున్నా..
ఎవ్వరి మొహంలోకి చూసినా నీ నవ్వుల కోసమే వెతుక్కుంటున్నా..
ఎవ్వరి చెయ్యి తగిలినా నువ్వేనేమో అని ఉలిక్కిపడుతున్నా..
ఎవ్వరిని చూసినా.. నువ్వు కాదుగా అని ఉక్రోషపడిపోతున్నా..

అసలు మీ ఊరూ, మీ వీధీ, మీ ఇల్లు, మీ చెట్లూ.. అన్నీ పిచ్చివే..
నిన్నెప్పుడూ రాసుకుంటూ తిరిగేస్తుంటాయని మిడిసిపడే గాలీ, వర్షం, ఎండా.. అన్నీ పిచ్చివే..
నువ్వు రోజూ మీ పక్కింటమ్మాయిని చూసి నవ్వుతావే.. ఆ పిల్ల కూడా పిచ్చిదే..
నీతో కలిసి ఎప్పుడూ ఎగురుకుంటూ తిరిగేస్తుంటారే.. నీ స్నేహితులూ.. వాళ్ళూ పిచ్చోళ్ళే..
అవన్నీ నిన్ను రోజూ చూస్తుంటాయనీ, నీకు దగ్గరగా మసలుతుంటాయని నాకస్సలు కోపం లేదు..
అబ్బబ్బబ్బా.. అసలు ఇదంతా కాదు గానీ నిన్నూ... అసలు నిన్ను చంపేస్తే గానీ నా ప్రాణానికి ప్రశాంతంగా ఉండేట్టు లేదు!


* ఊరికే సరదాకి రాసాను తప్ప నిజంగా హత్యలూ అవీ చెయ్యాలని నా ఉద్దేశ్యం కాదని గమనించ ప్రార్థన!jelir

20 comments:

Prasad Gutti said...

Hi,

Pic chaala bagundi ... "Parugu" Cinema lo pic kada ... (kaakapote endulodi cheppu)

ponle saradaki raaste raasavu kani ... evarini ala champakem .. hahaha ....

chala bagundi ..

--
Prasad :)

ఇందు said...

:)))))))))))))

SHANKAR.S said...

ప్రేమా...పిచ్చీ ఒకటే...లాలలా...లాలా ఆ ఆఆ ఆఆఆ

Pandu said...

Bagundi...:)

వేణూశ్రీకాంత్ said...

హ హ హ శంకర్ గారి పాటే నాది కూడానూ :-)

సృజన said...

హు...అంతేగా మరి:-)

Padmarpita said...

ప్రేమ పిచ్చిదా?
పిచ్చి ప్రేమదా?
ప్రేమకి పిచ్చికి తేడా లేదా?
భలే:) భలే:) భలే:)

రాజ్ కుమార్ said...

హహహ.. పిచ్చి పీక్ కి వెళ్ళిపోతే అలాగే అనిపిస్తుందనుకుంటా..;)
బావుందండీ.. ;)

మేధ said...

నిన్నూ... ;)

శివ చెరువు said...

Good one!

హరే కృష్ణ said...

పోస్ట్ చదువుతూ మళ్ళీ మరోసారి చదువుదామని షీలా దగ్గరకు వచ్చి అలా కాసేపు ఆగిపోయా
మా బాస్ వచ్చి ఎవరీ అమ్మాయి సో క్యూట్ కదా అని అన్నాడు
ఆ తర్వాతా బ్లాగులు బ్లాక్ ఇంకా చాలా చాలా అక్షింతలు :(((

>>అసలు నిన్ను చంపేస్తే గానీ నా ప్రాణానికి ప్రశాంతంగా ఉండేట్టు లేదు!
చంపేయండి చంపేయండి రక్తం ఏరులై పారాలి
చాలా కోపం గా ఉంది :)

shanti said...

short and sweet,simple and brilliant..simply a nice one..

Sriharsha said...

:)

మధురవాణి said...

@ ప్రసాద్,
అవునండీ.. ఆ సినిమాలోదే ఈ ఫోటో.. మీరేం భయపడకండి.. ఎవ్వర్నీ చంపను.. ఊరికే రాసాను సరదాకి. :)

@ ఇందూ,
:))

@ శంకర్ గారూ, వేణూ శ్రీకాంత్..
హహ్హహ్హా.. అంతే అంతే! ;)

@ పండు,
థాంక్యూ! :)

మధురవాణి said...

@ సృజన,
అంతేగా మరి! :))

@ పద్మార్పిత,
హహ్హహహా.. సూక్ష్మం గ్రహించారు.. :))

@ వేణూరాం,
అంతేనంటారా.. ఏమో మరి.. అయితే అయ్యుండొచ్చు.. :P

@ మేధ,
హిహ్హిహ్హీ.. :D

మధురవాణి said...

@ శివ చెరువు,
థాంక్యూ! :)

@ హరే కృష్ణ,
అయ్యయ్యో.. అంత ఘోరం జరిగిపోయిందా నేను పెట్టిన బొమ్మ వల్ల.. అయినా మీ బాస్ కి అదేమ తిక్క.. అమ్మాయి క్యూట్ అన్నాక కూడా బ్లాగ్స్ బ్లాక్ చేసేసాడా.. బాస్ ల దౌర్జన్యం నశించాలి అని మీతో పాటు గొంతెత్తి విలపిస్తా నేను కూడా! అంతవరక్తిహే ఓకే గానీ, మరీ రక్త చరిత్ర అంటే కష్టం.. నాకంత సీన్ లేదు.. :))

@ శాంతి,
Thanks a lot! :)

@ శ్రీహర్ష,
:)

kiran said...

హహహ్హా మధుర ఏమయ్యింది ?అయినా కాస్త జాగ్రత్తగా ఉంటాలే ..:)

మధురవాణి said...

హహ్హహ్హా.. కిరణ్.. భయపడకు నువ్వు సేఫేలే! ;) :D

ఏకాంత్ said...

ఫీల్ చాలా బావుంది......చివరి పంక్తి వలన comedy ఐపోయింది కానీ లేకపోతే ఇవాళంతా ఈ ఫీల్ తో గడిచిపోయేదేమో...

నన్ను office పని చేస్కోనిద్దమని మంచి ఫీల్ని సరదా చేసేసినందుకు :@ ......నేను రెండు మూడు సార్లు ఆ చివరి line లేకుండా చదివేస్కుని ఊహల్లొకి, మధుర(మీరు కాదులెండి) జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయా :)

By the way I am ArunKanth(from Eluru) working in bangalore. mee follower ni ayyaa ee madhyE(buzzlO)

మధురవాణి said...

@ Arun K,
థాంక్స్! :)
ఇంతకీ ఆ చివరి పంక్తి అంటే ఏదండీ.. చంపేస్తాను అన్నదా లేకపోతే ఊరికినే సరదాగా రాసాను అని చెప్పిందా?
పోన్లెండి.. మీకు నచ్చినంత వరకే చదువుకుంటే హ్యాపీ కదా! :))