Friday, June 03, 2011

ఒక పోస్టు చెయ్యని ఉత్తరం..


నువ్వు గుర్తొస్తావు.. నువ్వు చాలా గుర్తొస్తావు.. నువ్వు బోల్డు గుర్తొస్తావు.. మళ్ళీ మళ్ళీ నువ్వే గుర్తొస్తావు.. అసలు నువ్వెంతలా గుర్తొస్తావో తెలుసా నీకు!?

ఎక్కడో ఓ చెత్త కాగితం మీద ఒక ఊరి పేరు కనిపిస్తుంది.. అదే.. అక్కడెక్కడో భూగోళానికి ఇంకో వైపునున్న ఆ ఊరు.. అదే నువ్వున్న ఆ ఊరు గుర్తొస్తుంది.. అసలు ఇప్పటి దాకా కనీసం పేరైనా పరిచయం లేని ఆ ఊరంటే ఉన్నట్టుండి గంపెడంత ప్రేమ పొంగుకొచ్చేస్తుంది.. ఆ ఊరి పేరు వింటే చాలు మైమరచిపోతాను.. ఏదో నీ పేరే విన్నంత ఆనందం, నిన్నే చూస్తున్నంత పరవశంలో పడిపోతాను.. యథాలాపంగా ఎక్కడో చోట మీ ఊరి పేరు విన్నప్పుడల్లా గుండె ఝల్లుమంటుంది. ఊపిరాడనట్టు, గుండెల్లో ఏదో పట్టేసినట్టు అయిపోతుంది. ఎవరో అపరిచితులు గబుక్కున మీ ఊరి పేరు చెప్తే వాళ్ళంటే అప్పటికప్పుడు బోల్డు ఇష్టం వచ్చేస్తుంది. వీళ్ళు నాకు బాగా కావలసినవాళ్ళన్న పిచ్చి అభిమానం ముంచుకొచ్చేస్తుంది. అంటే.. నువ్వుండే ఊర్లో వాళ్ళు కూడా ఉంటున్నారనీ, నువ్వు తిరిగే చోట వాళ్ళూ తిరిగారని, నీ కళ్ళతో చూసిన దృశ్యాలని వాళ్ళూ చూసారనీ, అంతటి గొప్పవాళ్ళని నేనూ ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నా అని నా సంబరమన్నమాట! అదే చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు కదా a=b=c అయితే a=c అని.. అలాగన్నమాట! మరీ సిల్లీగా అనిపిస్తోంది కదూ.. నాక్కూడా అంతే అనిపిస్తోంది. కానీ, అదంతే! ఒకోసారి కొన్ని నిజాలు సిల్లీగానే అనిపిస్తాయి.

నీ పేరు.. అబ్బబ్బా నీకసలు ఎందుకా పేరు పెట్టారు? ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ మూలకెళ్ళినా ఎవరో ఒకరు నీ పేరుతో వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటారు.. ఒకోసారి ఒళ్ళు మండిపోతుంది.. అబ్బబ్బా ఈ పేరుతో అసలు మనుషులే ఉండకపోతే బాగుండు, అసలీ పేరు పెట్టుకోడానికి వీల్లేదని ఏదన్నా చట్టం తెస్తే బాగుండు.. ఇలాంటి క్షుద్రపూరితమైన ఆలోచనలు వస్తాయి. ఆ పేరుని వింటున్నప్పుడూ, పలుకుతున్నప్పుడంతా ఓ పక్క మనసుని మెలితిప్పే ఏదో చెప్పలేని బాధ, మరో పక్క నీ పేరుని అన్నిసార్లు పలికే అదృష్టం దొరుకుతున్నందుకు అదో మురిపెం.. పిలిచేది నిన్ను కాకపోయినా, ఎంచక్కా నీ పేరునలా హాయిగా గొంతెత్తి పిలుస్తుంటే.. ఆహా.. అదో గొప్ప ఆనందంలే! నీకు చెప్పినా అర్థం కాదులే.. హుమ్మ్.. ఇది ఖచ్చితంగా పిచ్చి లక్షణమే అనిపిస్తోంది కదూ!

ఒకోసారి నేను ఏదోక పనిలో ఊపిరి సలపనంతగా మునిగిపోయి నీ ఊసే అసలు గుర్తుకు రాని సందర్భాల్లో.. అబ్బా ఎంత హాయిగా ఉంది ఈ కాసేపు అనిపిస్తుంది. అంతలోనే ఇంతసేపూ నిన్ను మర్చిపోయానని అనుకోగానే చాలా బెంగగా అనిపిస్తుంది.. ఏడుపొచ్చేస్తుంది.. అదే పనిగా కంటికి కనిపించిన ప్రతీదానిలో నిన్నే తలచుకోవడం చాలా దిగులుగా, బాధగా ఉంటుంది. కానీ, అదేంటో, ఆ బాధే చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఈ బాధని ప్రేమించడవేంటో నా మొహం.. అని నాకు నాకే తెగ నవ్వొస్తుంది కూడా!
ఎందుకలా!?
హుమ్మ్.. కేవలం ఒక్క మనిషి మీదున్న ప్రేమ ఇలా ఇన్నిటి మీద ప్రేమని పుట్టిస్తుందని నాకిప్పటి దాకా తెలీనే తెలీదు. ఆలోచిస్తుంటే ఇంకోటి కూడా అనిపిస్తుంది.. ఒకవేళ నేను నిజంగా నీతోనే ఉన్నాననుకో.. అప్పుడు ఇలా నువ్వున్న ఊరు, నీ పేరూ, నువ్వు మాట్లాడిన ప్రతీ అక్షరం అక్షరమూ, నీతో గడిపిన చిన్ని చిన్ని క్షణాలు.. ఇవన్నీ ఇన్ని వేల సార్లు మళ్ళీ మళ్ళీ తలచుకునేదాన్నంటావా? కాదేమో కదా! నువ్వే నాతో ఉన్నప్పుడు ఇంక నీ జ్ఞాపకాలతో నాకేం పని అనుకునేదాన్నేమో! అబ్బ.. నాకెంత స్వార్థం కదూ!

ఇంకా నీ గురించిన తలపుల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నప్పుడు నాకింకో సందేహం కూడా వస్తూ ఉంటుంది. నాలో నీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు నేనెందుకు నిన్ను బాధ పెట్టానసలు? అంటే, ఇప్పుడు నిన్ను దూరం చేసుకున్నాక గానీ ఇంత ప్రేమ నాలో దాగుందని నేను గుర్తించగలిగానా? లేకపోతే నిన్ను కోల్పోయాక గానీ నీ విలువ అమాంతంగా పెరిగిపోయి నీ జ్ఞాపకాలన్నీ ఇంత అపురూపం అయ్యుంటాయా? ఏమో.. నా దగ్గర ఇలాంటి జవాబులు లేని ప్రశ్నలు గంపల కొద్దీ ఉన్నాయి. ఏమైనా, ప్రశ్నించడం చాలా సులువనుకుంటా.. సమాధానాలు వెతుక్కోడం, సమాధానాలు ఇవేనని సకాలంలో గుర్తించి సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోగలగడంలో ఉంది అసలు చిక్కంతా.. ఏవిటో, పరీక్షలయిపోయాక సెలవుల్లో సమాధానాలు రాసినట్టుంది కదూ నా తెలివి!

ఒకోసారి నీ మీద చాలా కోపమొస్తుంది.. నేను మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు నువ్వెందుకు ఊరుకున్నావసలు.. అప్పుడే చెవి మెలిపెట్టి బుద్ధి చెప్పాల్సిందేమో.. అప్పుడైతే నేను నీకు దూరం అయ్యేదాన్ని కాదు కదా! నాకు వినిపిస్తుందిలే నువ్వేం అంటున్నావో.. నాలాంటి పెంకి మొహాలకి చెవి మెలెయ్యడం అంత సులువు కాదనేగా! పెద్ద గొప్పేలే.. ఆ విషయం మాక్కూడా తెలుసు.. అయినా సరే, నువ్వే ఏదోకటి చేసుండాల్సింది.. అంతే.. ఇంకో మాటే లేదు!
అసలు నువ్వంటే నాకు చాలా బోల్డు కోపం.. అసలీ ప్రపంచంలో నీ మీద కంటే కోపం నాకు ఇంక దేని మీదా లేదు.. రాదు.. ఎందుకు నిన్ను వదిలించుకోలేకపోతున్నాను నేను? నాకెందుకింత బాధ నీ వల్ల అని.. కానీ, అంతలోనే నీ మీద కోపమంతా నా మీదకి మళ్ళుతుంది. అసలిదంతా నా వల్లే.. నేనే నిన్ను వెళ్ళగొట్టేసాను. అయినా వేటూరి గారన్నట్టు కొన్ని దూరమైనా, దగ్గరైనా ఆనందమే.. నీలాగా! అసలు నువ్వు నాకు లేకపోతే.. అమ్మ బాబోయ్.. నేనస్సలు ఊహించలేను.. అసలు నువ్వే లేకపోతే నా చేతిలో ఉన్న సమయమంతా ఏమి చెయ్యాలో తెలీక మహా ఇబ్బంది పడిపోయేదాన్నేమో కదా! ఏం ఆలోచించాలి, దేనికి సంతోషపడాలి, దేనికి సంబరపడాలి, బాధ ఎందుకొస్తుంది, ప్రేమంటే ఏంటీ, పిచ్చంటే ఏంటీ.. ఇవన్నీ నాకు తెలిసేవి కాదుగా మరి!

ఏవిటో.. అంతా అయోమయంగా, అస్పష్టంగా, చిందరవందరగా, గందరగోళంగా ఏదేదో చెప్పేసాను కదూ! ఏమో.. నాకలాగే చెప్పాలనిపించింది మరి.. చెప్పేశాను.. అంతే! ఇలాంటప్పుడే నాకు నేనే అర్థం కావట్లేదేమోననిపిస్తుంది.. అంతలోనే ప్రేమో, పిచ్చో.. ఇది ఏదైనా కానీ.. నాకు మాత్రం ఇదే బాగుందనిపిస్తుంది.. మరి నీకు!?

30 comments:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

After a long time, oka manchi post.
అదంతే! ఒకోసారి కొన్ని నిజాలు సిల్లీగానే అనిపిస్తాయి. - baagundi.

Arun Kumar said...

వేచి చూడటంలో ఆనందముంటుంది అంటే ఈదేనేమో మధురా గారు?
మీ పోస్ట్లు గురించి ఎదురు చూసినందుకు ఒక మంచి పోస్ట్ రాశారు, చాలా బాగా రాశారు .

చెప్పాలంటే...... said...

avunu nijam gaa baagundi mi uttaram lo9ni manasu cheppina maata....

Eshwar said...

dat was a nice post
naku ila evarikina cheppalani undhi
but no chance ..

Anonymous said...

Excellent. Recently saw your blog. Too good. Love your way of writing.

MURALI said...

As usual ilantivi miru champethsaruga champesaranthe

హరే కృష్ణ said...

అలిగి వెళ్ళిపోతే ఇంత బాగా బుజ్జ గిస్తారా..చాలా లక్కీ మీ ఫ్రెండ్
ఎప్పటిలానే చాలా బావుంది :)

రాజ్ కుమార్ said...

బాగుందండీ..

ఇందు said...

ఎంతబాగా రాసావ్ మధురా!! నాకు పోస్టుచేయి ఇలా పోస్టుచేయని అందమైన ఉత్తరాలని :) నేను దాచేసుకుంటా ;)

Anonymous said...

chala bagundandi..

Vineela said...

హాయ్ మధుర గారు, చాల బాగా మనసు కి హత్తుకునేలా రాసారండి. నేను ఇట్లా మా స్నేహం లో ని తియ్యని జ్ఞాపకాలను తలచుకుంటూ, నా గురించి నేను తిట్టుకుంటూ, చాల మధనపడుతూ ఎన్ని రోజుల నుండి బతికేస్తున్ననో..అబ్బ నాకే ఇట్లాంటి పిచ్చి తలపులు వస్తాయేమో ఇలా వూరు, పేరు చూసి మురిసిపోవడం ఏంటో అనుకుని నాలో నేనే నవ్వుకునేదాన్ని..అట్లాంటిది ఇవాళ మీ పోస్ట్ చదువుతూ ఆశ్చర్య పోయాను భలే నా ఆలోచనల్ని చదివేసారండి :)

ramperugu said...

హృదయం లో కలం ముంచి రాస్తే ఇలాగే వుంటుంది...మనసుల్ని స్పర్శిస్తూ...

praveena said...

Heart touching...chala baga rasaru

Krishna Kalluri said...

:-)

vidipovatam vallane feelings inkaa strong gaa autaayi.

Premani anubhavinchi, daaniki dooram aina vaaru, chaala goppa bhaavakilu autaaru.

Meeru raasindi, aa feeling anubhavinche vaariki chaala baaga telustundi.

Great expression

Ennela said...

good post madhura....

shanti said...

hanna..hanna..how to write like this?

నేస్తం said...

>>>>>నువ్వు గుర్తొస్తావు.. నువ్వు చాలా గుర్తొస్తావు.. నువ్వు బోల్డు గుర్తొస్తావు.. మళ్ళీ మళ్ళీ నువ్వే గుర్తొస్తావు.. అసలు నువ్వెంతలా గుర్తొస్తావో తెలుసా నీకు!?
ఎవరో అపరిచితులు గబుక్కున మీ ఊరి పేరు చెప్తే వాళ్ళంటే అప్పటికప్పుడు బోల్డు ఇష్టం వచ్చేస్తుంది. వీళ్ళు నాకు బాగా కావలసినవాళ్ళన్న పిచ్చి అభిమానం ముంచుకొచ్చేస్తుంది.
ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ మూలకెళ్ళినా ఎవరో ఒకరు నీ పేరుతో వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటారు
ప్రతీదానిలో నిన్నే తలచుకోవడం చాలా దిగులుగా, బాధగా ఉంటుంది. కానీ, అదేంటో, ఆ బాధే చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఈ బాధని ప్రేమించడవేంటో నా మొహం.. అని నాకు నాకే తెగ నవ్వొస్తుంది
హుమ్మ్.. కేవలం ఒక్క మనిషి మీదున్న ప్రేమ ఇలా ఇన్నిటి మీద ప్రేమని పుట్టిస్తుందని నాకిప్పటి దాకా తెలీనే తెలీదు>>>>>

చాల్లే ఇంతకు మించి ఎక్కువ రాస్తే మొత్తం పోస్ట్ కాపీ పేస్ట్ చేయాలి మధు .... చాలా బాగా రాసావ్ మధు.. మా తొలి లేఖలు గుర్తు తెచ్చావ్ అంతే ...మళ్ళీ బయటకు తీయాలనిపిస్తుంది పైన సూట్కేస్ అట్టడుగున ఘాడంగా నిద్రపోతున్న పదకొండేళ్ళ క్రితపు మా జ్ఞాపకాలను

Anonymous said...

chaalaa baagundandi...

భారతీయ వాఙ్మయం said...

asalu seetharamashastri gaarini antaaru kaani meeru kuda andari manasullo emundo chusi rayagalaru, ee post chadivaka nenu kopamtho thokkipattina naa friend meedunna prema nannu munchesi vukkiri bikkiri chesthundi. em cheppanu. call chesthe naa friend nenu time kaaliga vundi call chesthunnanu antundi. nenu prematho call chesthunnanu antanu. i want solution for this.

అనుదీప్ said...

మధురా... మీరు మరీనండీ... ప్రతిసారి ఇంత బాగ రాస్తే ఎల చెప్పండీ... నాకు మిమ్మల్ని చూస్తే కుళ్ళుగా ఉంది. . చాలా కుళ్ళుగా ఉంది... బొల్డు కుళ్ళుగా ఉంది.... మళ్ళీ మళ్ళీ కుళ్ళుగా ఉంది... అంత బాగా రాసారండి. కీప్ ఇట్ అప్

Santosh Reddy said...

Mee Akshara pondhika adbutham...
Mee madhi bhaavala prathi padam amrutham...!!!..keep up the good work.....!!!

HarshaBharatiya said...

చాలా బాగా చెప్పారండి మధుర గారు ........

మధురవాణి said...

@ అవినేని భాస్కర్,
ధన్యవాదాలు.. :)

@ అరుణ్,
అమ్మయ్యో.. అంతగా ఎదురు చూసారా అయితే? పోన్లెండి.. ఫలితం దక్కింది.. :)
ధన్యవాదాలు.

@ చెప్పాలంటే,
ధన్యవాదాలండీ ఉత్తరంలోని మనసుని చదివినందుకు.. :)

@ ఈశ్వర్,
దానిదేముందండీ.. ఇప్పుడొక ఉత్తరం రాసి పెట్టుకుని ఆ అవకాశం ఎప్పుడన్నా దొరికితే ఇచ్చెయ్యండి. అయినా, ఇది పోస్ట్ చెయ్యని ఉత్తరం కదా! అంటే, చేరాల్సిన వాళ్ళకి ఎన్నటికీ చేరదు. మన దగ్గరే మిగిలిపోతుంది!

మధురవాణి said...

@ అనానిమస్ 1,
నా రాతలు మీకు నచ్చుతున్నందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ! :)

@ మురళి,
హహహ్హహా.. థాంక్యూ! :)

@ హరే కృష్ణ,
అంతేనంటారా? మరి ఫ్రెండ్స్ అలిగినప్పుడు బతిమాలడమో, బెదిరించాదమో తప్పదు కదా! ;) థాంక్యూ! :)

@ వేణూ రామ్, అనానిమస్ 2,
ధన్యవాదాలండీ! :)

@ ఇందూ,
హహహ్హహా.. అలాగంటావా.. అయితే మనిద్దరం బోల్డు ఉత్తరాలు రాసేస్కుందాంలే ఎప్పుడైనా! థాంక్యూ! :)

మధురవాణి said...

@ వినీల,
థాంక్యూ! చాలాసంతోషంగా ఉందండీ.. అచ్చం నాలాగే ఇంకొకరు ఆలోచిస్తారని వింటుంటే.. :)

@ ramperugu,
ఎంతందంగా మెచ్చుకున్నారండీ! ధన్యవాదాలు! :)

@ ప్రవీణ,
థాంక్సండీ! :)

@ Krishna Kalluri,
ధన్యవాదాలండీ!
హహహహ్హా! అయితే, ప్రేమించిన వాళ్ళు దూరమైతేనే గానీ భావుకత్వం రాదంటారా? ;)

@ ఎన్నెల,
థాంక్యూ! :)

మధురవాణి said...

@ శాంతి,
నాకూ తెలీదండీ.. అప్పుడప్పుడూ ఇలా రాసేయ్యాలనిపించినప్పుడు రాసేస్తూ ఉంటా! :)

@ నేస్తం,
మీ కామెంట్ చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్న నన్ను ఊహించుకోండి మీరు.. థాంక్యూ ఊ ఊ.. :)
ఒహ్హో.. అయితే ప్రేమలేఖలన్నీటిని కట్టగట్టి సూట్కేసులో దాచేసారన్నమాట! :)

@ అనానిమస్ 3,
ధన్యవాదాలండీ! :)

@ శ్రీ హర్ష,
థాంక్యూ! :)

మధురవాణి said...

@ గీత_యశస్వి,
కెవ్వ్... గీత గారూ... నన్ను మునగ చెట్టు కాదండీ.. ఎక్కడికో తీస్కెళ్ళిపోయారు! అక్కడి నుంచి పడిపోతానో ఏమో! :P

మీ ఫ్రెండుతో ఫోన్లో వివరంగా మాట్లాడటం కుదరకపోతే మీరే తీరిగ్గా కూర్చుని ఒక ఉత్తరం (ఈ మెయిల్) రాసి పంపండి. ఫోన్లో లాగా పెట్టెయ్యడం, చెప్పనివ్వకపోవడం ఉండదు కదా ఉత్తరంలో.. తను మొత్తం చదువుకుని మీ ప్రేమని అర్థం చేసుకుని.. మళ్ళీ మీరిద్దరూ దగ్గరైపోతారు ఎంచక్కా! :)

@ అనుదీప్,
How Sweet! బోల్డన్ని ధన్యవాదాలండీ! :)

@ Santosh Reddy,
That's so sweet of you! Thank you! :)

Anonymous said...

"Oka Post Cheyani Uttaram Baga Undi".......

jeevatham oka anubhavala sammalanam ,kani ippatiki mee madilo inni teepi jnapkalanu nimpina kammani sneham marala chigurunche avakasam leda?

మధురవాణి said...

@ అనానిమస్,
మీరు చెప్పింది నిజమేనండీ! కానీ, ఏ సమయానికి పోస్టు చెయ్యాల్సిన ఉత్తరాలు అప్పుడు పోస్ట్ చెయ్యకపోతే వాటికున్న కాలపరిమితి ముగిసిపోతుంది కదా! అలాంటివి ఇలా పోస్ట్ చేయని ఉత్తరాల్లానే మిగిలిపోతాయి! ;)

Unknown said...

ఫీలింగ్స్ అన్ని చాలా బాగా రాసారు....
అన్ని ఫీలింగ్స్ ఒకే చోట..
బాగుంది :))