Saturday, June 19, 2010

ఇవాళ్టి 'ఈనాడు' లో నా బ్లాగు పరిచయం

ఎవరమైనా సరే బ్లాగుల్లో ఏం రాస్కుంటాం? బ్లాగంటే మన మనసులోని భావాలకి అక్షరరూపం కదా! అందుకని ఎవరి బ్లాగు మీద వాళ్లకి సహజంగానే ప్రేముంటుంది. అందుకే మన బ్లాగుకి వచ్చే చిన్న గుర్తింపైనా కూడా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదూ! ఏంటీ.. అరవ డబ్బింగ్ సీరియల్ డైలాగుల్లాగా అనిపిస్తోందా! సరే సరే.. నేరుగా విషయానికొస్తున్నా! sengihnampakgigi

ఇవ్వాళ్టి 'ఈనాడు'లో ఈతరం పేజీలో 'బ్లాగోగులు' శీర్షికన నా బ్లాగు పరిచయం వచ్చింది.celebrate నా వరకూ నాకు ఇది చాలా పెద్ద గుర్తింపే!encem


దాదాపు రెండేళ్ళ క్రితం ఊరికే సరదాగా యీ బ్లాగు ఓపెన్ చేసాను. అప్పటికి కంప్యూటర్లో తెలుగు రాయచ్చనే విషయం కూడా తెలీదు నాకు. బ్లాగర్లో తెలుగులో రాసే వీలుందని చూసి చాలా సంతోషమేసింది. తరవాత కొన్ని రోజులకి కొత్తపాళీ గారు రాసిన కామెంట్ వల్ల జల్లెడ, తరవాత కూడలి గురించి తెల్సింది. అన్నేసి తెలుగు బ్లాగులు చూసి చాలా ఆశ్చర్యపోయాను. తరవాత క్రమంగా తెలుగు బ్లాగులు చదవడం అనేది ఒక ఇష్టమైన అలవాటుగా అయిపోయింది. అందరి రాతలూ చదువుతూ మెల్లమెల్లగా నేనూ రాయడం మొదలెట్టాను. అలా రాయడంలో ఓనమాలు దిద్దానన్నమాట మన తెలుగు బ్లాగ్లోకంలో. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది నాకు. నా పాత పోస్టులు ఎప్పుడైనా చూస్కుంటే ఒకోసారి నాకే సందేహం వస్తుంటుంది. అసలిదంతా నిజంగా నేనేనా రాసింది. అప్పుడిలా రాయాలని ఎలా అయిడియా వచ్చిందబ్బా.. అనుకుంటూ నాకు నేనే బోలెడు ఆశ్చర్యపడిపోతుంటాను.rindusengihnampakgigi

యీ సందర్భంగా నా రాతల్ని చదువుతూ ఎప్పటికప్పుడు స్పందన తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ బోలెడన్ని ధన్యవాదాలూ, కృతజ్ఞతలూ చెప్పుకుంటున్నాను.doa
ఎప్పుడైనా చాలా రోజులు కొత్త పోస్టు వేయకుండా ఉన్నప్పుడు నా బద్దకాన్ని పోగొట్టి ఏదో ఒకటి రాయాలన్న స్ఫూర్తిని నాలో నింపే నా బ్లాగు ఫాలోవర్స్ 90 మందికి పేరుపేరునా నా కృతజ్ఞతలు.tepuktangan
నాకు ప్రత్యక్షంగా తెలీకపోయినా కూడా నా బ్లాగుని చదువుతున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.tepuktangan
నేనేదన్నా కథ రాస్తే, చదువుతారా చస్తారా అంటూ వేళాపాళా లేకుండా వాళ్ళని హింసించినా కూడా ఓపిగ్గా చదివి తిట్లూ, దీవెనలూ అందించే చిన్నూకి, సుజ్జీకి నా ముద్దులు.ciumjelir

నా యీ చిన్ని బ్లాగుని ఈనాడు ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన 'మనసులోమాట' సుజాత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.rossenyum

ఏంటీ.. మరీ ఫార్మల్ గా మీటింగులా అనిపిస్తోందా! రోజూ కాకపోయినా ఇలాంటప్పుడైనా ఓసారి.. మనల్ని వెన్నంటి నడిచే వాళ్లకి, మనల్ని నిరంతరం ప్రోత్సహించేవాళ్ళకి చిన్న థాంక్స్ అన్నా చెప్పాలి కదా! అదే యీ ముచ్చటన్నమాట!sengihnampakgigi

68 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

congrats!!!

..nagarjuna.. said...

congrats...

Kiran said...

congratulations...

హరే కృష్ణ said...

అభినందనలు

Prasad Gutti said...

Hi Madhu,

How are you. I am Prasad. I have seen it in EENADU website reading your "Sumathi Satakam"s.

Congratulations first of all for appearing your blog in EENADU.

I am feeling very happy and awesome when I am reading your poems, meanings(tatparyamu) and explanation about the poem with your real life experiences.

But there are some mistakes in your telugu literary, Could you please take care while writing them. Please dont mind.

Mana telugu bhaasha meeda unna abhimanam tho cheputunnanu. Vintarukaduuu...

Poem which i have found with mistake is : "Upakariki Nupakaramu".

You have to write "Napakariki Nupakaramu" but not "Nupakariki Nupakaramu" at 3rd line. Could you please correct it? hahahah Have a nice day... and I too will follow your blog when I have time. bye for now.

Anonymous said...

మధుర వాణి గారు
కంగ్రాట్స్
so sweet of you
very nice blog


మీ అభిమాని
పద్మ

Anonymous said...

wow congrats madhu
i'm proud of my favourite blog is in eenadu
i am so happy
waiting for many more posts to come from you
wishing a best time

one of your fan
:)

Prasad Gutti said...

Hi Madhuravani,

Thank you for correcting the poem.

meeru PHD deni meeda chestunnaru?

Anonymous said...

మా మధు బ్లాగు ఈనాడులో వచ్చిందోయ్ :)
congrats..

జ్యోతి said...

Congratulations .. keep going...

bhavani said...

అభినందనలు

SRRao said...

మధురవాణి గారూ !
అభినందనలు

Unknown said...

అభినందనలు!!!!!!

krishna chaitanya said...

madhu gaaru,
your blog is really nice, reminds us of our true culture and is a welcome change amidst the plethora of blogs filled with westernised/so called modern writings. the mention of your blog in eenadu is truly recognising your worth. it seems you are pursuing your ph.d may i know in which university and what subject?

krishna chaitanya said...

dayachesi me email id telupagalaru. nenu germany vachi chadavalani anukuntunnanu. mee salahalu naakavasaram

durgeswara said...

subhakaamkshalu

పరుచూరి వంశీ కృష్ణ . said...

అభినందనలు........పార్టీ ఇవ్వరా మాకు ? :-)

Anonymous said...

అందుకోండి అభినందన మందార మాల ;-))

పార్టి సంగతి మర్చిపోవద్దు సుమా!!

శిశిర said...

అభినందనలు.వంశీ ప్రశ్నే నాదీనూ.. :)

శివరంజని said...

Congratulations .. keep going...

సవ్వడి said...

Hearty Congrats..

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

మధురవాణి గారు హార్ధికాభినందనలు

స్థితప్రజ్ఞుడు said...

కంగ్రాట్స్!!!

మీ బ్లాగు పోస్ట్స్ అన్ని చదివా. బాగా రాసారు. నాకు కూడా సుజాత గారు అబ్రకదబ్ర గారి బ్లాగులు చదివాకే తెలిసింది అసలు తెలుగు లో బ్లాగులు రాయొచ్చని. మీరు ఏ విధంగా అయితే బ్లాగు మొదలెట్టారో, నేను కూడా సరిగ్గా అలాగే మొదలు పెట్టా...

చెప్పాలంటే...... said...

congrats madhuravaani garu

Madarapu said...

మీరు సూపర్ అండి... ఈనాడు వారికి ఇంత మంచి బ్లాగర్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు..జర్మనీలో ఇంకో తెలుగు బ్లాగర్ ఉందని కొంచెం గర్వంగా ఉంది....!
ఇప్పటికే మీ టపాలు బోలెడు చదివాను పొద్దుననుండి. ఇంకా చదువుతూనే ఉంటాను. అభినందనలు మరియు ధన్యవాదములు.
భవదీయ,
రాము మాదారపు
www.indiayouth.info

sivaprasad said...

నా పాత పోస్టులు ఎప్పుడైనా చూస్కుంటే ఒకోసారి నాకే సందేహం వస్తుంటుంది. అసలిదంతా నిజంగా నేనేనా రాసింది. అప్పుడిలా రాయాలని ఎలా అయిడియా వచ్చిందబ్బా.. అనుకుంటూ నాకు నేనే బోలెడు ఆశ్చర్యపడిపోతుంటాను.
congrats!!!

సి.ఉమాదేవి said...

బ్లాగాక్షరాలలో వినపడుతున్న మీ వాణి,విశ్వవీణగా ఈనాడుద్వారా ఈనాడంతటా వ్యాపించి, గుర్తింపే మనిషికి ఉద్దీపన అని తెలియచేసింది.అభినందనలందుకోండి.

KK said...

Great... అభినందనలు.

జయ said...

హార్ధికాభినందనలు మధురవాణి గారు. ఇంక రోజూ రాయక తప్పదు. ఇది సెకెండ్ టైమ్ కాబట్టి మా అందరికీ ఎవరు కోరుకున్న పార్టీ వాళ్ళకివ్వాలసిందే తప్పదు.

Nishigandha said...

Congratulations and keep going!!

:-)

ఆ.సౌమ్య said...

congratulations madhuravani garu...great! keep rocking.

కౌండిన్య said...

అభినందనలు

శేఖర్ పెద్దగోపు said...

Hearty Congrats!! I think this is your turn to be on Cloud9, Right?? Enjoy every minute today...and dont forget about the party..OK :-)

swapna@kalalaprapancham said...

Congrats dear

ANALYSIS//అనాలిసిస్ said...

మధురవాణి గారూ ... అభినందనలు

psm.lakshmi said...

congrats madhuravani
psmlakshmi

సిరిసిరిమువ్వ said...

అభినందనలు!

మాలా కుమార్ said...

మధురవాణి ,
హార్ధికాభినందనలు .

ప్రణీత స్వాతి said...

congrats...maduravani garu

AB said...

Congrats

Padmarpita said...

అభినందన మందారమాల....

Anonymous said...

Hearty congrats :)
Sharada

GASP3R said...

actually i started followin ur blog from dat article only... congrats and good luck!!
your article on baruvu-bhadyata was quite funny... me n my sister enjoyed a lot!!! :D

చిలమకూరు విజయమోహన్ said...

అందుకోండి మా అభినందనలు.

నీహారిక said...

congratulations!!!
ఇక మీ పెళ్ళి కబుర్లు ఎపుడు చెప్తారు?

హరీష్ బలగ said...

CONGRATS

హరీష్ బలగ said...

hello madh gaaru... mundhugaa meeku naa abhinandhanalu... chaala kaalam nundi blog anna padam vintunnaa kudaa, gantalatharabadi computer mundu gadipe nenu eppudooo blogs ni pattinchukoledhu.. kaani EENADU lo mee blog parichayam chusi mee blog open chesaanu.. english medium chaduvullo padi yuvatha telugu ni marichipothunnaa eerojullo kudaa germany lo vundi kudaa antha swachamayina theta telugu lo blog raasthundatam naaku chalaa nachindi..mee blog chusi aascharyapoyaanu.. idi chadivaakaa naakooo oka blog raayaalani korika kaluguthondi.. thappakundaaa thvaralone nenu kuda oka telugu blog pedathaanu..

mee blog lo humour kudaa baagaa nachindi..bore kottakundaaa chadavaalanipinchelaa vundi.. ee comment kudaa telugu lo raayaalani anukunnaa.. kaani elaa raayaalo theliyaledhu.. thondaralone thelusukuntaaa..

inko vishayam.. ammaayilu thama vayasu, baruvu evarikee theliyakudadhanukuntaaru.. kaani meeru mee baruvu-badyatha tapa lo raasina paddhathi naaku chalaa muchatesindi.. asalu blog lo em raasthaaraaa ani innaallu naaku unna doubt ki answer dorikindi.. raayakudanidi edi ledhani..

nannu inspire chesianduku marokkasari meeku dhanyavaadhaalu thelupukuntooo selavu theesukuntunnaanu... oka kottha blog tho malli mimmalini kalusukuntaanu...

Vinay Datta said...

I've seen the Enadu news. I've seen the titles of your posts in koodali but entered only with Eenadu. Your interest in the mothertongue is laudable!

శ్రీ said...

అభినందనలు

రాధిక(నాని ) said...

నా హృదయపూర్వక శుభాబివందనాలు మదురవాణీ గారు

మధురవాణి said...

@ మందాకినీ, నాగార్జున, కిరణ్, హరేకృష్ణ, జ్యోతి, భావాన్ని, SR rao, ధరణీరాయ్ చౌదరీ, జీవని, దుర్గేశ్వర, శివరంజని, సవ్వడి, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్, చెప్పాలంటే, నువ్వుశెట్టి బ్రదర్స్, నిషిగంధ, సౌమ్య, కౌండిన్య, అనానిమస్, swapna@kalalaprapancham, శీను, PSM లక్ష్మి, సిరిసిరిమువ్వ, మాలా కుమార్, ప్రణీత స్వాతి, అశ్విన్ బూదరాజు, పద్మార్పిత, శారద, చిలమకూరు విజయమోహన్, శ్రీ, రాధిక(నాని )...

చాలా సంతోషంగా ఉంది. You all made my day! సమయం తీసుకుని నన్ను అభినందించిన బ్లాగ్మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! :-)

మధురవాణి said...

@ Prasad Gutti,
ముందుగా వివరంగా సుదీర్ఘమైన కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు. తప్పుని సరిచేసినదుకు చాలా థాంక్సండీ! సాధారణంగా నేను స్పెల్ చెక్ బాగానే చూసుకుంటాను. అయినా, పొరపాటున ఒకోసారి అలాంటి అక్షరదోషాలు దొర్లుతుంటాయి. మీలాంటి మిత్రులెవరైనా చెప్తే సరిచేసేస్తాను. అన్నట్టు, నేను PhD బయాలజీలో చేసానండీ.

@ అనానిమస్ 1,
ధన్యవాదాలండీ. మీలాంటి మిత్రుల encouragement తోనే నేను రాసే ప్రయత్నం చేస్తున్నానండీ. అది సరే గానీ, మీ పేరు చెప్పుంటే బాగుండేదిగా! ;-)

@ అనానిమస్ 2,
థాంక్సండీ.. ఇంత స్నేహంగా అభినందనలు చెప్పారు కదా.. అలాగే మీ పేరు చెప్పుంటే బాగుండేది కదూ! ;-)

@ కృష్ణ చైతన్య,
ధన్యవాదాలండీ.. చాలా సంతోషంగా ఉంది. నా బ్లాగర్ ప్రొఫైల్ లో నా మెయిల్ ఐడి ఉంది. నేనేమైనా సహాయం చేయగలిగితే తప్పక చేస్తానండీ! Good luck!

@ పరుచూరి వంశీకృష్ణ, రాధిక, శిశిర,
థాంక్స్ ఫ్రెండ్స్.. అయితే మరి పార్టీ ఎక్కడ పెట్టుకుందామంటారూ! ;-)

@ స్థితప్రజ్ఞుడు,
ధన్యవాదాలండీ.. మరి ఆ చేత్తోనే మీ బ్లాగ్ లింక్ ఇచ్చుంటే నేనూ చూసేదాన్ని కదండీ! :-)

@ Ramu Madarapu,
థాంక్సండీ! అంత ఓపిగ్గా నా పోస్టులన్నీ చదివేసారా? చాలా పెద్ద సాహసం సుమీ! ;-) అయితే మీరు జర్మనీ లోనే ఉన్నారా? ఎక్కడో తెల్సుకోవచ్చాండీ?

మధురవాణి said...

@ sivaprasad nidamanuri,
నిజంగానే అలానే అనిపిస్తుందండీ! :-) :-)

@ C.ఉమాదేవి,
ఎంతందంగా చెప్పారండీ మీ అభినందనలు. ఎంతైనా రచయిత్రి కదూ.. :-) ధన్యవాదాలండీ!

@జయ,
థాంక్సండీ! ఇంతకీ పార్టీ ఎక్కడ పెట్టుకుందామంటారు మరి? రెండోసారి ఏంటండీ? అంటే, నెమలికన్నులో మురళి గారు ఓసారి నా బ్లాగుని పరిచయం చేశారు కదా.. అదేనా మీరనేది? ;-)

@ శేఖర్ పెద్దగోపు,
థాంక్యూ! నిజంగా cloud 9 మీదే ఉన్నానండీ! ఈ టపా రాసేప్పుడు మీ బామ్మ టపానే గుర్తొచ్చింది. :-)

@GASP3R,
థాంక్సండీ.. మీకూ, మీ సిస్టర్ కి కూడా :-)

@ HARISH,
ముందుగా ఇంత ఓపిగ్గా సుదీర్ఘమైన కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు. బరువు, వయసు గురించి అలా సీక్రెట్ గా ఉండాలి అని నాకేమి అనిపించదండీ! అందుకే అలా మాములుగా రాసేసాను. :-)
మీరు కూడా ఓ బ్లాగు ఓపెన్ చేయబోవడం హ్యాపీగా ఉంది. :-) మీరు తెలుగులో రాయాలంటే ఈ లింక్ చూడండి. http://www.google.com/transliterate/indic/telugu# మీరు తెలుగు బ్లాగు ఓపెన్ చేయడానికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. http://telugublogtutorial.blogspot.com/

@Madhuri,
Thanks! Keep visiting! :-)

మంచు said...

congrats

హను said...

Hearty Congratulations!!
No words to say....Way to go!

మధురవాణి said...

@ నీహారిక గారూ,
థాంక్సండీ! అయితే ఇంక ఆ కబుర్లే మిగిలిపోయాయంటారా? ;-)

@ మంచు పల్లకీ,
ధన్యవాదాలండీ!

@ హను,
Thanks! I hear you! :-)

తృష్ణ said...

last but not the least...hearty congrats.You deserve it.

Anonymous said...

పేరు చెప్పిన అనానిమస్ కి థాంక్స్ చెప్పలేదు
ఎవరు అని అనుకుంటున్నావా
మధూ నేను మధూ నీ అభిమాని పద్దూని
6th comment
హుమ్మ్... సరేలే మరిచిపోయినా నేను ఏమి అనుకోనులే

i love ur blog అది గుర్తుంచుకుంటే చాలు :)

మధురవాణి said...

@ తృష్ణ,
Thanks a lot! :-)


@ డియర్ పద్దూ మేడమ్, (నేనిలా పిలవచ్చు కదూ!)
I'm extremely sorry. అనుకుంటూనే ఉన్నాను అందరివీ జాగ్రత్తగా పేర్లు చూసుకు రాయాలి.. ఎవ్వర్నీ మిస్ చేయకూడదు అని. ప్చ్! కానీ, చేసేసాను :-( అయినా, చూసారా అలా పొరపాటు జరగడం వల్లనే కదా మీరొచ్చి మరోసారి 'I love ur blog' అని చెప్పారు. హీ హీ హీ.. ;-) మీకు నవ్వు రాలేదా నా అతితెలివికి :-D అసలు మీలా ఆప్యాయంగా ప్రోత్సహించే మిత్రుల వల్లే నేనీ బ్లాగు రాయగలుగుతున్నాను. ఊరికే మాటవరసకి కాదు నిజ్జంగా చెప్తున్నా! ఇంకెప్పుడూ మిమ్మల్ని అస్సలంటే అస్సలు మరచిపోనని మాటిస్తున్నా! కావాలంటే నాకేదైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే, నాకు మెయిల్ చేసి చెప్పండి. నా బ్లాగర్ ప్రొఫైల్ లో మెయిల్ id ఉంటుంది. ప్లీజ్.. ఈ ఒక్కసారికి నా తప్పు ఒగ్గేసి.. ఓ పాలి ఇటొచ్చి 'క్షమించేసా..పో..' అని చెపుదురూ! :-)

ఏకాంతపు దిలీప్ said...

Congratulations! :)

మధురవాణి said...

@ ఏకాంతపు దిలీప్,
ధన్యవాదాలండీ! :-)

అశోక్ పాపాయి said...

congratulations maa wish latega vachina latestga vuntundi andukondi mari....

harikrishnavarma.n said...

Hello madhuravani garu congrats........

DILSE said...

Madhuravani garu!!!congratulations!!nenu oka one month kritam mamuluga evo blogs choosthu unte mee blog dorikindi!!!nachi follow autunna!!Nenu follow ayina konni rojulaki mee blog gurinchi paper lo chusa!!!

edemaina congrats!!!

Anonymous said...

ఏదోలే సుత్తి, బ్లాగులో ఏమి రాస్తారు అనుకున్న..కొన్నల్లక్రితం గూగుల్ సెర్చ్ లో కనిపిస్తేయ్ ..'ఈనాడు' మళ్లీ గిచ్చింది ..మధురవాణి సుమధుర వీణాగానం లీల గ వినిపించింది ..ఇంటర్నెట్లో ఆ తెలుగుని చూసి ..మనసు పులకరించి ..ఆ గిచ్చుడికి పెదవి మీద కిచ్చుక్కున నవ్వుకున్న ..ప్రస్తుతానికి కృతజ్ఞతలు ఈనాడుకి ...మీకు అభినందనలు .

ఇవన్ని పొగడ్తలనుకునేరు ..అస్సలు కాదు ..ఇంగిలీషు పొగ లో కలుషితమైన మనసు ..తెలుగు చాప మీద సేదతీరితేయ్ ఇలానీ ఉంటుంది.

మధురవాణి said...

@ అశోక్ పాపాయి,
లేటెస్ట్ గా విష్ చేసినందుకు థాంక్సండీ! :-)

@ harikrishnavarma.n,
ధన్యవాదాలండీ! :-)

@ DIL SE,
ధన్యవాదాలండీ! Thanks for following my blog. :-)

@ నాగేశ్వర ప్రసాద్ నకరికంటి,
"ఇంగిలీషు పొగ లో కలుషితమైన మనసు ..తెలుగు చాప మీద సేదతీరినట్టుంది.." -- అంటూ చాలా అందంగా చెప్పారండీ! ధన్యవాదాలు :-)

malathi said...

చాలా చాలా ఆలస్యంగా చూసేను. ఆలస్యంగానైనా, 68 అభినందనలతరవాతయినా, నేను కూడా చాలా సంతోషించేను ఇది చూసి అని చెప్తే తప్పులేదు కదా.
మధురవాణీ, నువ్వింకా ఇలా చాలా చాలా కథలు రాస్తూ, కబుర్లు చెప్తూ, ఫొటోలు పంచుతూ, మరింత గొప్పపేరు తెచ్చుకోగలవని ఆశిస్తూ,,,మాలతి.
పదికి నీబ్లాగుగురించి చేసిన సుజాతకి కూడా అభినందనలు.

bharath nunepalli said...

ita late ga congrats cheptunanduk titukokandi pls. nenu mee blog regular ga chusevadini. emadya work ekuva kavadam valla kudaraledu. mee blog gurinchi eenadu paper lo news vachindani chusi chala anadinchanu. nenu net lo telugu blogs ni chudadam modalu petindi mee blog to ne. mee blog lo prati roju oka kothadanam kanipistundi. naa snehithurale rastondi ane aatmiyaa bhavana kalugachestundi.. meeru ila manci peru inka techukovali ani aasistunanu