మా సుజ్జీ ఇవ్వాళ ఓ కవిత రాసింది తన బ్లాగులో! అది చూసి సరదాకి నేనిలా స్పందించా! కాబట్టి, యీ బుజ్జి కవిత సుజ్జీకే అంకితం ;-)
నేనెవరు?
నీ అలసిన మనసుకి సేద తీర్చాలని పడిగాపులు కాస్తున్న ఓ వాసంత సమీరాన్ని!
నేనెందుకు?
నీ పలుకుల ముత్యాలద్దుకుని మెరిసిపోదామని ఆరాటపడుతున్న ఆల్చిప్పని!
నేనేమని?
నీ చిరునవ్వు గంధం నాపైన చిలకరిస్తే పరిమళించాలని ఎదురు చూస్తున్న ఓ కాగితం పువ్వుని!
అసలు పోలికలెందుకు?
నువ్వూ, నేనూ వేరు వేరు కానప్పుడు!
మన మధ్యన మరేదైనా ఇమిడే ఆస్కారం ఎక్కడిది?
ఇద్దరం ఒకటే అయినప్పుడు!
నీ అలసిన మనసుకి సేద తీర్చాలని పడిగాపులు కాస్తున్న ఓ వాసంత సమీరాన్ని!
నేనెందుకు?
నీ పలుకుల ముత్యాలద్దుకుని మెరిసిపోదామని ఆరాటపడుతున్న ఆల్చిప్పని!
నేనేమని?
నీ చిరునవ్వు గంధం నాపైన చిలకరిస్తే పరిమళించాలని ఎదురు చూస్తున్న ఓ కాగితం పువ్వుని!
అసలు పోలికలెందుకు?
నువ్వూ, నేనూ వేరు వేరు కానప్పుడు!
మన మధ్యన మరేదైనా ఇమిడే ఆస్కారం ఎక్కడిది?
ఇద్దరం ఒకటే అయినప్పుడు!
19 comments:
హ్మ్మ్.. మీ సమాధానం బాగుంది. :-)
"అసలు పోలికలెందుకు?
నువ్వూ, నేనూ వేరు వేరు కానప్పుడు!
మన మధ్యన మరేదైనా ఇమిడే ఆస్కారం ఎక్కడిది? "
ఘాడమైన ఆలోచన....
బావుంది
"అసలు పోలికలెందుకు?
నువ్వూ, నేనూ వేరు వేరు కానప్పుడు!"
Beautiful.
So Sweet
బాగుంది మీ స్నేహ బంధం.
:-)
@ భావన, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్, శిశిర, సవ్వడి, విశ్వ ప్రేమికుడు, గీతాచార్య
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు :-)
nuvvu, nenu veru kaadu ane bhavana, rendu manushulanu, rendu manasaulanu kalipe adbhutha bhavam. danini meeru chala chakkaga vyaktaparicharu
Thanks Bharath! :-)
మీ ఇరువురి స్నేహం చిరకాలం వర్ధిల్లాలని దేవుడి ని ప్రార్థిస్తున్నాను
@ రాధిక,
Thanks for your wish! :-)
మధురవాణి గారు, నమస్కారములు.
మీ కవితా మధురంగా వున్నది. "కాగితం పువ్వు" అని వాడటం ద్వారా, సుఘంధం చల్లబడటంవల్ల, జీవంలేని ఆ కాగితం పువ్వు , స్నేహ ఘంధమనే జీవాన్ని పొంది, మీ స్నేహాన్ని బతికిస్తున్నది అనే అర్ధం వచ్చింది. చాలా బాగుంది.
భవదీయుడు,
మాధవరావు.
చాలా బాగుంది మీ జుగల్బందీ. అభినందనలు.
@ madhavarao.pabbaraju,
ఎంతందంగా వివరణ ఇచ్చారండీ! ధన్యవాదాలు. :-)
@ ఆత్రేయ కొండూరు,
కవిగారూ.. చిరకాల దర్శనం. ధన్యవాదాలండీ! :-)
Chala Bagundi. First time visitor nee. Eee roju eenadu paper lo mee blog details chudaganae open chesanu.
@ Vijaya,
నా బ్లాగుకి స్వాగతమండీ! మీకు నచ్చినందుకు సంతోషం. Keep visiting!
chala bagundi mee blog.......eenadu paper lo chadivi ivvale chusanu....keep it going!!
--Swetha
@ శ్వేత, ramnarsimha,
ధన్యవాదాలండీ! :-)
అసలు పోలికలెందుకు?
నువ్వూ, నేనూ వేరు వేరు కానప్పుడు! ee lines chala bavunnayi.
Post a Comment