Tuesday, June 08, 2010

నిరీ'క్షణం'




నా మదిలో గుట్టుగా దాచిపెట్టిన గుప్పెడు ఊహలు స్వేచ్ఛగా గువ్వల్లా ఎగరాలని ఉవ్విళ్లూరుతున్నాయి..
ఓ క్షణం కళ్ళు మూసుకుంటే రెప్పల మాటున రోజు గడిచినట్టుంది..

గోడకున్న కుందేలు గడియారం చెవులు పట్టుకు ఎంత లాగినా ఒక్క ఘడియా కదలదే!
ఒక్కో సూర్యోదయం కోసం ఎన్నెన్ని అహోరాత్రాలు వేచి చూశానో కదా!

అలా కొన్ని యుగాల నిరీక్షణ అనంతరం నా తపస్సు ఫలించి నా కళ్ళ ముందు నువ్వు అవతరించావు..
నీ సాక్షాత్కారానికి అచ్చెరువొంది నే రెప్పవేయడం మరచి చూస్తుండిపోయాను..

అంతదాకా పోగేసిన నా ఊహలన్నీ నీ సమక్షంలో ఊసులుగా మారకుండానే మూగబోయాయి..
నీ మనోహర రూపం నా కళ్ళల్లో నింపుకుందామన్న పిచ్చి ప్రయత్నంలో ఘడియొక క్షణంలా కరిగిపోయింది..

నీ కంటిపాప వెలుగులో నా ప్రతిబింబం చూసుకుంటూ హృదయ నివేదనం చేసేలోపే రెప్పపాటులో అంతర్దానమయ్యావు..
ఆ మధురక్షణాల ముత్యాలసరాన్ని భద్రంగా దోసిట్లో పట్టుకుందామనుకుంటుండగానే చేజారి చెల్లాచెదురై పోయింది..
సప్తవర్ణరంజితమైన స్వప్నమొకటి రంగులన్నీ వెలిసిపోయి బోసిగా మిగిలిపోయింది!



24 comments:

Unknown said...

నిరీక్షణం విమోచనం పలకడానికి ఒకేలా ఉన్నా
మీ కవిత చాలా బావుంది
చప్పట్లు

విశ్వ ప్రేమికుడు said...

చాలా బాగారాశారు.

" గోడకున్న కుందేలు గడియారం చెవులు పట్టుకు ఎంత లాగినా ఒక్క ఘడియా కదలదే! "

పాపం కుందేలు చెవులు ఎంతలా వాచిపోయుంటాయో..! కొంచమైనా కరుణ చూపించవచ్చు కదండీ.. :):)

హరే కృష్ణ said...

nice,బావుంది

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుంది...

తృష్ణ said...

"సప్తవర్ణరంజితమైన స్వప్నమొకటి మధుర స్మృతిగా మిగిలిపోయింది! " అంటే కవితను melancholic note నుంచి తప్పించినట్లుంటుందేమో...?

లేబుల్ మీది "మధుకవిత" ను "మధురకవిత" చేయండి బాగుంటుంది..:)

mannam said...

very nice.

అశోక్ పాపాయి said...

చప్పట్లు,తాళాలు,భజత్రింలు మీ కవితకి......

Padmarpita said...

మీ కవిత చాలా బావుంది...

సవ్వడి said...

very nice

Anonymous said...

>> అంతదాకా పోగేసిన నా ఊహలన్నీ నీ సమక్షంలో ఊసులుగా మారకుండానే మూగబోయాయి..

ఇది చాలామందికి స్వానుభవమే అయ్యుండాలి. మీ పదాలకూర్పు చాలా పొందికగా ఉంది. మంచి కవిత.

ఆ.సౌమ్య said...

ఎక్కడో తాకింది, ఏవేవో ఙ్ఞాపకాలు మదిలో మెదిలాయి....ఇలాంటి క్షణాల్నే అనిభవించిన గుర్తు....బాగుంది.

bharath said...

ఆ మధురక్షణాల ముత్యాలసరాన్ని భద్రంగా దోసిట్లో పట్టుకుందామనుకుంటుండగానే చేజారి చెల్లాచెదురై పోయింది..

ee line naku baga nachindi.. a line chepina anubhavam chala mandiki kaligi untundi.

madhuravaani garu chala baaga rasaru kavithani

మధురవాణి said...

@ ఖలీల్ జీబ్రాన్, అశోక్ పాపాయి
మీ చప్పట్లు నాకు వినిపించాయండీ. ధన్యవాదాలు :-)

@ విశ్వప్రేమికుడు,
ధన్యవాదాలు :-) ఆ కుందేలు చెవులు పట్టుకు ఎంత లాగినా దానికి నొప్పేయదండీ.. అందుకే అలా చేశానన్నమాట! ;-)

@ హరేకృష్ణ, శేఖర్ పెద్దగోపు, mannam, పద్మార్పిత, సవ్వడి, sivaprasad nidamanuri
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు :-)

మధురవాణి said...

@ తృష్ణ,
నా కవితకి మరో అందమైన ముగింపు ఇచ్చినందుకు చాలా థాంక్స్! :-) ఇంతకుముందు నా బ్లాగులో అన్నీ 'మధుర' అనే లేబుల్స్ ఉండేవి. మధుర స్మృతులు, మధురోహలు, మధురానుభూతులు వగైరా..మరీ అన్నీ అలా ఉంటే చూసేవాళ్ళకేమైనా విసుగొస్తుందేమోనని అవన్నీ తగ్గించేసాను. అందుకే కాస్త వెరైటీగా 'మధుకవిత' అని పెట్టానన్నమాట! అయితే అది కాస్తా 'మధురకవిత'గా మార్చేస్తే బాగుంటుందంటారా? :-)

@ అభిజ్ఞ,
నిజమేనండీ..మీరన్నట్టు ఆ భావన చాలందికి అనుభవంలోకి వచ్చేదే! మీకు నా కవిత నచ్చడం సంతోషంగా ఉంది. :-)

@ సౌమ్య,
అయితే ఈ కవిత మీ జ్ఞాపకాల తుట్టెని కదిపిందన్నమాట! ;-)

@ Bharath,
Thanks for your encouragement as always! :-)

రాధిక(నాని ) said...

చాలా బాగుంది మీ "నిరీక్షణ"

sairam said...

మీ కవిత చాలా బావుంది... మనసుకు హత్తుకునేలా..

Anonymous said...

"సప్తవర్ణరంజితమైన స్వప్నమొకటి రంగులన్నీ వెలిసిపోయి బోసిగా మిగిలిపోయింది" ఈ లైన్ నాకు చాలా నచ్చింది.

వర్ణన చాలా బాగుంది :-)

మధురవాణి said...

@ రాధిక(నాని ), sairam, రాధిక,
సంతోషంగా ఉందండీ మీకు నా కవిత నచ్చినందుకు. స్పందించినందుకు ధన్యవాదాలు :-)

Unknown said...

mee kavitha bagundi

Unknown said...

mee kavithaa varnana chala bagundhi. eduru chupulu yentho tiyyana . nijame kada.

Unknown said...

mee kavithaa varnana chala bagundhi.

మధురవాణి said...

@ లక్ష్మీశ్రీరామ్,
నిజమేనండీ.. ఎదురుచూపులు బాగుంటాయి ఒకోసారి.
thanks for the comment! :-)

Rachana said...

chala chala bagundi...madhuravaani garu

మధురవాణి said...

@ Rachana,
Thanks for your response! :)