ఇదివరకు నాకో అభిప్రాయం ఉండేది. ఏమనంటే.. మన చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో ఉన్నంత నిష్కల్మషమైన, స్వచ్ఛమైన స్నేహం చేయగలిగే మనస్తత్వం వయసు పెరిగే కొద్దీ మనలో క్రమేపీ కనుమరుగైపోతుందని! అలా అని మనం పెద్దయ్యాక మంచి స్నేహితులు ఉండరా అంటే ఉంటారు కానీ, నిస్వార్ధంగా ప్రాణస్నేహంలా భావించేంత అనుబంధం ఎవరితోనూ ఏర్పడదేమో అని! నిజానికి, ఇది నా అభిప్రాయమే కాదు అనుభవం కూడా చాలావరకూ! కానీ, ఒకోసారి మనకి ఎదురైన అనుభవాలు మన అభిప్రాయాల్ని మార్చుకునేలా చేస్తాయి కదా! అలానే, నా అభిప్రాయం కూడా మారిపోయింది సుజ్జీ తో స్నేహం కుదిరాక!
హమ్మ్.. మరి మా స్నేహం ఎలా మొదలయ్యిందో చెప్పాలిగా! 2008 డిసెంబరులో అనుకుంటాను మేమిద్దరం మొదటిసారి మాట్లాడుకుంది. అప్పటికి నేను బ్లాగు మొదలెట్టి మూడు నెలలు అయింది. అప్పుడప్పుడే బ్లాగరులు పరిచయమౌతున్నారు. 'ప్రమదావనం' మహిళా బ్లాగరులు చేస్తున్న సేవాకార్యక్రమాల గురించి సుజాత గారి బ్లాగులో చూసి ఆ స్పూర్తితో నేను కూడా జ్యోతి గారిని సంప్రదించి ప్రమదావనంలో చేరాను. అక్కడ ఒకరా ఇద్దరా.. బోలెడంత మంది స్నేహితులు దొరికారు నాకు :-) అలాంటి రోజుల్లో, ఓ రోజు సుజ్జీ హాయ్ చెప్పింది నాకు. నేనూ హాయ్ అన్నాను. 'ఏంటోయ్.. నీ చేతికి ఎముకే లేనట్టుంది. తెగ టపాలు రాసేస్తున్నావ్' అంది నన్ను. హీ హీ హీ.. అని నవ్వాను. అప్పటికి సుజ్జీ బ్లాగులో ఓ నాలుగైదు టపాలున్నాయి. అందులోని చిట్టి కవితలు చూసి చాలా ముచ్చటనిపించింది. అన్నట్టు... యీ మధ్యే సుజ్జీ కవితల గురించి ఇక్కడ చెప్పాను. చూశారా?
సరే.. అలా మా పరిచయం మొదలయిన విషయం గుర్తుంది గానీ.. ఆ తరువాత మా స్నేహం ఎలా చిగురిస్తూ వచ్చిందో అసలు గమనించనే లేదు. అలా అలా మా కబుర్లలో కొన్ని రోజులు దొర్లిపోయేసరికి.. అసలు బ్లాగుల వల్ల మేము పరిచయం అయ్యామన్న సంగతే మర్చిపోయాం. ఇద్దరం ప్రత్యక్షంగా ఇంతవరకూ కలవకపోయినా కొత్తగా ఎప్పుడూ అనిపించదు అసలు. మేమిద్దరం ఎప్పటెప్పటి నుంచో స్నేహితులం అనే భావన వచ్చేసింది నాకైతే! ఒకోసారి ఆలోచిస్తే నా గురించి నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నెట్లో పరిచయమై ఇంత స్నేహితులైపోయామా? అని భలే చిత్రంగా అనిపిస్తుంటుంది. అన్నట్టు.. మేమిద్దరం కలిసి సరదాగా 'సుజనమధురం' అనే బ్లాగు కూడా మొదలుపెట్టాం. అదన్నమాట టూకీగా మా స్నేహం కథ!
ఇంతకీ యీ జ్ఞాపకాలన్నీ ప్రత్యేకంగా యీ రోజే తలుచుకోడానికి ఓ కారణముంది. అదేంటంటే, ఇవ్వాళ సుజ్జీ పుట్టినరోజు. తను కోరుకున్నవన్నీ జరగాలనీ, తానెప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా! మీరూ నాతో పాటు సుజ్జీకి పుట్టిన రోజు జేజేలు చెపుదురూ! :-)
19 comments:
కొన్ని విషయాలు చిన్నవీ, మూలo పట్టలేనివైనా ఎంతో అపురూపమైనవి .. ! చాలా బాగా చెప్పారు మీ స్నేహం గురించి .. మీ ఇద్దరూ ఎప్పటికి ఇలానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .. మీ సుజ్జి కి నాతరపున కూడా "పుట్టిన రోజు శుభాకాంక్షలు "
Many more Happy Returns of the day Srujana. మీ స్నెహం ఇలానే ఎప్పుడూ వుండాలని కోరుకుంటు.
సుజ్జి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ స్నేహం ఇలానే కలకాలం నిలవాలని కోరుకుంటూన్నాను ....కాదు కాదు, దీవిస్తున్నాను.
మీ స్నేహానికి ముచ్చట పడుతూ ,
సుజ్జీ కి ,జన్మదిన శుభాకాంక్షలు .
మీ స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలని వెరైటీగా చాలా అందంగా చెప్పారు.సుజ్జీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
బ్లాగులద్వారా మంచి స్నేహాలు ఏర్పడడం నాక్కూడా అనుభవమే కనక మీరు చెప్పిన విషయం నామనసుకి హత్తుకుంది. మీఇద్దరికీ నా అభినందనలు, మీ స్నేహితురాలికి శుభాకాంక్షలు.
మీ సుజ్జి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి కోరుకుంటూ ...
మీ ఇద్దరి స్నేహం చాలా ముచ్చటగా ఉంది. మీస్నేహం ఇలాగే కలకాలం నిలవాలని కోరుకుంటూ.. సుజ్జి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
Oh, Sujji = Srujana?
నాకు ఇప్పుడే వెలిగింది. :)
శతమానం భవతి!
Many Happy Returns Srujana garu
@ భావన, కొత్తపాళీ, రౌడీ గారూ ;-)
sujji = srujana కాదండీ!
sujji = sujana
సృజన, సుజన కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికే సుజన = సుజ్జీ, సృజన = సృజన అన్న మాట!
ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయలేదు కదా ఇప్పుడు ;-)
@ సిరి,
సరిగ్గా చెప్పారండీ! నిజంగా అలాంటివన్నీ అపురూపమైనవే :-)
శుభాకాంక్షలకి ధన్యవాదాలండీ!
@ లలిత గారోయ్,
మీ దీవెనలందుకున్నాం. బోలెడన్ని థాంక్స్!
@ మాలా గారూ,
థాంక్సండీ :-)
@ రాజన్ గారూ, మాలతి గారూ,
మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మా స్నేహం 'బ్లాగు బంధం' కాబట్టి, బ్లాగులో చెప్పాలనిపించిందండీ. ఇవ్వాళ సుజ్జీ పుట్టిన రోజు కాబట్టి, ఇదే సరైన టైం అనిపించి ఇవ్వాళే రాసేశాను :-)
@ స్రవంతి, రాధిక
మీ అందరి శుభాకాంక్షలన్నీ సుజ్జీకి అందజేసానండీ! ధన్యవాదాలు.
@ భావన, కొత్తపాళీ, మలక్పేట్ రౌడీ
Thanks for the wishes!
పేరు కాస్త అటూ ఇటైనా మీ శుభాకాంక్షలు కూడా బర్త్డే బేబీకి అందజేసానండీ! :-)
పాపం సుజ్జి కి 'సృజన ' కష్టాలు ఇంకా ఉన్నాయా? :))
మీ స్నేహం గురించి చదువుతుంటే బహుముచ్చటగా ఉందమ్మాయిలూ.. మీరిద్దరూ ఇలానే ఎప్పటికి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ సుజ్జికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :-)
@ Nishi ji,
Thanks a lot for your wishes :-)
:D Thanks everybody for wishes..
మీ ఫ్రెండ్ కి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలండీ (కొంచం ఆలస్యంగా)
చాలా బాగుంది మీ స్నేహం.. అభినందనలు..
@ మురళి, Sandhya.panduranga,
ఆలస్యంగానైన మీ శుభాకాంక్షలు సుజ్జీకి తప్పక అందజేస్తానండీ! Thanks for your hearty wish!:-)
హలో మధు గారు.. మీ బ్లాగు చూడటం మొదలు పెట్టినప్పటి నుండి వున్నా డౌట్ ని ఇప్పుడు మీరు తీర్చేసారు.. మీరు నమ్మండి , నమ్మకపోండి మొదటి నుండి సుజ్జి అంటే మీ సోదరి అయ్యుంటుంది అనే అనుకున్నా.. అలా వుంది మరి తన గురించి మీ ప్రస్తావన. ఈ రోజు పనిగట్టుకుని మీ టపాలు అన్ని చూస్తుంటే, ఇప్పటికి అర్ధమయింది.. మీ స్నేహం ఎంత బలం గా వుందో మీ టపాలు చుసిన ఎవరికయినా ఇట్టే తెలుస్తుంది . మీ స్నేహం ఇలాగే కలకాలం నిలవాలని కోరుకుంటున్నాను.
అన్నట్టు, మీరు చెప్పిన సలహాలతో ఈసారి తెలుగు లోనే వ్యాఖ్య పెడుతున్నాను.. మీతో ఇంతకుముందు చెప్పినట్టు గా, ఒక కొత్త బ్లాగు పెట్టడానికి కసరత్తు చేస్తున్నాను. ఒక శాంపిల్ బ్లాగు పెట్టి , దానిమీద ప్రయోగాలు చేస్తున్నాను.. త్వరలోనే నా అసలు బ్లాగు అడ్రస్ మీకు తెలియజేస్తాను .. మీరిచ్చిన సలహాలు చాలా ఉపయుక్తంగా వున్నాయి . ధన్యవాదాలు ........... హరీష్
@ హరీష్,
ఎంతో ఓపిగ్గా నా పాత పోస్టులన్నీ చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు మీకు బోలెడన్ని ధన్యవాదాలండీ! :-)
మా స్నేహానికి మీరిచ్చిన అభినందనలు అందుకున్నానండీ! :-)
త్వరలోనే మీరు ఒక బ్లాగువారై మీ రాతలతో మమ్మల్ని ఆనందిమపజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగు లింక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండేం!
Post a Comment