Monday, March 08, 2010

మరుజన్మంటూ ఉంటే.!? - నా కోరికల జాబితా


-->
మరుజన్మంటూ ఉంటే.!? అసలు మరో జన్మ అనేది ఉందంటారా.? ఏమో.. ఉందీ, లేదూ అని ఇప్పటిదాకా ఎవరూ ఆధారాలతో నిరూపించలేదు కాబట్టి, అదెలాగూ సాధ్యమయ్యే పని కూడా కాదు కాబట్టి.. ఎంచక్కా మనిష్టానుసారం ఉందనో లేదనో అనేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక్క మాటతో తేలిపోతుంది. అదే ఉందనుకుంటే, ఎంచక్కా బోలెడు ఊహించుకోవచ్చు.senyum వచ్చే జన్మలో ఎలా పుడితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందో ఎంచక్కా ప్లానింగూ గట్రా చేస్కోవచ్చు.encem మీరేమంటున్నారో నాకు వినపడిందిలెండి. అక్కడికి యీ జన్మలో ఏదో బాగా ప్లాను చేసుకుని దాని ప్రకారమే నడుస్తున్నట్టూ.. అనేగా? angkatkening మరేం చేసేది చెప్పండి.. ఎంచక్కా ఊహల్లో విహరించడం, ప్రణాళికలు రచించడం వరకూ ఉండే ఉత్సాహమంతా ఆచరణలో పెట్టాల్సివచ్చినప్పుడు ఉండకపోవడమనేది కుంచెం బద్ధకం ఉన్నవాళ్ళకి సహజమే కదా.!? కాబట్టి మీరలాంటి సందేహాలేమీ పెట్టుకోకూడదన్నమాట. సరే! విషయం పక్కదోవ పడుతున్నట్టుంది. ఇహ అసలు విషయానికొచ్చేసి అర్జెంటుగా వచ్చే జన్మ కోసం నాకున్న కోరికల చిట్టా పద్దేంటో మీకు చదివి వినిపించేస్తా. సావధానంగా వినెయ్యండి మరి!rindu

1. ముందుగా, వచ్చే జన్మలో కూడా తెలుగింటమ్మాయిగానే పుట్టాలి. మరీ ముఖ్యంగా తెలుగు రాయడం, చదవడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి.senyumkenyit

2. మా నాన్నకే మళ్ళీ ఏకైక ముద్దుల కూతురిగానే పుట్టాలి. ఏకైక అని ఎందుకన్నానంటే పోటీ ఎవరూ ఉండకూడదు మరి! మా అమ్మ కడుపునే పుట్టాలి. కాకపోతే, నాదెప్పుడూ ముందు నాన్న మాటే తరవాతనే అమ్మ మాట. చిన్నప్పుడు ఏదన్నా దెబ్బ తగిలితే అందరు పిల్లలూ అమ్మా అని ఏడిస్తే, నేను మాత్రం నాన్నా అని ఏడ్చేదాన్నంట!nangih అంతటి ఘన చరిత్ర ఉంది మరి నా వెనకాల. అందుకే అలా చెప్పానన్న మాట.!sengihnampakgigi అసలు ఒకోసారి నాకింకోలాగా కూడా అనిపిస్తుంటుంది. యీ జన్మలో అమ్మా, నాన్న నాకోసం ఎన్నెన్ని కష్టాలూ, ఇబ్బందులూ పడి ఇంత ప్రేమగా పెంచారు కదా.. కాబట్టి, వెరైటీగా వచ్చే జన్మలో నా కడుపునే వాళ్ళు పుడితే బాగుంటుందేమో అని. అప్పుడు మా నాన్నకి ఎంతో ఇష్టమైన డాక్టరు చదివిస్తాను. ఎలా ఉందంటారూ నా ఆలోచన?fikir

అలాగే, తప్పకుండా మా తమ్ముడు కూడా నాతోనే పుట్టాలి.cium వాడు లేకపోతే జీవితం మహా చప్పగా ఉంటుంది. ఇందులో ఒక స్వార్ధం కూడా ఉంది. తమ్ముడిగానే అయితే ఎంచక్కా వచ్చే జన్మలో కూడా వాడి మీద 'అక్క జులుం' చేయచ్చు..encem టీవీ రిమోట్ దగ్గర నుంచీ.. తినే చిరుతిండి దాకా వంతుల కోసం బాగా పోట్లాడుకోవచ్చు. tumbuk హీ హీ హీ
ఏంటీ.. ఇంకా ఎవరు కావాలీ.. అంటారా? మరీ, అలా రగస్యాలన్నీ చెప్పెయ్యమంటే ఎలాగండీ.!? అర్ధం చేసుకోరూ!!malu

3. ఇంకా...వచ్చే జన్మలో కూడా ఎంచక్కా సైన్సే చదుకోవాలి. అప్పుడు కూడా పీహెచ్డీ చేసెయ్యాలని అనుకోనా.?nerd పీహెచ్డీ చేసేవాళ్ళేవరైనా ఇది చూస్తే మాత్రం రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు.. వచ్చే జన్మలో కూడా పీహెచ్డీ ఏనా.. అని తిట్టుకుంటారేమో నన్ను.marah

మా బాగా చెప్తున్నావులేమ్మా... యీ మాత్రం దానికి అన్నీ యీ జన్మలోవే డిటో డిటో అని చెప్పెయచ్చుగా..ఇంత కరశోష (చేత్తో రాస్తున్నా కదా మరి!) ఎందుకు? అని అంటున్నారు కదూ.? ఇది కూడా వినిపించింది నాకు. సరే, ఇప్పుడు యీ జన్మలో చేయలేకుండా పోయినవి, చేయాలనుకునేవి చెప్తా ఇప్పుడు.menari

4. వచ్చే జన్మలో నా చిన్నప్పుడు బోలెడన్ని చందమామలు (పుస్తకాలు) ఉండాలి నాకోసం. చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన భరతనాట్యమో, కూచిపూడినో నేర్చుకోవాలి. సుమధుర గాత్రం కూడా ఉండి సంగీతం కూడా నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది.siul మరీ అత్యాశ కదూ!?sengihnampakgigi

5. నా చిన్నప్పుడు మా నాన్నకి చాక్లెట్ ఫ్యాక్టరీ, బిస్కెట్ ఫ్యాక్టరీ, పాప్ కార్న్ ఫ్యాక్టరీ, ఇంకా హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉండాలి. నేను పెద్దయ్యాకేమో అవన్నీ మారిపోయి బట్టల ఫ్యాక్టరీలు, నగల ఫ్యాక్టరీలు లాంటివి ఉండాలన్నమాట!celebrate

6. ఇంకా..rindu నాకిష్టమైన ఘంటసాల, విశ్వనాథ్, మణిరత్నం, సచిన్, ఇళయరాజా, రెహ్మాన్ లాంటివాళ్ళు కూడా అప్పుడు పుట్టాలి. వీళ్ళందరూ లేకపోతే ఇంకేమన్నా ఉందా.? బోలెడు ఆనందం మిస్సయిపోతాను బాబూ..! అసలు ఇప్పుడే నాకింకో దురాలోచన వచ్చింది. వీళ్ళందరూ కూడా మా నాన్నకి స్నేహితులయ్యుంటే ఇంకా బాగుంటుంది కదూ!kenyit

7. నాకింకో దురాలోచన కూడా ఉంది. అదేంటంటే, ఎంత నెయ్యి తిన్నా కూడా బొజ్జ పెంచెయ్యకుండా వయసులోనైనా ఎంచక్కా సన్నగానే ఉండాలి ఎప్పుడూ. అది కూడా ఎక్సర్సైజులూ గట్రా చేయకుండానే! sengihnampakgigi

8. మరేమో.. ఇంకా నాకు నల్లటి పట్టు కుచ్చులాంటి పేద్ద.. జడ ఉండాలి. జుట్టు ఊడిపోతూ జడ సన్నగా అయిపోకుండా ఎప్పుడూ అలానే ఉండాలి అందంగా!women

9. ఇలా ఇవన్నీ కూడా పోయిన జన్మలోనే ప్రోగ్రాం చేసుకున్నవి అని మాత్రం ముందే తెలిసిపోకూడదు. అలా ముందే తెలిసిపోతే ఎక్సైట్మెంటు మిస్సవుతుంది కదా మరి!putuscinte

అసలైతే ఇంకా పెద్ద జాబితానే ఉండాలి. ఏంటో! సమయానికి గుర్తు రావు కదా!adusప్చ్.. ఏం చేస్తాం.. ఇవ్వాళ మీ టైం బాగున్నట్టుంది. ఇహ ఇక్కడితో ఆపేస్తాన్లెండి నా వచ్చే జన్మ విష్ లిస్టు.

అసలు నాకో ఆలోచనొస్తోంది. ఎంచక్కా దేవుడికి ఒక పోస్ట్ బాక్స్ ఉంటే బాగుంటుంది కదా!
doaమనం ఏది కావాలంటే అది రాసేసి డబ్బాలో పడేస్తే సరి.! క్రిస్మస్ తాత గిఫ్టులు తెచ్చినట్టు, మన కోరికల జాబితాని దేవుడు చూసేసి.. తథాస్తు.. అనేస్తే పని అయిపోతుంది. దేవుడనేది నమ్మకం..అదీ ఇదీ అని జ్ఞానబోధలు గుర్తు చేసుకోకూడదు ఇలాంటి సమయంలో. ఇలాంటి అందమైన ఊహలన్నీ మిస్సయిపోతాం అలా అయితే! అప్పుడప్పుడూ ఇలాంటి ఊహల్లో విహరిస్తుంటే బాగుంటుంది కదూ!sengihnampakgigi

29 comments:

శరత్ కాలమ్ said...

నాకయితే వచ్చే జన్మంటూ వుంటే అందమయిన అమ్మాయిగా పుట్టాలని వుందండీ. ఈ మగ జన్మ చాలా బోరింగుగా వుంది. ప్చ్!

SRRao said...

మధురవాణి గారూ !
మీ కోరికల జాబితా బావుంది. మరుజన్మ వుండాలని మీ కోరికలన్నీ తీరాలని కోరుకుంటూ...నిన్నటి మహిళా దినోత్సవానికి నేడు శుభాకాంక్షలు అందిస్తూ....

Anonymous said...

ఏంటో వయసు పెరిగినా మనసు పెరగలేదమ్మాయ్ నీకు !( బహుసా అది పోయిన జన్మలో నువ్వు కోరుకున్న వరమై వుంటుంది) . ఈ జన్మ ఎంత మధురంగా వుంటేమటుకు మళ్ళీ ఇదే జన్మా ....అబ్బా బోర్ కదూ! అయినా పోన్లే.....నీ కోరిక తీరాలని దీవిస్తూన్నా.

మాలా కుమార్ said...

మీ కొరికల చిట్టా చాలా బాగుంది. ముఖ్యం గా బిస్కెట్ ఫాక్టరీ , చాక్లెట్ల ఫాక్టరీ , ఆ పైన అవి బట్టల ఫాక్టరి , నగల ఫాక్టరీ ఐడియా వుంది చూసారూ , సూపర్ అనుకోండి .

psm.lakshmi said...

శాంతాక్లాజ్ గారి బొమ్మ చూసినప్పుడే అర్ధమయింది మీ కోరికల చిఠ్ఠా పొడుగు. ఇప్పుడర్జంటుగా కోరుకోవాల్సింది ఏమిటంటే ఏ సందర్భంలోనైనా జ్యోతి టపాకి ఈ సబ్జెక్టే ఇవ్వాలి....కనీసం మన లిస్టులు పూర్తయ్యేదాకా.
psmlakshmi

శ్రీలలిత said...

మధురవాణీగారూ,
మీ కోరికలు బహు మధురంగా వున్నాయండీ..

సుజ్జి said...

Hahahaha... 5th point keka ga.. :D

జయ said...

మీ కోరికలన్నీ వరసబెట్టి తీరు గాక. All the best.

sphurita mylavarapu said...

భలే వున్నాయండీ...మీ కోరికలూ...
ఎంత నెయ్యి తిన్నా కూడా బొజ్జ పెంచెయ్యకుండా ఏ వయసులోనైనా ఎంచక్కా సన్నగానే ఉండాలి ఎప్పుడూ. అది కూడా ఎక్సర్సైజులూ గట్రా చేయకుండానే...హ హ హ
దేవతల లోకం అని మనవాళ్ళు చెప్పే కథల్లో వుంటారేమో ఇలాంటి వాళ్ళు..

శ్రీవాసుకి said...

>>ముందుగా, వచ్చే జన్మలో కూడా తెలుగింటమ్మాయిగానే పుట్టాలి. మరీ ముఖ్యంగా తెలుగు రాయడం, చదవడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి

నిజంగా ఇది మంచి కోరిక. వ్రాయడం, చదవడం భళా.

>>ఏంటీ.. ఇంకా ఎవరు కావాలీ.. అంటారా? మరీ, అలా రగస్యాలన్నీ చెప్పెయ్యమంటే ఎలాగండీ.!?

ఫర్వాలేదు కొంచెం చెప్పండి. ఎవరికి చెప్పనులేండి.

వర్మ said...

nice .......

Srujana Ramanujan said...

నాకింకో దురాలోచన కూడా ఉంది. అదేంటంటే, ఎంత నెయ్యి తిన్నా కూడా బొజ్జ పెంచెయ్యకుండా ఏ వయసులోనైనా ఎంచక్కా సన్నగానే ఉండాలి ఎప్పుడూ. అది కూడా ఎక్సర్సైజులూ గట్రా చేయకుండానే!

Naa potta ichhesthaanu teesukondi. :D

పరిమళం said...

మధురవాణి గారు భలే వున్నాయండీ...మీ కోరికలూ.. నాకోరికల జాబితా ముఖ్యంగా రెండోపేరా మీరు రాసేశారు ...నా బ్లాగ్ లో కమిట్ అయ్యాను కాబట్టి రాయక తప్పదు.కాపీ అనుకోకండేం :) :)

సవ్వడి said...

మధురవాణి గారు.. మీ కోరికల చిట్టా చాలా బాగుంది.
' " నాన్నా...!" అంటూ ఏడ్చేదాన్ని' అని ఏడ్చే స్మైలీ పెట్టారు కదా! చాలా నచ్చింది. ఎంత నవ్వానో చెప్పలేను.
ఇంకా మీ ఐదో కోరిక కేక.

bharath nunepalli said...

mee korikala chitta chala bagundandi...

మధురవాణి said...

@ శరత్ గారూ,
అభీష్టసిద్ధిరస్తు! :-)

@ SR రావు గారూ,
ధన్యవాదాలండీ!

@ లలిత గారూ,
అంతేనంటారా? నేనలా కోరుకున్నట్టు గుర్తుండకూడదు అని కూడా ఓ డిస్క్లైమర్ కోరుకుని ఉంటాను పోయిన జన్మలో కూడా! ;-)
మళ్ళీ ఇదే జన్మ బోర్ అంటారా..హుమ్మ్..అయినా, మళ్ళీ మళ్ళీ బోలెడు జన్మలు వస్తూనే ఉంటాయి కదండీ..అప్పుడు చూసుకోవచ్చు.. మనమసలే మోక్షసాధన చేసే టైపు కూడా కాదు కదా! ;-)

@ మాలా గారూ,
ఫ్యాక్టరీల అయిడియా మీకు బాగా నచ్చిందన్నమాట! మరి ఈ జన్మలో తీరలేదండీ ఆ కోరికలు.. అందుకే అలా కోరుకున్నా ;-)

@ లక్ష్మి గారూ,
కరక్టుగా చెప్పారండీ.. ఈ లిస్టులు ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా లేవు ;-)

మధురవాణి said...

@ శ్రీలలిత, జయ, వర్మ
ధన్యవాదాలండీ!

@ సుజ్జీ,
:D ;-)

@ స్ఫురిత,
నిజమేనండీ.. దేవతలు అలానే ఉంటారేమో! అమృతం తాగడం మూలాన వాళ్లకి తినే బాధా, తద్వారా వండుకునే బాధ, బొజ్జ పెంచే బాధా ఏవీ ఉండవు కాబోలు! ఇదేదో ఆలోచించాల్సిన పాయింటేనండోయ్..ఈ సారి లిస్టులో ఆ లోకంలో పుట్టాలని కోరుకుంటే సరి! ;-)

@ శ్రీవాసుకి,
ఏం చేస్తాం చెప్పండి మరి..ఈ మధ్య తెలుగు వాళ్ళ పిల్లలకి తెలుగు రాయడం, చదవడం రావట్లేదు కదా.. అందుకే అలా ప్రత్యేకంగా కోరుకోవాల్సి వచ్చింది. :-)
రగస్యం చెప్పెయ్యమంటారా.? ఏదీ.. ఓసారి మీ చెవిటుపడెయ్యండి మరి.. ;-)

@ సృజన,
లాభం లేదు సృజనా.. ఇంకా అలాంటి సౌకర్యాలు ఎవరూ కనిపెట్టినట్టులేరు.. అదే పొట్ట డొనేషన్ ;-) అలాంటి ఛాన్స్ ఉంటే.. జనాలు ఎంత పోటీలు పడేవాళ్ళో కదా ;-) ;-)

మధురవాణి said...

@ పరిమళం,
అయ్యో, ఇంత మాత్రానికే కాపీ ఏముందండీ.. నిజానికి మనలో చాలా మందికి అలానే అనిపిస్తుంది కదా! మీ కోరికల లిస్టు ఇంకా ఇంకా బాగుంది :-)

@ సవ్వడి,
నా ఏడుపుతో మిమ్మల్ని అంత నవ్వించానన్నమాట! ;-)

@ భరత్,
థాంక్స్ :-)

గీతాచార్య said...

మీరు మరీనూ, :D

ఎనీవే తథాస్తు, తథాస్తు, తథాస్తు అనెయ్ మని చెప్పేద్దాం.

భావన said...

అధ్బుతమైన కోరికలు కదా మీవి. అభీష్ట సిద్ధి రస్తు.

హరీష్ బలగ said...

హలో మధు గారు.. చాల బాగుందండీ మీ కోరికల చిట్టా.. సగటు మనిషి కోరుకునే సాదారణమయిన కోరికలే కోరుకున్నారు .. అవేమి తీరని గొంతెమ్మ కోరికలు కాదు కాబట్టి, మీది దురాలోచన కాదు లెండి.
అయినా Ph.D చెయ్యడం శనీశ్వరం ఏంటండీ ??మీకు ఎంత నచి వున్దకపోతేయ్ ఆ కోరిక కోరి వుంటారు? మేము కూడా అలా అనుకోము.. ఏరి కోరి జాబు జాయిన్ అవ్వకుండా నేను కూడా (అందరూ జీవిత చరమాంకం లో వెళ్ళే కాశి కి పావు జీవితం కూడా గడవకముందే వచ్చేసి మరీ ) Ph.D లో చేరాను (Banaras Hindu University) . నన్ను చూసి మా ఫ్రెండ్ కూడా IITD లో జాయిన్ అవ్వబోతున్నాడు. కాబట్టి మీరు నిశ్చింతగా వచ్చే జన్మ లో కూడా Ph.D చెయ్యండి. ...

మీరు ఇంకో కోరిక మాత్రం మరిచిపోయారండి.. సుజ్జి అక్కరలేదా మీకు?? తను ఎంత ఫీల్ అయ్యారో మీరు కోరలేదని.. :(
సరే లెండి సుజన గారికి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి (belated)

....హరీష్

ఆ.సౌమ్య said...

ఎవరో ఇక్కడ గురించి మాట్లాడుతున్నారు.....క్రితం సంవత్సరమే థీసిస్ సబ్మిట్ చేసి తల పూర్తిగా కడిగేసుకున్నా...PhD అంటే డెఫినిషన్ మీకు తెలుసు కదా Permanent Head Damage...ఎవరికైన డౌట్లు ఉంటే నన్నడగండి,ఉచితసలహాలిచ్చేస్తా.

మధురవాణి said...

@ హరీష్,
అయితే నా కోరికలు తీరిపోగలిగేవే అంటారు.. థాంక్సండీ! :-) మీరు BHU లో PhD చేస్తున్నారా? ఫ్డ్ చేయడం చెడ్డ పనేం కాదుగానీ, చాలా కష్టమైన పని కదండీ అందుకే అలా అన్నాను. మీరన్నట్టు ఎంతో ఇష్టం, ఓపిక ఉంటే తప్పించి PhD చేయలేము.
మీ belated wishes సుజ్జీకి చెప్పానండీ! మీకు థాంక్స్ కూడా చెప్పింది. :-) మీరన్నది నిజమేనండీ.. ఒక్క సుజ్జీనే కాదు.. బొత్తిగా ఫ్రెండ్స్ అందర్నీ మర్చిపోయినట్టున్నా! అదేనండీ PhD మహత్యం.. ఈ మతిమరుపు గురించి మీకు డిగ్రీ వచ్చే టైం కి మీక్కూడా అర్ధమైపోతుందిలెండి.

@ సౌమ్య,
నేను కూడా పోయినేడాది జూన్లో నా థీసిస్ సబ్మిట్ చేసానండీ! అయితే మనిద్దరం ఒకే ఏడాదిలో డాక్టర్లయిపోయామన్నమాట! :-) మీరేమో ఎకనామిక్స్, నేనేమో బయాలజీ. PhD కి మీరు చెప్పిన definition నాకు ఇంతదాకా తెలీదు. ఎవరు చెప్పారో గానీ బాగా అనుభవం మీద చెప్పినట్టున్నారు కదా! ;-) మనలాంటివాళ్ళం ఆ ఉచిత సలహాలేవో PhD చేయకుండా సుఖపడిపోతున్నవాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా PhD లో జాయిన్ అయ్యేట్టు తీవ్రంగా కృషి చేయాలండీ! ఏమంటారూ? ;-)

ఆ.సౌమ్య said...

అరే నేను కూడా క్రితం జూన్ లోనే సబ్మిట్ చేసాను....భలే.
అయ్యో మీకీ డెఫినిషన్ తెలీదా...మాకు జాయిన్ అయిన మొదటి యేడాదిలోనే మా సీనియర్లు చెప్పేసారు :)
అయ్యో మీరు వేరే చెప్పాలా....నేను మూడో యేడాది నుండే మొదలెట్టేసాను ఈ పని, కనిపించిన వాళ్ళందరి హెడ్ డేమేజ్ చెయ్యడమే నా లక్ష్యం.

ఇప్పుడు మనిద్దరం చేరాము కాబట్టి ఈ బ్లాగుల్లో చిన్న పిల్లల బుర్రలు పాడుచేసేద్దాం, ఏమంటారు? ;)

Bhãskar Rãmarãju said...

మరు జన్మ వద్దని కోరుకునే వారే లేరా?

నీహారిక said...

@ bhaskara rama raju gaaru,

maruvam usha gaarunnaaru kadaa!!

మధురవాణి said...

@ సౌమ్యా,
ఇహనేం.. సందు దొరికినప్పుడల్లా మనం ఆ పన్లో ఉందామండీ! జయహో PhD ;-)

@ భాస్కర్ రామరాజు,
నా బ్లాగులో మరుజన్మ వద్దని ఎవరూ చెప్పలేదు గానీ, అలా కోరుకునే వాళ్ళు చాలామందే ఉంటారని నేననుకుంటున్నా! :-)

@ నీహారిక గారూ,
ఉష గారు అలా అని ఏదైనా పోస్ట్ రాశారా? నేను మిస్సయినట్టున్నాలెండి :-)

HarshaBharatiya said...

five star chacolate la undhi...

మధురవాణి said...

థాంక్యూ హర్ష గారూ! :)